తెలుగు-తెలుగు నిఘంటువు/క-ఖ
స్వరూపం
| కంకణం | n. కడియం, చేతినగ; మురుగు, హస్తమాత్రం, తోర, శిరోభూషణం |
| కంకర | వైవి రోడ్డు, గృహనిర్మాణం మొ వాటికి ఉప యోగించే చిన్నగా పగలగొట్టే రాయి, మొరపరాయి; సం కర్కరమ్; కర్కరం, చూర్ణఖండం |
| కంకాళం | n. ఎముకల గూడు; కరంకం, పంజరం |
| కంకి | వి ఎన్ను; కండె |
| కంగారు | విఆపత్సమయంలో కలిగే తొందర,యతత కలవరపాటు; కొందలం, క్షోభం, చీకాకు,వ్యాకులత |
| కంచం | వైవిభోజన పాత్ర; సంకంసం; తళియ, పళ్లెం, పాత్రం |
| కంచు | వైవి ఒక విధమైన లోహం; సంకంసమ్; కంసం, కాంస్యం |
| కంచె | వి చుట్టూ ఉంచిన కంప; అవరోధకం, అవహాలిక, ఆవేష్టకం |
| కంటకం | n. ముల్లు; తరునఖం, ద్రునఖం, శితాగ్రం |
| కంటగింపు | వి రోత, ఈసడింపు |
| కంఠం | n. మెడ, గొంతు; కంధరం, కంది, కంబుకం, కంబువు, గళం |
| కంఠస్థం | n. కంఠపాఠంగా వచ్చింది |
| కంఠోక్తి | n. గట్టిగా చెప్పడం, స్పష్టంగా చెప్పడం |
| కండ | వైవిమాంసం; క్రవ్వం, చియ్య, శుక్తం |
| కండకావరం | విగర్వం, అహంకారం; అహంభావం, అహం |
| కండూతి | n. తీట, గోకడం; గుల, జల, తీంట్రం, దురద, దూల, నవ్వ |
| కంతి | వైవిదెబ్బవల్ల వాపు, బొప్పి, దద్దురు,కడితి, కణితి; కదుం, కిణం, బుడప, బొప్పి |
| కంతుడు | n. మరుడు, మన్మథుడు; కందర్పుడు, కాముడు, కుసుమాస్తుడు |
| కంత్రీ | n. నేర్పరి, టక్కరి, మోసం నకలు, సంకరం |
| కంద | n. కందగడ్డ |
| కందకం | వి అగడ్త ; భావకం, గడం, వరిఖాతం, ప్రతికూపం |
| కందర్పుడు | నంవిమరుడు, మన్మథుడు; కుసుమాస్త్రుడు, చక్కెర వింటిదేవర, పువ్వుల విలుకాడు |
| కందువ | విసమూహం, ఏకాంతం, చమత్కారం, సామర్థ్యం, ఉపాంశువు, ఎగ్గతం, ఏకతం, ఒంటిపాటు |
| కంప | విముండ్లమండ |
| కంపరం | వైవిగగుర్పాటు |
| కంపు | వివాసన; గబ్బు, గౌలు |
| కంబం | వైవి గుంజ; సంసంభః; కూచం, గుంజ, మొగరాడు |
| కంబళి | n. జాంగడి; కంబడి, కంబళం, గొంగడి |
| కంసాలి | వికమసాలి, స్వర్ణకారుడు; అగసాలె, కళాదుడు, విశ్వబ్రాహ్మణుడు, సువర్ణకారుడు, హేమకారుడు |
| కచ్చేరి | n. కొలువు కూటం |
| కచ్చితం | విణ పూర్తిగా సరియైనది; ఖచ్చితం, గుత్తం |
| కటికవాడు | వైవిమాంసం అమ్మేవాడు |
| కట్టడి చేయు | క్రి ఆజ్ఞాపించు |
| కట్టి కుడుపు | n. పట్టి పీడించు |
| కట్టు | విబంధం; నిబంధనం, నియతి, సూత్రం |
| కట్టుదిట్టం | వికట్టుపాటు; నిబంధనం |
| కట్టుబడి | విబంటుకు/పాలేరుకు ఇచ్చే మాన్యం; పంట ఆధారిత శిస్తు; నియతం, నియతి, నియమం |
| కఠినం | n. పరుషం, నిష్ఠురం; కజకు, గట్టి, బిరుసు |
| కఠోరం | n. పరుషం, కంఠం |
| కడక | వైవిదిక్కు, స్థానం; అభోగం, ఆస్థ, ఉద్యతి, ఉద్యోగం |
| కడకు | వి చివరికి |
| కడగి | క్రి యత్నించి, పూని |
