తెలుగు-తెలుగు నిఘంటువు/త
స్వరూపం
| తంటా | n | శ్రమ, కష్టం, చిక్కు, తంట, కలహం, చాడీ, అప్పు, మోసం, అధర్మం |
| తంటాలమారి | n | వంచకుడు |
| తండం | n | గుంపు, సమూహం |
| తండ | n | గాయం , దెబ్బ, కొట్టు, ఆహతి |
| తండ తండులాలు | n | బియ్యం |
| తండా | v | వి 1 లంబాడీ సమూహం ; |
| తండోపతండం | n | అసంఖ్యాకం, అపరిమితం |
| తండ్రి | దేఅబ్బ, జనకుడు, తండిరి తాత, జనకుడు, పిత, అయ్య, అప్ప, నాయన (నాన్న), పితరుడు, గురువు, జన్యుడు | |
| తంతు | v | దేవిప్రయోగం, ఉత్సవ విశేషం, ఉభయార్థ సాధకమైన ఉపాయం; ప్రకృ తంత్రం |
| తంతునాభం | n | సాలె పురుగు, దారం నాభిలో కలది లేదా నాభి నుంచి వచ్చే దారంతో గూడు కట్టుకొనేది; లూత, తంతువాయం, శ్రీ తంతువాయుడు |
| తంతువు | n | నూలుపోగు; సూత్రం, దారం, తామర తూడులోని దారం, వీణతీగ, యజ్ఞ |
| తంతెలు | n | బ మెట్లు, తంత్యలు |
| తంత్రం | n | సిద్దాంతం, హేతువు |
| తంత్రజ్ఞుడు | n | తంత్రం తెలిసిన వాడు, దైవ శక్తులు కలిగిన వ్యక్తి |
| తంత్రి | n | వీణ, తంతి, తంతువులు గలది, తిప్పతీగ, నరం, గాయకుడు, వింటినారి, నాడి, తాడు; ప్రకృ తంతి తంపర |
| తంపర | n | గుంపు, షండం |
| తంబుర | v | (తంతి + బుర్ర) దేవి పాట పాడువారు శ్రుతికోసం ఉంచుకొనే తంత్రీవాద్యం , తంబురా; ప్రకృ తుంబురు |
| తకంతాంత్రికం | n | తంత్రాల్లో విధింపబడింది, తంత్ర సంబంధ మైనది |
| తకరారు | n | వివాదం, పోట్లాట |
| తక్కిడి | v | విమోసం; ప్రకృతస్కర |
| తక్కిన | n | మిగిలిన, ఇతర |
| తక్కువ | n | కొరత, (నీచం) |
| తక్కెడ | v | వితాసు, తరాజు |
| తక్తు | n | సింహాసనం |
| తక్రం | n | పాతిక పాలు నీళ్ళు కలిపిన మజ్జిగ |
| తక్షకుడు | n | వడ్రంగి, ఒక సర్పరాజు, తక్షుడు |
| తక్షణం | n | 1 వెంటనే (తత్ + క్షణం), 2 n చెక్కడం |
| తగటు | n | సరిగ |
| తగదు | v | యుక్తం కాదు, అర్హం కాదు; వ్య తగు |
| తగరం | v | వి తెల్లగా మెత్తగా ఉండే లోహం, గ్రంధి తగరం, నంది వర్ధనం చెట్టు, పొట్టేలు |
| తగరు | v | విపొట్టేలు; ప్రకృ తగర |
| తగవరి (తగవు + అరి) | n | న్యాయాధిపతి, తీర్పు చెప్పేవాడు |
| తగవు | n | జగడం, న్యాయం, తగినది, తీర్పు, మేలు, పద్ధతి, వ్యాజ్యం, పెళ్ళి సమయంలో పెళ్ళి కూతురుకు తల్లిదండ్రు లిచ్చే బహుమానం |
| తగాదా | n | వ్యాజ్యం, తగవు, పేచీ, కలహం, పోట్లాట |
| తగులం | దేవి ఆసక్తి | |
| తగులబడు (తగులన్ + పడు) | v | 1 తగులు, చిక్కు, తవుల బడు, తొలబడు, 2 కాలు, మండు, 3 రా, పో, 4 నిందార్థంలో ఉండనీ |
| తగులబెట్టు | v | 1 తగిలించు, (తగులన్ + పెట్టు) 2 కాల్చు, 3 ఉంచు, పెట్టు |
| తగులు | దే 1 చిక్కు, 2 పట్టు, 3 తాకు 4 అంటు, 5 పొసగు, | |
| తగ్గు | v | 1 తక్కువగు, 2 వెనుదీయు, 3 కృశించు, క్షీణించు |
| తటం | n | 1 ఏటి ఒడ్డు, దరి, నదీ తీరం, వరిమడి, పల్లం, దిగంతం, కొండచరియ, స్థలం, పొలం |
| తట తట | n | గుండె కొట్టుకోవడం లోని అనుకరణ శబ్దం |
| తటపటాయించు | v | సందేహించు, అనుమానపడు |
| తటస్తుడు | n | 1 న్యాయస్తుడు, ఏ మొగ్గూ చూపనివాడు • 2 అటు ఇటు గాకుండా మధ్యస్థంగా ఉండేవాడు, |
| తటస్థించు | v | జరుగు, సంభవించు, తారసపడు, ఎదురుపడు |
| తటాకం | n | చెరువు, తటాకం, జలం చేత కొట్టబడినది |
| తటాలున | v | విణ శీఘ్రంగా, వెంటనే, ఆకస్మికంగా, తటాకం |
| తటి | n | 1 ఏటిఒడ్డు, 2 ప్రదేశం చూ తటం, చోటు |
| తటిత్తు | n | మెరుపు, విద్యుత్తు, తడిత్తు |
| తటిని | n | ఏరు, నది, తటాలు గలది; నది, ఆపగ, నిరరిణి, తరంగిణి, స్రవంతి, తరణి, కూలంకష ఝరి, శైవలినితటుక్కున |
| తట్ట | n | 1 గంప; వెదురు బద్దలు, పేము తీగెలు మొదలయిన వానితో అల్లిన పాత్ర, 2 తక్కెడ తట్ట, 3 పళ్ళెం, తబుకు, భోజనపాత్ర |
| తట్టి | n | 1 కంచం, 2 దేక్రి మెల్లగా చరచి |
| తట్టు | దేఅక్రి 1 తోచు, స్పురించు, 2 కలుగు, 3 చరచు, కొట్టు, 4 దేవి గుర్రం, తట్టువ | |
| తట్టుకొను | v | ఓర్చుకొను, సహించు, నిభాయించు, సమాళించు, సమర్థించుకొను, రక్షించుకొను, సహించుకొను |
| తట్టెడు | n | (తట్ట ప్రమాణంతో) (తట్ట + ఎడు); చూ తట్ట |
| తడ | దేవి, 1 అడ్డు, ఆటంకం, నిరోధం, 2 నిర్మోకం, కూసం, కుబుసం 3 తొట్రుపాటు, కలత తడక (తడిక) | |
| తడప | n | పట్టగా ఉండే నార, చెట్టు బెరడు తడపు |
| తడబడు | v | 1 తొట్రుపడు (తడ+పడు), 2 చలించు |
| తడబాటు | n | 1 తొట్రుబాటు, తబ్బిబ్బు, వ్యత్యాసం, తారుమారు |
| తడయు | v | ఆలస్యం చేయు |
| తడవ | n | సారి, తేప, మారు, ఆవృత్తి, పర్యాయం |
| తడవు | v | 1 నిమురు, చేతితో దువ్వు, 2 ప్రసంగించు, ప్రస్తావించు, అడుగు, ప్రశ్నించు 3 సేపు, కాలం, 4 ఆలస్యం, జాగు |
| తడితడి | n | తేమ తేమ, ఎచ్చిపచ్చి |
| తడిపొడి | n | కొంచెం తడిగా, కొంచెం పొడిగా ఉండేది |
| తడియు | v | ఆర్ధమగు, నాను, చెమ్మగిలు తడుము |
| తడుముకొను | v | నిమురు, తాకు, చీకటి, కంటిజబ్బు, వెలుతురు, / పోవడం వంటి వాటివల్ల దారి, వస్తువులు వెతుక్కొను, వల్లించిన పాఠం వంటి జ్ఞాపకం రాకపోవడంవల్ల ఆఁ, ఊఁ అంటూ ఆలస్యం చేస్తూ చదువు |
| తతంగం | n | వ్యవహారం, ఆర్భాటం, తంతు |
| తతి | n | 1 సమయం , తగినవేళ 2 n సమూహం, గుంపు, శ్రేణి, వరుస |
| తతిమ్మా | v,n | మిగిలిన, శేషించిన తత్కాలం |
| తత్తరం | n | సంభ్రమం, తొట్రుపాటు (త + తజ = తత్తు ) ప్రకృ తంద్రా |
| తత్వజుడు | n | తత్వం తెలిసినవాడు, వేదాంతి, బ్రహ్మజ్ఞుడు, తాత్యికుడు, పరమాత్మ స్వరూపం తెలిసినవాడు జ్ఞాని |
