Jump to content

తెలుగు-తెలుగు నిఘంటువు/బ-భ

Wikibooks నుండి
బంక n జిగురు, చెట్టు జిగురు, లోభం, పిసినారితనం, గ్రహణి, బంక విరేచనాలు
బంకమన్ను n కుండలు చేసేమను, జిగురుమను
బంగనబయలు n బట్టబయలు, బంగరబయలు
బంగరు n స్వర్ణం, బంగారం, బంగరం, బంగారు; కాంచనం, సువర్ణం, హిరణ్యం, కనకం, పసిడి, పైడి, హేమం, హాటకం, తపనీయం, శాతకుంభం, గాంగేయం, భర్మ, కర్బురం, చామీకరం, జాత రూపం, మహారజితం, రుక్మం, కార్తస్వరం, జాంబూనదం, అష్టాపదం, పొన్ను, జాళువా, పుత్తడి, కడాని, మేలిమి, కుందం, ఆణి, అప రంజి, ఉదిరి, కలధౌతం
బంగలా n పెద్ద ఇల్లు రూ బంగాళా బంగాళాఖాతం
బంటు n భృత్యుడు, పరిచారకుడు, శిష్యుడు, భక్తుడు, శూరుడు
బంట్రోతు n సేవకుడు, నాలుగో తరగతి ఉద్యోగి రూబంట్రోతు
బండ n 1 చాపరాయి, రాయి, 2 మందుడు, చురుకులేనివాడు
బండారం దేవి,కోశాగారం, ధనం, కోశం, బొక్క సం, గ్రంథాలయం, గొప్పతనం, శక్తి అసలు గుట్టు
బండి దేవిశకటం అనస్సు, కణిచి, కుబ్రం, కూబరి, కూవరి, చంకరం, చక్రపాదం, చక్రి, నేత్రం, స్యందనం, తీరు, అరదం, గంత్రి, గాడి, 2 రథం, తేరు
బంతి n 1 చెండు, కందుకం; గుండం, గేండుకం, గేందుకం, గేందువు, పిండం, చెండుతో ఆడే ఆట, ఒక జాతి పూల చెట్టు, వేటకాండ్రు చోరులు ఉపయోగించే ఓషధి విశేషం, వరస, పంక్తిలో పెట్టే భోజనం; ప్రకృపంక్తి
బంతెనగుండ్లు n 1 బంతులు తీరి కూర్చుండి తినేటట్లుగా ఆడే ఆటలు, 2 భోజన పంక్తి ఒకరికొకరు విసరు కొనే కబళాలు
బందిఖానా n జైలు, కారాగారం
బందిపోటు n నిర్బంధించి కొట్టడం, దొంగతనం, నిరోధించి దోచుకోవడం, ఊరిమీదపడి బలవంతంగా దోచుకునే వాడు
బందెలదొడ్డి n పశువుల చెరసాల
బంధం n సంబంధం, ముడ్డి, కట్టు, కావ్యరచనా విశేషం, చెర, ముడిరోగం, చెరసాలలో ఉంచడం, శరీరం, ఏర్పాటు చేయడం, పట్టుకోవడం, చేరిక, ఒడంబడిక, ఫలించడం, కనబరచడం, నరం, అంచు, తాకట్టు
బంధించు v కట్టివేయు, బంధనం చేయు
బంధితులు n బంధింపబడ్డ వారు
బంధుత్వం n చుట్టరికం
బంధురం n రమ్యం, ఒప్పిదమైనది, కిరీటం, కలహంస, నూనెమడ్డి, పొడుగుకలదై వంగినది, పక్షి, ఒక వృత్తం
బంభరం n తుమ్మెద , 'బం' అనే శబ్దాన్ని భరించేది; మధువ్రతం, మధుకరం, మధులిట్టు, మధుపాళి, ద్విరేవం, పుష్పలిట్టు, భృంగం, షట్పదం, భ్రమరం, అళీ, ఇందిందిరం, చంచరీకం, రోలంబం, బంభరం, జమిలి ముక్కాలి, తేటి
బకం n నక్కుకొంగ కహ్వం, కొక్కరాయి, కొక్కు, కొక్కిర, బకోటం, జలపాదం, పరద, బాతు, నగ్గటం, బకపుష్పం, ఒక రాక్షసుడు, కుబేరుడు
బకాయ n బాకి, నిలువ సొమ్ము, పాత బాకి
బకెట్టు n చేద, నీళ్ళుతోడే తొట్టి, బాల్చీ
బక్క n బక్కటిల్లినవాడు, బక్కటిల్లి నది, కృశుడు, దుర్బలుడు
బక్కచిక్కు v చాలా కృశించు
బగబగ n మండడానికి మంటలు, అనుకరణం
బగీచా n తోట
బగున v విణతొందరగా బచ్చల
బజారు n అంగడి వీధి, సంత, మార్కెట్
బజ్జీలు n బశనగపిండి మొదలైన వాటితో చేసే పచ్చడి, పిండి వంటలు
బటువు n అంగుళీయకం, భూషణం, గుండ్రనిది, దృఢం, దిండు, అందం, గొప్పది
బట్ట n గుడ్డ, వస్త్రఖండం, వెంట్రుకలు లేనిది, ఆచ్చాదన లేనిది, పసులదేహం మీది తెలుపు వంటి చార
బట్టతల దేఖల్వాటం, వెంట్రుకలు లేని తలవెంట్రుకలు రాలిపోయిన తల బట్టబయలు
బట్టీపట్టు v కంఠస్థం చేయు
బడ హివిణ పెద్దది
బడబడ n పోరాటంలో అయ్యే ధ్వన్యనుకరణం, రాళ్ళు వడగండ్లు మొ// తొందరగా పడటంలో అయ్యే ధ్వని కనుకరణం, మింగటంలోనగు వాని ధ్వని కనుకరణం, వేగంగా మాట్లాడటాన్ని సూచించడానికి వాడే పదం
బడబాగ్ని n బడబానలం, సముద్రంలో ఉండే అశ్వా కారంగా ఉండే అగ్ని
బడలిక n అలసట, శ్రమ
బడాయి n ఎచ్చు(లు), అతిశయం, గర్వం డాబులేని గొప్పతనం
బడి n చిన్న దుడ్డుకర్ర, బడియ
బడి n పాఠశాల, వెంబడి, అందు, చిన్నది, వామం, వెంబడించడం, విధం, తోవ, పరిమాణం, క్రమం, దిట్టతనం,
బడితే n 1 దుడ్డుకర్ర,బడిత, • బడితి, 2 ఇనుపకట్ల గుదియ
బడుగు n అసమర్థుడు, అల్పుడు, శవం, అశక్తుడు, కృశించినది
బడుగులు n బలహీనులు, అల్పులు, అసమర్థులు
బతిమాలు n లాలనచేయు, అనునయంగా అడుగు, ప్రార్థించు రూ బతిమలాడు
బతుకు (బతికించె) n జీవనం, జీవనస్థితి; క్రిజీవం పొందు, జీవించు,బ్రతుకు, ప్రాణా పాయస్థితినుంచి బయటపడు
బత్తాయి n బత్తా వియాదేశం నుంచి వచ్చిన ఒక నారింజ, అయ్యనారింజ
బత్తి v విభక్తి, విరాళి బత్తాం
బదరి n రేగుచెట్టు బదిలీ
బదలాయించు n ఒకచోటనుంచి మరోచోటికి మార్చు, మార్చు
బదులు n మారు, అప్పు, ప్రతి
బద్ద n వెదురు వంటి వాటి చీలిక, బ్రద్ద, కాయయొక్క ఖండం, బీట, విల్లు, పేము, కాయధాన్యాల పప్పు
బద్దలుకొట్టు v పగులగొట్టు,ముక్కలు చేయు
బద్ధకం n మాంద్యం, పాలుమాలిక,బద్దకం
బద్ధము n కట్టబడినది, సంకెల వేయబడినది, పట్టుకోబడినది, చెర పెట్టబడినది, కట్టుకోబడినది, అడప బడినది, నిర్మింపబడినది, కూర్పబడినది, రచింపబడినది, చిక్కుకొన్నది, గడ్డ కట్టినది
బధిరుడు n చెవిటివాడు , బాధింప బడిన శ్రవణ సామర్థ్యం గలవాడు
బనాయించు హింక్రికల్పించు, పెట్టు, వెక్కిరించు, తప్పుడు కేసులు పెట్టు, వేళాకోళంగా పొగడు, మోపు
