తెలుగు-తెలుగు నిఘంటువు/య
స్వరూపం
| యంత్రం | n | పెద్దపనులను తక్కువకాలంలో నిర్వర్తించడానికి ఏర్పరచిన సాధన విశేషం, బీజాక్షర చక్రం, తిరగలి, ఉపాయం, ఎండ్రి, సూత్రం, పనిముట్టు |
| యంత్రాంగం | n | పనులు నిర్వహించే వ్యవస్థ లేదా సౌకర్యం, అధికారులతో కూడిన అంచెలంచెల వ్యవస్థ |
| యకాయకీ | v,n | ఆకస్మికంగా, వేగంగా, త్వరితమైన; |
| యక్షగానం | n | పూర్వం సామాన్య జనరంజనం కోసం నటులు అభినయంతో పాడే రగడభేదాలుగల పురాణగాథ, జక్కులపాట; |
| యక్షుడు | n | కుబేరుడు; |
| యక్షులు | n | దేవతలలో ఒక తెగ వికృజక్కులు; |
| యజనం | n | యజ్ఞం చేయడం, యజ్ఞం చేయడం, యజ్ఞం, యజ్ఞస్థానం, ఈశ్వరుని మూర్తులలో ఒకటి యజమాని |
| యజియించు | v | పూజించు , యజించు; |
| యజుర్వేదం | n | బ్రహ్మ భిన్నమైన వచన మంత్రాత్మకవేదం |
| యజైశ్వరుడు | n | విష్ణువు |
| యజ్ఞం | n | యాగం, నేలిమి వికృ జన్నం; సవం, సవనం, ఆధ్వరం, సప్తతంతువు, ముఖం, క్రతువు, హవం, మన్యువు,, క్రతువు, వైదికకార్యం, అగ్ని, విష్ణువు, శివుడు, ఆత్మ |
| యజ్ఞపశువు | n | గుర్రం, మేక, యాగంలో చంపబడే పశువు |
| యజ్ఞపురుషుడు | n | విష్ణువు, యజ్ఞంలో పూజించవలసిన ప్రధాన పురుషుడు |
| యజ్ఞసూత్రం | n | యజ్ఞోపవీతం, జన్నిదం, జందెం వ్యు |
| యజ్ఞసేనుడు | n | ద్రుపదుడు; |
| యజ్ఞోపవీతం | n | జన్నిదం, యజ్ఞసూత్రం; |
| యజ్య | n | యజ్ఞంచేస్తున్నవాడు, సోమయాజి, యాగంచేసిన వాడు |
| యతనం | n | ప్రయత్నం రూ యత్నం , ఉద్యోగం, జాగ్రత్త, తెలివి, కష్టం, పట్టుదల, కడక, పాటు |
| యతి | n | పద్య విశ్రమస్థానం, సన్యాసి; నౌనా |
| యత్నించు | v | ప్రయత్నించు, ఉద్యోగించు; |
| యథాక్రమం | సం అవ్య క్రి విణ క్రమానుసారంగా, వరుసగా; | |
| యథాతథం | సంఅవ్య క్రివిణ ఉన్నది ఉన్నట్లు, సరిగా | |
| యథాపూర్వం | సంఅవ్యక్రివిణ ఎప్పటిలాగా, వెనుకటిలాగా; | |
| యథాప్రకారం | సంఅవ్యక్రివిణ ఉన్నరీతిలో; | |
| యథారీతి | సంఅవ్యక్రివిణ ఉన్నవిధం | |
| యథార్థం | n | సత్యమైనది, సార్థకమైనది, ఉచితం వ్యతి |
| యథాశక్తి | సంఅవ్యక్రివిణ శక్తికొలది, శక్త్యనుసారంగా; అని హామీ ఇస్తున్నాను | |
| యథేచ్చ | సంఅవ్యక్రివిణ కోరిక ప్రకారంగా, కావలసినంతగా; | |
| యథోచితం | సంఅవ్యక్రివిణ తగినట్లు | |