| తత్వవేత్త | n | తత్వం తెలిసినవాడు, స్వభావం తెలిసినవాడు |
| తత్వశాస్త్రం | n | పరమాత్మను గురించి తెలిపే శాస్త్రం |
| తత్సమం | n | దానితో సమమైనది, సంస్కృత ప్రాకృత సమానమై, తెలుగు విభక్తి ప్రత్యయంతో కూడిన పదం |
| తత్సలం | n | దాని ఫలితం |
| తథాగతుడు | n | బుద్ధదేవుడు |
| తథ్యం | n | సత్యం; వీణ సత్యమైనది |
| తదనంతరం | v | విణ దానితర్వాత (తత్ + అనంతరం) పిమ్మట, ఆపైన |
| తదనుగుణంగా | సంఅవ్య దానికి అనుకూలంగా (తత్ + అనుగుణం) | |
| తదారభ్య | n | అది మొదలు (తత్ + ఆరభ్య) |
| తదితరులు (తత్ + ఇతరులు ) | n | బ వారు కాక వేరే వారు |
| తదియ | v | వి కృష్ణ శుక్ల పక్షంలో మూడవ తిథి |
| తదీయ | n | తత్సంబంధమైన తదుపరి |
| తద్దర్మం | n | అదే ధర్మంగా గలది ఇది మూడు కాలాల్లో (వర్తమాన, భూత, భవిష్యత్తులలో) ఉపయోగింప బడుతుంది స్వాభావిక ధర్మాన్ని తెలిపే క్రియాపదం |
| తద్దినం | n | ఆదినం, ఆబ్దిక దినం; శ్రాద్దం, మృతినొందిన నాటి దినం |
| తద్ధనాధికులు (తత్ + ధన +అధికులు) | n | ఆ ధనవంతులు |
| తద్భవం | n | మార్పు చెంది తెలుగులోకి వచ్చిన సంస్కృత లేదా ప్రాకృత పదం |
| తధాస్తు (తథా + అస్తు) ఆశీరర్థకం | నంక్రి అట్లే అగుగాక! అని ఆశీర్వదించే మాట | |
| తనఖా | n | తాకట్టు, గిరివి, పొలంపన్సు, భూమి శిస్తు, జీతం |
| తనయ | n | పుత్రిక, కూతురు |
| తనయుడు | n | పుత్రుడు, కొడుకు |
| తనరు | వైక్రి ఒప్పు, అతిశయించు; వికృ తనరు | |
| తనిఖీ | n | విమర్శ, విచారణ, పరీక్ష, పర్యవేక్షణ, సోదా, సరిచూడటం |
| తనివి | దేవి, తృప్తి, ఆపోక, తనివు | |
| తనుత్రాణం | n | కవచం, దేహాన్ని దెబ్బల నుంచి కాపాడే సాధనం |
| తనువు | n | దేహం, కృశం, సన్ననిది, విరళం, అల్పం, తోలు |
| తనూజుడు | n | తనయుడు, కొడుకు, తనుజుడు, శరీరం నుంచి పుట్టినవాడు |
| తనూభవుడు | నామ , తనుభవుడు, శరీరం నుంచి పుట్టిన వాడు | |
| తన్ను | v | 1 తాచు, పాదతాడనం, 2 వి తన్నులు – దెబ్బలు, 3 కొట్టు, 4 తనను |
| తన్నుకుపోవు | v | ఎగరేసుకు పోవు, బలవంతంగా తీసుకొనిపోవు |
| తన్మయం | n | తత్స్యరూపమైనది, దానిలోలయమైన అంతఃకరణ వృత్తి గలది |
| తన్మయత్వం | n | వాటిలో లయమైన మనస్సుగలవారు |
| తన్మయుడు | n | దానిలో లీనమైన అంతఃకరణ వృత్తి గలవాడు |
| తన్వి | n | స్త్రీ, తనివి, తృప్తి , కృశించిన దేహంగల స్త్రీ |
| తన్సు | v | తృప్తిపరచు, సంతుష్టి పొందించు, తనుపు |
| తపం | n | 1 వేసంగికాలం, గ్రీష్మ ఋతువు, గ్రీష్మఋతువు, తపస్సు, ఒక లోకం, చాంద్రాయణాది పుణ్యకర్మం, శిశిర ఋతువు, మాఘమాసం, 2 తపస్సు, |
| తపన | n | 1 తాపం, బాధు, తపనం, 2 ఉత్సుకత |
| తపనుడు | n | సూర్యుడు, చంద్రుడు, అగ్ని, అగస్త్యుడు |
| తపసి | v | వి 1 తాపసుడు, ఋషి తపస్వి, తబిసి 2 బైరాగి, సాధువు, 3 గారచెట్టు |
| తపస్వి | n | ఋషి |
| తపస్సు | నంవి మనస్సును ఇంద్రియాలను ఏకాగ్రంగా ఉంచడం, దీక్ష, శరీరానికి శ్రమ కలిగించే ఉపవాసం, వర్ణాశ్రమ విదితమైన ధర్మం | |
| తపాలా పెట్టె | n | పోస్టు డబ్బా |
| తపాలా బిళ్ళ | పివి పోస్టు స్టాంపు | |
| తపాలా శాఖలు | n | బ టెలిగ్రాఫ్, పోస్టు శాఖలు |
| తపించు | సం,క్రి 1 ఎండకాయు, తాపం కలిగించు | |
| తపేల | n | వంటగిన్నె, తపెల, |
| తపోధనుడు | n | తపస్వి, ఋషి , తపస్సే ధనంగా గలవాడు |
| తప్తం | n | తపింప చేయబడింది, కాచబడింది |
| తప్పఁదాగు (తప్పన్ + తాగు) | దేకి స్మృతి తప్పేటట్లు మద్యాదులు తాగడం తప్పదొక్కు | |
| తప్ప | n | 1 బీజం లేనిది, 2 అవ్య తక్క, కాక, మినహా |
| తప్పక | అవ్య తదేక దృష్టితో, చలింపక; ‘‘తప్పు ధాతువు వ్యతిరేక కార్థక రూపం | |
| తప్పకుండ (తప్పక + ఉండన్) | v | ‘‘అవ్య తప్పిపోకుండ , ఉన్నదున్నట్లుగా, విధిగా, మానకుండా |
| తప్పజూచు (తప్పన్ + చూచు) | v | కప్పి పుచ్చడం |
| తప్పట్లు | దే చప్పట్లు; (తప్పెటలు తప్పెట్లు తప్పట్లు ?) | |
| తప్పనడుచు | n | విడవడం |
| తప్పబలుకు | n | బొంకడం తప్పటడుగు (తప్పు + అడుగు) |
| తప్పించు | v | తొలగించు, పోగొట్టు |
| తప్పించుక | v | తప్పించుకొని, తొలగి; తప్పించు ఆత్మనేపదం ‘తప్పించుకొని అనేది ‘తప్పించుక’గా మారింది |
| తప్పించుకొను | v | తొలగు, తప్పించుకొను |
| తప్పిదం | n | అపరాధం, నేరం, ‘‘పొరపాటు, ప్రమాదం |
| తప్పిదారి (తప్పి+తారి) | ,అవ్య గురితప్పి, పొరపడి, ఒకవేళ, తప్పిదారు ధాతువుకు ఇది క్యార్థక రూపం (మూలధాతువు కు ప్రయోగం కనబడదు) | |
| తప్పిపోవు | v | 1 దొరకకుండా పోవు, 2 దారి తెలియక పోవు, చెప్పకుండా పోవు, 3 తొలగిపోవడం |
| తప్పు | n | 1 అపరాధం, దోషం, పాపం (సం దంభః), 2 దేక్రి తొలగు, 3 విడిచి, 4 అవశ్యం రాక తప్పదు |
| తప్పుకొను | v | తొలగు, తప్పించుకొను |
| తప్పుదారి | దేవి తప్పుతోవ, అపమార్గం, పెడదోవ, చెడ్డమార్గం | |
| తప్పుపట్టు | v | లోపాన్ని లెక్కించడం, తక్కువ చేయడం |
| తప్పెట్లు | n | చర్మవాద్య విశేషాలు; ప్రకృ తమ్మెట |
| తబల | n | చర్మవాద్యం, తబలా |
| తబిసి | n | తపసి ముని, ఋషి, ప్రకృ తపస్వి |
| తబ్బిబ్బు | n | తడబాటు, తొట్రుపాటు |
| తమం (బు) | n | చీకటి, దుఃఖం, రాహువు, తమో గుణం, దైన్యం, మోహం, చిహ్నం, వక్షస్థలం, ధూళి, పాపం, అజ్ఞానం, నరకం, తమాలం |
| తమకం | దేవి 1 మోహం , అనురాగం, ఉత్సాహం, తహతహ, 2 భయం | |
