తెలుగు-తెలుగు నిఘంటువు/గ-ఘ
స్వరూపం
| చంచలం | n. గాలి, చలించేది; చాపలం, చాలం |
| చంచల | n. లక్ష్మి, మెరుపు; చపల, తటిత్తు |
| చంటిది | n. చిన్నపిల్ల, పసిపిల్ల, చనుబాలుతాగే పిల్ల |
| చండాలుడు | n. మాలవాడు; అంటరానివాడు, హరిజనుడు |
| చండి | n. పార్వతి, కోపంఉన్న స్త్రీ రూచండిక, అంబ, అంబిక, కాళి |
| చందనం | n. గంధం; సిరిగంధం, హరిచందనం |
| చంద్ర శేఖరుడు | n. శివుడు, నెల తాలుపు; అచలుడు, అజితుడు |
| చక్రధరుడు | n. విష్ణువు; అంబుజనాభుడు, అచ్యుతుడు, అనంతుడు, లక్ష్మీపతి |
| చక్రపాణి | n. విష్ణువు; అంబుజనాభుడు, అచ్యుతుడు |
| చక్రం | n. శ్రీకృష్ణుని ఆయుధం, బండికల్లు, కమ్మరిసారె, వలయం |
| చక్రవర్తి | n. సార్వభౌముడు, రాజులకు రాజు; అధిపతి, అధీశుడు |
| చక్షువు | n. కన్ను; అంబకం, అక్షి, చక్షువు |
| చతుర్దశి | n. పక్షంలో పద్నాల్లో దినం, పఖాల్లోది |
| చతురాననుడు | n. చతురాస్యుడు, బ్రహ్మ; అంబుజగర్భుడు, అంబుజాసనుడు, చతుర్ముఖుడు |
| చతురుడు | n. నేర్పరి; ప్రతిభామంతుడు, సచేతనుడు |
| చతుషష్టి | n. అరవై నాలుగు సంఖ్య, అరవైనాలుగు అధ్యాయాలున్న ఋగ్వేదం |
| చదువరి | సం చదువువాడు, పాఠకుడు |
| చమురు | n. నూనె |
| చలనం | n. కదలిక |
| చర్య | n. నడపటం, నిల్చోవటం, ‘‘కూర్చోవటం, వడుకోవటంలో, సమాహితుడు కావడం, పని, పద్దతి, కర్ణం, కార్యం |
| చషకం | n. గిన్నె, మధుపాత్ర; గలాసు, లోటా |
| చాకచక్యం | n. నేర్పు |
| చాటువు | n. ప్రియమైనమాట, గ్రంథస్తం కాకపోయినా లోకంలో ప్రజాదరణ పొందిన పద్యం |
| చాతుర్యం | n. నేర్పు; నైపుణ్యం, పటిమ |
| చాదస్తం | విఛాందసం, లోకజ్ఞానం / పోవడం, వింత ప్రవర్తన |
| చాపం | n. ధనుస్సు, విల్లు; ధనువు, సింగిణి |
| చింత | n. తలపు, ఆలోచన, విచారణ, చింతచెట్టు/పండు |
| చింతన | n. అనేకసార్లు తలచు కోవటం; తలపు, తలపోత, యోచన |
| చిం దు | క్రినీళ్ళు తొనకిపడు, రాలు, వ్యాపించు; ఒలుకు, రువ్వు, ఒకరకంపాట, అలక, ఆగ్రహం |
| చికిత్స | n. రోగానికి చేసే ప్రతిక్రియ; ఉపక్రమం, ప్రతిక్రియ |
| చిక్కం | వైవి శిక్యం, ఉట్టి, దారంతో అల్లిన చిన్న సంచి |
| చిక్కిన | n. లభించిన |
| చిగురు | విపల్లవం; విణలేత,చివురు; చిట్ట కిసాలం, తరురాగం |
| చిటారు | n. చివర |
| చిటికె | వైవినడిమి వేలిని పెద్ద వేలిని చేర్చి ధ్వని పుట్టించటం; ధ్వని పుట్టించటానికి పట్టే క్షణకాలం; చిటికరింత, |
| చిట్టెలుక | వి ఎలుక జాతికి చెందిన చిన్న ఎలుక |
| చిత్తడి నేలలు | విఎల్లప్పుడు నీళ్ళతో నిండి ఉండే భూములు, నదుల సమీపంలో ఉన్న భూములు |
