Jump to content

తెలుగు-తెలుగు నిఘంటువు/న

Wikibooks నుండి
నంకటం నంవి ఆవ ద, కష్టం, సమ్మర్గం, నిండినది, చొరరానిది, ఇరుకైనది
నంఖ్య నంవిగణన, ఎన్నడం,లెక్కించడం, ఒకటి రెండు వంటి లెక్క, సంఖ్యావాచకం, లెక్క, ఆత్మవిషయక జ్ఞానం, విచారణం, పద్దతి
నంగనాచి n వడ్ల చిలుక , దిట్టతనం కలిగీ బయటికి ఏమీ తెలియని దానిలా నటించేది, దిట్టతనం కలిగీ లేనట్లు నటించేది వడ్ల చిలుక
నంజుకొను v తిను, ఆస్వాదించు, నంచుకొను వేదించు, సతాయించు
నందనారామం n నందనవనం, పూలతోట
నందనుడు n కొడుకు , సంతోషాన్ని కలిగించేవాడు
నంది n శివుని వృషభం, శివుని ఎద్దు, ఎద్దు, మర్రిచెట్టు, సంతోషం, జూదం, జయయొక్క పుత్రుడు, జువ్వి, మినుము, కొడుకు
నంబరు n అంకె, సంఖ్య, అంకె, లెక్క, సమూహం, వచనం,
నంవర్గమాన n చక్కగా పెరుగుతున్న వృద్ధిమౌతున్న
నకనకలాడు v వాడు, కృశించు
నకలం నంవిఅంతా, నర్వం, సంపూర్ణమైనది, భాగాలతో కూడినది, అన్ని కళలతో కూడినది, మృదువూ మందమూ అయిన ధ్వనితో కూడినది
నకలు n ఒకదాన్ని చూసి రాసింది
నకాసి n రంగుపని చేసేవాడు
నకిషీ n అలంకారపు పని రూ నగిషీ
నకులం n 1 ముంగిస, 2 యుధిష్ఠిరుని తమ్ముడు (నకులుడు)
నక్క v వి జంబుకం, విణ క్షుద్రం, శివ, భూరి మాయువు, గోమాయువు, మృగధూర్తక, సుగాలం, వంచకం, క్రోష్టువు, ఫేరువు, ఫేరవం,జంబుకం
నక్కు v 1 ఒదుగు; దాగు, 2 మాని అతుకు,, బంగారపు బిల్ల, బంగారం నరకగా మధ్యలో కనిపించే నిగ్గు, నాగటి కర్రు, ఒదుగు, గంటు, దాగు నక్తం
నక్రం n 1 మొసలి, భూమిపై పాదం పెట్టనిది 2 అడ్డకమ్మి, 3 తొక్కుడు కమ్మి
నఖం n గోరు, ఛిద్రం లేనిది; ఇరవై అనేసంఖ్య; భాగం; అంశం; గోటి చిప్ప, నఖమనే గంధ ద్రవ్యం,
నగం n కొండ, గమనం లేనిది మల, గట్టు, తిప్ప, గుబ్బలి, మహేద్రం, శిఖరి, క్ష్మాభృత్తు, అద్రి, గోత్రం, పర్వతం, గిరి, గ్రావం, అచలం, శైలం, శిలచ్చయం, ధరం, చెట్టు, పాము, కస్తూరి, 7 సంఖ్య
నగ n భూషణం, అలంకారం, ఆభరణం, కలాపం, పరిష్కారం, ప్రతిసరం, భాండం, తొడవు, రవణం, సొమ్మునగదు
నగరం n పట్టణం, పురం
నగరు n రాజగృహం, దేవగృహం, అంతఃపురం, కొలువుకూటం, గుడి
నగరుడు v నంవిన గరచక్రవర్తి, విషంతో కూడినవాడు, సూర్యవంశపు రాజులలో ఒకడు
నగవు n నవ్వు, హాస్యం నగారా
నగుబాటు ద్వవి అపహాసం
నచ్చు v 1 నమ్ము, 2 ఇష్టపడు,, ఇష్టపడు, ఆలస్యం, బాధ నజరానా
నజరు n 1 సముఖం, సౌందర్యం, కానుక 2 దృష్టి దోషం,
నజీవసాక్ష్యం నంవిచురుకైన ఉదాహరణ
నజ్జ n ధాన్య విశేషం, గంటే; సర్జం, గరునెత్తు, (సం) అలంకరణం, సన్నాహం, కవచం, (దే)పానుపు, వాసగృహం, శిరోగృహం,
నజ్జు n ఎక్కువ నలిగింది , నరుజు
నటన n 1 నటనం, నాట్యం, 2 కపట ప్రవర్తన
నటించు v నర్తించు, 2 కపటంగా ప్రవర్తించు
నటి n సూత్రధారుని భార్య, నాట్యం చేసే స్త్రీ, నట్టువుని పెండ్లాం, దొమ్మరి వాడు, కాకి దొండ, గువ్వ, గుత్తిక, వేశ్య
నటుడు n నట్టువుడు, నాట్యం చేసేవాడు నట్టుగుడు, నట్టు(వ)కాడు, నట్టు వాడు, నటుడు, నర్తకుడు, నాగరకుడు, భారతుడు, శైలాలి, శైలూషుడు
నట్టడవి (నడుము + అడవి) n అడవి నడిమిచోటు అరణ్య మధ్యం నట్టనడము (నడుము + నడుము)
నట్టివీధి ద్వవి వీధి మధ్య భాగం
నడక n 1 గమనం, 2 ప్రవర్తన,
నడగొండ n నడిచే కొండ నడుస్తున్న కొండ మాదిరిగా ఉన్న ఏనుగు మొ
నడచు v 1 గమనించు, 2 ప్రవర్తించు కాళ్ళతో అడుగులు వేస్తూ వెళ్ళు
నడత n నడవడి, ప్రవర్తన
నడబావి ద్వవి నడచి పోవడానికి మెట్లు ఏర్పరచినబావి; దిగుడుబావి
నడమంత్రం దేవిణ మధ్య కాలంలో కలిగినది , నడమంతరం, నడుము, మధ్యకాలం
నడయాడు v సంచరించు, చలించు
నడలు n నడకలు
నడవ n తలవాకిటికీ, నడిమి వాకిటికీ నడిమిచోటు, అళిందం, సేతువు, మార్గం
నడవడి n నడత, చరిత్రం, ప్రవర్తన, నడక, గమనం
నడి n మధ్యలో ఉన్న ‘నడుము’ అనే పదానికి వృత్తిలో కలిగే 'నడిమి' అనే రూపంలో చివరి వర్ణం(మి) లోపించగా మిగిలింది , నడిమి
నడికట్టు (నడిమి+కట్టు) n మగవాళ్ళ బిగువుకోసం నడుముకు కట్టే కట్టు
నడినిశి n అర్థరాత్రం
నడిపించు v నడపు (నడిపే) దారిచూపు, నడవడానికి కారణమవు
నడిబొడ్డు n సరిగ్గా మధ్య
నడుం కట్టు v సిద్ధపడు,
నడుం బిగించు దేక్రి పూనుకొను ఏదైనా పనిసాధించడానికి సిద్ధపడు లేదా ఆయత్తమవు
నడుం వాల్చు v పడుకొను, విశ్రాంతి (6) తీసుకొను
నడుం విరుగు v దుః ఖాదుల వార్త వినడంవల్ల వివశుడు కావడం
నడుమ n మధ్య
నడుము n మధ్యం, కాను, అవలగ్నం, కౌను, క్రోధం, మాధ్యమం, మధ్యం (లే)గౌను
నడ్డి n నడుము, గూను, వంగిన వీపు భాగం
నడ్డిముక్కు వాడు n చప్పటి ముక్కు కలవాడు
నత్త n గుల్లలో ఉండే పురుగు, క్షుద్ర శంఖ కిరీటం, క్షుద్రశం
నత్తగుల్ల n క్షుద్ర శంఖం గుల్ల, క్షుద్రకంబువు, క్షుద్ర శంఖం, క్షుల్ల కం, జలబింబం,
నత్తి n మాట్లాడేటప్పుడు ఒక అక్షరాన్ని అనేకసార్లు ఉచ్చరించడం, ఆగిఆగి కష్టంమీద మాట్లాడడం మొదలగు లక్షణాలు గల జిహ్వాదోషం తడబడుతూ మాట్లాడే జిహ్వాదోషం
నత్తు n 1 ముక్కు పోగు, స్త్రీల నాసాలంబులాకీ, ముక్కెర 2 దేక్రి తడబడుతూ మాటలాడు
నది n ఏరు, ఆమడకంటే ఎక్కువ దూరం పారే ఏరు ఆపగ, నరరిణి, తరంగిణి, ప్రోదిని, శైవలిని, తటిని, ద్వీపవతి, స్రవంతి, ధుని, ప్రోతస్విని, నిమ్నగ, అధ్యగ, అభివధువు, తరణి, తలోద, సరిత్తు, సాగరగామిని, వరద, వాక, పదం, ఝరి, హైమవతి, కడలి వెలది, కూలంకష
నదీనదాలు నంవితూర్పుగా, పడమరగా ప్రవహించే ఏరులు
నబాబు మివిమహమ్మదీయ ప్రభువు రూ నవాబ్ రాజప్రతినిధి, మహ్మదీయపాలకులు, అధికారుల గౌరవ బిరుదు
నభం సంవి ఆకాశం, కాంతి లేనిది, ఆకారం, శ్రావణమాసం, ముక్కు, మేఘం, వర్షాకాలం, అభ్రకం, మృణాళబిస, తంతువు, నెరసిన తల, హింస పెట్టేది
నమలు v దంతాలతో పలుమారు ఖండించడం, తిను, భక్షించు
