Jump to content

తెలుగు-తెలుగు నిఘంటువు/ద-ధ

Wikibooks నుండి
థియేటరు n 1 రంగం, నాటకశాల; 2 హాలు, గది, 3 శస్త్రవైద్యశాల
థెర్త్యం n ధూర్తత్వం, దుండగం
థ్యాంక్యూ ఉపకార స్మృతి, దండం, మీకు ధన్యవాదాలు
దంగు v నలగు, దంచు, డంగు
దంచు v నలగజేయు, నలగదొక్కు
దంట n జంట, కవ,, నేర్పరి, జంట, ప్రౌఢ స్త్రీ, వ్య
దండం దే నమస్కారం రూ దణ్ణం, నమస్కారం; చతురోపాయాలలో ఒకటి; రాజశిక్ష; చెట్టుబోదె; కాడ; కవ్వం; వాద్యం వాయించే కొడుపు
దండ n పూలహారం, మాల, 1 సమీపం, ప్రాపు; హారం వైపు, పక్క, పార్శ్వం, స్థానం, ఆధారం; బాహువు;భుజబలం; హస్తావలంబనం; మల్లుని సాధన దండం
దండ నాయకుడు n సేనా నాయకుడు
దండ ప్రణామం n సాష్టాంగ నమస్కారం, కర్రలాగానేల మీద బడి మొక్కడం
దండకం n ఒక వృత్తం; సుదీర్ఘంగా మాట్లాడటం, అరణ్యం పేరు ఉదా
దండనాధుడు n సేనాపతి
దండన్ n సమీపాన
దండయాత్ర సంవి 1 యుద్ధ యాత్ర, రాజు మొ వారు శత్రువుపై దాడికి వెడలడం, దిగ్విజయయాత్ర 2 పెండ్లి ఊరేగింపు 3 చక్కగా పోవడం
దండాకోర్ n మొండి దండి మగలు
దండి వీరులు n శార్వం ఉన్నవారు
దండు n 1 సేన, 2 సమూహం దేక్రి సంపాదించు, గ్రహించు
దండుగ n నష్టం, – దండగ, 2 అధికారి అపరాధి నుంచి అపరాధం కోసం తీసుకునే ధనం, 3 పనికిరాని, వ్యర్థం
దండెం v వి 1 బట్టలు ఆరవేసే కర్ర , దండియం 2 గండి సాధనలలో ఒక విధం
దండెత్తు v యుద్ధ ప్రయత్నం చేయు (దండు + ఎత్తు)
దండే v విరాసుకోల రూ దండియ, కిన్నెర, వీణి, తంబుర, పల్లకి బొంగు, ఏతపు కడవకు మీద అడ్డంగా ఉంచి కట్టేకొయ్య త్రాసు కోల –
దండోరా వేయు హింక్రి తప్పెట కొట్టి చాటించు, డప్పుకొట్టి చాటించు రూ దండోరావేయు
దంత ధావనం n పళ్ళు తోము కోవడం
దంతాలు n పళ్ళు, పొడవైన రాళ్ళు, పొదరిళ్ళు, ఏనుగు దంతాలు పళ్లు, కొండ నడుములు, ముప్పది రెండు
దంతావళం n ఏనుగు , ప్రశస్తమైన దంతాలు కలది దంతి, హస్తి, ద్విరదం, అనేకపం, ద్వీపం, సింధురం, సామజం, కుంభి, మాతంగం, మతంగం, గజం, నాగం, కుంజరం, వారణం, కరి, ఇభం, గవురు, కలభం, దంతావళం దంతెలు
దంత్యం n (ఇ, ఈ, చ, ఛ, జ,ఝ, య, శ, లు దండ దంత్య స్థానంలో పుట్టిన వర్గాలు
దందడి n 1సాంద్రత, కలత, దొమ్మి, ఆధిక్యం, సమ్మర్ధం, సంకుల రణం
దందశూకం n పాము,, కుత్సితమైన దంశనం (కరవడం) కలది భుజంగం, విషధరం, వ్యాళం, సరీసృపం, కుండలి, కాకోదరం, ఫణి, ఉరగం, పన్నగం, భోగి, పాము, త్రాచు, సర్పం
దంపతులు n ఆలుమగలు, భార్యాభర్తలు, జాయాపతులు
దంభం సంవి కపటం, మోసం, డంబం, బడాయి, పాపం
దంభాచారం n మోసపు పని
దంష్ట్రం n కోర, పల్లు
దక్కన్ n దక్షిణ ప్రాంతం
దక్కు v లభించు, చేకూరు రూ డక్కు నిలుచు
దక్షిణ n ఋత్విక్కులకిచ్చే సొమ్ము, యజ్ఞాదులలో ఋత్విక్కులకు ఇచ్చే ధనం 2 దక్షిణదిక్కు 3 గుర్వాదులకు ఇచ్చే ధనం విణకుడిది X ఉత్తర, కుడి దిక్కు, మర్యాద కలది, దానం తర్వాత ఇచ్చే దక్షిణ, నేర్పు కలది, మనోహరమైనది
దక్షిణామూర్తి n ఋషులకు జ్ఞానోపదేశం చేయడానికి అవతరించిన శివమూర్తి
దక్షిణాయనం n 1 సూర్యుడు దక్షిణం వైపుగా పోవడం, సూర్యుడు ఉత్తరం నుంచి దక్షిణం దిక్కు కు పోయే ఆరునెలల కాలం X ఉత్తరాయణం
దక్షుడు n సమర్థుడు, నేర్పరి, అభిజ్ఞుడు, చురుకైన వాడు, ప్రజాపతులలో ఒకడు, వహ్ని, ఒకానొకముని, శరీరం దాచని బంటు,శివుడు, నవ బ్రహ్మలలో ఒక బ్రహ్మ
దగ n దాహం , దప్పి, పిపాస, తాపం, బాధ, ఆయాసం, అలసట
దగా n మోసం
దగాకోరు n మోసగాడు
దగ్గం n కాల్చబడింది, కాల్చు
దగ్గమూర్తి n కాలుతున్న వాడు
దగ్గర n సమీపం
దగ్గహస్తం n కాల్చేచేయి
దగ్గు n కాసం, కాశం, క్షపథువు, క్షవకం, గదాగ్రణి, ఉక్కిన, ఉబ్బసం, కక్కువాయి, కుముటు, గస
దగ్గుత్తిక n గద్గద స్వరం, డగ్గుత్తిక
దగ్గులు n కాల్చబడినవారు
దట్ట n సాంద్రం, తరచు, అధికం, గొప్పది, పావడ, వస్త్రం, కాసె, దట్టి
దట్టించు v అదలించు, గట్టిగా కూరు, నశింపజేయు, పోగొట్టు, జయించు, గ్రహించు, పూను, యత్నించు
దడదడ n గుండె చలనానికనుకరణం; దడ యొక్క ఆమ్రేడిత రూపం
దడి n వెదురు వంటి వాటితో ఏర్పరచిన తడక
దడియు v భయపడు, వణకు, జడియు
దత్తత n పెంపకం, సంతానంలేని వారు చట్టరీత్యా ఇతరుల పిల్లలను పెంచుకోవడం, స్వీకారం
దత్తపదులు n (అవధానంలో) ఇవ్వబడిన పదాలు
దత్తుడు n దత్తపుత్రుడు, పెంపుడు కొడుకు,దత్తకుడు
దద్దమ్మ దేతెలివి తక్కువ వాడు; పనికిమాలినవాడు, అప్రయోజకుడు
దద్దరిల్లు v అదరిపడు; తీవ్రమైన ధ్వని తాకిడికి కంపించు, కంగారుపడు, సంభ్రమం పొందు, తుళ్ళిపడు, భయపడు, తబ్బిబ్బుపడు, వ్యత్యయంపొందు
దద్దు n 1 చీమ, దోమ వంటివి కుట్టడం వల్ల/ పైత్యంవల్ల/ బెత్తం వంటి వాటితో కొట్టడంవల్ల కలిగే వాపు, దద్దురు, కణితి
దధి n పెరుగు, పెరుగు, వస్త్రం, మద్ది
దధ్యోదనం n తాలింపు పెట్టిన పెరుగన్నం,దద్దోజనం
దనియాలు n కొత్తిమిరి విత్తులు, ధనియాలు; ఇది నిత్య బహువచనాంతం,
దనుక ,అవ్య వరకు, పర్యంతం, దొక
దనుజుడు n రాక్షసుడు, (దను పుత్రుడు) కశ్యపునికి దనువు అనే భార్యవల్ల పుట్టినవాడు దనుజాధిపుడు