| కడగండ్లు | వికష్టాలు, ఇక్కట్లు; అగచాట్లు |
| కడతేరు | క్రి చచ్చు, నశించు; అంతమైపోవు, సమాప్తమైపోవు |
| కడతేర్చు | క్రిరక్షించు, నిర్వర్తించు |
| కడలి | విసముద్రం; అంబుధి, అబ్ది, ఉదధి, ఊర్మిమాలి, జడధి, జలధరం |
| కడు | అవ్యఅత్యంతం, మిక్కిలి; ఎచ్చు, గొప్ప, జాస్తి |
| కడిమి | వి అతిశయం, పరాక్రమం; అతిరేకం, టెక్కు, పెంపు, బలిమి, విశేషం |
| కడుపార | n. కడుపునిండ |
| కణం | n. కొంచెం, సూక్ష్మం |
| కత | చరితం; సంకథ |
| కత్తిగాటు | n. కత్తిదెబ్బ |
| కథ | n. తొల్లింటికత, వాస్తవార్థం, కత, కద, చరిత |
| కథకుడు | n. కథలు చెప్పేవాడు |
| కదనం | n. యుద్ధం; ఆజి, కలహం |
| కదన రంగం | n. యుద్ధరంగం |
| కదపకుండా | n. కదలించకుండా |
| కదియు | క్రిదగ్గరికి వచ్చు, చేరు; కూడు, కూడుకొను |
| కదురు | వి నూలు వడకు సాధనం, సన్నని కమ్మ; తంతుకాష్ఠం, తరువు, తిక్కిడి |
| కనకం | n. బంగారు; అభ్రం, అమరం, పైడి, స్వర్ణం, హేమం |
| కనకాభిషేకం | n. బంగారు నాణాలతో స్నానం; కనకస్నానం, స్వర్ణాభిషేకం |
| కనికట్టు | విఇంద్రజాలం, కళ్ళకు కనిపించకుండా చేసే గారడి; గారడి, శాంబరి, హస్తలాఘవం |
| కనీసం | వైవితక్కువైనది, హీనం, అథమం |
| కనుగొల్కులు | n. కన్నుల చివరి భాగాలు |
| కనులార్పక | n. కనురెప్పలు మూయకుండ |
| కన్నది | n. చూసినది |
| కన్నం | వైవిరంధ్రం, సంఖననమ్ |
| కన్య | n. పెండ్లికాని పడుచు; అభర్తక, అవివాహిత |
| కపటం | n. కవుడు, వ్యాజ్యం; అటమటం, కల్లతనం, కాటిల్యం, టక్కరితనం |
| కపటసారంగం | n. మాయలేడి |
| కపర్థి | n. శివుడు; అంబరీషుడు, అనిరుద్ధుడు, కాశీనాధుడు, గిరీశుడు |
| కపి | n. కోతి; కుఠారువు, మర్కటం, వానరం |
| కపోతం | n. పావురం, గువ్వ; కలరవం, పారావతం, పావురాయి |
| కపోల పాళికలు | n. చెక్కిళ్ళు; |
| కప్ప | విమండూకం; భేకం, మరూకం, రపఠం, వర్షపిశునం |
| కప్పు | ఏఆచ్చాదనం, ఇంటి పై కప్పు; కలటం, కుటంకం, కుటలం, పటలం |
| కబళం | n. ముద్ద, కడి, గ్రాసం; అన్నం, ఓగిరం, ఓదనం, బువ్వ, బోనం, భిక్ష, భుక్తి |
| కబురు | n. సమాచారం, వార్త, మతలబు, సంగతి |
| కమఠం | n. తాబేలు; కచ్చపం, కశ్యపం, కూర్మం |
| కమలం | n. తామర, ఎర్రతామర, అంబుజం, అబ్దం, జలజం, రాజీవం, సరోజం |
| కమ్మ | విస్త్రీల కర్ణభూషణం, తాటియాకు, జాబు, ఒక కులం; ఆకు, ఉత్తరం, చీటీ, శ్రీముఖం |
| కమ్మచ్చు | n. తీగలు చేసే సాధనం; |
| కమ్మని | n. తీయనైన |
| కమ్మరి | వైవిఇనుప పనివాడు; సం కర్మారః; కనుమరి, కమ్మరీడు, కరుమల, కర్మకారుడు, లోహకారుడు, లోహఘాతకుడు |
| కమ్మలు | విబ స్త్రీల కర్ణభూషణాలు కొబ్బరి జాతి చెట్టు కొమ్మలు, ఉత్తరాలు |
| కమ్ము | వైక్రిచుట్టుకొను |