| చిత్తం | n. మనస్సు; ఆత్మ, ఎద |
| చిత్తరు | వైవిచిత్రం, ఆశ్చర్యం |
| చిత్రభాను | n. అరవై ఏళ్ళలో ఒకటి |
| చిత్రలేఖనం | n. చిత్రం గీయటం, లలితకళలలో ఒక కళ |
| చిప్ప | విగిన్నె, కప్పచిప్ప, టెంకాయచిప్ప, ‘‘తాబేటి చిప్ప; గరిచిప్ప, ముక్తాశుక్తి |
| చిప్పిల్లు | క్రి స్రవించు; ఉప్పొంగు, ఉబుకు |
| చిరంజీవి | n. చిరకాలం జీవించే వాడు; ఆయుష్మంతుడు, జైవాతృకుడు |
| చిరకాలం | n. ఎంతోకాలం; చాలాకాలం, కలకాలం, బహుకాలం |
| చిరాకు | వికోపం; అంచలం, అక్కసు |
| చిరుతరంగాలు | n. చిన్న అలలు |
| చిరునగవు | విచిన్ననవ్వు, మందహాసం |
| చిరునామా | విజాబు మీద రాసే అడ్రసు |
| చివ్వ | వికలహం |
| చివాలున | n. వెంటనే |
| చీవాట్లు | విగద్దింపుమాటలు, తిట్లు |
| చుట్ట | n. బీడి |
| చురుకు | n. వేడి; పదును, వాడిమి |
| చూలు | n. గర్భం; కడుపు, భ్రూణం |
| చెంగలువ | వి ఎఱ్ఱకలువ; చెందొగ, రక్తబలం |
| చెంగున | క్రి తొలగు, వెనుతిరుగు |
| చెంత | n. దగ్గర |
| చెక్కిళులు | విచెంపలు; బుగ్గలు, లెంపలు |
| చెదలు | వైవిపుట్టలు పెట్టే చీమల వంటి తెల్ల పురుగులు; వమ్రిక, శిథిలి |
| చెమరించు | క్రి చెమటపోయు; ఆర్ధమగు, తడియగు |
| చెమ్మగిలు | క్రి తడిగలది, చెమ్మగిల్లు, తడిఅవు, తేమగిల్లు |
| చెరసాల | n. జైలు; కారాగారం, ఖైదు, బందిఖనా |
| చెరుపు | క్రి చెరచు, కీడు |
| చెలమ | వినీటికోసం యిసుకలో తవ్విన పల్లం; ఉపకూపం, కూపకం |
| చెల్లాచెదరు | విణమిక్కిలి చెదరు; కకావికలు, పటాపంచలు |
| చెలికాండ్రు | విస్నేహితులు |
| చెలిమి | విస్నేహం; నెయ్యం , నేస్తం |
| చెల్లుబడి | విఅధికారం, మాటసాగుదల, చెల్లడం; పెత్తనం, పెద్దరికం |
| చేటు | వి వినాశం, కీడు, అశుభం, మరణం; అనర్థం, అనిష్టం |
| చేడే | వైవిచేటి, స్త్రీ; అంగన, అతివ |
| చేను | n. పంట |
| చేమంతి | వైవిసేవంతి, ఒక పూలచెట్టు, సేమంతి |
| చేర | విపుడిసిలి, చాచిన అరచేయి |
| చేరువ | n. దగ్గర, సమీపం |
| చేలు | n. పంటలు |
| చేవ | విచేగ, సారం, ధైర్యం; సత్తు, సత్తువ |
| చేవ్రాలు | n. సంతకం, దస్తూరి; చేతివ్రాలు, వ్రాలు, హస్తాక్షరం |
| చేష్టలు | n. పనులు, నడవడిక |
| చైత్రం | n. నెల; తొలినెల, మధువు |
| చైతన్యం | n. తెలివి, ప్రాణం; కదలిక, చేతనం |
| చోద్యం | n. ఆశ్చర్యం; అచ్చరువు, చిత్రం |
| చోరుడు | n. దొంగ; తస్కరుడు, తెక్కలి |
| ఛందస్సు | n. పద్యలక్షణం తెలిపే శాస్త్రం |
| ఛత్రం | నంవిగొడుగు; ఆతపత్రము, ఆతప వారణము; ఆలపట్టము |
| ఛలోక్తి | n. చమత్కారపు మాట |