దప్పళం n రెండు మూడు కాయ దినుసులు చేర్చి పలుచగా చేసిన వ్యంజన విశేషం పులుసు
దప్పి n 1 దాహం , పిపాస,డప్పి, దప్పిక 2 గ్లాని, శ్రమ, బడలిక
దబదబ n 1తలుపు కొట్టడం, వెత్తడం, మొ వాటి ధ్వనికి అనుకరణం 2 గబగబ
దబ్బనం n పెద్దసూది, గోనెలు కుట్టేసూది; దబ్బడం, గోనె కుట్టు సూది, బృహత్సూచి, దబ్బనం
దబ్బర n 1 బొంకు, అసత్యం, మోసం, నిందావాక్యం, తప్పు, విపత్తు
దబ్బున v విణతొందరగా, శీఘ్రంగా
దమం n అణచడం, బహి రింద్రియ నిగ్రహం, బ్రహ్మచర్యాది క్లేశాలను ఓర్చుకోవడం, దండనం, బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం, క్లేశసహనం, బురద, ఓర్పు, దండోపాయం
దమనచర్య n అణచేపనులు
దమ్మిడీ n అయిదు కాసుల నాణెం, (రెండు కాసుల నాణెం అనికొందరు)
దమ్ము n బురద, పంకం 2 పొలాన్ని నీరు పెట్టి దున్నడం 3 ఆయాసం
దయ n కృప; కనికరం, జాలి
దయా సముద్రుడు n సముద్ర మంత దయ గలవాడు
దయాదాక్షిణ్యాలు n కనికరం, ఔదార్యాలు
దయామయుడు n దయగల వాడు, కనికరం గలవాడు
దయామూర్తి n దయయే ఆకృతిగా తాల్చినది
దయారసం n దయాగుణం
దయార్ద హృదయ n దయతో మెత్తనైన హృదయం గలది
దయ్యం n 1 దేవుడు, దేవత; ప్రకృతి దైవం 2 పిశాచి, 3 విధి, అదృష్టం గాలి, గాము, గ్రహం, పిశాచం, బూచి, సోకుడు, పిశాచం, దేవుడు, వీధి దరఖాస్తు
దరవననం నంవిచిరునవ్వు, దరహాసం
దరి n గట్టు, తీరం, ఒడ్డు, గుహ, గట్టు, దగ్గర, మేర, సానువు, దిక్కు
దరిద్రుడు n 1 బీదవాడు, 2 చెడ్డవాడు
దరిబేసి n దీనుడు, పిసినిగొట్టు, దర్బేసి
దరిమిలా హింక్రివిణతరవాత, దరిమిల
దరియు v సమీపించు
దరుజు n గచ్చు పూతతో రాళ్ళను (ఇటుకలను) కలపడం
దరువు v విగీతి విశేషం, తాళం
దర్జా n 1 మెట్టు, స్థితి 2 హాయి
దర్జాగా n 1 స్థితిగా, 2 హాయిగా
దర్జీ n కుట్టుపని చేసేవాడు, ట్రైలర్
దర్డురంబు n 1 కప్ప; 2 మబ్బు
దర్పణం n 1 అద్దం, ముకురం, దీనిచేత మంచి వేషాభిమానాన్ని కలిగి గర్విస్తారు 2 కుబేరుని ఉనికిపట్టయిన ఒకానొక పర్వతం దర్పం
దర్బారు n 1 కచ్చేరి, కొలువు కూటం 2 ఒక రాగం
దర్భ n తృణ విశేషం, కుశ; వికృ దబ్బ; దబ్బ, కుశం, కథం, కూర్చం, పవిత్రం, కొనె
దర్యాప్తు n విచారణ, నేర న్యాయ సంబంధమైన విషయాలను గురించి పూర్వాపరాలను తెలుసుకోవడానికి జరిపే పరిశీలన
దర్వాజా n తలుపు, ద్వారబంధం
దర్వి n మిళ్ళి, గరిటె, తెడ్డు, పాము పడగ; చిన్నగరిటె
దర్శకుడు n చూసేవాడు, చలనచిత్ర నాటక ప్రయోగ విధాన నిర్వాహకుడు, పరిశీలించేవాడు, నేర్పరి, నిపుణుడు, ద్వారపాలకుడు
దర్శనం n చూసేది, అమావాస్యనాడు చేయదగినది, చూపు, అద్దం, ధర్మం, శాస్త్రం, తెలివి, కానుక, సాక్షాత్కారం, రంగు, జన్నం, కల, దశ / ద్వాదశావస్థలలో ఒకటి, పరిశీలించడం, కన్ను, జ్ఞానం, బుద్ది
దర్శనీయం n చూడదగినది, సుందరం, చూపదగినది
దలారీ n లావా దేవీలో ఇరు పక్షాల మధ్య సంబంధం కుదిర్చే వ్యక్తి (బ్రోకర్) రూ దళారీ
దళం n ఆకు,
దళసరి n మందం, తఱచు, గొప్పతనం, మహత్యం, తరచు
దళిత వర్గాలు n చీల్చబడిన సంస్థలు
దళితుడు n చీల్చబడినవాడు, వేరు చేయబడినవాడు
దవం n కార్చిచ్చు, అడవి,, దావాగ్ని, రోగం, అగ్ని, గుర్రం, అడవి
దవడ n తొలువు
దవనం వాసన మూలికా విశేషం
దవీయం (బు) సవి మిక్కిలి దూరమైనది
దవు n దూరం; దూరప్రదేశం
దవ్వ n చెట్టు మధ్యలోని మెత్తని భాగం
దశ n అదృష్టం, పది; వస్రపు చెఱగు బట్ట అంచు; దీపపు వత్తి; అవస్థ, స్థితి, చిత్తము, పంక్తి, వరుస ప్రభుత్వం, మనస్సు
దశకం n పది, దసకం దస్కం
దశమి n పక్షంలో పదో తిథి, నూరేళ్ళలో పదోది, పదవది, మిక్కిలి వృద్దుడు దశరథుడు
దష్టం n కరిచిన, కొరికిన
దసరా n దశరాత్రి పండుగ, ఆశ్వీజ శుపాడ్యమి మొదలు దశమి వరకూ గల వదిరోజుల పండగ దశరాత్రాలు –
దస్కతు n చేవ్రాలు, సంతకం
దస్తరం దేవికాగితాల మూట;రూ దస్తు
దస్తావేజు n రాత పూర్వకమైన సాధనం
దస్తూరి n రాత, చేవ్రాలు
దహనం n కాల్చడం,, కాల్చుట, దుర్వ్యాపారం, పులికడుగు, త్రిసంఖ్య, పావురం, కృత్తిక, జీడి, నిప్పు, చిత్రమూలం
దహించుకు పోవు v కాలిపోవు
దాంతి n బ్రహ్మచర్యాది తపఃక్లేశాన్ని ఓర్చేతనం
దాంపత్యం n దంపతి భావం, భార్యా భరభావం
దాంభికుడు n డాబు ఉన్నవాడు, దంభం ఉన్నవాడు
దాకొను v మరుగువడు,దాచుకొను (దాగు+కొను); దాక్కొను
దాక్షిణ్యం n మొగమోటం, కరుణ, జాలి, సామర్థ్యం, నేర్పు, దయ, నీతి, ఐకమత్యం, నేర్చు
దాఖలా n రుజువు, సాక్ష్యం
దాఖలు n ప్రవేశం, దఖలు కార్యాలయాల్లో వ్యవహారాలకు సంబంధించిన కాయితాలు ఇచ్చి అవి ఇచ్చినట్లు పుస్తకంలో రాయించు కోవడం
దాగర n తట్ట
దాగిలి మూతలు n గుప్తక్రీడ, దాగుడు మూతలు
దాగుడు మూతలు n గుప్తక్రీడ, దాగిలిమూతలు, దాగుడు మూతలు, పిల్లలాడుకొనే ఒక రకం ఆట
దాచు v దాగజేయు, మరుగు పరచు, భద్రపరచు
దాటు v విగుంపు, సమూహం 2 దేక్రి లంఘించు 3 తరించు 4 ఉల్లంఘించు
దాడి v,1 శత్రువును జయించడం కోసం దండెత్తి పోవడం, 2 n గడ్డం
దాడిమ్మ v విదానిమ్మ దాణా