| తమరు | దేసనా మీరు వ్యాక (నీవుమీరుతమరు) అత్యంత గౌరవం చూపించేటప్పుడు వాడే మధ్యమ పురుష సర్వనామం | |
| తమస్విని | n | రాత్రి; , తమస్సు (చీకటి) కలది; నిశ, నిశీధిని, త్రియామ, క్షప, విభావరి, రజని, శర్వరి, అసుర, శ్యామ, రేయి, రాతిరి, రాత్రి, పసుపు తమాం |
| తమాయించు | హింక్రి స్థిమితపడు, శమించు | |
| తమాషా | n | వేడుక, గమ్మత్తు |
| తములపాకు (తములము + ఆకు) | దేవైవి నాగవల్లీ దళం, తములపుటాకు | |
| తమ్మిచూలి | v | వి బ్రహ్మ,విష్ణువు నాభి కమలంలో పుట్టినవాడు; పరమేష్ఠి, పితామహుడు, హిరణ్య గర్భుడు, స్వయంభువు, చతురాననుడు, ధాత, విరించి, కమలాసనుడు, స్రష్ట, ప్రజాపతి, విధాత, విధి, తాత నలువ |
| తమ్ముడు | n | వెనుకబుట్టినవాడు, అనుజుడు; అనుజుడు, అనుజన్ముడు, కనిష్టుడు, తంబు, జఘన్యజుడు, సహోదరుడు, సోదరుడు |
| తమ్ములం | v | వి తాంబూలం; వీడియం, విడియం, వక్కలాకులు, వీడెం, వీడ్యం, కిళ్ళి, ఆకుమడుపు, పాను |
| తయారు | v,n | సిద్దమైన,n తయారీ, సిద్ధంచేయడం |
| తరం | n | 1 పురుషాంతరం, జీవితకాలం, పురుషాంతరం, తెగ, పద్ధతి, పోలిక, సామ్యం, మానం, శక్యం, దినుసు, వరుస, దాటడం, పడవ, నిప్పు, చెట్టు, వడి, బలం 2 శక్యం, సాధ్యమైన, సాటి అయిన |
| తరంగం | n | అల; ఊర్మి, భంగం, వీచి (క), లహరి, కడలు, |
| తరంగిణి | n | నది, అలలు కలది, తరంగాలు కలది, ఆపగ, నిర్హరిణి, తటిని, స్రవంతి, ధుని, ప్రోతస్విని, తరణి, ఝరి, కూలంకష |
| తరక | n | గింజపట్టని చొప్ప పొల్లు, గింజపట్టని ధాన్యం |
| తరగతి (తరము + గతి) | v | 1 తరాన్ని తెలిపే భాగం 2 పాఠశాలలో ఉండే తరగతులు |
| తరగని | n | తగ్గని, కృశించని, క్షయించని |
| తరచు | n | బాహుళ్యం, ఎక్కువ |
| తరణోపాయం | n | ఈదడం, దాటడం |
| తరతమం | n | ఎక్కువ తక్కువ ఉండేది; హెచ్చుతగ్గులున్న |
| తరతరాలు (తరం + తరం) | n | వంశానుస్యూతం |
| తరఫున | n | పక్షాన |
| తరబడి (తరము +బడి) | దేవి కొలది, ప్రమాణం | |
| తరలు | v | ప్రయాణం అవు, బయలుదేరు |
| తరహా | n | విధం, రీతి, ప్రకాశం |
| తరాజు | n | తాసు, తూచే సాధనం, తరాసు |
| తరించు | v | దాటు, ధన్యమవు |
| తరి | v | వి 1 సమయం , మారు, సారి, మథనం, ఓడ, పొగ, మబ్బు, అవస్థ, భూమి, బట్టల పెట్టె, కవ్వం, సమయం, మథనం, ఓడతడు |
| తరుగు | v | 1 తగు, క్షయించు, 2 ఖండించు, చించు, కోయు n తగ్గుదల, క్షయం |
| తరుణం | n | తగిన సమయం, యుక్త సమయం |
| తరుణ | n | 1 నవీనం, కొత్తది, 2 యావనం |
| తరుణి | n | స్త్రీ, యౌవనంలో గల స్త్రీ, యువతి, పెద్ద జీలకర్ర, గులాబి, పిన్న గోరింట, నేపాళం, ఒక గంధ ద్రవ్యం |
| తరుణుడు | n | యువకుడు |
| తరుము | v | వెంటబడి పరిగెత్తు, వెంటాడు, వెంబడించు |
| తరువు | n | చెట్లు, వృక్షం; మహీరుహం, శాముఖి, విటపి, పాదపం, వృక్షం, అనోకహం, కుటం, ద్రుమం, కుజం |
| తర్కం | n | 1 ఊహ, కారణం, ఒక శాస్త్రం 2 చర్చ, వాదం, ఊహ, కారణం, కోరిక, ఒక శాస్త్రం, అధ్యాహారం, కర్మ, వాదం, ఆశ, సందేహంతో కూడిన ఊహ |
| తర్కించ | నంక్రి చర్చించు, తర్కంచేయు, ఊహించు | |
| తర్జనం | n | చూపుడు వేలు ఆడిస్తూ బెదిరించు |
| తర్జన భర్జనలు | n | సుదీర్ఘ చర్చలు విశేషంగా అన్నీ తర్కించడం |
| తర్జని | n | జుట్టన వ్రేలు, చూపుడు వేలు, దీనితో భయ పెట్టబడతారు |
| తర్జుమా | n | భాషాంతరం, అనువాదం, భాషాంతరీకరణ |
| తర్పణం | n | తృప్తి, పితృయజ్ఞం, దీనితో పితృదేవతలు తృప్తి పొందింపబడతారు |
| తర్పీదు | n | శిక్షణ, నేర్పు, అభ్యాసం, తరబియ్యతు |
| తలం | n | శక్యం, తరం, అడవి, చల్లనిది, గుంట, చాచిన వేళ్ళుగల అరచేయి, చేయి, గోధ (ఉడుము), రూపం, పరుపు, చెంప దెబ్బ, బాణాలు తగుల కుండా చేతికి తొడుక్కొనే ఉడుము తోలు, స్వరూపం, పాతాళం, కిందిభాగం, కాలుసేతులకింది భాగం, తాడిచెట్టు, సమ ప్రదేశం, కత్తిపిడి |
| తలంటు (స్నానం) | v | అభ్యంగానికి తలమీద నూనె రాయడం, అభ్యంగం |
| తల | n | 1 శిరస్సు, 2 శిరసు వెండ్రుకలు |
| తల | దే కాపాడు, తప్పించు | |
| తలకంటకం | n | ఆలోచనకు విరుద్ధం |
| తలకాయ | n | 1 తల, శిరస్సు, 2 పెద్దవాడు, వృద్దుడు, గొప్పవాడు, 3 ఒక తిట్టు |
| తలకిందు | n | 1 అధోముఖం, తల్లకిందు, 2 తారుమారు, తబ్బిబ్బుపడు |
| తలకు మించిన పని | దేవి తన శక్తికంటే ఎక్కువైన పని | |
| తలకెక్కు | v | 1 నెత్తికెక్కు, గర్వం, 2 తలకు ప్రసరించు 3 మనసులో నాటుకోవడం |
| తలకొరవి | n | శవాన్ని తగుల బెట్టేటప్పుడు తలదగ్గర అంటించే నిప్పు |
| తలగడ (తల + కడ) | n | తల కింద పెట్టు కునే దిండు, మెత్త, పడుకొన్నప్పుడు తల ఉంచుకొనే దిక్కు, తలాడు, తలాపి, తలయంపి, తల ఉంచుకునే దిక్కు, తలకింద ఎత్తుగా ఉంచుకునే దిండు, ఉపధానం |
| తలగాచు | v | రక్షించు |
| తలగుడ్డ | దే తలకు చుట్టుకునే వస్త్రం, పాగా గుడ్డు | |
| తలచు | v | ఎంచు, ధ్యానించు, స్మరించు, మంచి చెడ్డలు ఆలోచించు, వివేచించు |
| తలడిల్లు | v | 1 క్షోభపడు, బాధపడు, తల్లడిలు 2 చలించు |
| తలతల తగిలి | v | ప్రయత్నించి |
| తలదాచుకొను | v | దాగి ఉండు, నివసించు |
| తలపంకించి | v | తలూపి |
| తలపండిన | n | అనుభవజ్ఞులైన, వయసు వచ్చిన |
| తలపడు | v | డీకొను తాకు, కలి |
| తలపాగ | n | శిరోవేష్టనం, ఉషీషం, తలగుడ్డ |
| తలపు | n | కోరిక, అభిప్రాయం, ఆలోచన, చింత, తలంపు |
| తలపెట్టు | v | 1 ప్రారంభించు; 2 తలపోయు, చింతించు, సంకల్పించు |
| తలపొలం | n | (ఊరి) పొలిమేర వెంట ఉన్నపొలం, పైచోటు, చివరిభాగం |