| కయ్య | విచిన్న నీటికాలువ, మడి; కుల్య, బట్టే |
| కయ్యం | n. కొట్లాట; కలహం, జగడం, సంగ్రామం |
| కరణి | వివిధం, రీతి |
| కరతాళం | n. అరచేతులు తట్టి చేయు ధ్వని; కరతాళి, కరతాళిక, కేకిసలు, హస్తతాళం |
| కరం | n. చేయి, కిరణం, తొండం, కయి, పాణి, హస్తం |
| కరవాలం | n. కత్తి; అడిదం, కటారం, కరపాలు, ఖడ్గం |
| కరసాన | n. బాణాలు పదును పెట్టు అర్ధచంద్రాకారపు సాన |
| కర్ణం | n. చెవి; కుహరం, చెవ్వు, వీను, శబ్ద గ్రహం |
| కర్తవ్యం | నంవిబాద్యత, విధి, చేయవలసిన పని |
| కర్మిష్ఠి | n. కర్మలో అధిక నిష్ఠ గలవాడు, పనిలో నేర్పరి |
| కర్పూరం | n. ఘనసారం, కప్పురం; కద్రం, కముదం, తుహినం, హిమాంశువు, హిమాభం |
| కల | విస్వప్నం; సంవేశం, స్వాపం |
| కలత | విక్షోభం, సంతాపం; చీకాకు, వేదన, వ్యాకులత |
| కలకండ | విమధుతర్కర, పటిక బెల్లం; కండచక్కెర, ఖండ శర్కర, పులకండం |
| కలకలం | n. గుంపులో పుట్టిన పెద్ద ప్రాత; కోలాహలం, గోల, రంతు, రొద, సందడి |
| కలకాలం | వి ఎల్లప్పుడు; చిరకాలం, చిరం, బహుకాలం |
| కలయంపి | విదుమ్ము అణగడానికి చల్లే పేడ నీళ్ళు, కలాపి; కలయంపి, కల్లాపు, చానపి, పేడనీళ్ళు |
| కలవరం | వికలత, సంతాపం; అలజడి, కల్లోలం, గందరగోళం |
| కలశం | n. ఘటం, కుండ; ధారకం, పూర్ణకుంభం, భద్రకుంభం |
| కలహం(బు) | n. కయ్యం, సమరం, కొట్లాట, తగాద, వాదు |
| కలాయి | n. పాత్రలకు తగరం పూయడం,కళాయి |
| కలిమి | విఅతిశయం , సంపద; ఐశ్వర్యం, సిరి |
| కలుగు | n. రంధ్రం; కందర్ల, కుహరం, గని, గహ్వరం, బిలం, బొరియ |
| కలువ | వైవిఉత్సలం, |
| కల్వ | సంకైరవమ్; కజ్జలం, కల్హారం, కువలయం |
| కలుషం | n. పాపం; కసటు, పంకం, పాతకం, మాలిన్యం |
| కల్పతరువు | n. కోరిన కోర్కెలు తీర్చే చెట్టు, కల్పవృక్షం, వేల్పుమాను, ఈవులమాను |
| కల్పన | n. కల్పించడం; కూర్పు, నిర్మాణం |
| కల్యాణం | n. పెండ్లి, శుభం, క్షేమం; పరిణయం, పాణిగ్రహణం, మనువు |
| కల్ల | విఅసత్యం; అనృతం, బొంకు, రిత్త |
| కవచం | n. బొందలం, తనుత్రాణం |
| కవనం | n. కవిత్వం; కవిత, కైతం |
| కవల | విజంటగా పుట్టిన వారు, ఆమడలు; కవలలు, అమడ బిడ్డలు |
| కవాతు | n. కసరత్తు, సైన్యం చేసే కసరత్తు |
| కవి | n. కవిత్వం రాసేవాడు, కావ్యకర్త, శుక్రుడు, వాల్మీకి, నీటికాకి; కబ్బపు కూరుపరి, కయితగాడు, కావ్యుడు |
| కవికోటి | n. కవుల సమూహం |
| కవిత | n. కవిత్వం; కవనము, కవిత, కైత |
| కవితామృతం | n. కవిత్వమనే అమృతం |
| కవ్వం | వి పెరుగు చిలుకు సాధనం; తరిగోల, మథనం, మంథరం |
| కశ్మలం | n. మురికి, మలినం; అంటు, కలంకం, కపటు, కాలుష్యం, మయిల, మాలిన్యం |
| కసరి | క్రి కోపగించి |
| కసింత | వికొంచెం |