నమస్కారం n వందనం, కైమోడ్పు, దండం గిడిగిడి, నతి, జోత, దండం, జోహారు, ఎక్కు, చేవాడు, చెంగనాలు, జేజే, ప్రశాంతి, ప్రణామం, వందనం, గొబ్బిళ్ళు, జాగిలి, టెంకణం, దీవెన కోల
నమస్కృతి n నమస్కారం
నమస్సు సంఅవ్యనమస్కారం, వందనం
నమాలోచనలు నంవిచర్చలు, మంతనాలు
నముల్లసితం n ఎక్కువ ప్రకాశించేది, చక్కగా వికసించేది, చక్కగా వ్యక్తమైనది, వినోదించేది, క్రీడించేది,ఆనందించేది
నమోవాకం నంవినమస్కారం, వందనం
నమ్మకం n విశ్వాసం, నమ్మిక
నమ్మలేనంత n విశ్వసించలేనంత
నమ్రత n వినయం, అణకువ
నమ్రభావం n వినయ భావం, విధేయత
నమ్రుడు n వినయం కలవాడు
నయం n 1 అందం, పొలుపు, రీతి, నేర్పు, ఆసక్తి, లాభం, స్వాస్థ్యం, మృదువు, చౌక, నును పైనది 2 n నీతి, కొనిపోవడం, నడవడం, పొందించడం, నీతి, న్యాయం, ధర్మం, శాస్త్రం, ద్యూత విశేషం
నయం n స్వస్థత
నయనం n కన్ను , బుద్ధి, విషయాన్ని పొందేటట్లు కాలయవనం, పొందించడం, పాలించడం, బుద్ధి విషయాన్ని పొందేటట్లు చేయడం
నయనోత్సవం n 1 కన్నుల పండువు , నేత్రాలకు ఉత్సవం కలిగించేది, 2 దీపం
నరం n నాడి, నారి, బరువు మొ తీసికొని పోయేది గుర్రం, రామ కర్పూరమనే తణం, నర యంత్రం, ఉదకం, నీరు నారి, ఈనె, తండ్రి, త్రిపుటం, ధమని, శిర, సుసి, స్నాయువు
నరకం n పాపఫలం అనుభవించే లోకం , పాపులను సమీపాన పొందించేది, పరులు దీనిలో మొర పెడుతారు పాపఫలం అనుభవించే లోకం, నరకం, నిరయం
నరకడం v 1 ఖండించడం, 2 చంపడం
నరపాలకుడు n రాజు , నరులను పాలించేవాడు
నరవాసన n మనిషి వాసన
నరాంకితం సంవిణ మానవులకు అంకితం ఇవ్వడం
నరుడు n మనుష్యుడు, బ్రహ్మ, మూర్ఖుడు, విష్ణువు, శివుడు, ఒక ముని, ఇంద్రుడు, మనుష్యుడు, అర్జునుడు
నరేంద్రుడు n రాజు, నరులలో శ్రేష్టుడు, విషవైద్యుడు, పాములవాడు, భూతవైద్యుడు
నర్తనం n నృత్యం, ఆట, ఆలోచన మొ వాటివల్ల తలా, వేళ్ళు, మొ ఆడించడం
నర్తనశాల n నాట్యశాల, నృత్యగృహం , నృత్యం నేర్పేమందిరం
నర్తించు v ఆడు నర్తనం చేయు
నర్మభాషణాలు n పరిహాసపు మాటలు
నర్సింస్ హోమ్ n ప్రైవేటు ఆసుపత్రి (నర్సింగ్ హోం)
నలక n రేణువు, చిన్నముక్క, దుమ్ములోని , రేణువు, వ్యాధి, ఆపద, శ్రమ
నలగు v బాధపడు, శ్రమపడు, నలుగు, ముక్కలవు, చెడు, నశించు, శ్రమపడు, బాధపడు
నలత n అల్సరోగం, అస్వస్థత, కొద్దిపాటి అనారోగ్యం
నలిగి v ముక్కలై, నశించి
నలినీ బాంధవుడు n సూర్యుడు, కమలాలకు (వద్మాలకు) ఆపుడైనవాడు
నలిరేగు v విజృంభించు
నలుమూలలు n నాలుగు (మూలలు) వైపులు
నలువంకలు n నాలుగు దిక్కులు
నలువ n బ్రహ్మ
నలువు n అందం, సౌందర్యం, చక్కనిది, శక్తికలది
నలుసు n రేణువు, చిన్నముక్క, ఎండుగడ్డి
నలేరు v దేవి వజవలి నాలుగు పలకలుగా ఉండే ఒక జాతి మందు తీగ వజ్రాక్షి, శృంఖల, సృగాల కంఠ, కులశోదర, క్రోష్టఘటిక, నల్లేరు
నల్లబల్ల n రాయడానికుపయోగించే బల్ల సుద్దముక్కతో రాసే నల్లరంగు పలక
నల్లి n మంచం మొదలగు వాటిలో చేరి మనుషులను పట్టి రక్తం తాగి బాధించే ఒక పురుగు ఉత్కణం, ఉద్దంశం, కిటిభం, మత్కుణం, మొగిటి, రక్తాంగం, నెత్తురు తాగే పురుగు, గోడపురుగు
నవ n కొత్తది, కొత్తది, పత్తిచెట్టు, తొమ్మిది దేవి దురద
నవకం n మెత్తదనం, మృదుత్వం, అదం, తొమ్మిదింటి సమూహం
నవగ్రహాలు n సూర్యుడు మొ తొమ్మిది గ్రహాలు విశే సూర్య, చంద్ర, అంగారక, బుధ, బృహస్పతి, శుక్ర, వని, రాహు, కేతువులనే తొమ్మిది గ్రహాలు
నవజం నంవిమనుష్యాదుల సమూహం, గుంపు, సభ, ఏనుగు
నవధాన్యాలు n తొమ్మిది రకాల ధాన్యాలు విశే గోధుమలు, యవలు, కందులు, పెసలు, సెనగలు, బొబ్బరలు, నువ్వులు, మినుములు, ఉలవలు అనే తొమ్మిది ధాన్యాలు
నవనవలాడు v కోమలంగా ఉండు, చాలా మృదువవు
నవనీతం n అప్పుడు చిలికితీసిన వెన్న వు నవీనమైన పెరుగు నుంచి తీయబడినది
నవపల్లవం n క్రొతచిగురు
నవమి n పక్షంలో తొమ్మిదో తిథి
నవయు v (రోగాలతో) కృశించు, చిక్కు, క్షీణించు, శ్రమపడు
నవరత్నాలు n తొమ్మిది రత్నాలు వివ మౌక్తికం, మాణిక్యం, వైఢూర్యం, గోమేదికం, వజ్రం, విద్రుమం, పుష్యరాగం, మరకతం, నీలం అనే తొమ్మిది రత్నాలు, 2 విక్రమాదిత్యుని ఆస్థాన పండితులు తొమ్మండుగురు విశే ధన్వంతరి, క్షపణుడు, అమర సింహుడు, శంకువు, బేతాళభట్టు, ఘటకర్పరుడు, కాళిదాసు, వరాహ మిహిరుడు, వరరుచి అనేవారు
నవరస భరితం n తొమ్మిది రసాలతో కూడింది
నవరసాలు n తొమ్మిది కావ్య రసాలు వివ శృంగారం, హాస్యం, కరుణం, వీరం, రౌద్రం, భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం
నవరాత్రులు n తొమ్మిది రోజులు జరిగే పండగ రూ నవరాత్రాలు వివ 1 వసంత రాత్రులు చైత్రశుద్ద ప్రతిపత్తుల (పాడ్యమి) మొదలు తొమ్మిది రాత్రులు 2 గణపతి నవరాత్రులు భాద్రపద శుద్ధ చతుర్థి మొదలు తొమ్మిది రాత్రులు 3 దేవీ నవరాత్రులు ఆశ్వయుజ శుద్ధ ప్రతిపత్తు మొదలు తొమ్మిది రాత్రులు
నవల n ఒక విధమైన గద్య కథా రచన, స్త్రీ
నవసమాజం n కొత్తదైన సమాజం
నవాతు n కలకండ, చక్కెర, పటిక బెల్లం , నవ్వోతు, నవుబోతు
నవారు దేవి మంచానికి చేసే పట్టెడ
నవాషాఢం n ఆషాఢ మాసపు తొలి రోజులు
నవ్యసంప్రదాయం n కొత్తదైన సంప్రదాయం మా ఆవిడ సాధించిన నవ్య సంప్రదాయం
నవ్వు v హాసం, నగవు; క్రి ఉల్లాసం, వినోదం మొ వాటిని అనుచ్చరిత ధ్వని ద్వారా ముఖకవళికల ద్వారా వ్యక్త చేయు అలరింత, స్మితం, హాసితం, హసనం, హాసం, హాసం, హాస్యం++ గేలి సేయడం, ఆనందించడం, నవ్వడం, పరిహాసం, వింత ****మనలోని తప్పిదాలను, లోపాలను మనకే నవ్వుపుట్టించేలా తెలుపుతాడు
నవ్వులాట n పరిహాసం, పరాచకం , నవ్వులాట నష్టం
నష్టపరిహారం n ప్రమాదంవల్ల కలిగిన నష్టానికి చెల్లించే సొమ్ము నష్టం కలిగించినప్పుడు ఒక వ్యక్తికి చెల్లించవలసిన మొత్తం
నస n 1 దురద, తీట, జల, నవ, 2 గొణుగు, దురద, ఉపద్రవం, ముక్కు