| తలపోత (తలపు + పోత) | n | ఊహ, అభిప్రాయం , ఆలోచన |
| తలపోయు (తలపు + పోయు) | దేకి వివేచించు, భావించు | |
| తలబిరుసువాడు | n | మూర్ఖుడు, మొండి పొగరున్నవాడు |
| తలబొప్పికట్టు | v | ఎదురుదెబ్బ తగులు, అనుభవం వచ్చు |
| తలబ్రాలు (తలన్ + ప్రాలు) | n | పెళ్ళిలో వధూవరులు తలమీద పోసుకొనే అక్షతలు,వివాహ కాలంలో కన్యావరులు దోసిళ్ళతో తలలమీద పోసుకొనే బియ్యం |
| తలమానికం | n | శిరోరత్నం, అలంకారం కోసం తలమీద పెట్టుకొనే రత్నం |
| తలమున | n | పూర్తిగా మునిగి, శిరస్నానం |
| తలయెత్తు (తల+ఎత్తు) | v | 1 గౌరవం 2 చెలరేగు, విజృంభించు 3 పొడచూపు, కనబడు |
| తలరాత | n | నొసటి రాత, తలరాత |
| తలర్చు | v | ఒప్పు, ప్రకాశించు ? |
| తలలు దూర్చు | v | ప్రవేశించు, చిక్కుకొను, ఇతరుల విషయంలో జోక్యం చేసుకొను |
| తలలోగు | v | అంగీకరించు, ఒప్పుకొను |
| తలలోని నాలిక | దే అందరితో కలిసి మెలిసి ఉండేది కలుపు గోలు మనిషి | |
| తలవంపు | n | అవమానం, సిగ్గుచేటు |
| తలా ఒక | n | తలకొక, మనిషికొక |
| తలారి | n | ఆ రక్షకుడు, ఆరెకుడు, దండనాధికారి, తలవరి, రాత్రులలో దొంగతనం మొదలైన నేరాలు జరగకుండా గస్తు తిరిగి కావలి కాసే దొరతనపు బంటు |
| తలియ | n | పళ్ళెం, కంచం, తలె |
| తలిర్చు | v | చిగురించు, పల్లవించు |
| తలుపు | దేవి కవాటం, మూయడానికీ, తెరవడానికి అనువుగా ఉండే గుమ్మం మొదలగు ! వాటికి | |
| తలోదరి | n | స్త్రీ, సన్నని నడుముగల (ఆడుది) స్త్రీ |
| తల్లడిల్లు | v | బాధపడు, భయపడు, కలతపడు, శోకించు; చూ తల్లడిల్లు |
| తల్లి | n | 1 జనని, మాత, 2 విణ మొదటిది, పెద్దది, మూలం, 3 n జవరాలు, యువతి |
| తళతళ | n | మెరవడంలోని అనుకరణం మీరు రూపొం |
| తళుకు | n | అధిక ప్రకాశం, తళతళమనే కాంతి |
| తవుడు | n | బియ్యం మీది మెత్తని పొట్టు, తాడు |
| తవ్య | n | రెండు సోలల కొలదిగల మాన విశేషం; రూపా త్రవ్వ |
| తవ్వు | v | 1 భూమ్యాదులను చీరు, ఖననం చేయు, గొచ్చు, పెల్లగించు, 2 బైట పెట్టు, ప్రకటించు, |
| తవ్వోడు | n | ఇసుకను తొలగించే సాధనం (డ్రగ్దరు) |
| తస్కరణ | n | దొంగతనం |
| తస్కరుడు | n | చోరుడు, దొంగ; ' తస్కరి n చోరస్త్రీ |
| తహతహ | n | వేగిరపడటం, ఉత్కంఠ, దుఃఖం |
| తాండవం | n | మగవారి నృత్యం, తండువను ఋషిచే చెప్పబడింది |
| తాండ్ర | n | 1 చాప మొదలైన వాటి మీద రాచి ఎండబెట్టిన తాటిపండ్ల, మామిడిపండ్ల రసం 2 తాడి, విభీతకం తాడి, అక్షం, కరవలం, కలిద్రుమం, భూతావాసం, సంధ్య, విభీ |
| తాంత్రికుడు | n | 1 సిద్ధాంతం తెలిసినవాడు 2 తంత్ర శాస్త్రాలను చక్కగా ఎరిగినవాడు, 3 రాజ్యతంత్రాలు ఎరిగినవాడు |
| తాంబాళం | n | తాంబూలం మొదలైనవి ఉంచుకోవడానికి ఉపయోగపడే ఇత్తడితో చేసిన పెద్ద పళ్ళెం |
| తాంబూలం | n | వక్కలు, సున్నం మొదలైనవి కలిసిన తమలపాకులు, కిళ్ళీ; వీడియం, విడియం, వక్కలాకులు, విడెం, తమ్ములం, వీడెం, వీడ్యం |
| తాకట్టు | n | కుదువ, తనఖా, ఆయకం, (తాకు + కట్టు) |
| తాకు | v | 1 తగులు, అంటు, ముట్టుకొను 2 మార్కొను, కలియు |
| తాకులాడు (తాకులు + ఆడు) | v | కొట్టుకొను, డీకొను |
| తాగు | v | పానం చేయు |
| తాగుబోతు | n | మితం దప్పి మద్యపానం చేసేవాడు |
| తాచు | v | కొట్టు, తన్ను, తాకజేయు, వి పాము, సర్పం, తాచుపాము |
| తాజాతనం | n | కొత్తదనం (తాజాతనం) |
| తాటంకం | n | (దంతం మొదలైన వాటితో చేసిన) చెవికమ్మ |
| తాట | n | 1 చర్మం, 2 చెట్టు పైపట్ట, బరడు (బెరడు) 3 మోసం, 4 దగ్గర |
| తాటించు | వైక్రి కొట్టు | |
| తాటిబెల్లం | n | తాటికల్లు ఉడికించి చేసే ఒక విధమైన బెల్లం |
| తాడనం | n | 1 కొట్టేది, కొట్టడానికి సాధనమైనది, 2 వి కొట్టడం |
| తాడు | n | 1 తాడిచెట్టు, తాళవృక్షం; తాలం, తృణరాజం, తాడు 2 రజువు, పాశం |
| తాత | n | 1 తండ్రి తండ్రి, పితామహుడు, 2 తల్లితండ్రి, మాతామహుడు, 3 వృద్ధులకు గౌరవంగా ఉపయోగించే పదం, 4 బ్రహ్మదేవుడు, 5 n తండ్రి,, దయ, తండ్రి, బ్రహ్మ, అధికుడు, తండ్రి తండ్రి, తల్లితండ్రి |
| తాత్కాలికం | n | అప్పటిది, అప్పుడు మాత్రమే ఉండేది, శాశ్వతం కాని |
| తాత్పర్యం | n | అభిప్రాయం, భావం, తత్పరత (పద్యంబొక్కటి చెప్పి సార్ధముగ తాత్పర్యంబు భాషింపుమా!) |
| తాత్వికం | n | సత్యమైనది, యథార్ధమైనది |
| తాత్వికుడు | సవి సత్యం తెలిసినవాడు, వేదాంతి | |
| తాదాత్మ్యం | n | అభిన్నమై ఉండడం, అభేదం |
| తానం | n | 1 స్నానం, మజ్జనం, 2 స్థానం, తావలం 3 తన్నకారంతో పాడేపాట, 4 విస్తారం, గానాంగ విశేషం |
| తాపం | n | వేడి, బాధ |
| తాప | n | 1 మెట్టు, సోపానం, 2 నిచ్చెన, 3 మణి, రత్నం |
| తాపడం | n | 1 పొదగడం, అమర్చడం, 2 తాగించడం |
| తాపత్రయం | n | ఆకాంక్ష, కోరిక, ఆరాటం (ఇది ఆధ్యాత్మికం, ఆధిభౌతికం, ఆధి దైవికం) |
| తాపసి | n | తపస్వి, ముని, మునిపత్ని, తపస్సు చేసే స్వభావమున్న వ్యక్తి |
| తాపసుడు | n | తపస్వి, ఋషి |
| తాపీగా | ,అవ్య నెమ్మదిగా, తీరికగా, ఆందోళన లే కుండా, హడావుడి లేకుండా | |
| తాపు | n | తన్ను, పాదతాడనం |
| తాబేదారు | n | తక్కువ పనివాడు, ఒకడి కింద పనిచేసేవాడు, కింది ఉద్యోగి, చిన్న ఉద్యోగంలో ఉన్నవాడు తామరతంపర |
| తాబేలు | n | తాబేలు (మాం తాంబేలు); ఆ కూపారం, కచ్చపం, కమఠం, కూర్మం, గుహ్యం, తామేలు, ఢులి, దులి |
| తామరసం | n | పద్మం, తామర, ప్రకృష్టమైన రసం కలది శ్రమ పడినవారిచే ఆస్వాదింప బడినది, ఉదకంలో/నీటిలో ఉండేది, బంగారం, ఉమ్మెత్త, రాగి, తామర |