| కస్తూరి | n. కస్తూరిమృగం నుండి లభించే పరిమళ ద్రవ్య కురంగనాభి, మదం, మృగనాభి, మృగమదం, మోదిని |
| కళ | n. చంద్రకళ, శిల్పుల నైపుణ్యం, ద్రుతాంతం కాని పదం |
| కళంకం | n. మచ్చ, గుజులు, పొడ, మరక |
| కాంక్ష | n. కోరిక, వాంఛ; అపేక్ష, అభిరతి, అభిలాష, అభీష్టం |
| కాంచి | క్రిచూసి |
| కాండం | నంవిగ్రంథ భాగం; దండం, ప్రకాండం, బోదియ |
| కాంతి | n. వెలుతురు; అంశువు, ఓడ, ఛాయ, ద్యుతి, భాతి, రోచిస్సు |
| కాందిశీకులు | n. మత/రాజకీయ పీడన భరించ / స్వదేశం వదలి ఇతర దేశాలలో ఆశ్రయం పొందేవారు |
| కాంభోజి | n. సంగీతంలో ఒక రాగం; ఆరభి, ఆహిరి, మాళవి, శ్రీవరాళి, మరాటి |
| కాంస్యం | n. కంచు, లోహపాన పాత్ర, కంసాస్థి, కాంసీయం |
| కాటకం | n. కరువు; అనావర్షం, అవగ్రహం, కజవు, క్షామం, దుర్భిక్షం |
| కాణాచి | n. నిలయం; ఆటపటు; ఉనికిపట్టు, నెలవు, స్థావరం |
| కాత్యాయిని | n. గౌరి, పార్వతి; అంబ, అంబిక, ఈశ్వరి, కాళి, చండి, దుర్గ, |
| కాన | వైవి అడవి; సంకాననమ్; అటవి, అరణ్యం, కాడు, పోడు |
| కానుకలు | వి బహుమతులు |
| కాపరి | వి రక్షకుడు; ఉపరక్షకుడు, కెవనిబంటు, కోలుకాడు |
| కాపురం | n. సంసారం; సంసరణం |
| కామధేనువు | n. వేల్పుటావు, కోరిన వస్తువులను ఇచ్చే ఆవు; సురగని, సురభి |
| కాయం | n. శరీరం, సమూహం, స్వభావం; అంగం, ఒడలు, మేను |
| కారాగ హం | n. చెరసాల; కటకటాలు, జైలు, బందిఖానా, కారాగారం |
| కారాగారం | n. చెరసాల; కటకటాలు, ఖైదు, చెర, జైలు |
| కార్చిచ్చు | విదావానలం; దవ దహనం, దవం, దావాగ్ని |
| సైనికులు కారుణ్యం | n. దయ |
| కార్యవాది | నంవిఆచరణకు ప్రాధాన్యమిచ్చేవాడు |
| కాలక్షేపం | n. వృథాగా చేసే ఆలస్యం, విలంబం, ఉబుసుపోక; ఇష్టాగోష్టి, కబురు, ముచ్చట్లు, బాతాఖాని, లోకాభిరామాయణం |
| కాలధర్మం | n. మరణం, కాలం, స్వభావం; నిర్యాణం, మరణం, మృతి |
| కాలాయాపనం | n. కాలక్షేపం; జాగుచేయు, తడయు, తామసించు |
| కాలిడు | క్రికాలు పెట్టు |
| కాలుష్యం | n. కలుషితం, మురికి, హానికర పదార్థాలు చేయడంవల్ల గాలి, నీళ్ళు పరిసరాల్లోని స్వచ్ఛత దెబ్బ తినడం; అంటు, కను, మకిల, మయిల, మ |
| కాళం | n. పాము |
| కాళయుక్తి | n. ప్రభవతో మొదలయ్యే అరవై సంవత్సరాలలో ఏభైరెండోది |
| కాళి | n. గౌరి, పార్వతి, ఆదిశక్తి; అంబ, అంబిక, కాత్యాయని, చండి, దుర్గ |
| కావ్యరత్నం | నంవికావ్యాలలో రత్నంవంటిది |
| కాసారం | n. కొలను, సరస్సు; తటాకం, సరసి, సరోవరం |
| కాసు | వైవిఅర పైసా; డబ్బు, ద్రవ్యం, సొత్తు, సొమ్ము |
| కాసిని | n. కొద్దిగా |
| కాస్తా | వికొద్దిగా |
| కాహళి | n. బాకా, కోడిపుంజు, శివుడు, యువతి; కాళ, కాళి |
| కావళికుడు | నంవికాహళ వాద్యకారుడు |