దాత n ఇచ్చేవాడు, ఈవికాడు, ఈవరి, చాగకాడు, ఉదారుడు, త్యాగి, దాన శాండుడు, బహుప్రదుడు, వదాన్యుడు, స్థూల లక్షుడు, వితరణ శీలి, విసర్జకుడు++
దాతృత్వం n దానగుణం, ఔదార్యం, దానశీలం
దాదాపు n మిక్కిలి సమీపం (దాపు+ దాపు)
దాది v విపాలిచ్చి పెంచేతల్లి
దానం n 1 ఈవి త్యాగం, విహాపితం, ఉత్సర్జనం, 'విసర్జనం, వితరణం, వర్జనం, చాగం, ఈవి, తేగం,వితరణం, ఏనుగు కపోల మందలి మదం, రక్షణం, పరిపాలనం, ఛదనం, శుద్ధి, చతురుపాయాలలో ఒకటి
దానవుడు n దనుజుడు, రాక్షసుడు, కశ్యపునికి దనువునందు పుట్టిన సంతానం రాక్షసులు; రాక్షసుడు, అసురుడు, దైత్యుడు, దైతేయుడు, దనుజుడు, దానవుడు, శుక్రశిష్యుడు, పర్వ దేవుడు, రక్కసుడు, సురద్విషుడు, పుణ్య జనుడు
దాపరికం n గోపనం, మరుగు పుచ్చడం; (దాప+ఉకం)
దాపల n ఎడమవైపు, డాపల
దాపు n సమీపంలో,
దాపురమగు v ప్రాప్తించు
దామం n దండ, హారం 2 తలుగు దామోదరుడు
దాయలు n 1 శత్రువులు, 2 జ్ఞాతులు
దాయాదుడు n వారసుడు, జ్ఞాతి, పాలివాడు, దాయభాగాన్ని అనుభవించేవాడు; ప దాయాది,
దారం n నూలుతాడు
దార n భార్య, అగ్నిసాక్షిగా పెళ్ళాడిన పెళ్ళాం, భర్తను సోదరుల నుంచి విడదీసేది; పత్ని, దార, పాణి, గృహాతి, అర్ధాంగి, ద్వితీయ, సహధర్మిణి, జాయ, ఆలు, పెళ్ళాం, రాణి, ఇల్లాలు, కళత్రం, క్షేత్రం, పోయాలు, జని, వధువు, అగ్నిసాక్షిగా వివాహమాడిన పెండ్లాం, వితరణం, కత్తి అంచు, నీటిచాలు, క్రమం, దానం
దారా పుత్రులు n భార్య, పిల్లలు
దావానలం n కార్చిచ్చు
దాశరథి n రాముడు, (దశరథాపత్యం) దశరథుని పుత్రుడు
దాసరి n విష్ణుభక్తుడు, బిచ్చగాడు, శిఖా యజ్ఞోపవీతాలు ధరింపని బిచ్చమెత్తుకోనే విష్ణుభక్తుడు
దాసి n వెల కుకొన్న పనిగర్తె, పరిచారిక, పనిమనిషి తొత్తు, దాది, ధాత్రి, పరిచారిక, బానిస , బోనకర్తె, వరవుడు, సేవకురాలు , పనిచేయడానికేర్పాటైనది, కాకి దొండ, నల్లగొరంట, మహాదానాలు 16లో ఒకటి, ఐశ్వర్యాలు 8లో ఒకటి, కొన్నదాసి
దాసుడు n సేవకుడు, బ్రాహ్మణునికి వివాహిత శూద్ర కన్యయందు పుట్టి సంస్కరింపబడిన వాడు, భృత్యుడు, దాసరాజు, దానారుడు, చేపలు పట్టే జాలరి, జ్ఞాని (శూద్రుడు),
దాసోహం v విణనేనుదాసుణ్ణి, లొంగిపోవు
దాస్యం n దాసత్వం, సేవ, పని
దాహం n దప్పిక, కాల్చడం,
దిండు n 1 నిడుపాటి గుండ్రని తలగడ కాసే, దట్టి, నిడుపాటి గుండ్రపు తలగడవలె చెక్కబడిన మాను, మెరుగు బిళ్ళ వంటివి అంటించే రాళ్ళ పనివాడి సాన తిరుగుడు కొయ్య, దట్టి నిడుపాటి గుండ్రపు తలగడ
దింపు v దిగజేయు, దించు
దింపుడు కళ్ళం n దహనానికి ముందు కళేబరాన్ని (చివరిసారిగా పిలవడం కోసం) శ్మశానం ముందు ఆపడం
దిక్కరి n దిక్కు / , దిగ్గజం, ఎనిమిది గజాలలో ఒకటి
దిక్కరి n దిగ్గజం
దిక్కరిణి n దిక్కు అనే ఆడ ఏనుగు
దిక్కు n దెస, దిశ, కడ; దిశ, కకుభం, కాష్ఠ, ఆశ, వారితల, దేస, కడ, చెరగు , అవకాశం ఇచ్చేది, కడ, మార్గం, రీతి, పది అనే సంఖ్య, దంతక్షతం, రక్షకుడు, శరణం, పుత్రాది ఆధారం, విషయం, ఎడ, పక్షం, వైపు, స్థానం 2 నువ్వేనాకు దిక్కు;3 నువ్వెవరి దిక్కు
దిగంబరుడు n శివుడు, దిస మొలవాడు, ఒక తెగ జైన బిక్షువు, దిక్కులు వస్త్రంగా కలవాడు; శంభుడు, శర్వుడు, శంకరుడు, శితికంఠుడు, శ్రీ కంఠుడు, సర్వజ్ఞుడు, భైరవుడు, దిసమొలవాడు, శివుడు, క్షపణకుడు
దిగ విడుచు (దిగన్ + విడుచు) v విడిచి పెట్టు, త్యజించు
దిగజారు దేక్రి, క్షీణించు, బలహీనుడవు, హీనమవు, స్థాయి విలువ పడిపోవు, మీది నుంచి కిందికి బడు, చ్యుతమగు, స్రవించు, కారు, పోవు, కాంగు, దిగబడు
దిగదుడుపు n 1 పనికిరానిది, తక్కువది; 2 దృష్టిదోష పరిహారం కోసం ఉప్పు మిరపకాయ మొ చుట్టూ తిప్పడం
దిగబెట్టు v 1 విడుచు, వదిలి పెట్టు; 2 మిగుల్చు
దిగమింగు n 1 గొంతు దిగేటట్లు మింగడం, 2 అవహరించు, స్వాహాచేయు, ఎగగొట్టు
దిగాలు n వ్యాకులత;
దిగాలుపడు v వ్యాకులపడు, చిన్నపోవు
దిగు v 1 అవరోహించు, దిగ్గు, డిగ్గు; 2 విడియు, 3 ఉత్పన్నమగు, కలుగు 4 గుచ్చుకొను
దిగున v విణ తటాలున, ఉన్నట్లుండి, దిగ్గన
దిగుబడి n రావడం, ఉత్పత్తి, ఫలసాయం , పంట
దిగుమతి n ఓడలో ఉన్న సరుకును రేవులో దించడం, ఇతర ప్రాంతాల నుంచి అవసరమైన సరుకులు తెప్పించడం
దిగులు n గుండె అదరు, భయం, బెంగ, విచారం, అధైర్యం, దిగాలు
దిగువన n కింద, కిందిస్థాయి,దిగువ
దిగ్దర్శకుడు n మార్గం చూపేవాడు, జాడగా మూలసూత్రం తెలపడం
దిగ్ర్భాంతి n దిక్కుల తబ్బిబ్బు, ఆశ్చర్యం
దిటవు v విదార్థ్యం, దృఢం, శక్తి, సత్తువ
దిట్ట v విసామర్థ్యం కలది, సామర్థ్యం కలవాడు, దార్థ్యం గలవాడు, ధైర్యం గలవాడు, సామర్థ్యం గలవాడు
దిద్దు దేక్రి1 సవరించు, విద్యాదుల తీర్చు, 2 తిలకం చక్కగా దిద్దుకో 2 చక్కగా రాయు, 3 శిక్షించు
దినం n దివసం, పగలు, రోజు, 24 గంటలకాలం, చనిపోయినవారికి శ్రాద్ధకర్మ చేసే రోజు
దినం దివాంధం n గుడ్లగూబ, పగలు గుడ్డియైనది