బయటికి v వివెలుపలికి
బయర్లుకమ్ము v దేక్రిమబ్బుపట్టు, మసక అగు
బయలు v వివెలుపలి, బహిః ప్రదేశం, చెట్టు చేమలేని చోటు, ఆకాశం, శూన్యం, పొత్తు సందు
బయలుదేరు v నిర్గమించు, బయలు వెడలు, ప్రయాణమవు
బయళ్ళు n బబహిఃప్రదేశాలు
బయానా n సంచకరువు, బేరం కుదిరాక ముందు ఇచ్చే కొంత డబ్బు, అడ్వాన్సు
బయిసిమాలు v మర్యాద తప్పు, బైసిమాలు, హద్దుమీరు, సొంపుచేడు
బయోకెమిస్టీ n జీవరసాయన శాస్త్రం
బరబర n ఈడ్వడం మొదలగు వాటి ధ్వనికి అనుకరణం
బరమ n చెక్కలకు రంధ్రం చేయడానికి ఉపయోగించే వడ్రంగి సాధనం, పిడిసాన ,బరమా
బరాబరి n హెచ్చరిక, సరియైనది బరికె
బరితెగించు v హద్దుమీరు, విశృంఖల మగు
బరుకు v గోళ్ళతోగీరు, గోకు
బరువు n భారం, తూకం, ఒక వస్తువుకు ఉండే గురుత్వాకర్షణ శక్తి, సరుకునింపిన సంచి, అశక్యం, అధికం, సహింపరానిది
బరుసు n బిరు సైనది, గరుకైనది
బర్తి n నెమలి, బర్హం (పురి) కలది, నెమలి, దర్భ, అగ్ని, నగవు, కురువేరు
బర్రె n గేదె,బర్రియ
బలం n బలిమి, సత్తువ ఆయతి, ఉక్కు, ఓజస్సు, కుశలం, తేజస్సు, దార్డ్యం, దిట్ట, ద్రవిణం, ధిష్ణ్యం, పరాక్రమం, పౌరుషం, ప్రాణం, ప్రభవం, విక్రమం, శుష్మం, శక్తి, శౌర్యం, సత్యం, స్థామం, సేన, వాసన, రసం, రూపం, రక్తం, దేహం, చిగురు
బలకరం n బలాన్ని చేసేది, దృఢం బలి, రపరిజనం, సమని
బలగం n పరిజనం, సేవకులు, బంధువర్గం, సైన్యం, సమూహం
బలదేవుడు n బలరాముడు, కృష్ణుని అన్న , బలం గల దేవుడు బలభద్రుడు, ప్రలంబఘ్నుడు, అచ్యు తాగ్రజుడు, రేవతీరమణుడు, రాముడు, కామపాలుడు, హలాయుధుడు, నీలాంబరుడు, రౌహిణేయుడు, తాలయుడు, ముసలి హలి సంకరణుడు, శీరపాణి, కాళిందీ భేదనుడు, బలుడు, నల్ల వలువదాలు, తెల్లని మయిదంట, వెన్న దొంగన్న, మక్కి వాలు దాలుష, కాటి వడగ వాడు, బలరాముడు, వాయువు బలపం
బలభేది n ఇంద్రుడు ,బలుడనే రాక్షసుని చంపినవాడు
బలశాలి n బలం కలవాడు, బలవంతుడు
బలసి v బలవంతుడై, పుష్టి కలిగి
బలహీనపడు మిక్రిశక్తిహీనమగు, బలం తగ్గిపోవు
బలాఢ్యులు n బలవంతులు
బలాత్కారం n బలవంత పెట్టడం
బలాదూరు n దిగదుడుపు, పనీ పాట లేకుండా
బలి n ఉపహారం, కానుక, అర్పణం, శాంతికోసం క్షుద్రదేవతలకు సమర్పించే నెత్తురుకుండ, గంధకం, చర్మపు ముడుతలు, కప్పం, బలవం తుడు, పూజాసామగ్రి, ఒక చక్రవర్తి, యమదండం
బలిదానం n త్యాగం, దేవతకు బలి ఇవ్వడం
బలిమి n బలం, సత్తువ రూ బల్మి, పరాక్రమం, బలాత్కారం, అతిశయం, ఔదార్యం
బలిష్ఠం n 1 మిక్కిలి బలం కలది; 2 ఒంటె
బలువు n మిక్కుటం, బలం, దృఢం
బల్బు n ఉండ, బుగ్గ, కరెంటుతో వెలిగే గుండ్రని (సీసా) దీపం
బల్ల n దారుఫలకం, కొయ్యపలక, టేబుల్, కూర్చోటానికిగాని లేదా ఏవైనా వస్తువులు పెట్టడానికి గాని వాడే సుమారు రెండున్నర అడుగుల ఎత్తున్న నాలుగు కాళ్ళ చట్రానికి కొయ్యపలకరించిన ఆసనం, తూము, ఎత్తు పలక బిళ్ళ రోగం
బల్లి n గృహగోదిక, ఇండ్లగోడల పై పాకుతుండే సరీసృపం జాతికి చెందిన ఒక ప్రాణి ముసలి, గౌళి, పల్లి,
బల్లిదుడు n పరాక్రమశాలి, శూరుడు ,బలం ఉన్నవాడు
బల్లెం n జెముడాకు లాంటి అలుగుకల బాణ విశేషం
బళారె అవ్య1 ప్రశంసార్థకం, 2 ఆశ్చర్యార్థకం, బలారె
బవరం n యుద్దం
బవిరి n సాంద్రం,బవరి, గుండ్రం, ప్రహరి, శ్రాంతి
బస n వాసస్థానం, సంకేతం, ఉనికిపట్టు బసవన్న
బస్తా n (ధాన్యం నింపిన) గోనెసంచి, కట్ట, మూట
బస్తి n పట్టణం, పేట,బస్తీ
బస్తీవాసులు v విnపట్టణంలో ఉండే వారు, ఒక వీధిలో ఉండేవారు
బస్సు n ఒకచోటనుంచి మరో చోటకు చేర్చేందుకు ఉపయోగకరంగా ఉండే పెద్ద మోటారు వాహనం, ప్రజలు ప్రయాణం చేసే రోడ్డు రవాణా సంస్థ వాహనం;
బహిరంగం n బయలువడి, వెలుపలిది; అందరికీ తెలియడం
బహిష్కరించు v వెలివేయు, వెలివేటు
బహిష్కృతుడు n వెలి పెట్టబడిన, వాడు, వెలువరింపబడినవాడు
బహుకుటుంబీకుడు n చాలా కుటుంబం కలవాడు, పెద్ద కుటుంబీకుడు
బహుకొద్ది v విnచాలాకొంచెం
బహుభారం n ఎక్కువ బరువు
బహుభాషావేత్త n అనేక భాషలు తెలిసినవాడు
బహుమతి n బహుమానం, గొప్ప ఎన్నిక, ప్రతిభనుగానీ, సామర్థ్యంను గానీ గుర్తించి ఇచ్చే కానుక
బహుముఖ n అనేక విధాలైన; ఎక్కువ ముఖాలున్న; అనేక దృక్కో ణాలున్న
బహుళ n కృష్ణపక్షం, అనేకమైన;, అగ్ని, ఆవు, నీలి చెట్టు, ఆకాశం, మిరియాలు, నలుపు
బహువిధఖగములు n అనేక రకాలైన పక్షులు
బహుశః సంఅవ్యతరచుగా, సాధారణంగా, అవకాశాన్నిగానీ, సంభావ్యతను గానీ తెలి పేమాట
బహూకరించు సంక్రి(కానుకగా) ఇచ్చు, సన్మానించు, మన్నించు
బాంధవ్యం n చుట్టరికం
బాంబు n ఒక విధమైన ఫిరంగి గుండు, విస్పోటకరమైన మారణాస్త్రం, విధ్వంసకరమైన పదార్థం
బాకా n కాహళం, ఊదే వాద్య విశేషం
బాకీ n అప్పు, రుణం, బకాయి
బాకు n కటారి, కత్తి, వంకరకత్తి
బాగా n అధికంగా,
బాగు v,క్షేమం, శుభం ,v ధం, సుందరమైనది, అందం, ఆరోగ్యం
బాజా n డోలు, తప్పెట మొదలగు ! వాద్య విశేషాలు
బాట n బండిదారి, విశాలమార్గం బాటసారి
బాడుగ n 1 అద్దె, 2 జీవితం రూ బాడిగ