| యదువ్ర వీరులు | n | యాదవవీరులు; |
| యధాశ్రుతం | సంఅవ్యక్రివిణ 1 విన్నట్లుగా, 2 వేదానుసారంగా; | |
| యమం | నంవి అణచడం, ఇంద్రియజయం, ఓర్పు, అహింస, ఇంద్రియ నిగ్రహం, ఒక యోగాంగం, కాకి, జంట, ఒక అశ్వగతి యమలోకం | |
| యమకం | n | సంయమం, జంట, ఒక శబ్దాలంకారం, అర్థభేదంగల అక్షరాల సముదాయం మాటిమాటికి ప్రయోగింప బడి చమత్కారాన్ని కలిగించడం |
| యమకం ఉదా | లేమాదనుజల గెలవగ! లేమా! నీవేల కడగిలేచితి విటురా లేమానుమానవేనిన్ లేమాల్లందికొనుము లీలన్గేలన్, శబ్దాలంకారం, సంయమం, వస్తువుల, జంట | |
| యమకింకరుడు | n | యమదూత; |
| యమదూత | n | అ మృత్యుదూత, 1 యమభటుడు 2 కాకి; |
| యమపాశం | n | యముడు వేసే ఉరి |
| యమపురి | n | యమునిలోకం |
| యముడు | n | మృత్యుదేవుడు, కాలుడు; జమున సయిదోడు, 'పెతరులసామి, జముడు, ప్రొద్దుకొమరుడు, గుదేతాలు పోతుజక్ష్కివెక్కి ఆడెడబలురైతు దక్కిణింఫుసామి, పితృపతి, సమవర్తి, పరేతరాట్లు, కృతాంతుడు, యమునా భ్రాత, శమనుడు యమరాట్టు, దండధరుడు, శ్రాద్ధదేవుడు, వైవస్వంతుడు, అంతకుడు, శని, మృత్యుదేవుడు, కవలలలో ఒకడు, సహచరుడు |
| యమున | n | యమునానది, యమసోదరి; |
| యమునానది | n | యమున అనే పేరుగలనది, యమసోదరి, దుర్గాదేవి కాళింది, సూర్యతనయ, శమనస్వస |
| యయాతి | n | నహుషుని కుమారుడైన ఒక చంద్ర వంశపురాజు షోడశ మహారాజులలో ఒకడు |
| యవ | n | యవధాన్యపుగింజ రూ యవం, కిరణం, తెలివి, ఆరు ఆవగింజల ఎత, అదృష్టాన్ని సూచించే చేతివేళ్ళపై ఉండే యవగింజలాంటి రేఖ |
| యవనిక | n | తెర, తెరచీర; |
| యవనుడు | n | గ్రీసుదేశస్థుడు, ద్వీపాంతరవాసి; |
| యవ్వనం | n | పడుచుదనం, యువభావం, యావనం; ! , పదహారేండ్లు మొదలు 50 ఏండ్ల వరకు గల ప్రాయం పరువం, ప్రాయం, జవ్వనం, పాయం |
| యవ్వని | n | యువతి; |
| యశఃకాయం | n | కీర్తిశరీరం; |
| యశస్కరం | n | కీర్తిని కలిగించేది |
| యశస్వి | n | కీర్తిగలది; యశోద |
| యశస్సు | n | కీర్తి, ప్రఖ్యాతి; • , యశం, |
| యశోవా మృత్యుర్వా | n | కీర్తో, నురణమో; |
| యష్టి | n | కర్ర, దండం, హారపు పేట, ఒక ఆయుధం, బార్జిచెట్టు, తోమరం, తరహరి, జండా కామ, ఊత కర్ర, |
| యస్యస్యల్సి | ఇంని ఒకప్పటి మెట్రిక్యులేషన్, పూర్తి సెకండరీ స్కూలు లీవింగ్ సర్టిఫికెటు (Seconing certicate) | |