దినకరుడు n సూర్యుడు, దినములను కలుగ జేసేవాడు, పగలు జీవులను వ్యాపారవంతులనుగా చేసేవాడు; ఆదిత్యుడు, దివాకరుడు, భాస్కరుడు, అహస్కరుడు, ప్రభాకరుడు, అర్కుడు, మార్తాండుడు, అరుణుడు, తరణి, భానుడు, తపనుడు, సవిత, రవి, కర్మసాక్షి, లోకబాంధవుడు, దినమణి, విభాకరుడు, సప్తాశ్వుడు
దినదినాభివృద్ధి n రోజురోజుకు పెంపు
దినపత్రిక n రోజూవచ్చే పత్రిక, డెయిలీ
దినమెల్ల మిఅవ్య పగలంతా
దినరాజు n సూర్యుడు; చూదినకరుడు
దినవెచ్చం మివిరోజూ వారీ ఖర్చు
దినుసు n వస్తువు,దినుస్సు, 2 ప్రకారం
దిబ్బ n 1 కుప్ప, ఎత్తుగడ, ఉన్నత భూమి, పర్వతం, హస్తినఖం, ద్వీపం, మట్టి వంటి వాటి కుప్ప
దిబ్బడ n జలుబు చేత ముక్కు, ‘‘చెవులలో కలిగే బాధా విశేషం
దిమాకు n గర్వం, అధికారం, తెలివి
దిమ్మిస దే,వి,చదును, నేలను చదును చేసే సాధనం
దిమ్ము n తల మొ వానిలోని బాధా విశేషం, సమూహం, శిరోభారం, జడత్వం, మాంద్యం, మదం, గొప్ప ధ్వనికి అనుకరణ
దిమ్మె దేతామర దుద్దు,, రాళ్ళు మొ వాని చిన్న మిట్ట, కుప్ప, మద్దెల అంచు, కొయ్య బిరడాతామరదుద్దు
దిరిసెనం n శిరీషం, దిరిసనం; దిరిసనం, కింకిణీ వలం, పాండువు, ప్లవకం, భండిలం, మృదు పుష్పకం, శిరీషం, శుకదృవు, శుక్లపుష్ప, శ్యామతీర్థ
దివంగతురాలు v విస్వర్గానికెళ్ళిన స్త్రీ, మరణించిన స్త్రీ
దివసం n పగలు, అహోరాత్రకాలం
దివాకరుడు n సూర్యుడు; చూదినకరుడు
దివాణం v విఆస్థానం, రాజుకాని
దివాను n మంత్రి
దివాలా n వ్యవహారం చెడి కలిగే నష్టం
దివాస్వప్నం n పగటికల, పగటినిద్ర
దివి n స్వర్గం, ఆకాశం;
దివిజుడు n వేల్పు, దేవత, స్వర్గంలో పుట్టినవాడు
దివ్యం n మనోజ్ఞం, చక్కని, మహా వ్యవహారాలలో జయింప దగిన సత్యం , దివిలో పుట్టినది, లవంగం, అందమైనది, శ్రేష్టం, ఆశ్చర్యకరం, సాంబ్రాణి, ఆకాశం, చందనం, స్వర్గంలో పుట్టినది, భాష
దివ్య గీతాలు n అద్భుతమైన పాటలు
దివ్య భూరుహం n దేవతా వృక్షం, కల్పవృక్షం
దివ్యజీవితం n ఆశ్చర్యకరమైన, లేదా మనోజ్ఞమైన జీవితం
దివ్యజ్యోతి n శ్రేష్టమైనకాంతి
దివ్వె v విదీపం, దివ్య, దివె, ‘‘దివ్వియ, దివియ, దీవె, దీవియ; దిబ్బెం, దీబె, దీపిక, స్నేహాలం, దివిటీ, కజ్జల ధ్వజం, గృహమణి, దోషాతిలకం, జోతి, తిర్లిక, తిత్తిక, తిల్లిక, తిర్విశక, పంజు, ఇలాయి, కాగడా, దీపయిష్టిక
దివ్వె దీప్తి n ప్రకాశం, వెలుగు, కాంతి, అభివ్యక్తి, బయలు పడుట, లక్క, కంచు
దిష్టి n దృష్టిదోషం,దిష్టి, దృష్టిదోషం, కీసరు, దృష్టి
దిష్టి తీయు v దృష్టి దోషం పోవడం కోసం మిరపకాయలు వంటి దిగదుడుచు
దిష్టిబొమ్మ n 1 పంటలకు దృష్టి దోషం తగలకుండా గడ్డి వంటి వాటితో మనుష్య రూపంగా చేసి వేలాడ దీసిన బొమ్మ, 2 మనిషి రూపంలో తయారు చేసిన గడ్డి వంటి వాటి బొమ్మ
దీక్ష n గట్టి పట్టుదల, యజ్ఞం, వివాహాది కర్మలలో అవలంబించే నియమం, నియమం, దృఢాభినివేశం, మంత్రోపదేశం, మంత్రోపదేశం పొందడం, ఉపనయన సంస్కారం
దీటు v సవరించు, సరిచేయు; వి పమానస్థాయి, సమ ఉజ్జీ, పోలిక, విధం; దేవిణ సాటి అయిన, సమానమైన, తగిన నాకా ఆకర్షించు, కరచు, కొరకు, చలింపజేయు, సమానం, సరి, అర్షం, విధం, రీతి, తిన్నగా, సూటిగా
దీనం n చాల దయనీయం, దరిద్రం, దర్పముడగడం, భయపడడం, ఎలుక, పున్నాగం, మొగలి, తగరం, నందివర్ధనం, దరిద్రం, భయం, దర్పహీనం, జాలి గొల్పడం
దీనబాంధవుడు పంవిణకష్టాల్లో ఉన్నవారికి చుట్టం, కష్టాలలో ఉన్న వారిని ఆదుకోనేవాడు
దీనస్థితి n జాలి గొలి పేస్థితి దయనీయమైన స్థితి
దీనావస్థ n శోచనీయ స్థితి జాలి గొలిపే పరిస్థితి
దీనుడు n 1 జాలిగొలుపువాడు, శోచనీయుడు,
దీపకం n దీపం , ప్రకాశింప చేసేది, వాము, జీలకర్ర, దీపం, ఒక రాగం, ఒక అర్థాలంకారం, కుంకుమ, డేగ
దీపకళిక n 1 దీపశిఖ 2 యాజ్ఞవల్క్య సంహితకు శూలపాణి రచించిన టీక
దీపావళి n నరక చతుర్దశి మరునాటి పండుగ , దీపాల వరస ఆశ్వయుజ మాసంలో అమావాస్యనాటి పండుగ
దీపిక n దీపం చూ
దీర్ఘకాయుడు n పొడవైన శరీరం కలవాడు
దీర్ఘాయువు n దీర్ఘకాలం; దీర్ఘకాలం బతికేవాడు, చిరంజీవి, కాకి, మార్కండేయుడు, బూరుగుచెట్టు, జీవకం (వువి), అశ్వత్థామాదులు (అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు)
దీలుపడు v బలహీనమగు, కృశించు;
దీవన n ఆశీర్వాదం, ఆశీర్వచనం, దీవెన
దీవి n నీటినడిమిదిబ్బ, ద్వీపం దీవించు
దీవ్యత్ v శత్రర్ధకం ప్రకాశిస్తున్న
దీశ n దిక్కు, ఆశ, దేస, కడ, దెస
దుః ఖం n బాధ, వ్యధ, నొగులు పీడ, బాధ, వ్యధ, ఆమనస్యం, ప్రసూతిజం, కష్టం, కృచ్ఛం, ఆభీలం, క్లేశం, అంకం, అఘం, వనట, బాము, వేత, వంత, గోడు, వగపు, నొగులు, సేగి, అలమట, కొందలం
దుఃఖించు v ఏడ్చు, నొగులు
దుఃఖితమతులు n బాధతో ఉన్నవారు
దుంగ n (చెట్టు) మొద్దు
దుండగం n కీడు, దుర్మార్గం, చెడుపని, కీడు, ఆపద, అపరాధం, దౌష్ట్యం
దుండగీడు n దుర్మార్గుడు, ధూర్తుడు (దుండగము + ఈడు)
దుంప n మూలం, వేరు, కంద, మూలం, గెనుసుగడ్డ, కూటకం (ఏడికోలలేని నాగలి)
దుకాణం n అంగడి, కొట్టు
దుకూలం n పట్టుబట్ట, కప్పుకోవడానికీ, మీద వేసుకోవడానికీ రెండు విధాలుగా యోగ్యమైనది