బాణం n అమ్ము, శరం పర్యా, అజిహ్మగం, అయోగ్రం, ఆశుగం, ఇషువు, కలంబం, ఖురాలం, ఖేలి, పత్రి, పృషత్కం, మార్గణం, రోపం, విశిఖం, కోల, ములిగి, తూపు, లక్ష్యం, శరపుంఖం, ఆవు పొదుగు, అయిదుకు సంకేతనామం, శబ్దం, వాక్యం, అగ్ని, నల్లగోరింట
బాణసంచా దేవేడుక కోసం కాల్చే పూవతులు, బాంబులు, చిచ్చుబుడ్లు వంటివి దీపావళి మతాబులు
బాణీలు n నడకలు, శ్రుతిలయలు, రీతులు
బాతాఖానీ v,n సంభాషణ; వి వదురుబోతు
బాతు n ఆడేలు, నీళ్ళలో ఈదే ఒకరకం పెంపుడు పక్షి ఆటి, ఆడి, ఆతి, బాతువు n అన్నం (కేసరిబాతు, టమాటా బాతు)
బాధ n పీడ, వేదన, నొప్పి, పీడనం, దుఃఖం, హాని, అపాయం, నిషేధం, అడ్డు
బాధ్యత n పూచీ జవాబుదారీతనం
బాన n కడవ, పెద్దకుండ
బానిస n దాసి, తొత్తు, కూలివాడు
బాపురే దేఅవ్య
బాప్తిస్మం v వివయసు ఉన్న వారిని క్రైస్తవ చర్చిలో సభ్యులుగా చేర్చుకొనే తతంగం
బాబయ్య దేవిఒక వ్యక్తి పేరు, పూజ్యుడు, పినతండ్రి తండ్రి
బాబాయ్ n పినతండ్రి
బాబోయ్ అవ్యఆశ్చర్యార్థకం బారసాల
బారి n కష్టం, బాధ, ఆపద, కాలిగొలుసు, హింస, లక్ష్యం, గొప్పది, ఉదారం, వెలకలది
బారిన n ఆపదలో
బారిష్టర్ n వకీలు, న్యాయవాది
బారు n పంక్తి, వరుస, సమూహం, దీర్ఘం
బారువ n ఇరవై మణుగుల కొలది, ఇరవై ఒక్క తులాలు
బారెడు n రెండుమూళ్ళు పొడవైన
బార్లాజాపి v పొడువుగా చాపి
బాలబాలికలు n చిన్నపిల్లలు; కన్య; బాల++16 సంవత్సరాల లోబడి నది, స్త్రీ, మూఢురాలు, కొబ్బరిచెట్టు, తృటి బాలిక++కన్య, స్త్రీ, ఏలకులు, శర్కర, చెవినగ, చెట్టేలకి, ఇసుక, పీకే
బాలవితంతువు n చిన్నతనంలోనే భర్త మరణించిన స్త్రీ,
బాలశిక్ష n పిల్లలు చదువుకొనే పాఠ్యగ్రంథం (వాచకం), అక్షరాభ్యాసం తరవాత సంప్రదాయం ప్రకారం చదివించే పిల్లల మొదటి వాచకం
బాలింత n నవప్రసూత, బాలెంత రాలు,బాలెంత,
బాల్యం n చిన్నతనం, బాలభావం (16 ఏండ్ల కు లోబడిన వయస్సు), చిన్నతనం, క్షీణావస్థ, మూర్ఖత్వం
బాల్యవివాహం n చిన్నతనంలో చేసిన పెళ్ళిళ్ళు
బాల్యోపచారాలు n బాలురకు చేసే సేవలు
బావ n అక్కమగడు, భర్త అన్న, భార్య అన్న, తనకన్న పెద్దెన మేన మామ మేనత్తల కొడుకు బావి
బావుకొను v అనుభవించు, అన్నం, వంటి నోట సరుదుకొను, లాభపడు
బావురుమను v (జనశూన్యం కావడం వల్ల) బావురుమనే మారుమోత కలది అగు, దుఃఖించు, శూన్యమవు, భోరున ఏడ్చు
బాష్పం n కన్నీరు, తోటకూర, ఊష్మం , ఆవిరి, ఇనుము
బాష్పములు కురిసిబాస n ప్రతిజ్ఞ, ఒట్టు; ప్రకృ భాష, ఆంధ్రాదిభాష మాట, హితవచనం, ప్రమాణం, వ్రతం, ఒడంబడిక, కారణం
బాసికం n లలామకం, నొసటగట్టే భూషణం, వివాహ సమయంలో వధూవరులకు నుదుటకట్టే బంగారు
బాహాటం n బహిరంగం, దాపరికం లేని, అందరికీ తెలిసే
బాహుసత్యం n భుజబలం
బాహ్య n వెలుపలి
బింకం n బిగువు, బింగం, గర్వం, ధైర్యం, శౌర్యం, తీక్షత, అతిశయం
బింగోలు n గుంజిళ్ళు బిందె
బిందువు n బొట్టు, సున్న, నీటి బొట్టు, చుక్క, భ్రూమధ్యం, ఆకాశం, చెరువు
బింబం n (సూర్య) మండలం, ప్రతిబింబం, ప్రతిమ, సూర్య చంద్రమండలం, అంతఃపురం, ఊసరవెల్లి, సమానం, దొండపండు
బికారి v విnభిక్షకుడు, దరిద్రుడు, అప్రయోజకుడు, ధూర్తుడు బిక్కమొగం
బిగించు v గట్టిగా కట్టు
బిగి n పటుత్వం, పట్టుదల, బింకం, అభినివేశం, దృఢం
బిగుతు n వదులుకానిది, గుత్తం
బిగువు దేఅదుముడు, నొక్కుడు, దిట్టతనం, బెట్టుసరి, ధైర్యం, గర్వం, గర్వోక్తి, బింకం, తాడుతో కొలిచే ఒక జాతి కొలత
బిగ్గరగా v విణగట్టిగా, దృఢంగా
బిచ్చం n భిక్ష, తిరిపం బిట్టు
బిడాలం n పిల్లి ,మూషికాలను భేదించేది, కనుగుడ్డు, నేత్ర రోగ ఔషధం
బిడియం n సిగ్గు బిడ్డ
బిత్తరబోవు v చలించు
బిబ్బీలు n 1ముస్లిం వనితలు (బీబీలు), 2 తోరణాలు
బిరడా n 1 బరణి, సీసా వంటి వాటికి పైనుండే మూత, 2 వీణ వంటి వాటి తంతి చుట్టే తరిమెన కొయ్య
బిరబిర v విణ1 అతి త్వరితంగా, త్వరత్వరగా, 2 తిప్పడం వంటి వాటి కనుకరణం
బిరుసు n కాఠిన్యం, కరుకు, శౌర్యం, ఉద్దతి, విదం, పరుషభాషణం, బాధ, క్రూరం, తీక్షం అధికం
బిలం n రంధ్రం, గుహ, గుర్రం
బిళ్ళ n బింబం, గుండ్రని వస్తువు, (సూర్యచంద్రుల) బింబం, ఖండం, గుండ్రపుదిండు, గుండ్రని వస్తువు, గుండ్రని పలక, కర్ణభూషా విశేషం, గుండ్రని నెత్తురుగడ్డ, బంగారు బిళ్ళ, కపిల రాట్నం
బిస్కట్లు n రొట్టెబిళ్ళలు, పల్చటి సన్నని కేక్ వంటి పదార్థం
బీగం దేవి తలుపులకు వేసే తాళం, తాళం, తాళం చెవి బీచ్
బీజం n విత్తు,విత్తనం, గర్బా దానం, కారణం, అంకురం, విత్తడం
బీజావాపనం n విత్తనాలు విత్తడం, బీజవాపం
బీటలువారు v బద్దలవు, పగులు
బీదరికం n పేదతనం, దారిద్ర్యం, దైన్యం
బీదసాదలు n నిరు పేదలు, సామాన్యులు
బీభత్సం n రోత, పాపి, అసహ్యించుకొనేది, ఒక రసం
బీభత్సుడు n అర్జునుడు ,యుద్ధ రంగాన్ని మృతకళేబరాలచే రోత పుట్టించేవాడు
బీర n కాయకూరలలో ఒక తీగ; కోశాతికి; కర్కశచ్చద, వుంటాలి, జాంగలం, జాలిని, ధామార్గవ, పీతక, పీతపుష్ప
బీరువా v దేవిఅంతస్తులుగా అడు పుల్లలమర్చిన బిగపు పెట్టె
బీళ్ళు n దున్నని ఎండిన నేలలు, దున్నని భూములు
బుంగమూతి n చిన్న మూతి, అలక వంటి వాటివల్ల మాట్లాడకుండా మూతి ముడుచుకొని ఉండు
బుక్క n గంధపుపొడి, సుగంధ చూర్ణం, అన్నపుముద్ద రూ బుక్కా, బుక్కాం