| తామసం | n | తమోగుణం, చీకటి, ఆలస్యం, తమోగుణం కలది, అంధకారం కలది, అంధకార సంబంధమైనది, గుడ్లగూబ, కోపం, పాము, అజ్ఞానం, ఆలస్యం, దుష్టం, చీకటి |
| తామసుడు | n | దుష్టుడు,, తమోగుణం, నాల్గవ మనువు, రాహుసుతుడు |
| తామ్రం | n | రాగి, ఎరుపుతాయం |
| తాయి | n | తల్లి, మాత తాయిలం |
| తాయెత్తు | n | తల్లి రక్షణార్ధం బిడ్డలకు కట్టే ఎత్తు (తాయి + ఎత్తు) |
| తార | n | నక్షత్రం, దీనితో నావికులు తరిస్తారు చుక్క, వాలి భార్య, బృహస్పతి భార్య, నక్షత్రం, కంటినల్లగుడ్డు, బుద్దుని భార్య, సుగ్రీవుని, భార్య ఓంకారం |
| తారక | n | కంటినల్లగుడు; రూ తారకం, అంధకారాన్ని దాటించేది, కన్ను, నక్షత్రం, కంటి నల్లగుడ్డు, ఓంకారం, కంటిపాప, ముత్యం, తరింప జేసేది, తెప్పతారతమ్యం |
| తారసిల్లు | v | ఎదురుపడు, |
| తారాజువ్వలు | n | బ పైకెగురవేసే ఒక విధమైన బాణా సంచా, తారాచువ్వలు |
| తారాడు | v | 1 అటు ఇటు తిరుగు, 2 వేలాడుతూ నేల పై పొర్లడం, జీరాడడం |
| తారాపథం | n | ఆకాశం |
| తారు | v | 1 రోడ్లు వేసే నల్లటి పదార్థం; 2 సంచరించు, మెలగు, ఇటుఅటు తిరుగు, పోవు, తొలగు, కలుగు, పుట్టు, ప్రసరించు, వ్యాపించు, క్షీణించు, కాంతిహీనమగు, సమీపించు, మెలగు, తిరుగు |
| తారుమారు | n | క్రమంతప్పడం, వ్యత్యాసం |
| తార్కాణం | n | నిదర్శనం, ఉదాహరణ |
| తార్కికుడు | n | తర్కశాస్త్రం తెలిసినవాడు, తర్కశాస్త్రం చదువుతున్నవాడు |
| తాలవయిచు | v | వేలాడజేయు |
| తాలవృంతం | n | వీవన, విసన కర్ర, తాళవృంతం, తాలంలో (కరతలంలో) వృంతం (కాడ) కలది |
| తాలింపు | n | కూర వంటి వాటి తిరుగబోత, పొగపు (పోపు), తిరగమాత |
| తాలువు | n | చౌడ, |
| తాలూకా | n | జిల్లాలో ఒక భాగం, భూమిశిస్తు వసూలు నిమిత్తం కొన్ని గ్రామాలు కలిసి ఏర్పరచిన ప్రాంతం |
| తాల్చు | v | 1 ధరించు, తొలుచు; 2 గ్రహించు, కైకొను 3 పొందు 4 వహించు, మోయు 5 పూను, అవలంబించు, 6 పురి ఎక్కించు, పేను |
| తాల్మి | n | 1 ఓరిమి, క్షమ, తాలిమి 2 ధైర్యం, మనస్థీర్యం |
| తాళం | దే పాడేటప్పుడు చేతులతో చరచేచరపు; తాడిచెట్టు; పాడేటప్పుడు జరిగే కాల పరిమాణం, తాళం వేసే | |
| తాళపత్ర గ్రంథం | n | తాటాకుల పుస్తకం |
| తాళవృక్షం | సం,వి తాడిచెట్టు | |
| తాళి | n | మంగళసూత్రం, పుస్తె, తాళిబొట్టు |
| తాళు | v | సహించు, ఓర్చు, ఆగు, నిదానించు |
| తావక | n | నీ సంబంధమైన |
| తావలం | n | స్థానం, ఆధారం,, ఆధారం, అవకాశం, సామ్యం , స్థిరమైనది, స్థానం, గృహం, రక్షకం |
| తావి | n | పరిమళం, సువాసన |
| తావు | n | తావలం, స్థానం, చోటు |
| తాసిల్దారు | n | రెవెన్యూ అధికారి, వన్ను వసూలు చేసే అధికారి, తహసీల్దారు (హిం) ఆజ్ఞాపించే వాడు |
| తాహతు | n | శక్తి, బలం |
| తిండి | n | భోజనం, ఆహారం |
| తిండిపోతు | n | అతిగా తినే వ్యక్తి |
| తికమక | n | 1 తొట్రుపాటు, తడబాటు |
| తిక్క | దే పిచ్చి, ఉన్మాదం | |
| తిట్టు | v | నిందించు, దూరు, దూషించు |
| తిత్తి | n | తోలుసంచి, (చేతి) సంచి, శరీరంలోపల కోశంగా ఉండే ఊపిరి |
| తిథి | n | 1 పాడ్యమి మొదలైన పది హేను తిధులు, 2 శ్రాద్దదినం; వికృ తేది, |
| తిను | v | భుజించు; మెసవు, మెక్కు, కుడుచు, ఆరగించు, కతుకు, నమలు, సాపడు, భుజించు, లంచం తీసుకొను |
| తినుకు | v | ఊపిరి బిగపట్టి ముక్కు తిను బండారాలు |
| తిన్న | n | 1 మనోజ్ఞం, 2 యుక్తం, 3 స్వస్థం, 4 ఋజువు,, మనోహరం, యుక్తం, ఋజువు, స్వస్థం, సౌమ్యం |
| తిన్నె | n | అరుగు, వేదిక తిప్ప |
| తిప్పకాయ | n | ఆకతాయ, పెంకెవాడు (పెంకెది) తిమింగలం |
| తిమిరం | n | చీకటి, కాముక చిత్తాలను ఆర్ధంగా చేసేది, చీకటి, అంధత్వం, ఇనుప తుప్పు, కంటిరోగం |
| తిమ్మిరి | n | తాకినా, స్పర్శ తెలియని, శరీరస్థితి, గర్వం, పొగరు, స్పర్శజ్ఞానం శూన్యత, గర్వం, మదం, దురద తియ్య |
| తిరం(బు) | v | విn స్థిరం; ప్రకృ స్థిర, అగ్ని, కాలం, కోరిక, వర్షకాలం, మోహం |
| తిరగటి రాయి | n | పిండి వంటి విసిరేరాయి, విసుర్రాయి, తిరగలి రాయి |
| తిరస్కరించు | v | అనాదరం చేయు, తెగడు, నిరాదరించు, నిరాకరించు, అవమానించు |
| తిరస్కారం | n | అనాదరం, తెగడిక అనాదరం, వరిభవం, వరీభావం, తిరస్కాయ, రీడ, అవమానం, అవజ్ఞ, అవహేళనం, అనుక్షణం, అనాదరం, నింద, మజుగు, పాటు, నిర్లక్ష్య భావం తిలతండుల న్యాయం |
| తిలదానం | n | నువ్వులు దానం చేయడం, గ్రహణ కాలంలో బ్రాహ్మణులకు డబ్బుతో పాటు నువ్వుల రూపంలో చేసేదానం |
| తిలలు | n | నువ్వులు; ఇది నిత్య బహువచనాంతం |
| తిలోత్తమ | n | ఒక అప్సరస, సుందర వస్తువులలోని ఒక్కక్క దాని గురించి తొలమాత్రం సౌందర్యం గ్రహించి సృజింపబడినది; విశే సుందోపసుందులనే రాక్షసుల వినాశం కోసం మయునిచేత లోకంలోని అందాల నుంచి నూవుగింజ ప్రమాణంతో అందాలు గ్రహించి చేయబడిన ఒక స్త్రీ |
| తిలోదకం | నంవినువ్వులతో పితృదేవతలకు తర్పణం విడిచే నీళ్ళు; | |
| తివాసీ | v | వి మేలైన చిత్రాసనం; ప్రత్యేకమైన ఉన్నితో నేసిన దళసరి కంబళి, తివాచీ |
| తివురు | v | యత్నించు, పూను, ఇష్టపడు, అంగీకరించు, కుతూహలపడు, త్వరపడు, పూను, మించు, తిరుగు, కోపించు, మోయు, మారుమోగు, ప్రవర్తించు, సిద్ధపడు |
| తీండ్ర | n | వేడిమి, ప్రతాపం, ప్రభావం, కోపం, వేగం, తమి, తీవ్ర వాంఛ, ఉద్వేజనం, లతారూపంలో ఉండే ఒకానొక ఓషధి |