దుక్కి n దున్నడం , కృషి, నాగేటిచాలు, దుక్కి మునగడానికి తగిన వర్షం
దుక్కిటెదు n దున్నడానికి ఉపయోగించే (దుక్కి + ఎద్దు); ఎద్దు; హాలికం రూచుక్కెద్దు
దుగ్గం n పాలు; దుగ్గం, క్షీరం, పాలు, పిదుకబడినది, చెట్టు మొ వాటి పాలవంటి రసం (మర్రిపాలు), పాలు పెదకడం, నింపబడినది
దుగ్గ n విచారం, అసూయ, ద్వేషం
దుడుకు n దౌష్ట్యం, తప్పు, తొందరపాటు, గర్వం, దుష్టం
దుడ్డు n డబ్బు, రెండు దుగ్గనుల యెత్తు రాగినాణెం,,
దుద్దు n చెవికమ్మ, తామరపువ్వులోని దిమ్మె, మూలస్థానం, చెవికమ్మ, తాటాకు జాబు మీది చెంద్రిక, తాటాకుల కట్ట, అసత్యం, ముదుక, మోసం, మత్తు
దునేదారులు n శూరులు , చేతిలో ధరించేవారు
దున్న దే
దున్ను v దుక్కిచేయు, కృషిచేయు, దును
దుప్పటి n 1 వస్త్రం; 2 ఉత్తరీయం, 3 పక్కపై పరచేబట్ట, 4 కప్పుకొనే ముతకబట్ట
దుప్పి n మచ్చలు ఉన్న జింక దుబారా
దుబాసి n భాషాంతరం చేసేవాడు, వ్యవహారం జరిపేవాడు, రెండవ భాషలోనికి తర్జుమా చేసేవాడు
దుబ్బు v వి గడ్డిలోనగువాని గంట; తృణస్తంభం; తృణమూలం
దుమారం n దుమ్ము
దుముకు v గంతు వేయు, ఉరుకు, పడు, దూకు
దుమ్ము n దుమారం, ధూళి
దుయ్యబట్టు v సమాధానం చెప్పుమని నిర్బంధించు
దురం(బు) n 1 యుద్ధం; 2 నృత్తగీత వాద్యాలలోని వేగం
దురంతం n 1 దురాగతం, చెడ్డపని 2 తుదిలేనిది, అతిక్రమింపరానిది
దురదృష్టం n దౌర్భాగ్యం, చెడ్డ అదృష్టం
దురపిల్లు v శోకించు, పరితపించు,
దురభిమానం n దుష్టమైన అభిమానం, దుర్గర్వం
దురభిమాని n దురభిమానం గలవాడు, దుర్గర్వం గలవాడు
దురభ్యాసం n దుష్టమైన అభ్యాసం, చెడ్డ అలవాటు
దురవగాహం n అర్ధంకానిది
దురహంకారం n దుష్టమైన అహంకారం
దురాచారాలు n చెడ్డ అలవాట్లు
దురాశ n పేరాస
దురాశాపరులు n పేరాస గలవారు
దురితం n పాపం, చెడు, కష్టం
దురుసుతనం n కాఠిన్యం, క్రూరత్వం, నిర్దయ, అధికం, వేగం, కఠినం, విధం,
దురూహ n చెడ్డ ఊహ, చెడు తలంపు
దుర్గం n కోట, ప్రయాసం చే పొందదగినది, పోవడానికి కష్టమైనది, తెలుసుకోవడానికి కష్టమైనది, వన పర్వత ప్రవాహాదులతో కష్టంగా ఉండే దారి, కోట, ఒడుదుడుకు భూమి, విపత్తు, కష్టం
దుర్గంధం n చెడ్డకంపు గలది, గబ్బుగలది
దుర్గతి n నరకం,
దుర్గమం n నడవరాని, పోవడానికి కష్టతరమైన , దుస్సాధ్యమయిన గమనం కలది
దుర్గశ n దుస్థితి, కష్టదశ, నీచస్థితి
దుర్చటన n దుష్టమైన ఘటన, ఘటింపరానిది
దుర్జనుడు n దుష్టుడు, ఖలుడు, తుంటరి
దుర్దినం n దుష్టమైన రోజు, మేవలతో కవ్పబడిన నూర్య బింబంగల దినం; సూర్య దర్శనం / పోవడంవల్ల దుష్టమైన దినం
దుర్నిమిత్తం n అపశకునం
దుర్బరం n భరింపరానిది, ఓర్వలేని, సమ్మించ శక్యంగాని, మోయడానికి వీలుకానిది
దుర్బుద్ధి n 1 దుష్టమైన బుద్ది 2 దుష్టబుద్ధి ఉన్నవాడు, మూడు
దుర్బోధలు n చెడు బోధలు
దుర్భలుడు n స్వల్ప బలంకలవాడు, బక్కవాడు
దుర్భాగ్యం n దురదృష్టం దుర్భావన, n చెడుతలంపు దురిత
దుర్భావం సంవిణ చెడ్డ అభిప్రాయం
దుర్భిక్షమ్ n క్షామం, కరువు, లేమిడి, భిక్షలేమి (తిండి దొరకని)
దుర్మతి n 1 దుష్టబుద్ధి ఉన్నవాడు; 2 ఒక సంవత్సరం
దుర్మార్గులు n చెడుదారిలో నడిచేవారు, చెడ్డవారు, కీడు చేసేశారు
దుర్లభం n పొందశక్యంకానిది, అతి ప్రశస్తం, ప్రియం, కచోరం గంట్ల కచోరం
దుర్వారం n దుర్వార సుహృ ద్విపత్తిగని వహ్నిచోరంజని
దుర్వారులు n ఆపరానివారు
దుర్వార్త n అప్రియమైన వార్త, చెడ్డ వృత్తాంతం
దుర్వాసన n చెడ్డవాసన, దుర్గంధం
దుర్విలసితం n దుశ్చేష్టితం, చెడ్డపని
దుర్వ్యసనం n చెడ్డ వ్యవసనం, (ద్యూతం మొ ) కూడని ఆసక్తి
దులుప దేకి1రాలు, పడజేయు, 2 మేల్కొనజేయు, 3 జాడించు, విదిలించు
దువ్వ n దుమ్ము, ధూళి, పరాగం
దువ్వెన n దువ్వే సాధనం, కంకతిక ఈర్పెన, చిక్కంటి, చిక్కోల, పన్నె, కంకతం, కంకతిక, కేశమార్షకం, ప్రసాధని
దుశ్శీలుడు n చెడు స్వభావం గలవాడు
దుష్కరం(బు) n చేయ కూడనిది, కఠినం, చేయడానికి శక్యం కానిది
దుష్కర్మం n పాపం, చెడ్డపని
దుష్ట పద్దతులు n చెడ్డ పద్ధతులు
దుష్ట సంహార n దుష్టులను సంహరించే వాడా !
దుష్టులు n చెడ్డవారు, దుండగులు
దుష్పరిణామాలు n చెడు మార్పులు
దుష్పలితాలు n చెడు ఫలితాలు
దుసికిల కుండ v జారకుండా
దుస్తులు n 1 వస్త్రం, బట్ట; 2 అందం
దుస్థితి n చెడ్డ స్థితి, నిలుకడలేనిది, దుష్టమైన స్థితిగలది
దుస్సంధి n చెడుకలయిక
దుస్సహం n సహింపరానిది
దుహిత n కుమార్తె, ధనాదులను హరించడంవల్ల తల్లిదండ్రులను విత్తశూన్యులుగా చేసేది
దూకు దేక్రి గంతువేయు; చూదుముకు
దూట బిళ్ళ n అరటి 'దవ్వన గుండ్రంగా తరిగిన బిళ్ళలను దూట అంటారు (రూపాయిని దూటతో పోల్చడం)
దూడ దేవిలేగ, క్రేపు; లేగ, వత్సం, క్రేపు, పడ్డ, పెయ్య, దూడదూత
దూదీ n విత్తుదీసిన పత్తి తూలం
దూయు v లాగు, పైకితీయు, డుయ్యు, డూయు, దుయ్యు
దూరం n దవ్వున ఉంది; n దవ్వు
దూర n పాపాన్ని పోగొట్టేవాడా!
దూరాభారం n చాలా దూరం
దూరాలోచన n దూరపు ఆలోచన; ముందు చూపు?