| యాంటీనాచ్ | n | మార్పుకు విరుద్ధమైన; వ్యళి |
| యాంత్రిక | n | యంత్ర సంబంధమైన, యంత్రంలాంటి |
| యాగం | n | 1 యజ్ఞం, 2 శైవులు మొదలైనవారు వేసే సర్వతో భద్రాది మండలం; |
| యాగపద్యం | n | ఏకకాలంలో సంభవించడం; |
| యాగభోక్త | n | శ్రీకృష్ణుడు, యజ్ఞాలలో సమర్పించే పూజా ప్రసాదాన్ని భుజించే భగవంతుడు |
| యాచకుడు | n | 1 భిక్షకుడు, 2 ప్రార్థించేవాడు |
| యాచనం | సంని అడగడం, మనవి | |
| యాచమాన | n | అర్థించే; |
| యాచించు | v | అడుగు, బిచ్చమెత్తు |
| యాచించు | v | అడుగు, బిచ్చమెత్తు; |
| యాజకుడు | n | ఋత్విక్కు, పూజారి పురోహితుడు, యాగం నడిపేవాడు |
| యాజమాన్యం | n | నిర్వాహక సంఘం; |
| యాజ్ఞవల్క్యుడు | n | ఒకానొకముని, శుక్లయజుర్వేద ప్రవర్తకుడు, ధర్మశాస్త్రకర్త, |
| యాజ్ఞసేని | n | ద్రౌపది, యజ్ఞ సేనుని (ద్రుపదుని) కూతురు |
| యాజ్ఞికుడు | n | ఋత్విక్కు, యజ్ఞ విద్య తెలిసినవాడు, యజ్ఞం చేసేవాడు |
| యాణికం | n | 1 యోగానికి తగినది 2 వ్యుత్పత్తి కలది |
| యాతన | n | నరక దుఃఖం; నాసా |
| యాత్ర | n | తీర్థానికి పోవడం, జాతర, గమనం, దాడి వెడలడం, తీర్థానికి బోవడం, మహోత్సవం, ఉత్సవదినం, జీవిక, కాలక్షేవం చేయడం, త్రోవ, ఉపాయం, సాధనం |
| యాత్రికుడు | n | తీర్థవాసి; బాటసారి, తీర్థయాత్ర చేసేవాడు |
| యాదవుడు | n | యాదవంశపురాజు; శ్రీకృష్ణుడు, యదువంశంలో పుట్టినవాడు |
| యాదృచ్చికం | n | 1 ఆకస్మిక వేసినది 2 తనంతటతానే తటస్థించినది |
| యాదోనాథుడు | n | సముద్రుడు, వరుణుడు; వ్వు |
| యానం | n | గమనం, ప్రయాణం, దాడి వెడలడం, వాహనం |
| యానపాత్రం | n | జనులెక్కిపోయే ఓడ, జోగు, నావ, ప్రయాణ సాధనమైన పాత్ర |
| యాపిల్ | n | సీమరేగిపండు, సేపు |
| యాభై | మిస ఏబది, ఐదుపదులు; | |
| యామం | n | జాము వివ |
| యామిని | n | రాత్రి, పసుపు |
| యామినీపతి | n | 1 చంద్రుడు 2 కర్పూరం వ్యతి అహస్సు |
| యాయావరం | n | ఇంటింటికీ తిరుగుతూ ధాన్యంగాని, బియ్యంగాని, యాచించడం , ఆయవారం, యాయవారం, ఆశ్వవేదము గుర్రం, రాజశేఖరుడనే ఆలంకారికుని వంశం |
| యావచ్చక్తి | సంఅవ్య శక్తికొలది, సాధ్యమైనంతలో | |
| యావజ్జీవం | సంఅవ్య బతికి ఉన్నంత వరకు, ప్రాణమున్నంత కాలం | |
| యావత్తు | సంఅవ్య పూర్తిగా | |
| యావదాంధ్రులు | నంబిబ ఆంధ్రులంతా | |