నసాళం n మాడు, మస్తిష్కంలోని, నరాలకేంద్రం
నసిమిరి n దురద, కండూతి , నశ్మిరి
నసుగు v అస్పష్టంగా చెప్పు గొణుగు, జంకు, గొంకు
నస్యం n ముక్కు పొడుం, ముక్కులోపలి వెండ్రుక, నాసికకు హితమైనది
నాంది n ప్రారంభం, ఆనందం, సమృద్ధి, నాటకారంభంలోని మంగళం, కర్మారంభంలో చేసే దేవతా స్తోత్రం, ఉపోద్ఘాతం, ఉపక్రమణిక ఒక కార్యక్రమానికి పరిణామానికి ప్రారంభ సూచకమైన తొలిఘట్టం లేదా సంఘటన
నాఉన్మత్తుడు, ఆసక్తం, వెర్రిది వెకలితనం n అవివేకం, మూఢత్వం వెక్కసం
నాకలోకం n స్వర్గలోకం , అకం అంటే దుః ఖందుఃఖం లేనిలోకం
నాగం n పాము; ఏనుగు, సీసం , పర్వతంలో పుట్టింది ఏనుగు పర్వతంలో గాని, చందన తరువులో గాని పుట్టేది; పాము పాదాలతో సంచరింపనిది సీసం మెత్తగా కావడంవల్ల కదిలేది, తగరం, కొండ, మేఘం, కరి, గుర్రం, మేక, గృహం, పృష్టభాగం, ఒకరసం, ఉప వాయువు, ముస్తే, పొన్నచెట్టు, సీసం, నాగవాసం, శ్రేష్టం నాగరాజు
నాగ అవ్య వర్ణవ్యత్యయంవల్ల అన నాగ అయింది దేవిణ పూజ్యం, పెద్దది
నాగప్రతిష్ట n పాము రూపంలో సుబ్రహ్మణ్యేశ్వరుడి విగ్రహం రాతిమీద చెక్కించి, పదిమంది పూజ చేసుకోవడానికి వీలయిన చోట నీలపడం
నాగరికత n నాజూకు, నగర సంస్కృతి, నాణెం
నాగలోకం n పాతాళం – నాగులు నివసించే లోకం
నాజూకు n సున్నితమైన నాణ్యమైన, వి సోకు, చక్కదనం, మృదుత్వం, సున్నితం
నాటంగోలె n నాడు మొదలుకొని
నాటకం n 1 దృశ్య ప్రబంధం, దశమాసాల్లో మొదటిది, పూర్వ చరిత్రాలను అనుసరించిన వేషాలు ధరించి కథాంశాన్ని నేత్ర గోచరం అయ్యేటట్లు నటించడం దశరూపకాలలో ఒకటి వివ శృంగార వీర రసాలలో ఒక రసం ప్రధానంగా ఉండి ప్రఖ్యాత చరిత్రాన్ని తెలుపుతూ అయిదు మొదలు పది వరకు అంకాలుండే దృశ్యప్రబంధం++ దృశ్యప్రబంధం, నర్తనం, చరిత్రం, కపటోపాయం
నాటకీయత n నాటక సంబంధమైన లక్షణం
నాటిక n ఉపరూపకాలనే దృశ్య కావ్యాలలో ఒకటి ఒకటి రెండు అంకాలతో ముగిసే చిన్ననాటకం; నాలుగు అంకాలు, స్త్రీ పాత్ర బహుళం, కథ కల్పితం, ధీర లలితుడగు, రాజు నాయకుడు, అంతఃపురానికి సంబంధించినది కాని సంగీత వ్యాపృత గాని అయి నవానురాగ అయిన రాజకన్యక నాయిక, వృత్తి కైళికి మొ లక్షణాలు కలిగింది నాటిక
నాటు v గుచ్చు, పెట్టు, భూమిలో మొక్కలు మొ పాతు
నాటుపురం v నాగరికత లేని పల్లె మనిషి పల్లెటూరు
నాట్యం ఆట, నృత్యం, నృత్త గీతవాద్యాల కూడిక, నటుని కృత్యం, నృత్త గీత వాద్యాత్మకమైన లాస్యం, నాటకాది దశరూపకాభినయం
నాడా n నూలు వంటి వానితో నేసిన పట్టె, బొందు
నాడి n నరం, నరం, గడియకాలం, గొట్టం, కాడ, కుండ, తలమీది గడ్డ, వంచకుని నడవడి, వారికురుపు, ఈనె, ఇడాది, తెల్లగరిక
నాడు దేవి ఆ రోజు క్రి బాధించు, పీడించు, గుచ్చు, నాటు, విరుగు, నాటు, దేశం, జనపదం, దినం
నాణెం v వి ముద్రించిన రాగి, వెండి, బంగారాల బిళ్ళ, నాగరికత, బంగారపు బిళ్ళ, ముద్ర, ధనం, శ్రేష్ఠం, మంజులత, వెండి
నాతి n స్త్రీ, ఇంతి, భార్య, పెళ్ళాం
నాదం n 1 ధ్వని, మోత, 2 ప్రణవనాదం
నాధుడు n భర్త, పెనిమిటి రూ నాధుడు, యజమానుడు, రాజు, పెనిమిటి, ఇంద్రుడు
నానమ్మ n తండ్రితల్లి, బామ్మ
నాను v 1తడియు, ఆర్ధమవు, 2 దేవి స్త్రీ కంఠాభరణం, 3 n భక్ష్యవిశేషం
నానుడులు దే జన శ్రుతులు, కింవదంతులు
నాన్న n తండ్రి, నాయన
నాభి n బొడ్డు, కస్తూరి, బొడ్డు, ఒక విషం, బండి కంటి నడిమి తూము, ముఖ్యం, విజిగీషువైన రాజు, ప్రధానుడు, బొట్టు; చక్రవర్తి
నామం n 1 పేరు, పెట్టిన పేరు, వస్తువును తెలిపేది, నామదేయం, వాచకం, ప్రాతిపదికం, జలం, తిలకం, ఫాలభాగం పై పట్టుకొనే బొట్టు 2 ఎగవేత
నామకరణం n పేరు పెట్టడం, బిడ్డకు పేరు పెట్టడం 2 బిడ్డలకు పేరు పెట్టడానికి చేసే ఒక సంస్కారం
నామధేయం n నామం, పేరు ఆఖ్య, అభిక్య, ఆహ్వయం, అభిధానం, నామం, పేరు
నామమాత్రం n పేరుకు మాత్రం, వట్టి పేరు
నామరూపాలు n పేరు, ఆకురాలు, రూపురేఖలు
నామవాచకం n సంజ్ఞావాచకం ఒకదాని పేరు
నామాంకిత సంవిణ (నామ+అంకిత) పేరుతో ముడిపడిన, నామం గుర్తుగా ఉన్న
నామాంతరం n వేరొక పేరు
నాము n జొన్న మొదలగు ! వాటి కొయ్య గాలున చిగురించిన మొలక; 'నాము' ను పశువులు తింటే చనిపోతాయి (కొన్నింటికి రోగం వస్తుంది)
నామోషి n సిగ్గు, అగౌరవం, అవమానం, చిన్నతనం , నాముషీ, నామూషీ
నాయంకరం దే దాన విక్రయాది అధికారాలతోడి అనుభవం, ఆధిపత్యం
నాయకత్వం n శ్రేష్ఠత్వం, నడి పేగుణం
నాయకుడు n నేత, దేశప్రజలను నడిపించేవాడు ఒక రాజకీయ పక్షాన్ని నడిపించే వాడు, పొందించే వాడు, నడిపేవాడు, శృంగార రసాలంబన పురుషుడు, ముఖ్యుడు, ప్రభువు, ఒకజాతి పురుషుడు, భర్త, ప్రియుడు, శ్రేష్ఠుడు, సాధారణ నాయకుడు, సేనాధిపతి, ఉద్యోగి పెద్ద పెద్ద ఉద్యమాలు సాగించారు
నాయిక n రాణి , శృంగార రసాలంబన స్త్రీ, భార్య, రాణి, ఒక దినుసు కస్తూరి
నారచీర దే నారతోనేసిన బట్ట
నారాచం n 1 బాణం, ఇనుప బాణం, నరసమూహాన్ని ఆచమించేది 2 గంటం , తాటాకుల మీద రాయడానికి సాధనమై బాణంలా ఉండేది, బాణం, గంటం, దుర్దినం, నీటి ఏనుగు
నారాయణుడు n విష్ణువు ,1 అవతారాల్లో నరసంబంధమైన శరీరాన్ని పొందేవాడు 2 ఉదకం స్థానంగా గలవాడు 3 నరసమూహం నివాసంగా గలవాడు 4 శబ్దాలకు ఆధారభూతుడైనవాడు 5 సారూప్య ముక్తికి స్థానమైనవాడు 6 తొంభై ఆరు తత్యాలు స్థానంగా గలవాడు 7 ఒక మన్వంతరంలో నరుడు అనే ఋషికి పుత్రుడైనవాడు
నారింజ n నారంగం, ప్రసిద్ధమైన పళ్ళజాతి చెట్టు నాగరంగం, నారదం, నాదేయి, భూమిజంబుక, ఐరావతం, వీరావణం, కంటకి, దంత శరం, కిమ్మీరం, కిర్మీరం, గంధపత్రం, గంధాఢ్యం, గోధూమం, చక్రాధివాసి, గోరక్షణం, చోళకి, చోలనం నారికేళం
నారి n 1 వింటి అల్లెత్రాడు; నరం అరి, అల్లెత్రాడు, గొనయం, గుణం, జ్యా, మౌర్వి, శింజిని 2 n స్త్రీ , నరుని వశం చేసుకొనేది