దూలం n 1 ఇంటి కురుజుల కాదరువుగా నమర్చెడు మాను, ఇంటి గోడల పై అడ్డుగా వేయు పెద్ద కర్ర
దూషణ n తిట్టు, దూషణం, ఆక్షేపించడం, తప్పు, పాపం
దూషించు v నిందించు, దూరు ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడు
దృక్పథం n దృష్టిమార్గం, చూపుమేర
దృఢం n గట్టిది, కఠినం, పట్టుగలది, పూనిక విడువనిది, అశిథిలం, బలంకలది, సూలం,
దృశ్యం n దర్శనీయం, కంటికింపైనది, చూడదగినది
దృష్టాంతం n ఉదాహరణం,
దృష్టి n చూపు, దర్శనం, కన్ను, అభిప్రాయం, జ్ఞానం, ప్రకాశం, దృష్టిదోషం
దృష్టిదోషం n దిష్టి చూ దిష్టి
దృష్టిపథం n చూపుమేర, చూపు ప్రసరించే మార్గం
దెబ్బ దేకొట్టడం, తాడనం, వేటు, నష్టం
దేకిచా n పెద్దవంట పాత్ర, డేకిసా
దేకు v ముడ్డితోరాయు, పాకు, డేకు
దేఖో హింక్రి చూడు
దేబె n దీనుడు చేతకానివాడు, దిక్కుమాలినవాడు, మూర్ణుడు
దేవ మాత్సకం n వాన నీళ్ళ చేత పంటలు పండే దేశం
దేవత n వేలుపు
దేవతారాజు n దేవేంద్రుడు
దేవతార్చన నంవిదేవతను పూజించటం
దేవదాసి n దేవతల పరిచారిక; వేశ్వ, దేవాలయాలలో సేవ చేసే భోగసీ
దేవర v విదేవుడు, ప్రభువు
దేవళం v విగుడి, దేవాలయం
దేవి n రాణి, పార్వతి దవిడి
దేవు v 1 అడుగున ఉన్న నీళ్ళు మొ వాటిని తడివి తడిచిన ఎత్తడం కలచు, వికారం మొ వాటివల్ల కడుపులో ప్పినట్లవు, 2 వెదకు
దేవుడేల పోయి తిరిపెమెత్తె వెండికొండ n కైలాస పర్వతం వెండ్రుకలు
దేవులాడు v వేద కులాడు, వెంపర్లాడు, పెనగులాడు
దేవేరి v విదొరసాని,దేవేరి దేశం
దేశవాళీ n దేశీయమైన
దేశస్తులు n దేశంలోనివారు
దేశాంతరం n అన్యదేశం, మరొక దేశం
దేశాచారాలు n దేశంలో ఆచారాలు, ఆ ప్రదేశంలోని పద్ధతులు
దేశాటన n దేశాలు తిరగడం
దేశికుడు n 1 గురువు, 2 దేశం, తిరిగే బాటసారి
దేశ్యం n దేశానికి తగినది తమ ప్రాంతంలో వ్యవహరించే ప్రజలభాష తెలుగు దేశంలో వ్యవహరించే భాష దేశ్యం
దేహం n శరీరం, మేను
దేహ సౌష్టవం n దేహదార్థ్యం
దేహధూళి n శరీరపు దుమ్ము
దేహయాత్ర n 1 జీవనోపాయం, తిండి, దేహస్థితిని సాగించేది 2 చ్చావు , దేహం నుంచి యమపురి మొ వాటికి పోవడం
దేహశుద్ధి n శరీరాన్ని శుద్ధి చేయడం, కొట్టడం;
దేహి v 1 ఇమ్ము, 2 విశేష దేహం కలవాడు, జీవుడు, ప్రాణి
దైత్యేభ్యుడు n రాక్షసులలో శ్రేష్టుడు
దైన్యం n దీనత్వం, దారిద్యాదుల చేత కలిగే దురవస్థ
దైవం n అదృష్టం, భాగ్యం, దేవత
దైవకృతం n దైవంచే చేయబడినది, స్వాభావికమైనది, సహజమైన
దైవభక్తి n దేవుణ్ణి పూజించడం, దేవుడి పైన భక్తి;
దొంగ n 1చోరుడు, 2 అరటిపువ్వులోపల ఉండే గట్టికాడ, 3 దేవిణ వంచకం, మోసపుచ్చేది
దొంగిలించు v (ఒకరి సొమ్ము) – అపహరించు
దొండ v విబింబిక, తుండికేరి
దొంతరలు n పరంపరలు, వరుసలు
దొంతి n 1 ఒకటి మీద ఒకటిగా ఉంచిన కుండల వరస, వరస, 2 కాళ్ళమీద కూర్చోవడం
దొందు v విజత
దొడ్డవాదు n పెద్ద తగవు
దొడ్డవారు n గొప్పవారు;
దొడ్డి v వి1 పసులు మేసే కంచె, 2 పసుల కొట్టం, 3 పెరడు, 4 మరుగుదొడ్డి
దొప్ప n దొన్నె, తాగడానికి, ఉపయోగించే ఆకుపాత్ర, గొప్ప
దొబు v పడదోయు
దొబ్బ n 1 మాంసఖండం, 2 ముద్ద, 3 లావు
దొమ్మి v వి 1 అంతా కలయబడి చేసే యుద్ధం, 2 అందరు కలయబడడం, 3 సందడి
దొర n రాజు
దొరకొను n పూనుకొను, యత్నించు, ప్రారంభించు
దొరతనము వారు n ప్రభుత్వం, సర్కారు
దొరయు v 1 అంటు, 2 సమానమగు, 3 జరుగు, 4 పోలు, 5 కలుగు
దొరలు దే,క్రి దొర్లు, పడు, కలయు
దొరవులు n కొలనులు, చెరువులు
దొరసాని మివిరాజు భార్య, రాణి
దొరికిన v లభించిన
దొర్లించు v పొరలించు, దొరలేటట్లు చేయు
దొసగు n 1 విఘ్నం, ఆపద, 2 పాపం, 3 దోషం
దోకు v నేలను ఎదురుగా చెక్కు ఇంకు, తగు
దోగాడు (దోగి + ఆడు) దేక్రిశిశువు నేల మీద చేతులు పెట్టి, మోకాళ్ళతో నడవడం, అంబాడు (మాం)
దోచుకొను v దొంగిలించు, అపహరించు
దోనె n చిన్న పడవ, ద్రోణి, నీళ్ళు తోడి పారబోయడానికి ఉపయోగించే సాధనం
దోపిడి n దోచుకోవటం, కొల్ల
దోపు v చొప్పించు, జొనుపు, పూలు పెట్టుకొను, చీరకొంగు మొ బిగించు
దోమతెర n దోమలు ప్రవేశించకుండా మంచం చుట్టు వేసే వలగుడ్డ
దోయి v వి జత, జంట, జోడు, ద్వయి
దోయిలి v విదోసిలి, అంజలి
దోర n ఎజ్ఞపారినది
దోవతి n మగవాని కట్టువస్త్రం, పరిధానం, ధోవతి
దోషం n తప్పు,, భుజం, రాత్రి, పాపం, తప్పు, పొరపాటు, దుష్టత్వం, రాగద్వేష మోహాదికం, ఆవుదూడ, దూషణం, ఖండనం; వికృ దొసగు
దోషైక దృక్కులు n దోషం మాత్రమే చూసేవారు
దోస దే
దోసె v విఅట్టు, భక్ష్య విశేషం, పిండివంట
దోస్తి n స్నేహం, సఖ్యం, దోస్తీ
దోస్సారం n భుజబలం
దోహదం n తోడ్పాటు, ఇచ్చ, ప్రోత్సాహం, చేయూత, ఇచ్చ, వేవిళ్ళు, ఎరువు, చెట్లు మొ వాటికి చేసే స్త్రీల పాద తాడనాదివి
దౌడ n బుగ్గలోపలి భాగం, తాలువు, దవడ
దౌడు v వి పరుగు, దండయాత్ర
దౌర్జన్యం n చెడ్డతనం, దుర్జన భావం
దౌర్భాగ్యం n దురదృష్టం
దౌహిత్రుడు మనుమడు, దుహిత, కొడుకు
ద్యావావృధివులు నంవిమిన్ను మన్నులు, భూమి ఆకాశాలు;