| యావద్భారతదేశం | n | భారతదేశమంతా; |
| యాసం | n | గ్రామ్యం , వంకర, మదనశలాకసక్షి; భాషోచ్చారణలో ప్రాంతీయంగా కనిపించే ప్రత్యేకత , ఏస |
| యాస్కుడు | n | నిరుక్తం రచించిన ఒక గ్రంథకర్త, |
| యుక్తం | n | కూడుకొన్నది, ఉచితమైనది, న్యాయమైనది, ఉచితమైనది, లెక్కకలియకూడినది |
| యుక్తి | n | ఉపాయం , ఊహ,, కలయిక, పన్నుగడ, న్యాయం, కారణం, వ్యవహారం, ఉద్దేశాన్ని సూచించడం, నాటకాంగ విశేషం, విధం; |
| యుక్తి యుక్తం | n | యుక్తితో కూడుకొన్నది |
| యుగం(బు) | n | జత, యుగం,, కాల పరిమాణ విశేషం, బార, జంట, వయస్సు, రెండు, బుద్ది అనే గంధద్రవ్యం, బండి కాడి, నాలుగు సంఖ్యకు సంకేతం |
| యుగకర్త | n | యుగబ్రహ్మ, యుగాన్ని చేసేవాడు |
| యుగధర్మం | n | యుగలక్షణం, లక్షణం; |
| యుగలం | n | జత, జంట, యుగళం |
| యుగసంధి | n | ఒక కాలం నుంచి మరొక కాలానికి మారుతున్న మధ్యదశ |
| యుగాంతం | n | ప్రళయకాలం, మహాప్రళయం, కృతవ్రేతాద్వాపర కలియుగాల అంత్యభాగం, ప్రళయకాలం, మధ్యాహ్న, మహాప్రళయం |
| యుగ్మం | n | జత, యుగలం, సరిసంఖ్యగలది, జత, కలయిక, కవలు, మిథునలగ్నం, తిథివిశేష యోగం, |
| యుద్ధం | n | కయ్యం, పోరు; అమోదనం, జన్యం, ప్రధనం, ప్రవిదారణం, మృధం, ఆస్కందనం, సంఖ్యం, సమికం, సాంపరాయకం, సమరం, అనీకం, రణం, కలను, చివ్వ, కలహం, విగ్రహం, సంప్రహారం, పోట్లాట, కలి, సంస్పోటం, సంయుగం, అభ్యాఅని, దురం, మర్దం, సమాఖాతం, సంగ్రామం, అభ్యాగమం, హవం, నముదాయం, సమితి, సంయత్తు, ఆజి, సమితు, సేనకువ, జగడం, బవరం; |
| యుద్ధ నీతి | నంవి యుద్ధానికి సంబంధించిన నీతి; | |
| యుద్ధవీరుడు | n | యుద్ధంలో పరాక్రమవంతుడు; |
| యుధారం | v | విణ విలువ ననుసరించి; యథాలాపంగావిశేష అనుకోకుండా? |
| యుధావిధి | సంఅవ్యక్రివిణ విధిప్రకారంగా, శాస్త్రానుసారంగా; | |
| యుధిష్ఠిరుడు | n | ధర్మరాజు; ఇంద్రుడు, యుద్ధంలో స్థిరుడు |
| యువకుడు | n | పడుచువాడు, తరుణుడు; బలవంతుడు, ఆరోగ్య వంతుడు, శ్రేష్ఠుడు |
| యువతరం | n | యువ కుల సమూహం; |
| యువతి | n | తరుణ వయస్కురాలు, పదహారేండ్లు మొదలు ముప్పై ఏండ్ల వరకు గల వయస్సు గల స్త్రీ,, తరుణ వయస్కురాలు, కన్యారాశి, పసుపు |
| యూకం | n | పేను , యూక, పాము, అగిసెచెట్టు, నల్లమేడి చెట్టు |