నారీమణులు n స్త్రీలలో శ్రేష్ఠమైనవారు
నారు n విత్తులు, మొలకలు
నాలిక n జిహ్వ రూ నాలుక, నాల్క
నావ n ఓడ, తరణి, కలం నౌక, కప్పలి, తరంగడం, తరీషం, తర్తరీకం, తారణి, పోతం, యానపాత్రం, వహనం, వహిత్రం, హోడం
నావికుడు n 1 ఓడ నడి పేవాడు, కర్ణధారి, 2 ఓడ మీద పోయేవాడు
నావుడు అవ్యఅనిన తరవాత రూ అనవుడు
నాశం n చేటు, మరణం, చేటు, మరణం, అదర్శనం, పలాయనం, గోచరంకాకపోవడం
నాశనం n నశింపజేయడం, కనబడకుండా చేయడం
నాస n ముక్కు రూ నాసిక, పుష్కరం, (ఏనుగు తొండం అగ్రం), ద్వారం పై ఉండే అడ్డకమ్మి, ధ్వని, వాసకం
నాస్తి సంఅవ్యలేదు
నాస్తికుడు దేవుడిని నమ్మనివాడు (వేద ప్రామాణ్యాన్ని, అంగీకరించనివాడు) , 1 ఈ లోకం తప్ప పరలోకం లేదనేవాడు 2 భగవంతుడు లేడనే వాడు 3 వేదాలలో నమ్మకం లేనివాడు
నింగి n ఆకాశం, అంతరిక్షం, స్వర్గం
నిండు v జలాదులచే పూర్లమవడం నెరవేరు, పూర్తవు, సమాప్తమవు
నిండుకున్నాయి v అయిపోయి నాయి
నిందలు n అపవాదాలు
నింపాదిగ n సమృద్దం, సుఖితం
నింపు v నించు, నిండించు, పూర్ణం, నెరవేర్చు, సిద్ధింపచేయు
నికటం n ఆసన్నం, సమీపం
నికరం n సమూహం, మొత్తం, రాశి, వెత్తం, సారం, న్యాయంగా, ఇచ్చిన ధనం, నిధి
నికషంగా n హీనంగా, అధమంగా, నీచమైన
నికృంతన క్రియ n ఖండించేపని, కత్తిరించేపని
నికేతనం n గృహం, ఇల్లు , జనులు దీనిలో నివసిస్తారు నివాసానికి యోగ్యమైనది
నిక్కం n నిజం, వాస్తవం, సత్యం
నిక్కచ్చి n నిర్బంధం
నిక్కు v నిగుడు, పైకి లేచు, గర్వించు
నిక్షిప్తం n (భూమిలో) ఉన్నది పాతబడినది, పూడ్చబడినది, విడువబడినది, ఇల్లడ పెట్ట బడినది, ఉంపబడినది, పూడ్చబడినది
నిఖిలం n సర్వం, అంతా
నిగడు v 1 నిక్కి, పైకిలేచు, నిక్క, వ్యాపించు, బయల్దేరు, మార్కొను, వెలువడు, మీదికి వచ్చు, విజృంభించు, పుట్టు, యత్నించు, చక్కబడు, ఒప్పు, చచ్చు, అతిశయించు, ప్రవహించు, స్వస్థతనొందు, పరుగెత్తు, చాగు
నిగనిగలాడు డివినిగనిగ అని ప్రకాశించడం
నిగళం n సంకెల రూ నిగడం, సంకెల, ఏనుగు కాలి సంకెల, మింగడం
నిగూఢ గుప్తం n రహస్యంగా దాచుకొన్నది
నిగ్గదీయు v నిలబెట్టు, నిలదీసి అడుగు
నిగ్గు n కాంతి , కాంతి, జిడు, కిరణం, పరిమళాతిశయం, సారం, వర్ణలేశం, పస
నిగ్రహం n అడ్డగించు, అణచడం, బెదరుమాట, శిక్ష, నింద, వైద్యం, పిడి, మారణక్రియ, మేర, చెట్లు, అడ్డగింపు, హస్తక్రియలు
నిగ్రహించు v తిరస్కరించు, ఎదురు తిరుగు
నిఘా n దృష్టి కాపలా, విచారణ, రహస్యంగా గమనిస్తూ ఉండటం
నిచ్చెన n పైకి ఎక్కడానికి ఉపయుక్తమయ్యే మెట్లు ఉన్న సాధనం, నిశ్రేణి ఆరోహణం, అధిరోహిణి, తాప, నిశ్రేణి
నిజం n సత్యం, యదార్థం
నిజమరి సత్యం పలికేవాడు, సత్య వంతుడు
నిజాయితీపరులు n సత్యమైన వారు న్యాయమైనవారు
నిటలం n నుదురు, ఫాలం
నిటారుగా n నిలువుగా
నిట్టూర్పు (నిడు+ఊరు) n నిశ్వాసం, దీర్ఘ నిశ్వాసం
నిడుజడి n విడవకుండా కురిసేవాన
నిడుద n పొడవైన, దీర్ఘం
నిత్యం n శాశ్వతం, n సముద్రం, కడలి
నిత్య విద్యార్థి n ఎల్లప్పుడూ చదువుకునేవాడు
నిత్య సంతుష్టుడు n ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవాడు
నిత్య స్మరణీయురాలు n ఎల్లప్పుడూ స్మరింపదగినది
నిత్యకర్మం నంవి1 ఎప్పుడూ చేయవలసిన పని 2 చేయకుంటే ప్రత్యవాయం కలిగే శాస్త్ర విహిత కర్మం చనిపోయినవారికి పదిరోజుల వరకు ప్రతిదినం చేసే శ్రాద్ధకర్మ
నిత్యకల్యాణం n ఎడతెగని శుభం, ఎల్లప్పుడూ కలిగే శుభం
నిత్యాగ్నిహోత్రాలు n ఎల్లప్పుడూ ఉండే అగ్నులు
నిత్యాగ్నిహోత్రులు n ప్రతి దినమూ హోమాదులు చేస్తూ అగ్ని చల్లారకుండా రక్షించు కొనేవారు
నిత్యావసరాలు n ప్రతిదినం అవసరమైనవి
నిదర్శనం n ఉదాహరణం, దృష్టాంతం, చూపేది, తెలిపేది, బోధించేది, ప్రమాణం
నిదానం నంవి మూలకారణం, తొందరపడకుండా విచారించడం నెమ్మదితనం ', రోగనిర్ణయం, శుద్ధి, నిలకడ, పలుపు, రోగ హేతువు
నిద్ర n నిదుర, కూర్కు శయనం, స్వానం, స్వప్నం, సంవేశం, నిద్దుర, కునుకు, కూర్కు, కనుమోడ్పునిద్రాహారాలు
నిద్రాణం n నిదురించేది, ముకుళించేది
నిధులు n ధనం, డబ్బులు
నినాదం n ధ్వని, మోత రూ నినదం
నిపుణుడు n ప్రవీణుడు, నేర్పరి నిప్పు
నిబంధన సంవీణ ప్రతిబంధన, ఏర్పాటు, కారణం, బంధనం, కట్టుపాటు, ఊత, స్థానం, వీణా తంత్రులు కట్టే స్థానం కూర్పబడినది
నిబద్దత n కట్టుబడడం
నిబిడ n దిట్టమైన, సాంద్రమైన
నిబిడీకృతం n నిబిడంగా చేయబడినది, దట్టంగా చేయబడినది **** ప్రజాసేవ చేయాలనే దీక్ష వీరందరి లోనూ నిబిడీకృతమై ఉండటం వల్లనే వారి సొంత పనులు వదులుకొని తోటి దీన మానవ సేవకు పూనుకున్నారు
నిబ్బరం n దిట్టతనం, దృఢం రూ నిబ్బరికం, నిశ్చయం, నిలుకడ, పరవశత, సూటి, గుర్రపు పరుగు, నిదానం
నిమగ్నం n మునిగిన, లీనం
నిమిత్తం n కారణం, హేతువు, కారణం, గురి, నామమాత్ర కారణం, శకునం, గుర్తు ముసలి కొక్కెర వచ్చి నయనంబులు నిమీలించి యాహారంబు మాని దుష్కరంబయిన తపంబు చేయుదానివలె పిలువంబడి యుండెను
నిమురు v వాత్సల్యంతో చేతితో రాయు, తాకు రూ నివురు
నిమేషం n రెప్పపాటు కాలం రూ నిమిషం చూ, నిమిషం
నిమ్నజాతి n తక్కువజాతి
నిమ్మ n జంబీరం, ఐరావతం, పార్వతం, రుద్రాక్షం, రైవతకం, ఈడ, ఎర్రకిత్తలి, కరుణం, కాకవలం, క్షుద్రామ, గంభీరం, గిలం, జంబిరం, జంభీరం, జంభం, జంభరం, జంభలం, జహువు, దంతసరం, లకుచం
నిమ్మకు నీరెత్తినట్లు జా సుఖ దుః ఖాలచే కలతనొందక గంభీరంగా ఉండు ఏమీపట్టనట్లుండు
నిమ్మళంగా n నెమ్మది, ఆరోగ్యం , స్వస్థం, ఉపశాంతం, మందం, అల్పధనికలది, నిష్కళంకం, స్వాస్థ్యం
నియంత n శాసించేవాడు, సర్వాధికారాలను గుప్పిట్లో పెట్టుకొని, నియమించే వాడు, ప్రజాభి ప్రాయాలను లెక్కచేయకుండా ఇష్టం వచ్చినట్లు పాలించే వ్యక్తి, సారథి, మహేశుడు, రక్షకుడు, దండించేవాడు సత్యము నియంత
