Jump to content

తెలుగు-తెలుగు నిఘంటువు/జ-ఝ

Wikibooks నుండి
జంకు n. భయం, సంకోచం; భీతి, శంక
జంతువు n. ప్రాణం కలది; పర్యా చతుష్పదం, పశువు, మెకం, ప్రాణి
జంతుజాలం n. ఒక కాలంలోకాని, ఒక ప్రదేశంలో కాని ఉన్న జంతువుల మొత్తం
జంబుకం n. నక్క, ఒకద్వీపం; భీరుకం, భూరిమాయం
జగతి n. లోకం, జగత్తు, జగం
జగం n. ప్రపంచం; ఉర్వి, కుంభిని, మేదిని
జఠరం n. కడుపు; ఉదరం, డొక్క, పొట్ట
జడియు n. భయపడు, చెదరిపడు
జత n. రెండు, జోడు; జంట, జమట, జవళి, స్నేహం, జట్టు
జనకుడు n. తండ్రి, సీత తండ్రి; అప్ప, అబ్బ, అయ్య, జనయిత, షిత
జనత n. జన సమూహం ; జనం, ప్రజ
జననం n. పుట్టుక, వంశం; ఆవిర్భావం, జన్మం, పుట్టు
జనని n. తల్లి; అప్ప, అమ్మ, జనయిత్రి, మాత
జనవదం n. గ్రామం, దేశం,జానపదం; పల్లె, పల్లెటూరు
జనపదుడు n. పల్లెటూరివాడు; జనుడ, పారగతుడు
జనం n. ప్రజ; జనత, లోకులు
జనశ్రుతి n. నానుడి
జనసాంద్రత n. ఒక నిర్దిష్టమైన వైశాల్యంలో సగటున ఉన్న జనసంఖ్య
జనార్ధనుడు n. విష్ణువు; అంబుజనాభుడు, అంబుజోదరుడు, అజయుడు
జనాలు n. ప్రజలు
జనావళి n. ప్రజల సమూహం
జన్మభూమి n. పుట్టిన ఊరు, దేశం, స్థలం
జపం n. మంత్రావృత్తి, వేదాధ్యయనం
జపశాల n. ప్రార్థనా మందిరం, మజీదు
జప్తు n. నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వం ఆజ్ఞపై ఆస్తిని స్వాధీనం చేసుకోవడం; బకాయి సొమ్మును న్యాయస్థానం ద్వారా అధికారికంగా రాబట్టుకోవడం
జబ్బు విణ జ్వరం, సుస్తీ, రోగం; అనారోగ్యం, అస్వస్థం
జమీందారులు n. పెద్ద భూస్వాములు, కొన్ని గ్రామాల భూములకు అధికారి, సంపన్నుడు, ఆస్తిపరుడు
జయ n. పార్వతి, పార్వతి చెలి, సంవత్సరాలలో ఒకటి, మహాభారతం; అచలజ, అద్రీజ, ఈశాని
జయప్రదం n. విజయం
జయంతి n. జన్మదినోత్సవం, ఇంద్రుని కుమార్తె; కల్యాణి, కాత్యాయని
జయం n. గెలుపు, నెగ్గడం, కార్యసిద్ధి, సాఫల్యం; విజయం, విజితి
జలచరం n. నీళ్ళలో తిరిగే జంతువు; నీరుద్రిమ్మరి, వారి చరం
జలధి n. సముద్రం, కోటికోట్ల సంఖ్య; అంబుధి, ఉదధి, కడలి
జలపాతం n. కొండ కాలువ, సెలయేరు, కొండ మీద నుండి నిటారుగా కిందికి తీవ్ర వేగంతో ప్రవహించే నీరు
జలమయం n. నీటితో కూడినది
జలం n. నీళ్ళు; అంబువు, తోయం, ధరుణం
జల విద్యుచ్ఛక్తి n. నీరు ఎత్తునుంచి లోతుకు పడేటప్పుడు ఉత్పత్తి అయ్యే శక్తి నుండి సేకరించే విద్యుచ్ఛక్తి
జలాశయం n. తటాకం
జలబు వైవిశైత్యం, సర్ది; పడి సెం, రొంప, సీతి
జల్లు వైవివాన, వాన కురిసేటపుడు చెదిరిపడే నీళ్ళు, భయం మొ వాటివల్ల మనస్సు, శరీరం కంపించడాన్ని సూచించేమాట; తూర, సోన
జల్లెడ వైవిజల్లి సాధనం; సంచాలనీ
జవం n. వేగం; శీఘం, సత్వరం, పరుగు
జవాను n. బంటు, బలశాలి