బుగబుగ n పరిమళం వ్యాపించడానికి అనుకరణం, ఒలుకుడు, పారడం వంటి వాటి ధ్వనికి అనుకరణం, పరిమళం, ఐశ్వర్యాదులవల్ల కలిగే మిట్టు పాటు
బుగ్గలు n చెక్కిళ్ళు, పర్వతాల నుంచి సంతత ధారగా పైకి ఉబికి వచ్చే నీరు, నీటి బుడగలు, చెక్కిళ్ళు, గాలి బుడగలు
బుగ్గి n బూడిద, దుమ్ము, ధూళి
బుచ్చి n చిన్న, అల్పం
బుజ్జగించు v పలాలించు, మంచి మాటలతో సముదాయించు, స్తుతించు, పొగడు
బుజ్జి n చిన్న, చిట్టి, అల్పం
బుట్ట n పుష్పాదులుంచే తట్ట, వేళ్ళతో అల్లిన బుట్ట,బుట్టి
బుడమ n ఒక జాతి దోస బుడిబుడి
బుడుత n పొట్టివాడు, వామనుడు, లేత, బిడ్డ, కుమారుడు
బుడ్డి n చిన్నమూతిగల చిన్న కుండ,బుడ్డిగ, కమండలువు, చిన్న మూతి ఉన్న చిన్న కుండ, గాజు సీసా
బుత్విజుడు v యజ్ఞము చేయించేవాడు; ఋత్విక్కు, యాజకుడు, యాజయిత
బుద్దుడు n శాక్యముని; అక్షర చణుడు, అద్వయ వాది, అర్కబం ధువు, కనిష్ఠకుడు, కులి శాసనుడు, ఖసముడు, పేశుడు, గౌతముడు, జినుడు, తథాగతుడు, తమోవహుడు, త్రిశరణుడు, తీర్ధకుడు, దశభూమీ శుడు, దాశారుడు, ద్వాద శాఖ్యు, ధర్మచక్షుడు, వంచజ్ఞానుడు, భగవంతుడు, మహాబలుడు, మహా బోధి, మాయా దేవీసుతుడు, మార జిత, లోకజితు, శాక్యముని, శాక్యసింహుడు, శౌధోదని, శ్రీఘనుడు, శ్వేతకేతుడు, షడభిజ్ఞుడు, దశబలుడు, సమంత భద్రుడు, సర్వజుడు, సమదర్శి, సర్వార్థసిద్ధుడు, సుగతుడు, తెలియబడినవాడు, జాగరి తుడు, తెలివిగలవాడు, పండితుడు
బుద్ధి n మతి, మనీష తెలివి, జ్ఞానం, వివేకం, మనస్సు, ప్రతిభ, తెప్పరిల్లడం, ఆలోచన
బుద్బుదప్రాయం n నీటి బుడగ వంటిది
బుధవారం n ఏడు వారాలలో ఒకటి, సౌమ్యవారం
బుధుడు n పండితుడు, తెలిసిన వాడు ,అన్నిటిని ఎరిగినవాడు, ఒక గ్రహం, వేలు, వృద్దుడు, బుద్ధిమంతుడు, మేలుకొన్నవాడు
బురఖా n ముసుగు (ఆచ్చా దనం), గవు సెన
బురద n పంకం; అసలు, అడుసు, ఊబి, కర్ధమం, పంకం, రొంపి, జంబాలం, నిషద్వరం, బంద, బాడె, రొచ్చు
బురుజు n కోటకొమ్ము, మూలలందు గుండ్రంగా నిర్మించిన నిర్మాణాలు 2 చిన్న గంట
బుర్ర n తల, శిరం, కొబ్బరికాయ వంటి వాటి గుల్ల, వీణ వంటి వాటి కమర్చే సొరకాయ, పాముల వాని నాగస్వరం, తలపుర్రె
బుర్రకథలు n వంతలు వాయిస్తూ చెప్పే కథలు
బుర్రమీసం n లావుగా ఉన్న మీసం బుర్రుపిట్ట
బులుపు n ఉబలాటం, అభిలాష, విలాసం, బింకం బుల్లి వంతులమ్మ
బుల్డోజర్ n భూమిని సమంగా చేసే యంత్రం
బువ్వ n అన్నం, వంటకం, ఓగిరం
బుషభం నంవిఎదు, ఆనడ్వాహం, ధుర్యం, వరీవర్దం
బుష్కోట్లు n చొక్కాలు
బుస n 1 పాములు వంటి వాటి పూత్కారం, 2 నిట్టూర్పు
బూచి n భూతం, పిశాచం పిలలన భయ పెట్టడానికి వాడేమాట
బూజు n 1 దుర్గంధం, పుస్తు, 2 ఎండ సోకకపోవడంవల్ల తడి వస్తువుల పై పట్టే మకిలి
బూటకం n 1 మోసం, మాయ, 2 కల్లమాట
బూట్లు n కాలిజోడు
బూడిదపాలు n వృథా, వ్యర్థం
బూడిదలో పోసిన పన్నీరు జా వ్యర్థం, నిష్ప్రయోజనం
బూర n ఊదే వాద్య విశేషం, కాహళి భేదం, బాకా ఊదేటువంటి
బూరుగు n శాల్మలి వృక్షం కంటక ద్రుమం, కఠ్కటి, చిరంజీవి, తులిని, తూలఫల, దారణి, దీర్ఘ ద్రుమం, దురారోహం, నకులి, పిచులం, మోచకి, మోద, యమవృక్షం, రక్టోత్సలం, రోచనం, శ్రీమూలం, స్థిరజీవిక, స్థూలకంటిక
బృందం n గుంపు, సమూహం
బృందావనం n గోకులానికి సమీపంలోని అడవి, తులసికోట, కృష్ణుడు నివసించే తులసి తోట, రాఘవేంద్ర స్వామి సమాధి పొందిన స్థలం
బృహత్కార్యక్రమం n పెద్ద కార్యక్రమం, పెద్దపని
బృహన్నల n విరాటనగరంలో అజ్ఞాత వాసం నాటి అర్జునుని పేరు
బృహస్పతి n దేవతల గురువు, వాక్కులకు ప్రభువు సురాచార్యుడు, గీష్పతి, దీషణుడు, గురువు, జీవుడు, ఆంగిరసుడు, వాచస్పతి, చిత్ర శిఖండిజుడు, ఆర్యుడు, సూరి, వాగీ శుడు, వచసాంపతి, సురగురువు, ఒక గ్రహం, ఒక ముని
బెంగ n కలవరం, మనోవ్యాకులత, విరహవ్యథ, కేక
బెకబెక n కప్పలు కూయడంలోని ధ్వనికి అనుకరణం
బెగడు n భయపడు,బెగ్గడు, కలతనొందు, బెంగ పెట్టుకొని దుఃఖపడు, కంపించు
బెగ్గురుపిట్ట, స్త్రీ మొలనూలు, పక్షి, (దే) వినోదం సారస్యం n సరసత్వం
బెజ్జం n రంధ్రం, తూటు, కన్నం
బెటర్ ఆఫ్ n భార్య
బెటర్మెంట్ n అభివృద్ధి
బెట్టిదం n క్రౌర్యం, భయంకరం, తెగువ, ఉద్దతి, సాహసోక్తులు, ఘోరం, కఠినం, తీక్షం, అధికం, కష్టం, కరకు, తీవ్రం
బెడద n గొడవ, బాధ, ఆపద, నింద
బెడయు v వికలమవు, పటుత్వం తప్పు, చెడు
బెత్తం n వేత్రం, కర్ర, సన్నటి పొడ గాటి పుల్ల
బెత్తెడు n చాచిన తర్జని మొదలైన నాలుగు వేళ్ళంత
బెదరు v భయపడు, వెనుదీయు, అపనమ్మిక, అధైర్యం
బెదిరించు దేక్రిభయ పెట్టు, అదలించు
బెబ్బులి n పెద్ద పులి, వ్యాఘ్రం, కోల్పులి
బెబ్బులి బెరడు n చెట్టుపట్టు, చెట్టుబోదె మీద ఉండే పెచ్పులాంటి పొర లేదా కాండం
బెరయు v అంటు, తగులుకొను, వ్యాపించు, కలుగు, అగు, కూడు కొను, ఒప్పు, అతిశయించు, ఉండు, ఏకీభవించు, వీచు, తారసిల్లు, అనుకరించు
బెరుకు బెరుకుగా n భయం భయంగా, బెరుకు, తేడా, వేరు పాటు, ఉపయోగం, అలక్ష్యం, పిరికి తనం
బెల్ n గంట