| తీగ | n | లత, వల్లి, తీగె; తీగియ, తీవ, తీవె, తివ్వ, లత, లతిక, వల్లరి, వల్లి; 2 లోహతంత్ర, తంతి 3 స్త్రీలు మెడలో ధరించే ఒక విధమైన బంగారునగ 4 తీగలా సాగే జిగురు పదార్థం |
| తీగుచు | n | లాగు, ఆకర్షించు, తోడు |
| తీట | n | దురద, కండూతి తీక్షణం |
| తీతువు | n | తిత్తిరి పక్షి, టిట్టిభం, తిత్తిరం, లకుముకి పిట్ట, అర్థ పారావతం, ఖరణం |
| తీపి | n | 1 మాధుర్యం, రుచి; ఇచ్చ, అపేక్ష, ప్రేమ |
| తీపు | n | 1 మధురం, రుచ్యం; 2 ఇష్టం, ప్రియం, ప్రేమాస్పదం, 3 మనోజ్ఞత, ఒప్పిదం 4 తీవ్రవేదన, యాతన |
| తీపుల నడలు | దేవి తియ్యటి నడకలు | |
| తీరం | n | తటం, దరి, గట్టు, దరి, తగరం |
| తీరిక సమయం | n | తీరుబడి సమయం, అవకాశం ఉన్న సమయం |
| తీరు | v | 1 నెరవేరు, సిద్ధించు, 2 తెగు, పరిష్కృతమగు, కుదురు, 3 స్వస్థమగు, 4 తగు, యుక్తమగు 5 విధం, 6 వాడియగు, తళుకెక్కు |
| తీరువలు | n | శిస్తు, పన్నులు, విహిత కృత్యాలు తీరువలు తీసేవాని జారా వారి కొద్దిని! ఇవ్వవలసియున్నది |
| తీర్చిదిద్దు | v | చక్కబరుచు, అలంకరించు, సరిచేయు, సవరించు |
| తీర్థం | n | దేవతల నభిషేకించిన జలం;, |
| తీర్థంకరుడు | n | తీర్థాన్ని రచించిన వాడు, బుద్ధుడు, యతి, ముని, విష్ణువు |
| తీర్థయాత్ర | n | తీర్థ సేవకై పోవడం తీరు |
| తీర్మానాలు | n | న్యాయనిర్ణయం |
| తీవ్రం | n | అధికంగా, తీక్షణంగా, వాడిగా, వేడిగా |
| తీవ్రమతి | n | చురుకైన బుద్ధి గలవాడు |
| తుంగం | n | ఎత్తైనది, ఉన్నతం, కొండ, శిఖరం, ఖడ్గమృగం, ముఖ్యం, పొడవైనది, పొన్నచెట్టు, కొబ్బరితుంచడం |
| తుంగ | n | తృణ విశేషం, పరిమళించే దుంవలుగల ఒక జాతి గడ్డి; n జమ్మి; |
| తుంట | n | తునుక, ఖండం, ముక్క;, |
| తుంటరి | n | దుష్టుడు, తుచ్చుడు, తుచ్చురాలు |
| తుండం | n | ఖండం, తునక, ముక్క; n నోరు, ముఖం, తొండం, పక్షిముక్కు, నోరు, గజహస్తం, మొగం, పందిమూతి |
| తుంది) డాకాలు | n | ఎడమకాలు |
| తుకతుక | n | ఉడకడం, కాగడం వంటి వాటిలో ధ్వన్యనుకరణ పదం, ఉడుకు బోతుతనం |
| తుక్కు | n | 1 చెత్త, పనికిరాని వస్తు సముదాయం, తీసేసిన వస్తువులు, 2 తుప్పు |
| తుచ్ఛం | n | నీచం, హీనం |
| తుట్టతుద (తుద + తుద) | దేవి కేవలం, చివర, అన్నిటికన్నా చివర | |
| తుడుచు | v | 1 ఊడ్చు, 2 రాచు 3 కడుగు, 4 నిమురు, తడవు |
| తుద | n | 1 అగ్రం, కొన, చివర; 2 వినాశం, చేటు |
| తుదముట్టు | v | చచ్చు, నశించు, ముగియు |
| తునుమాడు | v | చీల్చి చెండాడు, ఖండించు, తున్నాడు |
| తుపాకి | n | సిపాయిలు మందుగుండు వేసి గట్టించి కాల్చే ఇనుప గొట్టం |
| తుప్ప | n | చిన్నపొద |
| తుప్పు | n | 1 వాడుకలేని ఇనుముకు పట్టే మలిన పదార్థం, 2 ఉమ్మివేసే ధ్వనికి అనుకరణం (తుపుక్కు |
| తుఫాను | n | గాలివాన |
| తుమ్మ | n | ముండ్లు ఉండే ఒక చెట్టు; చండ్ర, వెలితుమ్మ, అరిమేదం, బోధిస్కంధం, లోహిత మారకం |
| తుమ్ము | n | క్షుతం; దేక్రి క్షుతం చేయడం; కాశం, క్షపధువు, క్షపం, క్షుతం, క్షుతి జలుబు చేసినప్పుడుగానీ తదితరంగా గానీ ముక్కులోంచి ఒత్తిడితో వేగంగా ఆకస్మికంగా బయటికి వచ్చేగాలి |
| తుమ్మెద | n | పూల మీద వాలే ఒక రకం కీటకం, తేటి, భృంగం; మధుపత్రం, మధుకరం, మధు లిట్టు, మధుపాళి, ద్విరేఫం, పుష్పలిట్టు, భృంగం, షట్పదం, భ్రమరం, అళ్ళి, ఇందిందిరం, చంచరీకం, రోలంబం, బంభరం, తేటి |
| తురంగం | n | 1 గుర్రం, త్వరగా పోయేది; పూటకం, నీతి, తురగం, అశ్వం, సైంధవం, సప్తి, తేజి, వారువం, మావు, తట్టు (వ), వామి, కత్తళడు, బాబా, జక్కి, తత్తడి, సారంగం, పటాణి, 2 చిత్తం |
| తురాయి | n | పొడవైన కాడతో కట్టిన మాబంతి, తలమీద పెట్టుకొనే అలంకారం |
| తురుము | v | 1 తురుము పీటతో పొడి పొడిచేయు, 2 ముడుచు, 3 కొప్పు, 4 సవరించు |
| తుర్రు | v | వి వేగిరపాటు, గమనంలో అనుకరణ; విణ శీఘం తుల |
| తులకించు | v | ప్రకాశించు, కుతూహలపడు; |
| తులతూగు | v | సాటి అను సమానమగు, పోలు, సరిపోవు |
| తులనాత్మక పరిశీలన | n | పోల్చడం రూపంలో చేసే అధ్యయనం |
| తులువ | n | తుంటరి, దుషుడు, తుచ్చుడు, అవివేకి, తూలునట్టి వాయి (నోరు) కలవాడు |
| తుల్యం | n | సరి, సాటి, సమానం |
| తుళ్ళు | v | 1 గంతులు వేయు, ఎగిరిపడు, త్రుళ్ళు 2 గర్వించు, మదించు 3 విజృంభించు 4 సంతోషించు, ఉప్పొంగు 5 ఎగసిపాటు |
| తుష్టి | n | తృప్తి, సంతోషం |
| తుసికిలపడు | v | నీచదశనొందు |
| తుహినాద్రి | n | మంచుకొండ, హిమాలయం |
| తూగు | v | 1 తూనికపడు, సమమగు, 2 కూరుకు,, ఊగు, నడచు, కూరుకు, చలించు, సమర్థమగు, తూలిపోవు, |
| తూగుటుయ్యేల | n | ఉయ్యాల మంచం, ఉయ్యాల తొట్టె |
| తూచా తప్పకుండు | v | తుచ అనేవి సంస్కృతంలో పాద పూరకాలైన వ్యర్థపదాలు ఇలాంటివి కూడా వదలకుండా, సంపూర్ణంగా అనుసరించి వర్తించడం, చెప్పింది చెప్పినట్లుగా పాటించు, కొంచెమైనా విడవకుండా ఉండు |
| తూచు | v | (తాసులో) తూనిక వేయు, తూగజేయు, తూకించు |
| తూటాలు | n | బ పేలుడు మందు కూరిన గొట్టాలు, ఫిరంగిలోను, తుపాకీలోనూ ఉపయోగించే మందు గుండు |
| తూటు | n | రంధ్రం, చిల్లి |
| తూత్తుకుడై | n | తమిళనాడు రాష్ట్రంలో దక్షిణాదిన ఉన్న పారిశ్రామిక రేవు పట్టణం |
| తూపు | n | అమ్ము, ములికి, బాణం, శరం |
| తూపొడుచు | v | ఉమియు; ఊదు |
| తూప్లీంభావం | n | మౌనం, మాట్లాడ కుండటం తృణం |
| తూము | n | 1 నాలుగు కుంచాల కొలమానం, 2 రంధ్రం, 3 జలదారి, జలనిర్గమద్వారం,, |
| తూర్పు | n | సూర్యుడుదయించే దిక్కు, ప్రాగ్జిశ, తూరుపు |
