Jump to content

తెలుగు-తెలుగు నిఘంటువు/ట-ఠ

Wikibooks నుండి
టింగు n. గడియారంలోని లోలకం చేసే ధ్వనికి అనుకరణం
టంకం n. 1 నాణెం, టంకం పుల్ల, టంకవాటు, టంకసాల, టంకసాల వాటు 2 నిష్కం (పదహారు డబ్బుల బంగారు నాణెం ) దీనారం
టకటక n. 1 చలనం, 2 నడవడం మొదలైన వాటిలోని ధ్వనికి అనుకరణం, 3 తొందరగా
టక్కరి విణ (టక్కు + అరి) మాయావి మోసకాడు, మోసకర్తె, వంచకుడు రూ తక్కరి
టక్కున వెంటనే, టకీమని, టపీమని
టపటప n. టపటప అనే చప్పుడుతో (ధ్వన్యనుకరణపదం)
టపా n. (పోస్టు) అంచె, ఉత్తరాలు, టపాలు;
టపాకాయ వి బాణ సంచా విశేషం
టమకు టమకు 1 కుండ మొదలైనవి దొర్లేటప్పుడు వచ్చే ధ్వని; ధ్వన్యను కరణ పదం, చర్మవాద్యం
టమాటా n. (సీమబుడ్డ బూసర కాయ, మొలక్కాయ, కర్పూరపు వంకాయ, సీమతక్కాళి (బౌణ్యం); సీమతక్కాళిచెట్టు (శంవాడి)
టముకు వి (డమడమమోగే) వాద్య విశేషం
టరం n. 1 అవధి, 2 నియమిత కాలం
టవలు ఇంతుండుగుడ్డ, తువాలు
ట్రక్కు n. సరకుల రవాణా బండి
టాంగా n. గుర్రబ్బండి
టాంటాం విచాటింపు, బహుళ ప్రచారం
టాక్సి n. అద్దె కారు
టాటా n. సెలవు తీసుకోవడానికి సెలవు తీసికొని వెళ్ళేటప్పుడు చెప్పేవాడు సలాము పోయివస్తాను అని చెప్పడం
టాపు n. పైభాగం
టిక్కెట్టు n. రైలు అధికారులు ప్రయాణికులకు ఇచ్చే కేవు చీటి
టిఫిన్ n. ఫలాహారం
టిష్యూలు n. జరీబట్టలు (బ్రౌణ్యం)
టీ ఇం వితేయాకు పానీయం
టీక n. వ్యాఖ్య, వివరణ
టీకా వి స్పోటకం పొడిపించడం
టీచరు n. గురువు, ఉపాధ్యాయుడు, బోధకుడు, చదువు చెప్పువాడు, శిక్షకుడు, ఆచార్యుడు నేర్పేవాడు, శిక్ష చెప్పేవాడు
టీవి (టెలివిజన్) n. దూరదర్శని
టూకి విసంగ్రహం
టెంక సవి1 మామిడికాయలోని విత్తు
టెంకాయ వి కొబ్బరికాయ, నారికేళ ఫలం టెంకాయ తెంకాయ = (టెంక + కాయ, తెంకంకాయ్ త) నారికేళం
టెక్నికల్ ట్రెయినింగ్ n. సాంకేతిక శిక్షణ
టెక్కు వి 1 యౌవనం, అందం మొదలైన వాటివల్ల కలిగే గర్వం
టెక్స్ట్ బుక్ n. మూల గ్రంథం, పాఠ్యపుస్తకం
టెక్స్టయిల్ విధానం n. నేత సంబంధమయిన విధానం
టెన్షన్ n. ఉద్రిక్తత, ఒత్తిడి
టెలిగ్రాం n. తంతివార్త
టెలి ప్రింటర్ n. దూర ముద్రణ యంత్రం
టెలిఫోటో చిత్రాలు n. దూరయంత్రం వల్ల తీసిన ఛాయా చిత్రాలు
టెలిఫోన్ n. దూర శ్రవణ యంత్రం
టేకు n. ఒక చెట్టు పేరు; ఒక విధమైన కలప
టేప్ రికార్డర్ n. మాటలను పాటలను క్యాసెట్లో రికార్డు చేసుకోవడానికి, వినడానికి ఉపయోగించే సాధనం
టేబిల్ n. బల్ల
టైపు యంత్రం n. టైపు మిషన్ అచ్చు యంత్రం
టైము n. 1 కాలం, వేళ, సమయం 2 (Time Table) టైంటేబుల్ కార్య నిర్వహణాక్రమాన్ని తెలిపే పట్టీ, సమయానుసారిణి
టైరు n. సైకిల్, స్కూటర్, మోటర్, బస్సు, లారీ మొ వాహనాల చక్రాలకు చుట్టూ వేసే పరికరం
టైలరు n. దర్జీ, బట్టలు కుట్టేవాడు
టోపీ n. 1 గుడ్డతో చేసిన కిరీటం
టౌను n. నగరం, పట్టణం, ఊరు, గ్రామం
ట్యూషన్ n. ప్రైవేటుగా చదువు చెప్పడం
ట్రస్టు బోర్డు n. ధర్మ సంస్థ
ట్రాక్ ఇంవిపరుగెత్తటానికేర్పరచిన బాట
ట్రాక్టరు n. నాగలి (సరుకులు) లాగే యంత్రం
ట్రాపికల్ మెడిసిన్ n. ఉష్ణ రోగాల
ట్రం n. ఒక విధమైన బండి
ట్రాం పట్టా n. ఇనుప కమ్మీలు వేసిన బండిదారి
ట్రిప్పు n. పర్యటన, యాత్ర
ట్రిప్పుషీటు n. పర్యటన పత్రం
ట్రోఫీ n. గెలుపుకు చిహ్నంగా ఇచ్చే పత్రం లేదా పతకం