బెల్లం n గుండం, చెరకు రసం కాచి చేసిన ఒక ఘనపదార్థ విశేషం అరుణం, ఐక్షవం, గండోలం, గుడం, గులం, ద్రవజం, పాణి, మోదకం, స్వాదు, అచ్చు
బెల్లించు v వంచించు, మోసపుచ్చు, ఊరించు 2 ఉబ్బించు, ముఖస్తుతి చేయు
బెళుకు v తళతళ ప్రకాశించు, కంపించు, బెణకు, భయపడినట్లు నటించు, కలవరపడు, చాంచల్యం, మాటలోని చమత్కారం, తీక్షణత
బేకు కక్రి(కన్నడం) కావాలి
బేజారు n కంగారు, అలయిక
బేటరీ n విద్యుద్యంత్రం
బేటీ n కలుసుకోవడం, కలహం, పగ, వైరం, బిడ్డ, కూతురు
బేట్టు n బిగువు, అతిశయం, గౌరవం, టెక్కు, దృఢత, దిట్టతనం, బింకం, పెంపు, పారుష్యం బెడగు
బేడా n గుడి ముందుండే రాతిస్తంభం
బేరం n 1 వాణిజ్యం, క్రయవిక్రయ వ్యాపారం, 2 వెల నిర్ణయించడం
బేరీజు n లెక్కల వివరణం, పోల్చటం, అందాజా, అంచనా
బేరేజ్ n ఆనకట్ట, వంతెన
బేలలు n అవివేకులు, తెలివితక్కువ వారు, పిరికివారు
బేసి n సరిసంఖ్య కానిది X సరి
బైరాగి v (చిట్కాలు)దేవిన న్యా (చిట్కాలు) విరక్తుడు
బొంకు v అబద్దమాడు విఅబద్దం, కల్లమాట, పొరపాటు
బొంగరం దేతాడుచుట్టి గుండ్రంగా తిప్పుతూ ఆడే ఒక ఆటవస్తువు
బొంగు n కీచకం, లావుగా బోలుగా ఉండే వెదురు
బొండం n ఒలవని కొబ్బరికాయ,బొండలం, బోండం
బొండు n గుండ్రమైనది, వర్తులం
బొంత n కప్పుకోవడానికి, పరచుకోవ డానికి దట్టంగా కుట్టిన గంత
బొంద n చిన్నగోయి, గుంపు, అరటి మొదలగు ! వాటి ప్రకాండం, ఒకానొక శాకం శవాలను పూడ్చి పెట్టే గొయ్యి
బొంది n దేహం, మేను
బొక్క n కలుగు, కన్నం, గోయి, కారాగారం, నష్టం, ఎముక, రంధ్రం, గొయ్యి, యోని బొక్కసం
బొక్కు v (ఏదయినా వస్తువును) నోటినిండా వేసికొని తిను
బొక్కెడు n నోటిలో పట్టేంత ముద్ద,
బొక్కెన n నీళ్ళచేద, నీరు పిప్పలి ఉలవలు వంటి దాణా ఉంచి గుర్రం నోటికి తగిలించే సంచి
బొగ్గు n 1 మండి చల్లారిన కట్టె, తునక, కాలిక, 2 దేవిణ నల్లనిది
బొచ్చు n రోమం, వెంట్రుకలు
బొచ్చె n 1 తల పెంకు, 2 అడుక్కునే చిప్ప, పళ్ళెం, 3 పుర్రె, ఇనపగంప
బొజ్జు n పొట్ట, కడుపు బొటనవేలు
బొటబొట n పొక్కడం కారడం వంటి వాటి అనుకరణ ధ్వని
బొటిమ n మౌవనంలో మొగం మీద లేచే చిన్న పొక్కు,మొటిమ
బొట్టు n తిలకం; చుక్క, కలాపకం, తిలకం, పుండ్రం, బిందువు, బిందువు, సున్న, లెక్కలలో గుర్తు కోసం పెట్టిన చుక్క, మంగళసూత్రం లో గుచ్చే సువర్ణాభరణం
బొడ్డు n నాభి, పొక్కిలి ఉదానం, గుల్మం, తుందకూపి, బొడ్డు, నాభినాళం, గిన్నె సీసా వంటి వాటికి కింది భాగంలో లోపలికి మెరకగా ఉండే చోటు, నూతి చుట్టూ ఎత్తుగా కట్టిన గోడ
బొత్తాం n గుండీ, బొత్తాను
బొత్తి n దొంతి, దొంతర
బొత్తిగా v విnపూర్తిగా, మొదలంట
బొద్దీక n బరిణెపురుగు రూ బొద్దింక
బొబ్బ n పెద్ద అరుపు, సింహనాదం, కేక, పొక్కు, జలం
బొబ్బట్లు n పోతలు, మధ్యలో పూర్ణం పెట్టి చేసే తీపి వంట రూ ఒబ్బట్లు
బొమ్మ n సాలభంజిక, పుత్తళిక, కనుబొమ్మ, వస్త్ర దంతాదులచే చేయబడిన ఆటవస్తువు, బ్రహ్మ, బిరుదం
బొమ్మరిల్లు n బాలికలు బొమ్మలను ఉంచి ఆడుకోనే చిన్న ఇల్లు రూ బొమ్మలిల్లు
బొరుసు n కంతి (కణతి), వేపుడు చట్టి, తాబేలు వంటి వీపు చిప్ప
బొర్ర n బొజ్జ, కడుపు బొర్రె
బొల్లి n తెల్లనిది, ఒంటిమీద తెల్లని మచ్చలు పుట్టే చర్మరోగం
బొల్లిగద్ద n గరుడపక్షి
బోగంమేళం n వేశ్యామేళం
బోగంవారు n వేశ్యజాతి
బోటి n 1 సదృశార్థకం, వంటివాడు మొ, 2 స్త్రీ, చెలికత్తె, దూతి, సదృశార్థకం
బోటు n ఊతం (ఆం) పడవ, కొండ వంటి వాటి పై ఉబ్బుగా ఉండే చోటు, ఘనుడు, ధూర్తుడు
బోడ n 1 సన్యాసి, బోడి, మోడు, విధవ, జుట్టు, కొమ్ములు వంటి విశేషాలు లేనిది
బోడు n దిబ్బ, కొంచెం ఎత్తైన ప్రదేశం
బోణి n మొట్టమొదట సరకు అమ్మగా వచ్చిన సొమ్ము, మొదటి బేరం
బోద n 1 పక్షిపిల్ల, 2దేవిణఉబ్బినది, స్థూలం
బోదకాలు n ఏనుగుకాలు
బోధన n 1 బోధించడం, నేర్పడం, బోధనం, 2 జ్ఞానం
బోధపడు మిక్రిఆకళింతకు వచ్చు, అర్థమగు
బోధపరచు మిక్రితెలుపు, తెలియపరచు, అర్థంచేయించు
బోధించు v తెలుపు, ఉపదేశించు, మేల్కొలుపు, అగ్నిని రాజబెట్టు బోధపరుచు
బోనం n భోజనం, భుక్తి, బోనాం, బలి అన్నం, వంటపాత్ర బోను
బోయ n కిరాతకుడు, వేటకాడు, బెస్త
బోర n రొమ్ము , కడుపు
బోరు n 1, రక్తం వంటి స్రవించడంలో అయ్యే ధ్వని అనుకరణం, 2 భేరి వంటి వాద్యాల ధ్వని అనుకరణం, 3 పంది వంటి వాని రొప్పే ధ్వనిఅనుకరణం; ఇవిఆసక్తిలేని అంశం, ఆసక్తిలేని వ్యక్తి, లోతుగా గుండ్రని చిల్లిచేయడం మరీ ముఖ్యంగా రాతిలో లేదా శిలల్లో చేయడం
బోరెం n 1 దూది వంటి వాటి మూట ఉదా
బోర్లా v రొమ్ము భూమి వంటి వాటికి ఆనించు
బోలు n లోపల ఏమీ / గుల్లగా ఉండేది
బోలెడు n చాలా, లెక్క పెట్టలేనన్ని
బోల్తాకొట్టు v తలకిందులవు
బోళా v విnఅమాయకుడు, కపటం లేని
బోసి n దంతాలు లేనిది, నగలు లేనిది
బౌండు n 1 హద్దు, మితం, 2 కట్టబడిన అట్టవేయబడిన
బ్యాంక్ n వడ్డీ వ్యాపార స్థలం, ప్రజాధనాన్ని రక్షించి, వడ్డీ లిచ్చి, వడ్డీలకు రుణాలిచ్చే సంస్థ, గట్టు, ఒడ్డు, కట్ట
బ్రతుకుతెరువు n జీవనోపాయం ప్రాణరక్షణోపాయం, వృత్తి, జీవనం, ఉనికి, వృత్తి,
బ్రషు n కుంచె