ద్యోతకం n ప్రకాశింపజేసేది, తెలియడం;
ద్యోవీథి n ఆకాశవీధి;
ద్రవం n స్రవించేది, నీళ్ళలాగా పలుచనైన పదార్ధం, రసం, పరుగు, తడి, పరిహాసం, నీరు, గమనం, స్త్రీ పురుష మనోరంజక మగు ఆట, కరగు, కారు, వేగం, కషాయం
ద్రవిణం n ధనం, సొమ్ము , బంగారం , ద్రవించే శీలం ఉన్నది, ధనం, బంగారం, శౌర్యం, బలం
ద్రవ్యం n ధనం, పొంద దగినది, ధనం, ఇత్తడి, పూత, లక్క, కలు, మంద బుద్ధి, శుభమైనది, ఔషధం, పృధివ్యాది నవ ద్రవ్యాలు (పృథివి, అప్పు, తేజం, వాయువు, ఆకాశం, కాలం, దిక్కు, ఆత్మ, మనస్సు) వినయం, వృక్షవికారం, గుణవంతమైనది, అణకువ
ద్రావిదండన(0) n దండించడం, దండుగ విధించడం
ద్రుతం n కరిగినది, వడికలది, పారిపోయినది, త్వరితం, పిల్లి, తేలు, చెట్టు; ప్రత్యయ, ఆగమాత్మకమైన నువర్ణం (నకారంబు ద్రుతంబు బావ్యా) నా చేతన్ వచ్చును, వచ్చున్
ద్రుతప్రకృతికం n ద్రుతం చివరలో
ద్రుపదాత్మజ n ద్రౌపది;
ద్రుపదుడు n పాంచాల దేశపురాజు
ద్రుమం n చెట్టు, వృక్షం, కొమ్మలు ఉన్నది; చెట్టు, వృక్షం, మహీరుహం, శాఖాముఖి, విటపి, పాదపం, తరువు, అనోకహం, కుటం, సాలం, పలాశి, ద్రుమం, ఆగమం, కుజం
ద్రోహం n 1 కీడు తలపు 2 చంపాలనే కోరిక
ద్రోహి n ద్రోహం చేసేవాడు
ద్వాదశి n పక్షంలో పన్నెండో తిథి
ద్వాపరం n 1 ఒక యుగం, కృతవ్రేతాయుగాలు రెండింటి తర్వాత వచ్చే 8,64,000 సంవత్సరాలు పరిమితిగల మూడో యుగం; 2 సందేహం
ద్వారం n వాకిలి, వాకిలి, దేహరంధ్రం, యుక్తి, ప్రవేశం
ద్వారపాలకుడు నంవివాకిటి కావలివాడు, పణిహారి, ద్వారాన్ని కాచేవాడు
ద్విజుడు n బ్రాహ్మణుడు; ముట్టుక ఒక జన్మ, ఉవ నయన సంస్కారం జరగడం రెండవ జన్మ , రెండు జన్మలు కలవాడు, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు
ద్వితీయ n 1 భార్య, పత్నీ, యజ్ఞాధికార ఫలాన్ని గ్రహించే టప్పుడు భర్తతో కూడా తాను రెండవది2 విదియ, రెండవతిధి 3 వ్యాకరణంలో రెండవ విభక్తి, 4 విశేషరెండవ, రెండవది
ద్విపం n ఏనుగు, తొండం, నోరు అనే రెండిటితో తాగేది; చూ దస్తావళం
ద్విపద n రెండు పాదాలు ఉండే రుక్కు, తెలుగులో రెండు పాదాలుగల పద్యం
ద్విరదం n ఏనుగు, రెండు దంతాలు కలది; చూ దంతావళం
ద్విరేఫం తుమ్మెద, రెండు రేఫలు కలది భ్రమరం; తుమ్మెద
ద్విశతం n రెండు వందలు
ద్వీపం n నీటినడిమి దిబ్బ; దీవి, చుట్టూ నీళ్ళున్న భూమి, రెండు పక్కలా నీరున్న భూభాగం
ద్వీపాంతరం n వేరే ద్వీపం
ద్వేషం n శతృత్వం, పగ, ఏవగింపు, అసహ్యం
ధగద్ధగాయమానం n ఎక్కువగా ప్రకాశించేది
ధగధగ n ప్రకాశించడం మొ వాటిలోని అనుకరణం
ధగిడీ n నీచుడయిన వ్యక్తి
ధనం n సంపద, డబ్బు,విత్తనం, ఆవుల మంద, విత్తం, సొమ్ము, గోరూప ధనం, మూలద్రవ్యం, ప్రేమాస్పదమయిన వస్తువు, వడ్డికాక అసలు, సంకలనపు గుర్తు, దోచుకొన్న డబ్బు, ఆస్తి, ధనియం, ధనిష్టా నక్షత్రం అర్థం, ద్రవ్యం, విత్తం, స్వాపతేయం, రిక్తం, ధనం, వస్తువు, హిరణ్యం, పైకం, ద్రవిణం, ద్యుమ్నం, విభవం, రుక్తం, రుంక, రొక్కం, వడిముడి, సొమ్ము
ధనంజయుడు n 1 అర్జునుడు, సకల జనపదాలను జయించి ధనాన్ని తెచ్చినవాడు 2 అగ్ని వ్యు
ధనదుడు n 1 కుబేరుడు, ధనాన్ని ఇచ్చేవాడు, 2 అగ్ని
ధనాఢ్యుడు n ధనంచేత సంపన్నుడు, బాగా డబ్బున్న వ్యక్తి
ధనాభావం n సంపదలేమి
ధనాశారోగం n అధికంగా ధనం కావాలనే జబ్బు
ధనికుడు n 1 ఎక్కువ ధనం కలవాడు, ధనం కలవాడు, మంచివాడు, అప్పులవాడు, కుబేరుడు, వర్తకుడు, భర్త ధనుర్బాణ పాణి
ధనుర్ధరుడు n విలుకాడు, ధనుస్సు ధరించినవాడు
ధనువు n విల్లు; చూ ధనుస్సు ధనుస్సు
ధన్యవాదం n కృతజ్ఞతను సూచిస్తూ పలికే మాట, మేలు చేసిన వారిని ప్రశంసిస్తూ పలికే మాట
ధన్యుడు n కృతార్థుడు, శ్లాఘ్యుడు, సుఖం కలవాడు, సుకృతి, అదృష్టవంతుడు, ధనాన్ని పొందినవాడు, ఇష్టకార్యం నెరవేర్చు కున్నవాడు (కృతార్థుడు) ఔదార్యం కలవాడు
ధన్వంతరి n దేవ వైద్యుడు (ఆయుర్వేదం రచించిన వాడు), దేవ వైద్యుడు, మహేశ్వరుడు, సూర్యుడు, నారింజ చెట్టు ధమని
ధర n భూమి, సమస్తాన్ని ధరించేది, నేల, మావి, మెదడు, కొండ, పత్తి, వెల, స్త్రీల గర్భాశయం, రక్తనాళం, ఎముకలలోని కొవ్వు, తాబేటిరాజు, సంహారం, ఒక ఛందోవృత్తం
ధరణిపతి n రాజు, భూమికి ప్రభువు
ధరణీ సురుడు n బ్రాహ్మణుడు
ధరణీజాతం n చెట్టు, భూమి నుంచి పుట్టినది
ధరాతలం n భూమి; చూ ధర
ధరించు సం క్రి 1 తాల్చు, 2 తొడుగుకొను
ధరిత్రి n నేల, భూమి,విశ్వాన్ని ధరించేది; చూ ధర
ధర్మం n 1 శ్రుతి, స్మృతులలో విహితమైన కృత్యం, లోకాన్ని ధరించేది, లోకాన్ని మంచి స్థితిలో నిలబెట్టేది, పుణ్యం, స్వభావం, న్యాయం, ఆచారం, సామ్యం, అహింస, ఎద్దు, అదృష్టం, వేదోక్తవిధి, నీతి, సత్కార్యం, యజ్ఞం, విల్లు, ఉపనిషత్తు
ధర్మంv శ్వరూపం n సమస్తం, ప్రపంచరూపం
ధర్మకర్త n ధర్మాన్ని ఆచరించే వాడు మరొకరి పక్షాన విశ్వాస పూర్వకంగా ఆస్తి అధీనంలో ఉంచుకొన్న వ్యక్తి, ఆలయాలలో, సత్రాలలోగల కార్య నిర్వహకాధ్యక్షుడు, ధర్మం చేసినవాడు, ధర్మం చేసేవాడు