జవాబు n. ప్రత్యుత్తరం; ప్రత్యుక్తి, సమాధానం
జాగారం వైవిజాగరం, రాత్రి మేల్కొని ఉండటం; సంజాగరః; ప్రతి జాగరం, ప్రతిబోధకం
జాగరూకత n. మేల్కొని ఉండు
జాగా n. చోటు, స్థలం, ప్రదేశం
జాగిలం n. పెద్ద వేటకుక్క; కంకశాయం, కృతజ్ఞం
జాడ n. గుర్తు, దోవ, విధం; ఆచూకి, ఆనవాలు
జాతక కథలు n. బుద్దుని గురించి ఇతర బోధిసత్వుల గురించి కథల రూపంలో తెలిపే బౌద్ధగ్రంథం
జాతర వైవితిరునాళ్ళు, ఉత్సవం, గ్రామ దేవత శక్త్యుత్సవం; సంయాత్రా
జానకి n. జనకుని కూతురు, సీత; అయోనిజ, ధరణిజ, మైథిలి, వైదేహి
జాబిలి n. చందమామ,జాబిల్లి; చందురుడు, చుక్కలరాజు
జాబితా పివిపట్టీ
జాబు n. లేఖ, కమ్మ, ఉత్తరం; వాచిక పత్రం, శ్రీముఖం
జామాత n. అల్లుడు; అల్లుకుజ్జ, అళియ
జాము వైవియామ, ఏడున్నర, గడియల కాలం, సంయామం
జాలం n. ఆలస్యం, వల, కిటికీ
జాలి విమనఃభేదం, విచారం; ఆర్తి, క్లేశం, భేదం
జాలువారు క్రిప్రవహించు; పరుగు, పరవళ్ళు దుముకు
జాస్తి విణ అధికం
జాహ్నవి n. గంగ; త్రిపథగ, త్రివేణి, భాగీరథి
జిజ్ఞాస n. తెలుసుకోవాలనే కోరిక; ‘‘ జిజ్ఞాసువు, జిహాసువు, దిదృక్ష
జితేంద్రియుడు n. ఇంద్రియాలను జయించినవాడు; నిగ్రహ చిత్తుడు, సంయమనుడు, జితాత్ముడు
జిల్లా n. మండలం, భారతదేశంలో వరిపాలనా సదుపాయం కోసం విభజించిన భూభాగం
జిలుగు వైవిసూక్ష్మ వస్త్రం, సన్నబట్ట, గొలుసుకటరాత
జిహ్వ n. నాలుక, మాట, జ్వాల; కాకువు, నాలిక, రసన, లలన
జీతగాడు విణ జీతం తీసుకొని పనిచేసేవాడు; ఊడి గీడు, కిర్మకరుడు, గులాం, సేవ కుడు కూలివాడు, నౌకరు పనివాడు, పాలేరు
జీతం వైవివేతనం, ఉద్యోగం చేసే వ్యక్తికి ఇచ్చే సొమ్ము ; సం జీవితమ్; కూలి, భృతి
జీమూతములు n. మేఘాలు
జీవకోటి n. ప్రాణుల సమూహం
జీవనం n. బ్రతుకు, బతుకు తెరువు, ప్రాణం; జీవిక, సాగుపాటు
జీవాత్మ n. దేహి, జీవుడు; చేతనుడు, జీవకుడు
జీవి n. జీవించేవాడు, ప్రాణి
జూదం వైవిపందెంవేసి ఆడే ఆట, మోసం రూజూదం; సంద్యూతమ్, పాచికలాట, పాళి
జేగంట వైవిజయఘంట, జయించి నపుడు వాయించే పెద్ద ఘంట
జోక్యం n. సంబంధం, ప్రవేశం
జోడు వైవిజత, సమానం, దంపతులు ; అంటు, అనుగుదనం, కళ్ళద్దాల జత
జోల n. బిడ్డలను నిద్రపుచ్చడానికి పాడే పాట,జోవ
జోలి n. సంబంధం, వృత్తాంతం; పొత్తు, లంకె
జోహారు n. నమస్కారం; అభివందనం, అభివాదం, నివాళి
జ్యోత్స్న n. వెన్నెల రాత్రి, వెలుగు, కాంతి; కౌముది, చంద్రిక
జ్వలన శిఖలు n. అగ్నిజ్వాలలు
ఝంకారం n. తుమ్మెదల రొద;
ఝుంకృతి అల్లెతాటి చప్పుడు
ఝుంఝా మారుతం n. వానగాడ్పు, పెనుగాలి; కసరు, తుపాను
ఝడిపించు క్రి భయపెట్టు,జడిపించు
ఝూము n. పొద్దు, జాము
ఝర(0) n. సెలయేరు, ఒక రకం తోట కూర, రురి; కొండకాలువ, వంక, వాగు
ఝషం n. చేప