బ్రహ్మ n హిరణ్యగర్భుడు, బ్రాహ్మణుడు, బృహస్పతి, ఋత్విజుడు, విష్ణువు, శివుడు, సూర్యుడు, చంద్రుడు, పరమాత్ముడు
బ్రహ్మచర్యం n పెళ్ళి చేసుకోకుండా ఉండడం ,బ్రహ్మచారి ఆశ్రమ విశేషం, వేదాధ్యయనం కోసం నియమం, నాలుగాశ్రమాలలో మొదటి ఆశ్రమం, వివాహం చేసుకోకుండా ఉండడం
బ్రహ్మచారి n వడుగైనవాడు, (వేదాధ్యయనవ్రతం) బ్రహ్మ యందు ఆచరించేవాడు; ఉపనీతుడు, వటువు, వడుపు, వర్ణి, వేదాధ్యయనం కోసం వ్రతం చేసేవాడు, బ్రహ్మచర్యాశ్రమాన్ని స్వీకరించినవాడు, కుమారస్వామి, అవివాహితుడు
బ్రహ్మచెముడు v విnతీవ్రబధిరత్వం
బ్రహ్మర్షి n బ్రహ్మవేత్త అయిన రుషి వేదాన్ని స్మరించిన రుషి
బ్రహ్మవిత్తం n బ్రహ్మజ్ఞానం కలిగినవారు
బ్రహ్మాండం n 1 భువనగోళం, ప్రపంచం, 2 చాలా బాగా
బ్రహ్మానందం నంవి సత్యమైన ఆనందం, ఎక్కువ సంతోషం
బ్రాంచి n భాగం, శాఖ
బ్రిటిష్వారు v విnఆంగ్లేయులు
బ్రిడ్జి n వారధి, వంతెన, సేతువు
బ్రుంగు v మునుగు, మగ్నమగు, పూడు, ఆచ్చాదిత మగు, చాటగు, నశించు, మరణించు
బ్లాక్ n విభాగం
బ్లెండ్ v,n గుడ్డి
భంగం n ఆటంకం, చెల్లాచెదురు, గొరపు, కోరిక, అవమానం, అల, రోగం, ఓటమి, పగలడం, తుంచడం, భాగం, వీరగడం, వేరు పడడం, నిరాకరించడం, తప్పిపోవడం, నాశం, పగులు, పారిపోవడం, నిలుపు దల, వంగడం, జనుము, మోసం, కాలువ
భంగపడు మిక్రిఅవమానపడు, మోసపోవు
భంగి n విధం, రీతి, పగులు, కౌటిల్యం, తరంగం, వ్యాజం, విన్యాసం, ఒప్పు, ఉపాయం, గతి, గంజాయి
భంగిమ n విన్యాసం, రీతి, గతి
భంగురం n నశించేది, పెళుసైనది, మార్పు గలది, వంకరైనది
భంజనం n విరవడం, చీల్చడం
భంజించు v భంగపరచు, చంపు, విరుచు
భండనం n యుద్ధం, కవచం, మోసం
భంభరీ n జోరీగ , 'భం' అనే ధ్వని చేసేది
భక్తి n సేవ, ఆరాధన, దేవుడిపట్ల ఉండే అర్పణ, పూజ్యభావం, విభాగించడం, భాగం, దైవభక్తి, రచన, గుణవృత్తి, చెందడం
భక్షించు v భుజించు, తిను, పాడుచేయు, కాటువేయు
భక్ష్యం n 1 తినదగిన పదార్థం, 2 పిండివంట, తినుబండారం; ఫోళీ విణ తినదగిన
భక్ష్యరాశి n పిండివంటలు
భగభగ n కాలే ధ్వని, అగ్నిజ్వాలలు పైకి లేచినప్పుడు అయ్యే ధ్వనికి అనుకరణం
భగవంతుడు n మహత్తరుడు, మాహాత్మ్యంగలవాడు , ఐశ్వర్యాధిక్యం కలగడంవల్ల పూజ్యుడైనవాడు దయ్యం , దేవర, దేవుడు, విష్ణువు, శివుడు, బుద్ధుడు, సన్మానితుడు
భగవత్సంకల్పం n భగవంతుని సంకల్పం
భగవద్భక్తి n భగవంతుని మీద భక్తి
భగవద్విశ్వాసం n భగవంతుని పై నమ్మకం
భగాయించు హింక్రిపరుగెత్తు, పారిపోవు
భగీరథ ప్రయత్నం n భగీరథుని యత్నంలాంటి గొప్ప ప్రయత్నం, ప్రయాసతో కూడిన ప్రయత్నం విడవని పూనీక
భగ్గుమను మిక్రిమండిపడు
భగ్నం n పగిలినది, ముక్కలైనది,విఫలమైనది, నశింపచేయబడినది
భజన n సేవ, ఆరాధనం, పూజ,భజనం భగవంతుడిని భక్తితో స్తుతిస్తూ చేసే సంకీర్తన, భజించడం, ధైర్యం, శక్తి
భజించు v సేవించు, సంకీర్తన చేయు, 2 ఆవేశించు
భటుడు n కాలిబంటు, పనివాడు, యోధుడు, సిపాయి, కిరాతకుడు, రాక్షసుడు, మ్లేచ్ఛుడు
భట్టారకుడు n పూజ్యుడు, ముని, సూర్యుడు, నాట్యోక్తిలో రాజు, పండితోత్తముడు
భడవకానా మివితిట్టడానికి ఉపయోగించే పదం వెధవా' అని అర్థం ఇచ్చేది
భద్రపరచు v జాగ్రత్తచేయు
భద్రాయితమూర్తి n శుభకరమైన ఆకారం
భయం n వెఱపు, వెరపు పుట్టించునది, భీతి, భయానకరసము, రోగము
భయంకరం n భయం కలిగించేది, అపాయకరం
భయంకరమైనది, తీవ్రత, నవరసాలలో ఒకటి, దినంలోని మొదటి భాగం, క్షయ రోగజ్వరం, ఎండ, తీక్షం, భయంకరం వ్యతి శాంతం
భయప్రదం n భయం కలిగించేది
భయానకం n భయంకరం, భయంకరమైన; విరాహువు, నవరసాలలో ఒకటి
భరం n భారం, బరువు, అతిశయం, ఆసక్తి
భరణం n పోషించేది, పోషణం, మోయడం, ధరించడం, భోజనం, కూలి
భరణీ n 27 నక్షత్రాలలో రెండోది అయిన 3 చుక్కలు గల నక్షత్రం; బరణిచుక్క, అంతకం, యమం, యామ్యం, భూమి, ఒక స్వర స్థాయి
భరతం n 1 క్షేత్రం, 2 ఆయుధంచే జీవించే ఒకానొక సంఘం
భరతఖండం n హిందూదేశం
భరతవర్షం n హిందూదేశం , భరతుడు పాలించిన దేశం
భరతవాక్యం n భరతుని వాక్యం, మంగళం, నాటకం చివర నాట్యశాస్త్ర కర్త అయిన భరతునికి అంకితంగా రచింపబడే పద్యం, భరత మహర్షియొక్క ఆశీర్వాద వాక్యం
భరతుడు n శకుంతలా దుష్యంతుల కుమారుడు, శకుంతలా దుష్యంతుల కుమారుడు, కైకేయీ దశరథుల పుత్రుడు, ఋషభదేవుని పుత్రుడు (జడభరతుడు), నాట్యశాస్త్ర రచయిత భరతముని, అడవి మనిషి, అగ్ని పుత్రుడు, నేతగాడు
భరించడం v ఓర్చుకోవడం
భరిణి n పెట్టె, కుంకుమ మొదలగునవి పెట్టుకొనే డబ్బీ , బరిణె, బరిణి, బరణి, బరిణ
భరితం n నిండిన, పూర్ణమైన, నిండినది, పోషింపబడినది, పచ్చనిది
భర్త n పతి, మగడు ,భరించువాడు జన్యుడు, ధవుడు, నాథుడు, ప్రియుడు, వరుడు, వల్లభుడు, పతి, ప్రభువు, ముఖ్యుడు, నేత, పోషించే వాడు, సృజించేవాడు
భవం n జన్మం, పుట్టుక, సత్త మూలకారణం, సంసారం, ప్రపంచం, శుభం, శ్రేష్ఠత్వం, ప్రాప్తి
భవంతి n మేడ, హాలు, పెద్ద పెంకుటిల్లు
భవనం n ఇల్లు, ఉనికి, జన్మం, పుట్టుక, నివాస స్థానం, గృహం
భవహరం n జన్మరాహిత్యం
భవాని n పార్వతి, గట్రాచూలి , భవుని భార్య
భవితవ్యం n భాగ్యం, భవిష్యత్తు, రాబోయే కాలంలో పరిస్థితి, కాదగినది, శుభం