| కించిత్తు | సంఅవ్య, ఇంచుక, కొంచెం గోరంత, పిసరు, లవం, లేశం, స్వల్పం |
| కిచిడి | n. చిత్రాన్నం, వివిధ వస్తువులు (సెనగపప్పు మొ ) చేర్చి వండిన ఒక రకం అన్నం, పులగం |
| కిటకిటలాడు | విచాలామంది ఎడం లేకుండా కిక్కిరిసిపోయి ఉండటం |
| కిటుకు | వికపటం, మర్మం; కీలకం, కీలు, గుప్తం, గూఢం, మర్మం |
| కిన్నరుడు | n. నరముఖం, అశ్వశరీరం కలిగిన దేవజాతికి చెందినవాడు; గీతమోది, జక్కిమోర, పక్కి యొడలవాడు, మయువు |
| కిన్నెర | n. వీణ; కండోళి, చండాల వల్లకి, చాండాలిక, మాలవీణ |
| కిరణం | n. వెలుగు; అంశువు, ఓజస్సు, తేజం, దీప్తి, రశ్మి, వెలుగు, శిఖ, శోచిస్సు |
| కిరాతుడు | n. వేటగాడు, బోయవాడు; కంకుడు, గైలికుడు, చంచుడు, వ్యాధుడు |
| క్లిష్టం | n. కష్టం |
| కిసలయించు | v. చిగురించు |
| కిస్తీ | n. వంతు చొప్పున చెల్లించే సర్కారు శిస్తు; పన్ను చెల్లించే కాలం |
| కీకారణ్యం | n. దట్టమైన అడవి |
| కీడు | విఅశుభం, తప్పు, దోషం, అపరాధం; పరులకెపుడు కీడు తల పెట్టకూడదు |
| కీడ్చడు | క్రిచచ్చు, దైన్యపడు, తక్కువగు; తక్కువపడు, తేలికయగు, పలుచనగు, లోకువగు |
| కీరం | n. చిలుక, ఒక దేశం; పచ్చరెక్కల పక్షి, రామచిలుక, శుకం, వాగ్మి |
| కీర్తన | n. కీర్తి, యశస్సు, పాట; అభినుతి, కైవారం, ప్రణుతి |
| కీర్తి | n. యశస్సు; ప్రతీతి, విఖ్యాతి |
| కీలకం | విఅతి ముఖ్యమైనది, కిటుకు, మర్మం; కీలు, గుట్టు, గుప్తం, గూఢం |
| కీలించు | v.తగిలించు; ఉగ్గించు, ఒత్తు |
| కీలు | విమర, మర్మం; కేవారం, పర్యం, సంధి |
| కుంచం | n. నాలుగు మానికెల కొలత |
| కుంచియ | వైవిచిత్రాలు రాసే తూలిక; ఆలవట్టం, ఔశీరం, కుంచెం |
| కుంజరం | n. ఏనుగు; కరి, కుంభ, హస్తి |
| కుంటుపడు | క్రిచెడు, తగు, సొట్టపడు; చెడిపోవు, పాడువాజు |
| కుండ | వైవిమట్టిపాత్ర, ఇరుసు తగిలించే బండికంటి నడుమగుబ్బ, ఏనుగు కుంభ స్థలం; నం కుండమ్; కలశం, కుంభం, కుంభి, ఘటం, బుంగ |
| కుంభం | n. కుండ, ఏనుగు నెత్తిమీది గుబ్బ, పదకొండవ రాశి; కలశం, కుంభి, ఘటం, పాత్రం, భాండం |
| కుంభిని | n. నేల; అగ్నిగర్భ, అచల, అనంత, ఇల, ఉర్వర, ఉర్వి, ధారణి, పృథ్వి |
| కుటీరాలు | n. పర్ణశాల, గుడిసె, చిన్న ఇల్లు |
| కుఠారం | n. కత్తి; గండ్రగొడ్డలి, చిన్నగొడ్డలి, పర్నువు, సుథితి, స్వథితి |
| కుడితి | వి బియ్యం మొదలైనవి కడిగిన నీళ్ళు; కలి, కాంచికం, కూటినీళ్ళు, తరవాణి, పుల్లనీళ్ళు |
| కుడుపు | క్రి తినేట్లు చేయు; విఅనుభవం, భోజనం; కబళం, కూడు, భుక్తి |
| కుడ్యం | n. గోడ, పూత, లేపనం; ఇడుపు, భిత్తి, సాలం |
| కుతూహలం | n. కోరిక, ఆనందం; అభిరుచి, ఆసత్తి, ఉత్కంఠ, ఉబలాటం, తహతహ |