నియంత్రణ n అడ్డగింత, అవరోధం, అదుపు
నియతం(బు) n నిర్ణీతమయినది, కట్టబడినది, నియమంగలది, నిగ్రహింపబడినది, నిత్యమైనది, స్థిరమైనది, అనివార్యం
నియమం n సూత్రం, ఏర్పాటు, వ్యవస్థ, కట్టు, నిగ్రహం, ఆజ్ఞ, ప్రతిజ్ఞ, నియంత్రణ, నిశ్చయం, వ్రతనిష్ణ, విధిభేదం, అష్టాంగ యోగాలలో రెండవది
నియమావళి n కట్టుబాట్లు, సూత్రావళి చూ నియమం
నియమించు v ఏర్పరుచు, పదవిలో ప్రవేశ పెట్టు, ఆజ్ఞాపించు, నిరోధించు, నిర్ణయించు
నియమిత n నియమింపబడిన
నియాన్ దీపాలు మివిబ నియాన్ అనే జడవాయువుతో వెలిగే విద్యుద్దీపాలు
నియామకం n నియమించడం వ్యక్తిని ఉద్యోగంలో ఉంచడం
నియోగి n 1 అధికారం గలవాడు , రాజాదులచే ఒక పనిలో నియుక్తుడైన వాడు 2 బ్రాహ్మణులలో ఒక తెగను తెలిపే వ్యక్తి నియోజక వర్గం
నిరంకుశ n దౌర్జన్యకరమైన, అదుపులేని, కఠినమైన
నిరంకుశుడు n అంకుశం లేనివాడు, వారింపరానివాడు యథేచ్చగా వ్యవహరించే వాడు, వ్యతిరేక రాజకీయ విశ్వాసాలను గానీ, ప్రతిపక్షాలను గానీ అనుమతించని వాడు
నిరంజనం n కన్ను, నిర్మలం , కాటుకలేనిది
నిరంతరం n అవిచ్ఛిన్నం, స్థిరం, ఎడతెగని, ఎప్పుడూ ఉండే
నిరంతరం n సంతతం, సాంద్రం, అభిన్నం , అంతరం లేనిది
నిరంతరాయం n విమ్పం లేకుండా ఆపకుండా , అంతరాయం లేని, ఎటువంటి ఆటంకం లేకుండా
నిరక్షర కుక్షి n పొట్టకోస్తే అక్షరం ముక్కలేనివాడు, చదువు రానివాడు
నిరక్షరాస్యత n చదవడం, రాయడం రాకపోవడం, చదువురాని తనం
నిరక్షరాస్యులు n చదవడం, రాయడం రానివారు, చదువురాని వారు
నిరతి n ఎక్కువ ఆసక్తి
నిరపరాధుడు n అపరాధం చేయని వాడు నేరం చేయనివాడు
నిరపాయం n అపాయం లేని, నాశంలేని
నిరభిమానం n ఆత్మగౌరవం లేనిది, గర్వం లేనిది
నిరర్గళం n ఆటంకంలేని, అడ్డంలేనిది, యధేచ్చగా గడియలేనిది
నిరర్థకం n ప్రయోజనం లేనిది, నిష్పలం
నిరవద్యుడు n నిందలేనివాడు, దోషం లేనివాడు
నిరవధికం n అవధిలేనిది, మేరలేనిది
నిరశనం n అశనం లేనిది, ఉపవాసం
నిరసనం n తిరస్కారం, నిరాకరించడం, తొలగించడం, వెళ్ళగొట్టడం, ఖండించడం, వధం, ఉమియడం
నిరసించు v తిరస్కరించు అసమ్మతి ప్రకటించు
నిరహంకారుడు n 1గర్వం లేనివాడు, దేహేంద్రియాదుల పై నేను అనే అభిమానం లేనివాడు 2 ధన విద్యాదులవల్ల గర్వం లేనివాడు 3 కోపం లేనివాడు నిరాకరించు
నిరాఘాటంగా n అడ్డులేకుండా, హద్దు లేకుండా
నిరాడంబర జీవితం n ఆడంబరం లేని జీవితం, డాబుసరితనం లేని, దర్పంలేని
నిరాదరణ n ఆదరణ / పోవడం
నిరాధారులు n ఆధారం లేనివారు; ప్రాపులేనివారు
నిరామయం n రోగంలేనిది, కపటం లేనిది, నిర్దోషం, నిష్కపటం, అడవిమేక, పంది
నిరాయుధులు n ఆయుధం లేనివారు
నిరాలంబం n ఆధారం లేనిది, స్వతంత్రం లేనిది నిరాశ
నిరాళంకం n భయంలేనిది
నిరాశావాది n ఆశలేదని వాదించే వాడు, ఆశలేనివాడు, ప్రతి విషయంలో చెడును మాత్రమే చూసే స్వభావం ఉన్నవాడు
నిరాశ్రయులు n ఆశ్రయం లేనివారు, ఊత లేనివారు, ఆధారం లేనివారు
నిరాహారదీక్ష n ఆహారం లేనిదీక్ష, ఉపవాస దీక్ష అన్నపానాదులు లేకుండా చేసే దీక్ష, రాజకీయ, ఆర్థిక, సాంఘిక తదితర లక్ష్యాలను సాధించుకోవడం కోసం ఈ రోజుల్లో ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు
నిరీక్షించు v ఎదురుచూచు, చూచు
నిరీశ్వర వాదులు n దేవుడు లేడనే వాళ్ళు
నిరుడు n గతసంవత్సరం, కడచిన సంవత్సరం
నిరుత్సాహం n ఉత్సాహం లేనిది
నిరుదులు n అడ్డగింపు పొందిన వాళ్ళు
నిరుద్యోగి n ఉద్యోగం లేనివాడు, పనిలేనివాడు
నిరుపేద n కడు, అతి దరిద్రుడు
నిరూఢ n స్థిరమైన, ప్రసిద్ధికెక్కిన
నిరూఢ మనీషన్ నిరూఢి n ఎక్కువ ప్రసిద్ది, ప్రసిద్ది, కౌశల్యం, నిరూఢ లక్షణ, నిర్ధారణ
నిరూపించు v నిర్ణయించు, గ్రహించు
నిరోధించు v అడ్డగించు
నిర్గంధం n గంధం లేనిది, వాసనలేనిది, తొలి
నిర్గయులు n క్రూరులు, దయలేనివారు
నిర్గుణుడు n గుణాలు లేనివాడు, పరమాత్మ, భగవంతుడు
నిర్ఘాంత పోవు v ఆశ్చర్యపడు, నిశ్చేష్టమవు
నిర్జన ప్రదేశం n జనం లేనిచోటు
నిర్జరులు n దేవతలు, అమృతం తాగడంవల్ల ముదిమి (ముసలితనం) లేనివారు
నిర్జించు v చంపు, పీడించు, బాధించు, జయించు, వశపరచుకొను
నిర్ణయం n నిశ్చయం, నిర్ధారణ తీర్పు, సిద్ధాంతం, అర్థనిరూపణం
నిర్ణయించు v స్థిరపరచు, నిశ్చయించు
నిర్ణీత n నిర్ణయించేవాడు, న్యాయాధ్యక్షుడు, నేత
నిర్దిష్టం n నిర్ణయ పూర్వకంగా చెప్పబడినది, చూ బడి నది, ఏర్పాటు చేయబడినది, ఆజ్ఞాపింపబడినది, ఉపదేశింప బడి నది, నిరూపింవబడినది
నిర్దిష్ట n ఏర్పాటు చేయబడిన నిర్ణయ పూర్వకంగా చెప్పబడిన
నిర్దుష్ట n దుష్టముకాని, మంచి తప్పులు లేని, లోపాలు లేని, స్వచ్చమైన
నిర్దేశం n నిర్ణయపూర్వకంగా చెప్పడం ఆదేశం, ఆన, ఏర్పాటు, ఉపదేశం, దాపు, జీతం, ప్రతిపాదక శబ్దం, కథనం, చూపడం, నిశ్చయం
నిర్దేశించు v నిరూపించు, ఆజ్ఞాపించు, ఆదేశం జారీచేయు
నిర్ధనుడు n దరిద్రుడు, ధనం లేనివాడు
నిర్ధారణ n నిశ్చయం, నిశ్చయించడం, సముదాయం నుంచి ఒక దానిని వేరు చేయడం
నిర్బంధం n బలాత్కారం, పట్టుదల
నిర్బంధ విద్య n బలవంతంగా నేర్పే విద్య పట్టుదలతో నేర్పే విద్య
నిర్బరగతిన్ n అవలీలగా
నిర్బరి n నది, సెలయేరు
నిర్భయం n జంకులేనిది, భయం / పోవడం, ధైర్యంగా ఉండటం
నిర్భాగ్యులు n అదృష్టహీనులు, భాగ్యం లేనివారు
నిర్భీతి n భయం లేనీ
నిర్భేద్యం n చీల్చరానిది, భేదింపరానిది, గుట్టు తెలియరానిది
నిర్మలం n శుద్దం, మురికిలేనిది, తెల్లనిది, పాపం లేనిది, అభ్రకం, నిర్మాల్యం
నిర్మలమతి n శుద్దమైన బుద్ధి
నిర్మాణం n సృష్టి, గ్రంథరచనం, ఆకారం, కావ్యం, ఔచిత్యం, సారం, క్రియ, కట్టడం, భవనం