భవిష్యత్తు n 1 కాబోయేది 2 సమీపించినది
భవుడు n శివుడు వ్యు
భవ్యం n సత్యం, యోగ్యత, సుందరం, యోగ్యం, శ్రేష్టం, శుభం, కాబోయేది
భస్మం n బూడిద, బూది అర్ఘ టం, ఉల్క, క్షారం, భసితం, భూతం, భూవి, రక్ష, కరక, నిగురు, నివురు, నీలు, పదడు, బుగ్గి, బుసి, బసుమం, బూతి, విబూది, వెలిమిడి, వ్రేల్మిడి
భాండం n కుండ, పాత్ర, తొడవు, నీ షేధం, దుః ఖం, గుర్రపుఁ దొడవు, మొదలి సొమ్ము, వస్తువు, కుండ వంటి మట్టి పాత్ర
భాండాగారం n సామానుల గది, గోదాం, ధనగృహం, కోశగృహం
భాగం n అంశం, అంశం, అదృష్టం, రాశిలో 30వ వంతు, స్థలం
భాగధేయం n అదృష్టం, దైవం, భాగం, పన్ను
భాగవతం n భగవంతునికి సంబంధించినది ,కృష్ణరూప భగవంతుని చరితం ఉండే గొప్ప పురాణ గ్రంథం వివఅష్టాదశ పురాణాలలో ఒక మురాణం; వ్యాసుడు రచించిన పద్దెనిమిది మహా పురాణాల్లో ఒకటి
భాగవతుడు n 1 భగవద్భక్తుడు, భగవంతుని మీద భక్తి కలవాడు 2 కృష్ణుడు వంటి వారి పౌరాణిక వేషాలు వేసుకొని ఆడి జీవించేవాడు
భాగస్వామి n భాగస్తుడు, పాలు పంచుకొన్నవాడు
భాగహారం n భాగించడం, విభజనం
భాగీరథి n గంగానది
భాగ్యం n అదృష్టం, శుభం, విభజింపదగినది, విధి, క్షేమం
భాగ్యవంతుడు n అదృష్టవంతుడు, సంపన్నుడు
భాగ్యవిధాత n అదృష్టాన్ని నిర్లయించేవాడు
భాగ్యవిహీనుడు n నిర్ధనులు, దురదృష్టవంతులు
భాజనం n పాత్రం, చోటు, 64 పలముల తూనిక (8సేర్ల పరిమాణం) విస్తరి, ఉనికిపట్టు
భాజల్ v ప్రకాశించు
భాతి n 1 విధం, పోలిక, 2 ప్రకాశం, తళతళమనే కాంతి
భాద్రపదం n చైత్రం వంటి పన్నెండు నెలల్లో ఆరో నెల, భాద్రపదా నక్షత్రంతో కూడిన పున్నమగల మాసం
భానువు n సూర్యుడు, భానుడు, ప్రకాశించేవాడు, శివుడు, వృద్దుడు, మదాంధుడు, మబ్బు, రాజు, దినం, కిరణం
భానూదయం n సూర్యోదయం
భామ n 1 స్త్రీ, వనిత, సులభంగా కోపం వచ్చే స్త్రీ 2 కృష్ణుని భార్య అయిన సత్యభామ
భామామణి n స్త్రీలలో శ్రేష్ఠురాలు
భాయ్ n సోదరుడు,భాయి
భారం n బరువు, యుద్ధాలలో తీక్షమైన భాగం, తూనిక, కావడి, పూచీ, మల్లబంధ విశేషం
భారతం n భరతుని సంబంధమైనది, భారత గ్రంథం, భరత వంశీయుల చరిత్రను చెప్పే ఇతిహాసం, కౌరవపాండవుల చరిత్రను తెలిపే ఒక కావ్యం, భరతుని సంబంధమైనది, భరతుని వంశస్థమైనది, భరతుడు పాలించిన దేశం (హిందూదేశం), భారత గ్రంథం, నాట్యశాస్త్రం
భారతి n సరస్వతీదేవి, ఈ లోకానికి భరతమునిచే తేబడినది, వాక్కు, ఒకనది, ఒక పక్షి, మరపు, జ్ఞానముద్ర, ఒక కావ్యవృత్తి
భారతీయులు n భారతదేశంలో పుట్టినవారు, భారతదేశానికి సంబంధిం చిన వారు
భారవి n కిరాతార్జునీయమ్ అనే కావ్యాన్ని రచించిన ప్రసిద్దమైన కవి
భారీ v,n గొప్ప, ఘనమైన, బలిసిన, పెద్ద,భారి
భార్గవి n పార్వతి, లక్ష్మి, సరస్వతి, గరిక, తులసి
భార్య n పత్ని, పెళ్ళాం, భరింపబడినది; పాణిగృహీతి, అర్థాంగి, ద్వితీయ, సహధర్మిణి, జాయ, దార, ఆలు, పెండ్లాం, రాణి, ఇల్లాలు, కళత్రం, ప్రోయాలు, జని, వధువు, క్షేత్రం
భావం n అభిప్రాయం, ఉద్దేశం, ఆలోచన, ఊహ ,నిర్వికారాత్మక మైన చిత్తంలో కలిగే ప్రథమ వికారం, సతు మనోవికారం, ఆత్మ, పుట్టుక, స్వభావం, ధాత్వర్థరూపక్రియ, రత్యాది, వస్తు వు, అర్థకారణం, ఉనికి, కలగుట, అగుట, స్థితి, భక్తి, పద్దతి, నిష్కపటం, ప్రేమ, తలంపు, సారం, హృదయం, నిశ్చయం, ధాన్యం, ప్రపంచం, వెహాభినయం, జ్ఞానేంద్రియం, జాతకంలోని 12 గృహాలు
భావకవిత్వం n ఆధునిక కవితా ధోరణులలో ఒక కవిత్వ ధోరణి
భావజాలం n అభిప్రాయాలు
భావన n అభిప్రాయం, తలపు, ధ్యానం, భక్తి, జ్ఞానం, ఋజువు, మామిడి
భావనాశక్తి n ఊహాశక్తి, ఆలోచనా
భావపద్దతి n ఆలోచనారీతి, ఊహా పద్ధతి
భావభారతం n ఊహలోని భారతం, ఆలోచనలో ఉన్న భారతం
భావవిప్లవం n ఆలోచనలలో గొప్ప మార్పు
భావావేశం n భావతీవ్రత, మానసిక ఉద్వేగం
భావించు v తలచు, ఎంచు, అభిప్రాయపడు, అనుకొను, ఊహించు, ఆలోచించు, నటించు
భావి n భవిష్యత్తు, జరగబోయేది
భావితరం n రాబోయేతరం
భావుకత n ఊహాశక్తి
భావుకులు n భావనలు కలిగిన వారు, హృదయంతో ఆలోచించేవారు
భావోద్విగ్నత మానసిక వ్యాకులత
భావోద్వేగం n ఊహతోడి అవ్యవస్థ చిత్తత
భావ్యం n తగినది, ఔచిత్యం, కాదగినది, ఊహింపదగినది, భవిష్యత్తు
భాష n మాట, పలుకు, బాస, స్వరూప నిరూపణం, వివరణం, సరస్వతీదేవి
భాషాంతరీకరణం n అనువాదం, వేరేభాషలోకి మార్చడం, ఒక భాషలోని విషయాన్ని మరో భాషలోకి మార్చడం
భాషాపతి n బ్రహ్మదేవుడు
భాషావధూటి n సరస్వతి
భాషాశాస్త్రం n భాషలకు సంబంధించిన శాస్త్రం, భాషలను శాస్త్రీయంగా విశ్లేషించి చెప్పే శాస్త్రం
భాషించు v వచించు, చెప్పు, మాట్లాడు
భాష్యాలు n మాటలు, వ్యాఖ్యానాలు, వివరణలు
భాసించు v ప్రకాశించు
భాసురం n ప్రకాశించేది, దివ్యమైనది, ప్రకాశించేది, స్పటికం, చెంగల్వ కోష్టు
భాస్కరుడు n సూర్యుడు , కాంతి కలుగజేయువాడు, అగ్ని, శివుడు, వీరుడు
భిక్ష n అడగడం, యాచించడం, దానం, కూలి, బిచ్చం, వేడుకోవడం, బిచ్చమెత్తిన వస్తువు, కడికొద్దీ అన్నం, కొలుపు
భిక్షచేయు మిక్రిసన్యాసి బిచ్చమెత్తి తెచ్చుకొనే భోజనం తినడం