| కుత్తుక | విణ కంఠం; కంబుక, కంబువు, గళకం, గళం, గొంతు, గొంతుక |
| కుత్సితం | n. నికృష్టం; కుటిలం, బేరజం కుత్సిత దిలుడు, ఈ గుణవంత |
| కుత్సితుడు | n. చెడ్డబుద్ది ఉన్నవాడు; కుటిలుడు, కువాయడు |
| కుదప | వినారుమొక్క |
| కుదుపు | క్రి కదలించు, ఇటుఅటు ఊపు; చలింపజేయు, త్రిప్పు |
| కుదురు | క్రి అనుకూలమవు; నింపాది, నిమ్మళం |
| కుబుసం | విపాము పొర, తలుపు కింద మీద; కంచుకం, కూసం, పొర ఉంచే కూసం |
| కుబేరుడు | n. ఉత్తర దిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న; ధనపతి, రొక్కపు దొర |
| కుమ్మరి | వైవికుండలు చేసి జీవించే జాతి; కుంభకారుడు, కుంభి, ఘటీకారుడు, నూకరుడు |
| కురులు | n. వెంట్రుకలు |
| కులజులు | n. మంచి పుట్టుక కలవారు |
| కులభేదం | n. కులాల మధ్య తేడా |
| కులుకు | క్రి పోయు, వేయు, వెదచల్లు, |
| కుదిలించు | గునియు, గునిసాడు, మురియు; వి విలాసం, శృంగారపు కదలిక, వలపు మోహం |
| కువలయం | n. భూమండలం, నల్లకలువ; ఉత్పలం, కల్లారం |
| కుళ్ళు | n. చెడు |
| కూకలు | వి కూతలు |
| కూడు | వి అన్నం; ఓవనం, బువ్వ, భుక్తి, మెతుకు, సాపాటు |
| కూత | వి కూయడం; అరుపు, ఊళ, రుతం |
| కూన | వైవికుర్ర; చంటిపాప, పట్టి, పసికందు, పాప, బాలకుడు, బుడుత |
| కూర | వైవిశాకం |
| కూరిమి | n. స్నేహం; గారాబు, నెయ్యం, ప్రియం |
| కూలిపోవు | n. పడిపోవు |
| కృతకృత్యుడు | n. నెరవేరిన పనిగల వాడు; కృతార్థుడు, విదథుడు |
| కృతన్నుత | n. చేసిన మేలు మరచిపోవడం |
| కృతారుడు | n. ధన్యుడు, తలచిన పనినెరవేర్చుకొనినవాడు; కృతకృత్యుడు, ధన్యజీవి |
| కృత్యం | n. పని, వ్యాపారం; క్రియ, చేత, వ్యాసంగం |
| కృత్రిమ | n. సహజం కానిది, మనుష్యులు చేసింది; కృతకం, నకిలీ |
| కృప | n. దయ, కనికరం; అనుగ్రహం, ఆదరణ, కటాక్షం, కారుణ్యం, జాలి |
| కృపణులు | n. కుత్సితులు |
| కృష్ణవేణి | n. కృష్ణవేణి అనే నది; కృష్ణానది; కృష్ణ, కృష్ణాతటిని, కృష్ణాతరంగిణి |
| కృషి | n. సేద్యం, వ్యవసాయం; కర్షణం, పొలంపని, సాగుబడి |
| కెరటం | విఅల; అక్కలి, అర్గళం, ఉత్కలిక, ఊర్మి, జలలత, తరగ |
| కెరలిన | క్రిఆగ్రహించిన, విజృంభించిన |
| కేరళ్ళు | n. ప్రవాహాలు |
| కేకిసలు | విచప్పట్లు |
| కేలు | వైవిచేయి, తొండం; కరం, చెట్ట, పాణి, హస్తకం |
| కైచేయు | క్రి అలంకరించు |
| క్రిదండలు | విహస్త భూషణాలు |
| కైవల్యం | n. ముక్తి, మోక్షం; దివ్యపదం, పరమగతి, పరమపదం |
| కైవసం | విఅధీనం, వశం; స్వాధీనం, హవాలా, హస్తగతం |
| కైవారం | n. స్తోత్రం; అభినుతి, కొనియాడటం, ప్రశస్తి, శ్లాఘం |
| కొంటెవాడు | వి చిలిపి పనులు చేసేవాడు |
| కొండ | విపర్వతం; అచలం, అద్రి, శైలం, శిఖరి |