నిర్మాణ కార్యక్రమాలు n సృష్టి కార్యక్రమాలు, నిర్మించడానికి సాధనమైన కార్యక్రమాలు
నిర్మాణాత్మక n సృజనతో కూడిన
నిర్మాత n నిర్మించే వాడు, కూర్చరి, రచయిత
నిర్మాత n నిర్మించేవాడు
నిర్మానుష్యం n నిర్జనం, మనుష్యులు లేనిది , నిర్మనుష్యం, నిశ్శబ్దమైనది, ప్రశాంతమైనది
నిర్మాల్యం n ధరించి తీసి వేసిన పుష్సారికం, దేవతా పూజకు వాడగా మిగిలిన / వాడిన పుష్పాదికం, కళంకం లేనిది, మిగిలినది, అభ్రకం, ధరించి తీసి వేసినవి
నిర్మించు v కట్టు, సృజించు
నిర్మీనంబు n చేపలు లేని
నిర్మూలనం n నాశనం చేయడం, పెల్లగించడం
నిర్మూలన n నాశనం, పెల్లగించడం
నిర్మొగమాటం n మొహమాటం లేకుండా, కచ్చితం, మనసులో అనుకున్నది అనుకొన్నట్లుగా , నిర్మొహమాటం
నిర్యాణం n మరణం, ముక్తి, మోక్షం, పయనం కావడం, ఏనుగుకడకన్ను, దామం, పశువుల కాలికి కట్టేశాడు
నిర్లక్ష్యం n లక్ష్యం లేనిది, లెక్క చేయక పోవడం, ఉదాసీనత,
నిర్లిప్తం n నిస్సంగం, పూత లేనిది ఏమీ పట్టించుకోని
నిర్లిప్తత n ఉదాసీనత, పట్టనితనం
నిర్వచనం n గద్యశూన్యం, వచనం లేనిది, మాటాడనిది, ఉచ్చరించడం, అవయవార్థాన్ని చెప్పడం, సామెత, ప్రసిద్ధి
నిర్వర్తించు v నెరవేర్చు, చేయు, నిర్వహించు, ఆచరించు
నిర్వహించు నంక్రినెరవేర్చు, పూర్తిచేయు
నిర్వాణం n ఆరిపోయినది, శూన్యం, మోక్షం , దుః ఖాదులు లేనిది, మరణం, నిర్ణయం, పశువులను
నిర్వాహకురాలు n సమర్ధురాలు
నిర్విఘ్నం n ఎట్టి అడ్డంకులు లేని ఆటంకంలేని
నిర్విణుడు n నిర్వేదం పొందినవాడు, ఖిన్నుడు, విరక్తుడు, నిశ్చేష్టుడు
నిర్విరామకృషి n విశ్రాంతి లేని ప్రయత్నం, విరామం లేకుండా, అలసట లేకుండా
నిర్వివాదం n తగవులేనిది, సర్వ సమ్మతమైనది విశేషపౌరుషం / పోవడం
నిర్వీర్యులు n అసమర్థులు, పౌరుషం లేనివారు
నిర్వేదం n వైరాగ్యం, రోత, తన్నుతాను నిందించుకోవడం, వైరాగ్యం, దుః ఖం తత్త్యజ్ఞానాదులవల్ల ఐహిక విషయాల పట్ల కలిగే వైముఖ్యం
నిర్వ్యాజం n సహజం, నిష్కపటం, మోసం లేనిది, స్వాభావికం
నిర్వ్యాపారంగా n పనిలేకుండా
నిలయం n ఉనికిపట్టు, వాసస్థానం, నివాసస్థలం, సమూల నాశం, ఇల్లు, పూర్తిగా కలిసిపోవుడం
నిలవ చేయు దే దాచు
నిలిచిపోవు v ఉండిపోవు
నిలుపు v నిలువచెట్టు, ప్రతిష్టించు, స్థాపించు, ఉంచు, ఆపు, నిరోధించు, స్థిరపరచు, పుట్టించు, లగ్నం చేయు, స్వస్థ వరచు, నియోగించు, నెలకొల్పు, నిర్మించు, కాపాడు, ఏర్పరచు, చక్కబరచు, పరుచు, నెరవేర్చు
నిలువనీడ n ఉండటానికి చోటు, నిలబడటానికి నీడ
నిలువరం n స్థావరం, నివాసం, స్థిరం, యదార్థం, మాంద్యం
నిలువు n నిలువబడటం, నిలవడం, మీది అంతస్తు, ఆకారం, శరీరం, కోయగా మిగిలిన చేనులోనిభాగం, రెండు గజాల ఎత్తు
నిలువుటద్దం (నిలువు + అద్దం టుగాగమం) n నిలువు (రెండు గజాలు) ప్రమాణంగల అద్దం
నిలువెల్ల (నిలువు+ఎల్ల) n శరీరమంతా, రెండు గజాల ఎత్తు
నివసించు v ఉండు
నివహం(బు) n సమూహం, నముదాయం , రాశి, సప్తవాయువులలో ఒకటి, అగ్నిహోత్రుని సప్త జిహ్వలలో ఒకటి
నివారణ నంవిఅడ్డగించడం తొలగించడం
నివాళి n నీరాజనం, హారతి
నివాసం n కాపురం, ఇల్లు, వస్త్రం
నివాసయోగ్యం n ఉండడానికి తగినది
నివుంటువు n పదాలకు అర్థాలనిచ్చే గ్రంథం, డిక్షనరీ, కోశం, అభిదానం, అర్థాదులను తెలిపే ప్రమాణ గ్రంథం
నివురు v తడవు, రాయు రూ నిమురు
నివేదించు v తెలుపు, విన్నవించు, సమర్పించు
నివేదిక n పని వివరాలను తెలిపేది
నివేశనం n ఇల్లు, గృహం, ప్రవేశం, సేనాశిబిరం, కూర్చుండటం, ఉనికి వటు, పరిణయం, చొరవ
నివ్వెర పోవు v నిశ్చేష్టుడవు, చాలా ఆశ్చర్యపోవు
నిశ n రాత్రి, వ్యాపారాన్ని మిక్కిలి క్షీణింప చేసేది, రాత్రి, వసువు, మేషాది రాశిషట్కం (జ్యోతి) స్వప్నం
నిశాకరుడు n చంద్రుడు, రాత్రిని కలిగించేవాడు
నిశాచరుడు n 1 రాక్షసుడు, 2 దొంగ, రాత్రులలో తిరిగేవాడు
నిశాత n పదును పెట్టబడిన, వాడియైన
నిశితంగా n వాడిచేయబడినది, మెరుగు పెట్టబడినది
నిశీధిని n రాత్రి
నిశ్చయం n నిర్ణయం, సిద్దాంతం, గట్టి తలంపు, ఒక అర్థాలంకారం
నిశ్చలం n స్థిరమైనది, కదలనిది
నిశ్చింత n 1 చింత లేనిది 2 సంఅవ్యనిర్విచారం
నిశ్చేష్టం n కలదలని, చేష్టలు లేనిది
నిశ్చేష్టుడు n చేష్టలుడిగిన వాడు
నిశ్రేణులు n 1 నిచ్చెనలు, 2 ఖర్జూర వృక్షాలు
నిశ్వాసం n నిట్టూర్పు, ఊపిరి వదలడం
నిశ్శబ్దం n సద్దులేనిది, శబ్దం లేనిది
నిషాదుడు n బోయవాడు
నిషిద్ధం n 1 నిషేధింపబడినది, చేయరానిది 2 కొట్టి వేయబడినది శాస్త్రం అంగీకరించనిది
నిషిద్ధాక్షరి n అక్షరాన్ని నిషేధించడం
నిషేధం n నిరాకరణం, నివారణం, నివర్తనం, చేయ కూడదని తెలిపే వాక్యం
నిష్కంటకం n ముండ్లు లేనిది, బాధకం లేనిది
నిష్కర్ష n నిశ్చయం, ఊడబెరకడం, సారాంశం, నిశ్చయం
నిష్కల్మషం n కల్మషం లేనిది, మురికిలేనిది, నిర్మలమైనది
నిష్కల్మషత n కల్మషత లేనిది
నిష్కళంకం n కళంకంలేనిది
నిష్కామయోగం n కోరికలేని యోగం
నిష్క్రమించు v వెళ్ళిపోవు
నిష్ట n నిలకడ, ఆస్థ, స్థితి, ఆధారం, పూనిక, శ్రద్ద, నమ్మిక, సమాప్తి, నాశం, నెరవేరుట, వేడికోలు, నిశ్చయం
నిష్ణాతులు n నేర్పరులు, ప్రవీణులు 2 పారంగతులు
నిష్ణురం n మనస్సుకు నొప్పి కలిగించేది
నిష్పక్షపాతం n పక్షపాతం లేని, న్యాయమైన
నిష్పలం n వ్యర్థం, ఫలం లేనిది
నిష్పాక్షిక దృష్టి n పాక్షికంకాని
నిసర్గం n స్వభావం, స్వరూపం, సృష్టి విడుచుట, అప్పగింత
నిసుంగులు n పసిబిడ్డలు
నిస్తారకం n దాటించేది, ఉద్దరించేది
నిస్తేజం n కాంతిలేనిది, ప్రతాపం లేనిది, పౌరుషం లేనిది
నిస్త్రాణం n సత్తువ లేనిది
నిస్పంగులు n మునులు, సంగం లేనివారు, ముముక్షువులు, 1 విషయాసక్తి లేనివారు 2 సకుటుంబ సంబంధాన్ని వర్ణించి ఋషుల లాగా సంచరించేవారు