| యూకలిప్టస్ | n | పొడవైన అడవి చెట్టు, 'యూకలిప్టస్) అనే పేరుగల చెట్టు |
| యూధం | n | గుంపు, మంద |
| యూనిట్ | n | ఒకటి, ఏకం |
| యూనివర్సిటీ | n | సర్వకళాశాల, సమస్త శాస్త్రాలను నేర్పే విద్యాశాల, విశ్వవిద్యాలయం |
| యూపం | n | యజ్ఞపశువును కట్టడానికై పాతిన కొయ్య, యజ్ఞపశువును కట్టడానికై పాతినకొయ్య, జయస్తంభం, గంగరావిచెట్టు |
| యూపదారువు | n | యజ్ఞంలో బలిచ్చే పశువును గట్టివేసే స్తంభం, యజ్ఞంలో పశుబంధనార్థం నాటినదై పట్టలేని దారువు |
| యోగం | n | చిత్తవృత్తి నిరోధం, ధ్యానం, ఉపాయం, విష్కంభం వంటి కూడిక, కవచం, ధనం, ఉద్యోగం, ఔషధం, నూతన వస్తుప్రాప్తి, రాజయోగం, మందుల, సమూహం, అదృష్టం, సంబంధం, ఒక శాస్త్రం, సమయం, ఉపయోగం, విధానం, కాడి, ఆధారం, వాహనం, ఫలితం, ముఖం, కార్యం, శరీర ఛైర్యం, భాగ్యం, సూత్రం, |
| యోగక్షేమాలు | n | సంపద సంపాదించడం, సంపదను పదిలపరచడం అనేవి |
| యోగదృష్టి | n | ఎక్కడనో జరుగుతున్న దాన్ని దర్శించగలశక్తి భూత భవిష్యద్వర్తమానాలను దర్శించే శక్తి |
| యోగనిద్ర | n | 1 యుగాంతంలో శ్రీ విష్ణుని నిద్ర, 2 దుర్గాదేవి |
| యోగమాయ | n | 1 ప్రపంచక సృష్టినిమిత్తమైన భగవంతునిశక్తి 2 దుర్గాదేవి; |
| యోగాభ్యాసం | n | యోగాన్ని అభ్యసించడం, యమనియమాది అష్టాంగాలను అభ్యసించడం అష్టాంగాలు |
| యోగి | n | సన్యాసి, ధ్యాన నిష్ఠుడు, కలిగి ఉన్నవాడు, యోగాభ్యాసం కలవాడు, ధ్యాన నిష్ఠుడు, మంత్రశాస్త్రజ్ఞుడు, యోగ మతానుసారి, నారింజ |
| యోగిని | n | సన్యాసిని, భక్తురాలు, మంత్రకత్తె, శివపరిచారికల జాతి, దుర్గ |
| యోగీశ్వరుడు | n | 1 యోగిశ్రేష్ఠుడు 2 యజ్ఞవల్క్యమహర్షి యోగ్యత |
| యోగ్యం | n | తగినది, అరమైనది, ఇంద్రియగ్రాహ్యం, పుష్యమి నక్షత్రం, యనం (వాహనం), చందనం, రొట్టె, పాలు, యంత్రం, భరణీ నక్షత్రం వ్యతి |
| యోగ్యతా పత్రం | n | అర్హతను తెలిపే ధ్రువపత్రం; |
| యోగ్యుడు | n | అరుడు, తగినవాడు, సుగుణాలు కలవాడు, ఒకపనికి తగినవాడు, యోగానికి తగినవాడు, నిపుణుడు, ఉపాయం గలవాడు వ్యతి |
| యోచించు | v | ఆలోచించు; |
| యోజన | n | సంధానం, వ్యాకరణాను సారమైన అన్వయం, నిర్మించడం, స్థితి |
| యోజనగంధి | n | కస్తూరి గూ |
| యోజించు | v | ఆలోచించు; |
| యోద్ద | n | యోధుడు, వీరుడు; |
| యోష | n | స్త్రీ, |