| కొండముచ్చులు | వినల్లని మూతిఉన్న కోతులు |
| కొండ్ర | వివ్యవసాయదారునికి ఉండే భూమి |
| కొట్టం | వైవిపసువులను కట్టే చోటు; సంగోష్ఠమ్; గోగ్రంధి, గోష్ఠం, పెంటపట్టు |
| కొటారు | విధాన్యరాసులుంచే చోటు,కోటారు, కొట్టరువు; కొటారం, ఖలం, ఖల్వ |
| కొడవలి | వికోసే ఆయుధం, లవిత్రం, చిన్న పిడితో వంపు తిరిగి అంచునకు చిన్న రంపగరి ఉండే కత్తి; ఖడ్గకం, దాత్రం, లవిత్రం, లిక్కి |
| కొనియాడు | క్రి నుతించు, స్తుతించు; అంకించు, అగ్గించు, అభినందించు, ప్రణుతించు, శ్లాఘించు |
| కొనుగోలు | వి క్రయం |
| కొప్పు | విదోపిన వెండ్రుకల ముడి; కబం, కబ్భరం, కేశపాణి, కేశబంధం, క్రొమ్ముడి, జుట్టుముడి, మౌళి, శిఖ |
| కొమరుండు | వైవికొడుకు, కుమార స్వామి; కుమారుడు, కుఱ్ఱవాడు, కొమరుడు, పిల్లవాడు |
| కొమ్మ | వి స్త్రీ, శాఖ, విటపం, శిఖ, సురిగ |
| కొయ్య | వి కర్ర, మాను, మూర్ఖుడు, కట్టె, కాష్ఠం, కొయ్య, కోల, మొద్దు |
| కొలది | విపరిమితి, బలం, స్థితి, విధం |
| కొలను | వైవిసరస్సు, చెరువు; కాసారం, తటాకం, సరోవరం |
| కొలను | n. దేవతలను పూజిస్తూ పాడే పాట, కల్యాణం, జాతర, తిరునాళ్ళు |
| కొలువు | విఆస్థానం, సేవ; ఆస్థ, ఓలగం, దర్భారు, పేరోలగం |
| కొల్లాయి | వి చిన్న అంగవస్త్రం |
| కోక | వి వలువ, చీర; ఉడుపు, చేల, చేలం |
| కోట | వైవిదుర్గపురం, పట్టణం చుట్టు ఉన్న ప్రహారి; కిల్లా, ఖిల్లా, గడి, దుర్గం |
| కోతలు | n. బడాయి మాటలు |
| కోన | వైవిఅడవి; సం కాననమ్; కటకం, కనుమ, కొండపగలు |
| కోనేరు | వి (కోన + ఏరు) చుట్టూ కే నలుచదరపు గుంట, పుష్కరిణి; తిరుకొలను, తిరుకోళము |
| కోపం | సంకినుక, క్రోధం |
| కోమలి | n. చక్కనైన స్త్రీ; అంగన, అంచన, అబల, అబ్జముఖి |
| కోలాటం | వి చేతులలో కోలలుంచుకొని ఆడెడి ఆట; రెండు చేతులలోను కర్రముక్కలు ఉంచుకొని వదం పాడుతూ గుండ్రంగా తిరుగుతూ లయానుకూలంగా అడుగులు వేస్తూ ఒకరి చేతి కర్రలను వేరొకరి చేతి కర్రలకు తగిలిస్తూ ఆడే సామూహిక ఆట, హల్లీనం |
| కోలాహలం | n. కలకలం, ఒకానొక కొండ; గోల, రంతు, రొద, సందడి |
| కోవ | వి క్రమం; ఆనువంశికం, తరతరం |
| కోవెల | వి గుడి, దేవాలయం, దేవళం, పికం, కోవిల |
| కోశం | n. పుస్తకం, నిఘంటువు, బొక్కసం, కత్తిఒర; అభిదానం, పదనిధి, శబ్దకోశం, శబ్ద సంగ్రహం, శబ్దసాగరం |
| కౌతుకం | n. తహతహ, పెండ్లిలో చేతికి కట్టుకునే తోరం, స్త్రీ పురుషుల వరహానం, నంతోషం; అభినందనం, ఆనందం, ఆహ్లాదం |
| కౌముది | n. వెన్నెల, ఉత్సవం, పండుగ, కార్తీక పౌర్ణిమ; పర్యా, చంద్రకాంతి, చంద్రబాల, చంద్రిక, |
| క్షేమం | n. కలిగిన శుభం చెడకుండ; కుశలం, బాగు, యోగక్షేమం, సంక్షేమం |
| కౌరవులు | వి కురువంశపు వారు |