నిస్వార్థ n స్వార్థం లేని, తన ప్రయోజనం ఆశించని
నిస్సంకోచం n సంకోచం లేని, అనుమానంలేని
నిస్సందేహం n సందేహం లేని; విణ సందియం లేనిది
నిస్సహ n 1 ఆశలేనిది, 2 n అగ్నిశిఖావృక్షం
నిస్సారం n సారం లేనిది చేవలేనిది, సత్తువలేనిది, పిప్పి అయినది
నిస్స్వనం n ధ్వని, మోత, 2 ధ్వని లేనిది
నీచం n హీనం, అధమం, అవమం, అవద్యం, అణకం, అర్వం, ఉక్కితం, కువూయం, కుత్సితం, ఖేటం, క్షుల్లకం, గర్హ్యం, చేలం, జఘన్యం, న్యక్షం, నికృష్టం, ప్రతికృష్టం, యాప్యం, రేఫం, అల్పం, కిందిది, పొట్టిది, పల్లం, గ్రహగతి కింది భాగం
నీచు n 1 ధూర్తుడు, 2 మత్స్య విశేషం 3 మత్స్యమాంసాదికం
నీచుడు n అధముడు, మూర్ఖుడు, పామరుడు
నీటిబుర్ర n నీటితో నింపిన బుర్ర
నీటిముంపు n నీటివల్ల మునగడం
నీటు n శృంగార గర్వం, మురిపం
నీట్ v,n శుభ్రమైన, చక్కని
నీడ n ప్రతిబింబం, చాయ, కాంతి, చాటు, ఆశ్రయం
నీడజం n పక్షి, నీడం(గూడ)లో పుట్టింది
నీతి n సత్రవర్తన, న్యాయం, ఉపాయం, మంచి నడత, రీతికొని పోవుట, పొందించడం, రాజనీతి
నీతి విచక్షణులు n నీతిలో నిపుణులు, నీతి గురించి తెలిసినవారు
నీతిమంతుడు n నీతి కలవాడు
నీరం సంవి నీరు, రసం
నీరంధ్రం n సాంద్రం, రంధ్రాలు లేనిది
నీరవం n ధ్వని లేనిది, రవం లేనిది
నీరసం n బలహీనం, దానిమ్మ చెట్టు, రసంలేనిది, ఎండినది
నీరాజనం n 1 దీపాదులచే దేవతా ప్రతిమాదులకు ఇచ్చే హారతి 2 రాజులు యుద్ధానికి బయలు చేరడానికి పూర్వం చేసే ఒకానొక శాంతికర్మ
నీరు n బూది, భస్మం, నీళ్ళు, జలం, కన్నీళ్ళు, లోహాలజలం
నీరుకట్టె n నీరుపాము, ఆలగర్గం, నీటిలో కట్టెలాగ ఉండేది మాం నీరుకంటి ! నీరుకట్టె, ఆలగర్గం, నీరు తుట్ర,
నీరుకారు దే నిరుత్సాహపడు, ఉత్సాహం లేకుండ, లేత ఎరుము, కంసాలి కొరముట్టు, నిరుత్సాహపడు
నీరుకాలి n కొంచెం ఎరుపు, లేతకావి రూ నీర్కావి
నీరుల్లి n ఎర్రగడ్డ, పలాండువు
నీరువట్టు దేక్రిదప్పిగొను, దేవిదప్పి, పిపాస నీరుదోత్త, జలసర్పం
నీరెండ n కొంచెంపాటి ఎండ, లేత ఎండ
నీలం n నీలమణి, నీలకం, గాజువు, తుమ్మెద, మైలతుత్తం, నల్లగుర్రం, నల్లకోతి, వేగిస, కడిమి (చెట్టు), మచ్చ, ఒక కొండ, నల్ల తామర, చీకటి, నీలిమందు, కాలకూట విషం, కొండ ముచ్చు, నీలపురాయి, మర్రిచెట్టు, నల్లఎద్దు
నీలకంఠం n నెమలి, నల్లని మెడ కలది, నెమలి, ఊరబిచ్చుక, ముల్లంగి, తుమ్మెద, పాము, బంగారు పిచ్చుక, కాటుక పిట్ట, కూ కురు గుండి, హరిచందనం
నీలిమందు n నీలి ఆకుల నుంచి తీసిన రంజక ద్రవ్యం
నీలుగు v గర్వించు, ఈలుగు, చచ్చు, ఒడలు విరుచుకొను, ఒడలు సాచు, సాగు, గర్వించు, దేహం ఉబ్బించు
నీలోత్పలం n నల్ల కలువ విశే ఇది మన్మథుని ఐదు బాణాలలో ఒకటి
నీళ్ళాడు v 1 ప్రసవించు, 2 స్నానం చేయు
నీళ్ళు నమలడం n సంశయంగా చెప్పడం మందకొడితనం విశే ఇది చక్కటి తెలుగు జాతీయం
నీళ్ళు పోసుకొను v 1 గర్భవతి, 2 స్నానం చేయు
నీహారం n మంచు రూ నిహారం , అగ్నిచే మిక్కిలి హరింపబడేది
ను n గొడవ, నిష్టురంతో ఉన్నమాట, ఇంటి చాకిరీ, కష్టం
నుగు v నలగు దేవి పొడి, చూర్ణం, ముక్క, గుంపు
నుజన సంగతి n మంచి వారి సహవాసం
నుజ్జు n బాగా నలగినది , నజ్జు
నుడి n మాట, పలుకు, వాక్యం , నుడుగు, నొడుగు
నుడికారం n మాట, చమత్కారం, పలుకుబడి, మాటలోని చమత్కారం
నుడువు v చెప్పు, వచించు రూ నుడుగు, వచించు, సంభాషించు, జపించు, బోధించు, పఠించు
నుతి n స్తోత్రం, పొగడిక
నుదురు n నొసలు, ఫాలం
నున్నగా n 1 నునుపైనది, స్నిగ్ధం , నున్నన, మృదువైనది, సన్నం, సుఖకరమైనది
నుయ్యి n బావి, కూపం, నూయి నూయి, ప్రహి, అందువు, ఉదపానం, కూపం, బావి, నుయి,
నురుగు n ఫేనం, డిండీరం, పాలు, కల్లు మొ ద్రవాల మీద ఏర్పడిన తెల్లటి తెట్టె , నురువు
నులక n నారతో పేనిన దారం
నులి n మెలిక, చిక్కు, అల్పం
నువ్రతిష్టితం n చక్కగా నెలకొల్పబడినది, ప్రతిష్ట చేయబడినది, ప్రసిద్ధికెక్కినది
నువ్వు దే సర్వ 1 యుష్మదర్థకం, నీవు, ఈవు 2 దేతలసస్యం, ధాన్య విశేషం (నువ్వులు) తిలలు, ఫలకం, పూత ధాన్యం, దలాడకం, సారాలం, సుబంధం, స్నేహ ఫలం, హేమ్య ధాన్యం, తెలికలు
నుసి n పురుగులు తొలుపగా రాలే కట్టెపొడి
నూక n 1 వృక్ష విశేషం, 2 విరిగిన బియ్యం (నూకలు), తండులకణాలు
నూగు వేళ్ళు n లేతవేర్లు
నూతన విధానం n కొత్తపద్దతి
నూనె n లం, చమురు నూనె, తిలభవం, తిలరసం, తిల్యం, స్నేహం, తలచమురు
నూపురాలు n కాలి అందెలు, మంజీరాలు
నూయి n చేదుడు బావి, కూపం, చూ నుయ్యి
నూరిపోయు v బాగా బోధించు
నూరు n 1 వంద, శతం, 2 దేక్రి నన్నెకంటిపై మర్దించు 3 రాచు, నలచు, 4 ఆయుధాలు వాడి కావడానికి రాతిమీద ఒర పెట్టడం
నూర్యుడు నంవిరవి, శివుడు; సూరుడు, అర్యముడు, ఆదిత్యుడు, ద్వాదశాత్ముడు, దివాకరుడు, భాస్కరుడు, అహస్కరుడు, బ్రధుడు, ప్రభాకరుడు, విభాకరుడు, వివస్వం తుడు, అర్కుడు, మార్తాండుడు, మిహిరుడు, అరుణుడు, పూషణుడు, ద్యుమణి, తరణి, మిత్రుడు, చిత్రభానుడు, విరోచనుడు, విభా వసువు, గ్రహపతి, త్విషాంపతి, అహర్పతి, భానుడు, సహస్రాంశుడు, తపనుడు, సవిత, రవి, కర్మసాక్షి, హంసుడు, జగచ్చక్షువు, అంశుమాలి, త్రయీతనువు, ప్రద్యోతనుడు, దిన మణి, ఖద్యోతుడు, లోకబాంధవుడు, సురోత్తముడు, ధామనిధి, పద్మినీ వల్లభుడు, హరి, జగముచుట్టం, పవలు సేయు వేలుపు, పచ్చగుర్రాల వజీరుడు, వేడి వెలుగు, రేవెల్లుజోడు, చీకటిగొంగ, ఎర్రని వేలుపు, ఇవముసూడు, ప్రాజదువులజెట్టి, ఏడు గుర్రాల తేరెక్కేజోదు, గాములరేడు, వేయి చేతులరేడు, జక్కవలరేడు, వెలుగుల ఎకిమీడు,
నూలు n 1 దారం, తంతువు, పత్తివడికిన పోగు 2 (తామర మొ వాటిలోని) దానం
నృత్యం n తాళలయాత్మకమైన ఆట, నర్తనం
నృపాలుడు n రాజు, నరులను పాలించేవాడు, రాజు, క్షత్రియుడు, కుబేరుడు
నృపుడు n రాజు