భిన్నం n వేరుగా, పగిలినది, వేరు పడినది, కూడి ఉన్నది, భాగం, శోణనీల రత్న దోషం, విరిసినది
భిషక్కు/భిషజుడు n వైద్యుడు, రోగ చికిత్స చేసేవాడు
భీకర(6) n భయంకరం, వెరపు పుట్టించేది
భీతావహులు n భయపడినవారు
భీతి n భయం, వణకడం, దరం, త్రాసం, సాధ్వసం, వెరపు, ఎద, వెర, అళుకు, ఉద్వేగం, భీ, ఒజ, దిగులు, అదరు, బెదరు
భీతిల్లు v భయపడు
భీముడు n శివుడు, 1 భయం కలుగ చేసేవాడు, 2 ధర్మజుని తమ్ముడు, 3 ఒక రాజు, శివుడు, పరమేశ్వరుడు, పంచపాండవులలో రెండోవాడు, ఒక రాజు
భీరువు n స్త్రీ, భయస్వభావం ఉన్న స్త్రీ విశేషం, ఆడజాతి మేక, నీడ, కాళ్ళజెర్రి, శత్వారి, కంటకారి నక్క, పెద్దపులి, ఒక జాతి చెరకు
భీషణ(o) n దారుణం, భయానకం, గాఢం, పావురం, హించాలం
భీష్మం n భయంకరం, భయానకరసం
భీష్ముడు n గాంగేయుడు , సత్యవతి (యోజనగంధి) తండ్రి దాశరాజు అనుమతి ప్రకారం, తన తండ్రి శంతనుని వివాహం కోసం పెండ్లిచేసుకోనని భీష్మించిన వాడు, భయంకరుడు, శివుడు, రక్క సుడు, శంతను పుత్రుడు
భుక్తి n తిండి, భోగం, అనుభవం, మేర, గ్రహాల ప్రతిదిన సంచారం
భుజం n బాహువు, కరం బుజం, మూపు, రెట్ట, అరక, అరకడం, ఎరక, కొప్పరం, అంసం, నితంబం, ప్రగ్రహం, ప్రవేష్టం, వాహం
భుజంగం n పాము,వక్రంగా పాకేది
భుజకీర్తులు n రాజులు బాహువులకు పెట్టుకొనే స్వర్ణాభరణాలు
భుజబలం n బాహువులశక్తి
భుజస్కంధాలు n బాహువుల మూపులు
భుజించు నంక్రి1 తిను, 2 అనుభవించు మెసవు, మెసగు, ఆరోగిణ వెనర్చు, ఎక్కు, కుడుచు, ఆరగించు, సాపడ, నమలు
భువనం n లోకం, ప్రపంచం 14 లోకాలు , దీనివల్ల అన్నీ కలుగు తాయిజలం, భూమి, స్వర్గం, ప్రాణి, మనుష్య జాతి, నీరు, 14 అనే సంఖ్య, స్థానం, ఆకాశం, రంధ్రం
భువి n భూమి, భూలోకం, నవద్రవ్యాలలో ఒకటి, ప్రపంచకం, ప్రదేశం, ఒకటి అనే సంఖ్య, అగ్ని హోత్రం, సంభవించడం
భూకంపం n భూమి కంపించడం, అగ్నిపర్వతాలవల్లగానీ లేదా భూమి అంతర్భాగంలో జరిగే మార్పులవల్ల గానీ కలిగే భూమి కదలిక
భూగోళం n భూమండలం
భూజం n వృక్షం, చెట్టు , భూమిలో పుట్టేది
భూతం n ప్రాణి, జంతువు, దేవతాభేదం, పృథివిభేదం, పృథివ్యాది, కడచినది, సత్యం, పొంద బడినది, న్యాయం, బలం, వెలసినది, భస్మం
భూతదయ n ప్రాణుల పై దయ, సమస్త జీవులపై చూపదగిన ప్రేమాతిశయం
భూతాధిపతి n శివుడు ,1 భూతాలకు ప్రభువు, 2 పిశాచ గణాలకు, ప్రమథ గణాలకు అధిపతి
భూపతి n రాజు, క్షత్రియుడు, భూమిని పరిపాలించేవాడు
భూపాలుడు n రాజు ,భూమిని పరిపాలించేవాడు
భూభర్తలు n భూపతులు, రాజులు
భూమి n పృధివి, పుడమి అచల, అనంత, విశ్వంభర, రస, స్థిర, ధరిత్రి, ధరణి, క్షోణి, జ్యా, కాశ్యపి, క్షితి, సర్వం సహ, వసుమతి, వసుధ, ఉర్వి, వసుంధర, గోత్ర, పృధ్వి, క్ష్మా, అవని, మేదిని, మహి, విపుల, గహ్వరి, ధాత్రి, ఇల, కుంభిని, క్షమ, జగతి, రత్నగర్భ, భూతధాత్రి, అట్టి మేఖల, పంటవలతి
భూమీశులు n రాజులు, పాలకులు
భూరి v విణ గొప్పది, అధికం, బంగారం, విశాలం, బ్రహ్మ, విష్ణువు, శంకరుడు, ఇంద్రుడు
భూరుహం n చెట్టు, వృక్షం, భూమినుంచి పుట్టినది
భూవనిత n భూమి అనే స్త్రీ,
భూషణం n అలంకారం, నగలు, ధర్మం, విల్లు, యజ్ఞం, పుణ్యం, న్యాయం
భూషణవికాస n అలంకారాల చేత వికాసం పొందిన
భూషించు v 1 అలంకరించు, 2 స్తుతించు, పొగడు
భూషితం n అలంకరింపబడినది
భూషితుడు n అలంకరించబడినవాడు
భూసంస్కరణలు n భూమిని సంస్కరించడం,భూమి ఆధికంగా ఉన్న వారి దగ్గర నుంచి తీసుకొని భూమి లేని పేదలకు ఇవ్వడం
భేదభావం n వేరనే అభిప్రాయం
భేదించు v బద్దలుచేయు, వేరు చేయు
భేదించు వెంపలి n ఒక జాతి చెట్టు, బాణముఖి వెంబడి
భేదిల్లగ v పగిలిపోగా, బద్దలు కాగా
భేషజం n మందు, ఔషధం భైరవుడు
భేష్ n మెప్పుకోలు మాట
భోక్త n తినేవాడు, భుజించేవాడు, ఉపయోగపరచేవాడు, అనుభవించేవాడు, రక్షించేవాడు
భోగం n తినడం, సుఖం, రాజ్యం, పాముయొక్క శరీరం, భోజనం, ధనం, పంట (వేశ్యాదులకిచ్చే వెల), అనుభవం, పూజ, పాము పడగ
భోగట్టా మివివిషయం , వివరం, ఒక విషయం లేదా సంఘటనకు సంబంధించిన వాస్తవ సమాచారం
భోగి n అనుభవించేవాడు, రాజు, 1 భోగం కలవాడు, 2 సర్పశరీరం కలది, పాము, ఈశానుడు, కరణం, మునసబు, సుఖించు వాడు, మంగలి, ఒక పండుగ
భోజనం n అన్నం, ఆహారం ఆరగింపు, కుడుపు, తింట, తిండి, బాతు, బుత్తి, బూతి, బోనం, అశనం, ఖాదనం, గౌరణం, నిఘనం, ప్రాశనం, భుక్తి, భోగం, వేపం, లేహం
భౌతికం n భూత సంబంధమైనది, శరీరం ,పంచభూతాత్మకమైనది, శరీరం, ముత్తెం
భౌతికశాస్త్రం n సహజశక్తులు
భ్రంశం n తగ్గిపోవడం, పతనం, పతనం, క్షీణించడం, చెడడం, పలాయనం
భ్రమ n భ్రాంతి, భిన్నంగా గ్రహించడం, నీటిగుడి, తరిణిపట్లు నాయుధం, మూర్చ, నీరు ప్రవహించే తూము, తిరగడం, తిరగలి
భ్రమణం n తిరగడం, చలనం, కంపనం, కదలిక
భ్రమరం n తుమ్మెద, తీరు గుతూ ఉండేది, బొంగరం, ముంగురులు, సుడి, ఒక అభినయ హస్తం
భ్రష్టజీవనం n చెడిన జీవితం
భ్రష్టులు n 1 చెడినవారు, 2 వెలివేయబడినవారు
భ్రాంతి n కోరిక, వాంఛ, తిరగడం, పొరపాటు, ఒకానొక అలంకారం
భ్రాత n తోబుట్టువు, సోదరుడు భ్రాతృత్వం