| కౌలు | వి ఒడంబడిక పత్రం, భూస్వామి నుండి కొంత భూమిని శిస్తు చెల్లించు పద్ధతి పై రైతు తీసుకోవడం; ఇజరా, గుత్త |
| కౌశలం | n. నేర్పరితనం; చమత్కారం, చాతుర్యం |
| కౌశికుడు | n. విశ్వామిత్రుడు; కోటిరుడు, దేవేంద్రుడు, రాజు, |
| కౌస్తుభము | n. విష్ణు వక్షస్థలంలోని మణి; నీటికెంపు, నీరు పుట్టును, పెనుమాణికం, వార్మణి |
| క్రమం | n. వరస; తీరు, తెన్ను, తెలుగు, దేస |
| క్రమ్మర | n. మళ్ళీ |
| క్రమ్ము | క్రి వ్యాపించు, పైకుబుకు |
| క్రీడ | n. ఆట; కేళి, క్రీడనం, చీటం |
| క్రుద్దుడు | n. కోపం ఉన్నవాడు; కోపగాడు, కోపిష్టి క్రోధి |
| క్రూరత్వం | n. హింసించే స్వభావం |
| క్రూరుడు | n. దయలేనివాడు; ఖలుడు, బీభత్సుడు |
| క్రేపులు | వి దూడలు, పాడిపశువులు, శిఖరాలు |
| క్రొమ్మెరుపులు | n. కొత్త మెరుపులు |
| క్రోధన | n. అరవై సంవత్సరాలలో ఏభై తొమ్మిదోది |
| క్రోధం | n. కోపం, రోసం; ఆగ్రహం, ఆవేశం, ఉద్రేకం |
| క్లేశం | n. దుః ఖం; భేదం, చింత, బెంగ |
| క్షణ భంగురం | n. అచితం, అనిత్యం, అశాశ్వతం, క్షణంలో నశించేది |
| క్షణం | n. ఘటికలో ఆరోభాగం; త్రుటి, మాత్ర, లిప్త |
| క్షణికం | n. క్షణకాలం ఉండేది; రెప్పపాటు కాలం; త్రుటి, మాత్ర, లిప్త |
| క్షత్రియుడు | n. రాచవాడు, రాజు; భూపతి, రాజన్యుడు |
| క్షమ | n. ఓర్పు, మన్నింపు; తాల్మి, సహనం |
| క్షమించు | v.మన్నించు; తాలిమిడు, లోగోను, సైపు, సైరించు |
| క్షీరము | n. పాలు; దుగ్ధం, వయస్సు |
| క్షుణ్ణం | n. పూర్తిగా చదివింది |
| ఖండం | n. తునక, పెద్ద భూభాగం; శకలం, శల్కం |
| ఖగం | n. పక్షి, ఆకాశంలో పోయేది; ఖరాలికం, విహంగం |
| ఖగోళం | n. ఆకాశమండలం; ఆకాశగోళం, వరుణం |
| ఖగోళ శాస్త్రం | n. నక్షత్రాలు, గ్రహాలను గూర్చి తెలిపే శాస్త్రం, జ్యోతిశ్శాస్త్రం |
| ఖచరుడు | n. దేవుడు, సూర్యుడు, ఆకాశంలో సంచరించేవాడు |
| ఖజానా | n. ధనాగారం |
| ఖడ్గం | n. కత్తి; కరవాలం |
| ఖని | n. రత్నాలు, లోహాలు పుట్టే చోటు గని, గంజం |
| ఖనిజం | n. లోహం, గనిలో పుట్టేది |
| ఖర | n. అరవై సంవత్సరాలలో ఒకటి (25వది) |
| ఖరం | n. గాడిద; కరభం, గర్గభం, గార్దభం |
| ఖరుడు | n. ఒక రాక్షసుడు, ఖర దూషణాదులలో ఒకడు |
| ఖర్చు | n. వెచ్చం, వ్యయం |
| ఖలుడు | n. నీచుడు; అభీకుడు, ఉక్కీడు |
| ఖాతా | n. పద్దు, జమ ఖర్చు చూపు పట్టిక |
| ఖాయం | విణ స్థిరం; నిర్ణయం, నిశ్చయం |
| ఖాళీ | విణ ఉత్తది,ఖాలీ |
| ఖురం | n. గిట్ట; గొరజ, గొరిస్తే, మంగలికత్తి, మంచంకోరు |
| ఖేదం | n. దుఃఖం; క్లేశం, వ్యథ, వ్యాకులం, బడలిక, దీనత, రోగం, బాధ, దారిద్ర్యం, క్షయం |
| ఖ్యాతి | n. యశస్సు, కీర్తి; ప్రఖ్యాతి, ప్రతిష్ఠ ప్రతీతి |