| తూలు | v | 1 చలించు, కదలు, వణకు, ఊగు, వాలు, ఒరగు, చెదరు, నశించు |
| తృణప్రాయం | n | గడ్డిపోచతో సమానం, అల్పం |
| తృణీకరించు | v | తృణంగా చేయు, అలక్ష్యం చేయు |
| తృణ్య | n | గడ్డిమోపు తృతీయ |
| తృప్తి | n | తనివి, సంతోషం, తర్పణం |
| తృషితుడు | n | 1 దప్పికగొన్నవాడు; ఆశాపరుడు |
| తృష్ణ | n | దాహం, ఆశ, ఇచ్చ, పేరాశ |
| తెంచు | v | తెగజేయు, నరకు, ఖండించు, తెంచు; దారం మొ వాటిని ముక్కలు చేయు |
| తెంపరి | n | 1 సాహసంకలది, శూరుడు, 2 క్రూరం, కఠినం |
| తెకతేర | v | విణ సొంతంగా 1 కడు సులభంగా, మిక్కిలి, అనాయాసంగా; 2 నిష్కారణంగా, వ్యర్థంగా; 3 బొత్తిగా సంబంధంలేనిది; |
| తెగ | దేవి 1 సజాతీయ సమూహం, గుంపు, పక్షం, పక్క, అల్లెత్రాడు, జాతి, రీతి, పొడవు, ఖండితంగా, నిశ్శేషంగా (విధం) | |
| తెగడు | v | నిందించు, తిరస్కరించు, దూషించు, ఆక్షేపించు, పరిహసించు, ఉపేక్షించు, నిర్ణయించు, ఏర్పాటుచేయు, |
| తెగబడు | v | సాహసించు, తెగించు |
| తెగబారెడు | n | గొప్ప, సుదీర్ఘం, చాలా పొడవైన |
| తెగు | v | సాహసించు, ఖండితమగు, భిన్నమగు, చచ్చు, నశించు, ముగియు, ఆగు, విరమించు, మారు, సాహసించు, పరిష్కరింపబడు, సాధ్యమగు, శేషం లేకుండా భాగింపబడు |
| తెచ్చు | v | 1 తీసుకొనివచ్చు, రప్పించు, 2 సంపాదించు |
| తెట్టె(లు)గట్టు | v | రాశిపడు, పోగుపడు |
| తెడ్డు | n | 1 కొయ్య గరిటె; పడవ నడపడానికి ఉపయోగించే సాధన విశేషం , బ్రెడ్డు గరిటె, కంచి, ఖజ, ఖజాక, ఖజిక, చట్టువం, చాటువు, తండువు, తర్థువు, దర్వి |
| తెనిగించు | v | తెలుగు సేయు, ఆంధీకరించు, అనువదించు |
| తెనుగు | n | తెలుగు, ఆంధ్రం |
| తెనుగువాడు | n | ఆంధ్రుడు; తెలుగు వాడు |
| తెన్సు | n | దారి, మార్గం; విధం, రీతి; కుష్ఠురోగం |
| తెప్పరిల్లు | v | (మూర్ఛ, ఆయాసం, దుః ఖం మొ వాటి నుంచి) తేరు, స్వస్థమగు |
| తెప్పలుగ | v | విణ గుంపులు, నీటిలో తేలియాడే బల్లకట్లు, సమృద్ధంగా, అధికంగా, పుష్కలంగా |
| తెప్పున ఎగయడం | ఒక్కసారిగా పైకి లేవడం | |
| తెప్పున్న | v | విణ తటాలున, శీఘ్రంగా |
| తెమలు | v | కదలు; వి ప్రవాహం , తొట్రుపడు, చలించు, జంకు, అసత్యమగు, తిరుగు, మరలు, విరియు, పట్టుదప్పు, జారు, పోవు, నశించు, వెళ్ళు, బయలువేడలు, ముగియు, తెరపి చేసుకొను |
| తెమ్మెర | n | చల్లగాలి; మంద మారుతం; వాయువు, గాలి |
| తెర | n | వెనక ఉన్నవారు కనబడకుండా వేలాడగట్టే మరుగు చీర, తిరస్కరిణి, యవనిక, అల, తరంగం, పరంపర, వరస; అడ్డు వల, పరదా, అపటి, కాండపటం, గండవడం, జవనిక |
| తెరగు | n | విధం, ప్రకారం, పద్ధతి, తేరవు తెఱంగునన్ వలచినట్టు చేయుడు |
| తెరపి | n | అవకాశం, ఎడం, సందు |
| తెరలు | v | నీళ్ళు మొ సలసల కాగిపొంగు, తెరు, తొలగు, బయలుదేరు, కలగు, చచ్చు, సలసల మరుగు, అభిప్రాయభేదం |
| తెరవ | n | స్త్రీ, భార్య (తె జు+వాయి) , రహస్యం దాచనేరనిది |
| తెరువరి (తెరువు+అరి) | n | బాటసారి, పాంథుడు |
| తెరువు | దే మార్గం, దారి, పద్ధతి; ధర్మం, న్యాయం; సాధనం, ఉపాయం; గతి, స్థితి, అవస్థ; జోలి, సంగతి, సంబంధం | |
| తెలిగించు | v | తెనుగు సేయు, ఆంద్రీకరించు, అనువదించు; చూతెనిగించు |
| తెలియు | v | ఎరుగు, గ్రహించు, తెలిసికొను |
| తెలివి | n | జ్ఞానం, ఎరుక, వివేకం, దేహాత్మాది భేద జ్ఞానం, ప్రకాశం, వివేకం, వికాసం, కాంతి, ప్రసన్నత, నీళ్ళుతేరుడం, తెలుపు |
| తెలుగు | n | పశువులను గట్టే పలుపు (తగులు వర్ణ వ్యత్యయ రూపం); క్రి తొలగించు, తొలగు, పోవు |
| తెలుగు | n | ఆంధ్రభాష ఆంధ్రదేశం; |
| తెలుపు | v | ఎరిగించు, చెప్పు,విశదీకరించు, స్పష్టం చేయు, సూచించు, ప్రకటించు, చాటించు, బోధించు, తేర్చు, ఊరడించు, మేలుకొలుపు |
| తెల్ల | n | ధవళీమ, తెల్లకాంతి, ధావళ్యం, తెలుపు, తెల్ల |
| తెల్లబోవు | v | వెలవెలబోవు, నిర్విజ్ఞుడగు |
| తెల్లవారు | v | ఉదయమగు, వేగు తెలివి మందలించు; వీవర్లమగు, పాలిపోవు; నిస్సారమగు, చెడిపోవు |
| తెవులు | n | వ్యాధి, రోగం,తెగులు |
| తేకువ | దేవిధైర్యం, భయం, సందేహం, బింకం, బెట్టు, ఉత్సాహం, దర్పం, గర్వం, మేర, తెలివి, ఓర్పు, వివేకం | |
| తేజం | n | ప్రకాశం, ప్రభావం, పరాక్రమం, తేజస్సు, X నిస్తేజం |
| తేజరిల్లు | వైక్రి ప్రకాశించు, తేరుకొను, తేజరిల్లు, వెలుగు | |
| తేజస్వి | n | తేజస్సు ఉన్నవాడు |
| తేజి | n | గుర్రం, మేలుజాతి గుర్రం |
| తేజోనిధి | n | తేజసే నిధిగా కలవాడు |
| తేజోరుణాక్షి | n | కోపంతో ఎర్రబడ్డ కళ్ళు కలది |
| తేట | n | నిర్మలం, విశదం, ప్రసన్నం, విధం, సౌందర్యం, నీరు, మజ్జిగ, నైర్మల్యం |
| తేటతెల్లం | ద్వవిణమిక్కిలి స్పష్టం | |
| తేటి | దేతుమ్మెద, భ్రమరం | |
| తేడా | n | భేదం, తారతమ్యం , పెచ్చు |
| తేది | v | వి తారీఖు, రోజు,తేదీ |
| తేనె | n | మధువు, జున్ను, తేనియ; క్షాదం, కుసుమాసవం, పవిత్రం, పుష్పరసం, మధువు, |
| తేప | n | తడవ, తూర, మారు; తెప్ప |
| తేమ | v | వితడి, చెమ్మగిలు, తెమ్మ, ఆర్ధత |
| తేయాకు | n | 'తే' అనే ఒక దినుసు ఆకు, టీ తయారు చేయడానికి ఉపయోగించే ఆకు |
| తేర | n | సులభంగా, అనాయాసంగా, తేట, సంబంధంలేనిది, వ్యర్థంగా, వేరే, పూర్ణత, చులకన |
| తేరు | n | రథం, బండి; |
| తేలవేయు | దే తేలగిలచేయు | |
| తేలిక | n | లముత్వం, లఘువు, చులకన |