ధర్మతత్త్వజ్ఞుడు n ధర్మం యొక్క తత్యం తెలిసినవాడు
ధర్మపత్ని n భార్య
ధర్మబోధ n మంచిని / కర్తవ్యాన్ని చెప్పడం
ధర్మరాజు n 1 యుధిష్ఠిరుడు, ధర్మపాలనం చేసేరాజు 2 ఉత్తముడు
ధర్మశాల n ధర్మసత్రం, ధర్మం కోసం అన్నం మొదలైన దానాలకోసం కట్టబడిన ఇల్లు
ధర్మశాస్త్రం n ధర్మాలు చెప్పే శాస్త్రం, మనుస్మృతి మొదలైన గ్రంథాలు
ధర్మాత్ముడు n పుణ్యాత్ముడు
ధర్మాసుపత్రి v విఉచితంగా వైద్యం చేసే వైద్యశాల
ధర్మోపదేశం n ధర్మాలలో ఉండే ఉపదేశం, 2 మనుస్మృతి మొ ధర్మశాస్త్రం
ధవళ n తెల్లని
ధాటి n దాడి,, దండయాత్ర, ముట్టడి వేయుట, ధైర్యం, శక్తి, యుద్దం, దాడి
ధాత n బ్రహ్మ, సమస్తాన్ని ధరించేవాడు, బ్రహ్మ, రక్షించేవాడు, విష్ణువు, శివుడు, ఆత్మ, తాగేవాడు, ఒక సూర్యుడు, ఒక వాయువు
ధాత్రి n భూమి, సర్వాన్ని ధరించేది, నేల, తల్లి, దాది, ధరించేది, ఉసిరిక, ధరింపచేసేది
ధాన్యం n వడ్లు, గోధుమలు మొ వి, ధానానికి (పోషించడానికి) అనుకూలమయినది, ధనియాలు, 4 నూవుగింజల కొలది
ధామం n ఇల్లు, గృహం, స్థానం, ప్రకాశం, పట్టణం, ప్రభావం, సుఖం, అన్నం, ధనం, గుంపు, గురు, ఆకసం,
ధారణ n జ్ఞాపకశక్తి,, ధరించడం, పోషించడం, జ్ఞప్తియందుంచుకోవడం, గాలిని పీల్సి లోపల నిలబెట్టడం, (కుంభకం), అప్పుపడడం, స్థైర్యం, మర్యాద
ధారాధరం n మేఘం, ఖడ్గం, 1 వర్ష ధారలను ధరించేది, 2 ధారను (కత్తి) ధరించేది
ధారాపాతం n ధారగా పడడం
ధారాళంగా n అడు లేనిది, ప్రశస్తమైన ధార కలది
ధార్మికుడు n 1 ధర్మ శాస్త్రం, చదివినవాడు, 2 ధర్మం ఆచరించేవాడు 3 సుకృతి, పుణ్యాత్ముడు, 4 విలుకాడు
ధావళి n వస్త్ర విశేషం
ధిక్కరించు v 1 తిరస్కరించు, 2 బెదిరించు
ధిషణ n బుద్ది, మనీష వాక్కు, స్తోత్రం, గౌరి, భూమి, ఆకసం
ధీజడిమ n బుద్ధిమాంద్యం
ధీమంతుడు n 1 బృహస్పతి, బుద్దిగలవాడు, పండితుడు, బృహస్పతి, బుద్ధిమంతుడు
ధీమతాం n బుద్ధికలవారు, పండితులు
ధీమా n ధైర్యం, విశ్వాసం, నమ్మకం
ధీరలలితుడు n ధీరుడూ కళాసక్తుడూ అయిన నాయకుడు, మృదు చిత్తంతో కళాసక్తి ఉండి సమస్త భోగాలను అనుభవిస్తూన్న నిశ్చింతుడైన నాయకుడు
ధీరశాంతుడు n ధీరుడూ, శాంతుడూ అయిన నాయకుడు
ధీరుడు n ధైర్యం కలవాడు, నిలకడ కలవాడు, దృఢ చిత్తం కలవాడు, గంభీరుడు, పండితుడు, స్వతంత్రుడు, బలం కలవాడు, వినీతుడు, సుశిక్షితుడు, మూర్ఖుడు, సాహసికుడు, బుద్దుడు, చిదాత్ముడు, బలిచక్రవర్తి, సముద్రుడు
ధీరురాలు n ధైర్యంకలస్తీ
ధీరోదాత్తత n ధీరత్వం, ఉదాత్తతను కలిగి ఉండడం
ధీరోదాత్తుడు n ధీరుడూ ఉదాత్తుడూ అయిన నాయకుడు
ధీరోద్దతుడు n ధీరుడూ ఉద్దతుడూ అయిన నాయకుడు
ధీశక్తి n బుద్ధిబలం
ధుని n నది, ఏరు, గాలిచే కదిలేది
ధురంధరులు n కార్యభారం వహించేవాడు, భారాన్ని వహించేవాడు
ధూపం n సుగంధ ద్రవ్యాల నుంచి వచ్చే పొగ, పొగవేసేది, సంతాపం కలిగిం చేది, పొగకు సాధనమైన సుగంధ ద్రవ్యం
ధూమ పత్ర శ్యామలం n పొగాకుతో పచ్చగా ఉండడం
ధూమకేతువు n అగ్ని; • , పొగ చిహ్నంగా గలవాడు,, అగ్ని, ఉత్పాతం, తోకచుక్క
ధూమనౌక n పొగ ఓడ
ధూమశకటం n పొగబండి , రైలుబండి
ధూర్జటి n శివుడు, బరువైన జటలు కలవాడు
ధూర్తుడు n మోసగాడు, అతివినయం చూపి వంచించే వాడు, వంచ కుడు, జూదరి, హింసకుడు, శరుడు, శివుడు
ధూర్వహుడు n భారాన్ని మోసేవాడు
ధూళి n దుమ్ము, పరాగం
ధూసరవర్ణం n బూడిద రంగు; ధూసరం n బూడిదవర్ణం,,
ధృతరాష్ట్రుడు n దుర్యోధనాది కౌరవులకు తండ్రి, పాండు రాజుకు అన్న, దుర్యోధనుని తండ్రి, రాజు, ఒక గంధర్వుడు, సర్ప విశేషం
ధృతి n ధైర్యం; ధైర్యం, కొవ్వు, బింకం, చేగ, చేవ, అదటు, ఉదుటు, గట్టి, దిట్టం, ఉరిది, బిగువు, బెట్టు, బడాయి, బెట్టిదం++
ధృతిమాలి n ధైర్యం నశించి, ధైర్యం చెడి
ధేనువు n ఆవు, దూడలను తాగించేది
ధైర్యం n ధీరత్వం, గంభీరత, ధీరత్వం, నిర్వికార చిత్తత, గంభీరత, అవిధేయత
ధోరణి n 1 రీతి, పద్దతి, 2 పరంపర, పంక్తి
ధ్యానం నంవి1 చింత నం, చింతించడం, మనశ్చాంచల్యం / భగవంతుని తలచే యోగాంగం, 2 పరమాత్మను చింతించడం
ధ్యాస n చింతనం, ఆలోచన
ధ్యేయం n ధ్యానింపదగింది, చింతింప దగినది లక్ష్యం, ధ్యానింప దగినది
ధ్రువం n నిశ్చితం, ఊహ, మర్రిచెట్టు, మోడు, నిశ్చయం, గసిక, మేకు, యజ్ఞపాత్రం, సొరచెట్టు, పర్వతం, గుర్రపుసుడి, బాకు, ఒక నక్షత్రం, గ్రహయోగ విశేషం, ఎడ తెగనిది, తాళ విశేషం, కదలనిది
ధ్వంసం n నాశం,
ధ్వజస్తంభం n పతాక, టెక్కెం, చిహ్నం, గర్వం, మంచం కోడు, తూర్పున ఉండే ఇల్లు, చెట్టు, తాడిచెట్టు
ధ్వని n 1 శబ్దం, చప్పుడు; శబ్దం, నినాదం, నినదం, ధ్యానం, రవం, స్వనం, స్వానం, నిర్దోషం, నిర్జాదం, నాదం, నిస్వానం, నిస్వనం, ఆరవం, ఆరావం, సంరావం, విరావం, రొద, సద్దు, కూత, చప్పుడు, అలికిడి, రవళి, జంతు 2 వ్యంజనా వృత్తిచే తోచే అర్థం 3 వ్యంగ్య ప్రధాన కావ్యం, శబ్దం, వ్యంగ్య ప్రధాన పదం, కావ్య స్వరూపం
ధ్వాంతం n చీకటి, అంధకారం, మార్గం కానరాక దీనిలో మొర పెడతారు
ధ్వానం n ధ్వని