నెగడు v 1 అతిశయించు, విజృంభించు, రాణించు వి పొడుగ్గా ఉండే జలజంతువు, క్రూర జంతువుల నుంచి రక్షించుకోవడానికి చలి కాచుకోవడానికి వేసే మంట, బయలుపడు, ప్రసిద్దికెక్కు, ఒప్పు, వర్ధిల్లు, గర్వించు, యత్నించు, ప్రవర్తించు, సంభవించు, తంతునాగం, రాణించు
నెగ్గు v నెరవేరు, సిద్దించు, సిద్దించు, బతుకు, జయం నొందు, నిస్సత్వమగు
నెచ్చెలి (నెజు+చెలి) నంవిణ 1 ప్రాణ స్నేహితుడు (రాలు) 2 స్త్రీ,
నెట్టన v విణఅధికంగా, మిక్కిలి, తప్పక, న్యాయంగా, నిజంగా, చక్కగా, తెగించి, తొందరపడి, చెచ్చెర, అల్పమైన
నెట్టుకొను v నెలకొను, నివసించు, స్థిరపడు రూ నట్టుకొను, మానుకొను, నెలకొను, బలాత్కరించు, అతిశయించు, గెంటుకొను
నెత్తి n తల, శిరం, వెండ్రుకలు, ఒకానొక తిట్టు
నెత్తిమొతు v తల మీద కొట్టు
నెనరు n ప్రేమ, స్నేహం, మొహం, మచ్చిక, దయ, కృతజ్ఞుడు, ప్రియం
నెమకు v వెదకు, అన్వేషించు (లేమకులెంకుమాం)
నెమరువెట్టు v నెమరువేయు, పశువులు మింగిన ఆహారాన్ని మళ్ళీ నోటికి తెచ్చుకొని చక్కగా నమలడం, రోమంధం చేయడం
నెమలి n మయూరం రూ నమిలి, నెమలి బర్షిణం, హరి, బరి, నీలకంఠం, భుజంగభుక్కు, సారంగం, శిఖావలం, శిఖి, కేకి, మేఘనాదాలాపి, నట్టువ పులుగు, జుట్టు పులుగు, నమ్మి, నెమ్మి
నెమ్మది n నెమ్మనం, నిండు మనస్సు మెల్లగా, నిండు మనస్సు, నిశ్చింతత, విశాల హృదయం
నెమ్మి n ప్రేమ, అనురాగం, వంజుల వృక్షం, నెమ్మది, నెమలి, ప్రేమ, స్నేహం, అనుగ్రహం, సుఖం, సంతోషం, ఆసక్తి, క్షేమం
నెమ్ము దేతడి, తేమ, చెమ్మ, మేకు, ఎముక
నెయ్యం n చెలిమి, స్నేహం, నెయ్యమి, మైత్రి, వలపు, ప్రీతి, ఆసక్తి, మనోహరత, బాంధవ్యం, అనుకూలం
నెరవేరు v 1 సిద్దించు, ఈడేరు, 2 ముగియు, పరిసమాప్తమగు
నెరి v విణనిజంగా, ఆచారం, అందం, క్రమం, న్యాయం, వరాక్రమం, రెక్క, వంకరతనం, ప్రజ్ఞ, యోగ్యం, అత్యంతం, గొప్ప, నిగ్గు సౌశీల్యం, ఉత్సాహం, స్థైర్యం, తెగువ, రీతి, వైపు, పింజె, బిరుగడ్డ, ధృఢంగా
నెరిగురి n సరియైన లక్ష్యం
నెల n 1 చంద్రుడు, మాసం, పున్నమి, మాసం, చోటు, కర్పూరం, ఒక శిరోభూషణం
నెలకొల్పు v పాదుకొలుపు, నిలుపు
నెలవు n ఉనికి, స్థితి, ఉనికిపట్టు, పరిచయం, ఇల్లు, ఉత
నెవ్వ(లు) n బాధలు, శ్రమలు, దారిద్ర్యం, దుః ఖం, వ్యథ
నేటివ్ v,n మట్టినదేశం, స్వదేశస్థుడు
నేడు n ఈ దినం, ఈ రోజుల్లో, ఇప్పుడు
నేత v 1 దేవి బట్టలు నేయడం, 2 విశేషనాయకుడు,, నాయకుడు, రాజు, విష్ణువు, వేపచెట్టు
నేతృత్వం n నాయకత్వం
నేత్రం n కన్ను, నయనం, కవ్వపుతాడు, వస్త్రం, పేరు, ఏరు, నక్షత్రం, రెండు, నరం, జడ, చెట్టువేరు, రథం, రక్షించేది
నేత్రానందకరం n కళ్ళకు ఆనందం కలిగించేది
నేత్రావధానం n కళ్ళతో అవధానం చేయడం
నేపథ్యం n తెరకు లోపలి భాగం, వేషస్థానం, భూషణం, వేషం
నేయు v మగ్గం మీద బట్టలు చారులు మొ వాటిని తయారు చేయు, మంచం మొ వాటికి పట్టెడ అల్లు, ఇల్లు మొ వాటిని తాటాకులు మొ వాటితో కప్పు, అల్లు, కూర్పు
నేరం n తప్పు, అపరాధం
నేరుగా అవ్య తిన్నగా, సూటిగా
నేరులు n వెండ్రుకలు
నేర్పరి, ప్రఖ్యాతుడు, ధీరుడు విశాలదృక్పథం n విరివియైన చూపు
నేర్పు v 1 అభ్యసింపచేయు, 2 దేవిప్రావీణ్యం, సామర్థ్యం, చాతుర్యం
నేల n భూమి, భూమి, భూలోకం, ప్రదేశం, దేశం, మన్ను
నేలమట్టం n నేలతో సమానమైనది, నాశితం
నేస్తాలు n స్నేహితులు
నైచ్యం n నీచత్వం
నైజం n సహజం, స్వకీయం, స్వభావం
నైజగుణం n సహజగుణం
నైజాం n నిజాం రాజు పాలనలో ఉన్న ప్రాంతం (తెలంగాణం)
నైట్రస్ ఆక్సైడు n నవ్వించేగాలి గిలిగింతలు పెట్టే రసాయనిక వాయువు
నైతిక బలం n నీతికి సంబంధించిన నీతికీ ధర్మానికీ బలం కట్టుబడి ఉండే బలం
నైపుణ్యం n నిపుణత్వం, కౌశలం రూ నైపుణ్యం
నైయాయికుడు n న్యాయశాస్త్రం తెలిసినవాడు, తార్కికుడు, తర్క శాస్త్ర పండితుడు
నైరాశ్యం n నిరాశ, ఆశలేనితనం, ఆశలు అంతరించి పోవడం, నిస్పృహ
నైరృతి n దక్షిణ, పశ్చిమాల నడిమి దిక్కు రూ నైరుతి
నైవేద్యం n దేవతలకు నివేదింపదగిన వస్తువు, నివేద్యం
నైశిత్యం n నిశితత్వం
నైష్ఠికుడు n నిష్ఠకలవాడు మరణ పర్యంతం బ్రహ్మచర్యాన్ని మాని గురు కులంలో ఉండే బ్రహ్మచారి
నైసర్గికానుకూల్యం n స్వభావానికి అనుకూలమైనది
నొక్కి చెప్పు v గట్టిగా చెప్పు
నొక్కు v అదుము, నలుపు, అదుము, వంపుతీయు (నోరు నొక్కు మాట్లాడ కుండా చేయు)
నొచ్చుకొను v పశ్చాత్తాపపడు, బాధపడు
నొప్పింపక v బాధ పెట్టక
నొవ్వు n వేదన, బాధ
నొసలు n నుదురు, లలాటం
నోచు v నోము, ఆచరించు
నోచుకొను v నోముకొను, ఆచరించు
నోట్లు n రూపాయల కాగితాలు
నోము n 1 వ్రతం, 2 దేక్రినోచు, ఆచరించు
నోరాచి (నోరు+ఆచి) v నోరు తెరచి
నోరు n వాయి, ఆన్యం, ముఖావయనం, పక్షుల ముక్కు, పశ్వాదుల ముట్టె, మాట్లాడు శక్తి
నోరు తెరచు v 1 మాట్లాడు, 2 ఆశ పెట్టు, 3 నిరుత్తరుడగు
నోరుగొట్టు v అనుభవింపకుండ చేయు, తినకుండా చేయు
నోరునొక్కు v మాట్లాడ కుండ చేయు
నోరుమూయు v మాటాకుండ
నోరెత్తు v మాటాడు
నౌక n నావ, ఓడ, చిన్నపడవ
నౌకరి n సేవ, ఉద్యోగం, కొలువు, ఊడిగం
నౌకరు n ఉద్యోగస్తుడు, సేవకుడు
న్యాయం n ధర్మం అర్థం, అభినీతం, అభేషం, ఔపయికం, కల్పం, దేశరూపం, ధర్మం, న్యాయం, భజమానం, యుక్తం, లభ్యం, సమంజసం, పారం, తగవు, నీతి, తగవు, శాస్త్రం , తర్క శాస్త్రం, దృష్టాంతం, పద్ధతి, సూత్రం, ప్రభుత్వం, మర్యాద, సంబంధం, చట్టం, పోలి, పుణ్యం, తీర్పు, చెడని ధర్మం, వ్యాజ్యం
న్యాయవాది సం,విణన్యాయంకోసం, వాదించే వాడు న్యాయవ్రకారం వాదించి న్యాయాన్ని చెప్పేవాడు
న్యాయస్థానం n న్యాయాన్ని చెప్పేచోటు, కోర్టు , న్యాయం జరిగే చోటు
న్యూనత n తక్కువదనం
న్యూరో సర్జన్ n నాడీ వ్యాధి సంబంధమైన (శస్త్ర చికిత్సచేసే) వైద్యుడు