| తేలు | v | నీళ్ళలో మునుగక పైన తిరుగు, గాలిలో ఎగురు, దేవివృశ్చికం అవి, కర్కోటకం, కాలిక, కుశీలం, ఖర్జూరం, ద్రుణం, ద్రూణం, ద్రుణి, ద్రోణి, పృదోకువు, విషపుచ్చం, వలపురుగు, మండ్రగబ్బ, నీటి పై సంచరించు, నీళ్ళలో క్రోడించు, స్నానం చేయు, మోసపోవు, ఆనందించు, మైమరచు, పొడచూపు, వృశ్చికం; వ్య మునుగు |
| తైతక్కలాడు | v | నాట్యంచేయు, నృత్యం చేయు, ఎగురు |
| తైపు | n | ఉద్గారం, త్రేనుపు తేనుపు (బాగా అన్నంతిన్న తరవాత గానీ, అజీర్తివల్ల గానీ కడుపులోంచి గాలితోపాటు పైకి వచ్చే ఒక విధమైన ధ్వని) |
| తైలం | n | నూనె, తిలల నుంచి తీసినది తైలం; నువ్వుల నూనె, లంచం |
| తొంగిళ్ళు | n | నూనెబొట్లు; పొత్తులు, మెత్తని సన్నని పాత గుడ్డలు, బట్ట పింజెలు; చంటి పిల్లలకు నీళ్ళు పోసేప్పుడు పడుకోబెట్టడానికి చాచి దగ్గరగా ఉంచిన తొడలు |
| తొంగున్నాను | v | పడుకొను, శయనించు |
| తొంటి చేయి | n | ఈచవోయిన చేయి |
| తొండ | n | సరటం, కృకలాసం, ఒక జాతి సరీసృపం, ఊసరవెల్లి జాతి జంతువు 2 దాసుడు, భక్తుడు తొండం |
| తొందరపని | n | సంభ్రమంతో కూడిన పని |
| తొంభై | v | ‘‘దేస తొమ్మిది పదులు, అనేకసార్లు, తొంబది |
| తొక్క | v | చెట్టు మొదలైన వాటితోలు, చర్మం, తోలు |
| తొక్కటం | n | ఒత్తుడు, మర్ధనం |
| తొక్కు | v | 1 నడచు, ప్రవర్తించు, అడుగు పెట్టు, తొక్కు; 2 అదుము, అణచు; 3 దంచు, 4 పచ్చడి (చింత కాయలు, మిరపకాయలు, మొ వి రోట్లో వేసి తొక్కిన ముద్ద); 5 విణ అవ్యక్తమధురమైన |
| తొక్కుడు బిళ్ళ | n | పిల్లలు ఆడుకొనే ఒక ఆట , తొక్కుడు బిళ్ళ |
| తొట్టి | n | నోరు వెడలూ అడుగు సన్నం అయిన గంపలాంటి పాత్ర, గంగాళం, నీటితొట్టి |
| తొట్టు | v | మొదలుకొను, వ్యాపించు, స్రవించు, పారు, ఎగదట్టు, నిండు, చేరు, కలుగు, నాటు, గుచ్చుకొను, మునుగు, ఎదిరించు |
| తొట్రుపాటు | n | తడబాటు, తొందర |
| తొడగు | v | ఉపక్రమించు, పూను, ప్రారంభించు, అభ్యసించు, యత్నించు, మొదలుకొను, పూను కొను |
| తొడతొక్కిడి | n | ఎక్కువ సమ్మర్ధం |
| తొడరు | v | పూను, ఎదిరించు, ధిక్కరించు, మించు, అవలంబించు, ధరించు, పట్టుకొను, పొందు, అనుసరించు |
| తొడవు | n | ఆభరణం, తొడుగు |
| తొడిమ | n | ఆకు, పూవు మొ వాటి చివర ఉండే కాడ, వృంతం |
| తొడుగు | v | సంధించు, కూర్చు, ప్రయోగించు, ధరించు, ఆభరణం, కవచం, గవుసెన, పైపొర, బాణం |
| తొణకు | v | తొలకు, తొట్రుపడు, తొనకు |
| తొణికిసలాడు | v | తొలకు, చలించు, తొణికిసలాడు |
| తొన | n | తొల, భాగాలు; విణ రక్షకం |
| తొప్ప | n | అధికం, మిక్కిలి |
| తొప్పదోగు (తొవన్+తోగు) | v | మిక్కిలి మునుగు, మిగుల మునుగు |
| తొమ్మిది | దేస ఎనిమిదియు నొకటి నవమం, రత్నం, బ్రహ్మ, కమలాసనుడు, విధి, గ్రహం, ఖండం, రంధ్రం, భావం, ఆబ్దికం | |
| తొరగు | v | 1 పడు, రాలు, కారు, స్రవించు, కురియు, వర్షించు, ప్రవహించు, వశమగు |
| తొర్ర | ఏవిరంధ్రం, కోటరం, వృక్ష విశేషం, కోటరం, చెట్టులోనుండు పెద్ద రంధ్రం | |
| తొర్రి | n | రంధ్రం; ముందటి పండ్లు లేని నోరు |
| తొలకరి | ద్వవి (చైత్ర వైశాఖాల్లో కురిసే) వాన; వర్షర్తువు, చైత్రవైశాఖాల్లో కురిసే వర్షం | |
| తొలగించు | v | తొలగేటట్లు చేయు, పోగొట్టు |
| తొలగు | v | ఒదుగు, తప్పుకొను, విడుచు, త్వజించు |
| తొలచు | v | కడుగు, పోగొట్టు |
| తొలి | దే మున్ను, పూర్వం | |
| తొలిదశ | n | మొదటి అవస్థ |
| తొలిపలుకు | n | ముందు మాట; వేదం |
| తొలుచు | v | బోలుగా చేయు, రంధ్రంచేయు, ఖండించు, నాటు |
| తొలుత | n | మొదటి, మున్ను, పూర్వం, తొల్తా |
| తొలుదొల్ల (తొలుత+తొలుత) | n | మొట్టమొదలు, మొట్టమొదట |
| తొవ | n | కలువ, తొగ తొస్సి |
| తోక | n | జంతువులకు వీపు నుంచి కింది వైపు వేలాడే పొడవైన శరీరభాగం, పశు, పక్ష్యాదుల పుచ్చం, వాలం |
| త్యజించు | v | వదలి పెట్టు, విడుచు |
| త్యాగం | n | ఈవి; విడుపు |
| త్యాగమయి | n | త్యాగ లక్షణాలున్న |
| త్రచ్చు | v | ఖండించు, చిలుకు |
| త్రపు | n | ఉద్దారం, త్రేనుపు తేనుపు, ఆహారం తీసుకున్న తరవాత పొట్టలో నుంచి గాలితోపాటు పైకి వచ్చు ధ్వని |
| త్రయోదశి | n | నెలలోని రెండు పక్షాల్లో పదమూడో తిథి త్రాగు |
| త్రాచు | n | నాగుపాము, పాము, తాచు |
| త్రాచుపాము | n | నాగుబాము |
| త్రాసు | n | తక్కెడ, తూచే సాధనం, తరాజు, తరాసు |
| త్రికం | n | మూడింటి సమూహం, వ్యాకరణం సంప్రదాయం ప్రకారం ఆ,ఈ,ఏలనే మూడక్షరాలను త్రికం అంటారు |
| త్రికరణ శుద్ధి | n | మనస్సు, వాక్కు, కర్మ అనే మూడింటిలో నిజాయితీ ఉండటం |
| త్రికరణాలు | n | మూడు సాధనాలు (మనస్సు, వాక్కు, శరీరం) |
| త్రిదళం | n | బిల్వం, మారేడు, మూడు దళాలు కలది |
| త్రిదశుడు | n | వేల్పు, దేవత |
| త్రిదశేంద్రుడు | n | ఇంద్రుడు, త్రిదశులకు అంటే దేవతలకు రాజు |
| త్రినేత్రుడు | n | ముక్కంటి, శివుడు |
| త్రిళ్ళు | v | పడు, రాలు, కూలు |
| త్రోసిపుచ్చు | v | తిరస్కరించు, కాదను |
| త్వచ్చిర | v,n | త్వత్+శిర = నీతల మీద |
| త్వచ్ఛిర | n | త్వత్+శిర = నీతల మీద |
| త్వత్పాద | n | త్వత్+పాద = నీకాలు అనే |
| త్వత్పాద | v,n | త్వత్+పాద = నీకాలు అనే |
| త్వత్సారం, త్వచిసారం, కర్మారం, తృఫధ్వజం, శతపర్వం, యవఫలం, మస్కరం, తేజనం, కంటకం వెధవ | v | వి,nపనికిమాలిన, ఒక తిట్టు |
| త్వదీయ | సంసర్వ నీ యొక్క | |
| త్వరిత గతి | n | వేగంగా, తొందరగా |
| త్వరిత గతి | n | వేగంగా, తొందరగా, మూడు మొనలుగల బల్లెం |
| త్వాష్టం, ద్విదైవత్వం, విశాఖభం విశారదుడు | n | బుద్ధిమంతుడు, |