తెలుగు-తెలుగు నిఘంటువు/ఒ-ఓ-ఔ
స్వరూపం
| ఒంటరి | విణ ఏకాకి, అసహాయ శూరుడు, ఒంటరీడు; ఒంటరీడు | |
| ఒండుచోట | n వేరొక చోట | |
| ఒక | సర్వ ఏకార్థకం, ఒక్క, ఒకానొక | |
| ఒకడు | సర్వ ఒక మనిషి, ఇతరుడు, పరాయివాడు, అన్యుడు, ఏకాకి, ఒకడు, ఒకరుడు | |
| ఒక్క పొద్దు | వి వ్రత నియమం, ఒక పూట భోజనం, ఉపవాసం; ఉపోషణం, ఏకభుక్తం | |
| ఒట్టు | వి శపథం; ప్రతిజ్ఞ, ప్రతిన, బాస, ఆన | |
| ఒడంబడిక | వి ఇద్దరు/ఎక్కువ మంది మధ్య న్యాయబద్ధమైన ప్రతిఫలం; అంగీకారం, ఒప్పందం | |
| ఒడలు | వి దేహం, మేను, ఒళ్ళు; అంగం, అజీరం | |
| ఒడి | వి తొడపై భాగం; అంకతలం, అంకపాళి, అంకపీఠం | |
| ఒడిసెల | వి రాళ్ళు విసరడానికి ఏర్పరచిన తాడు | |
| ఒడుదొడుకు | విసంకటం, స్థిరత్వం లేని స్థితి; ఇక్కట్టు, చిక్కు | |
| ఒడ్డాణం | వైవి నడుముకు ధరించే నగ; సం ఓడ్యాణమ్; ఒడికట్టు, కటిమాలిక | |
| ఒడ్డు | వి తీరం, వ్యూహం; గట్టు, | |
| ఒత్తిడి | వి ఒక వైశాల్యం పై పనిచేసే మొత్తం బలం; అభిఘర్షణం, అభిమర్దం | |
| ఒప్పందం | వి అంగీకారం | |
| ఒప్పు | క్రి ఒప్పిదమగు, తగు, సమ్మతించు; అమరిక, చందం | |
| ఒయారం | వి విలాసం, సౌందర్యం, ఒయ్యారం; సొగసు, సోయగం | |
| ఒయ్యన | వి తిన్నన, నెమ్మదిగా, చప్పుడు లేకుండా | |
| ఒర | వి గమిసేన, ఖడ్గాన్ని ఉంచే కోశం, తొడుగు, గుండ్రటి సిమెంటు అచ్చు | |
| ఒరవడి | వి మేలుబంతి, ఒజ్జబంతి, దిద్దడానికి రాసి ఇచ్చిన పంక్తి, ఆచారం, కట్టుబాటు | |
| ఓమ్ | n పరబ్రహ్మార్థకం, ప్రారంభార్థకం | |
| ఓంకారం | n ప్రణవం, ప్రారంభం; అక్షరం, పంచాక్షరం, ప్రసరం | |
| ఓండ్ర | వి గాడిదకూత | |
| ఓగు | వి అశుభం, కీడు; అనర్థం, అపకృతి, దోషం | |
| ఓజస్సు | n తేజం, వెలుతురు, ఎండ; జ్యోతి, జ్యోతిస్సు | |
| ఓట | వి భయం, దిగులు, పిరికితనం, నేర్పు | బెదరు, భీతి |
| ఓటమి | వి అపజయం ; పరాజయం, పరిభవం | |
| ఓటు | n వ్యక్తులు ప్రకటించే అభిమతం, సమ్మతి, వోటు | |
| ఓడ | వైవి నావ, తరణి; సం హోడః; నౌక, నీటి రథం | |
| ఓడరేవు | వి రేవు పట్టణం | |
| ఓడికలు | వి ప్రవాహం, నీటిజాలు, చిన్నకాలువ; స్రవం, స్రుతి | |
| ఓడు | వి పరాజయం, ఓటికుండ, తూటు, బీట; పరాజితమగు, వీగు | |
| ఓడ్యాణం | n ఓడ్డాణం | |
| ఓడ్రదేశం | n ఉత్కళం (ఒరిస్సా) | |
| ఓణి | వి బాలికలు, యువతులు వేసుకొనే పైట; దావణి, పయట | |
| ఓదనం | n అన్నం, మేమం; పర్యా, బువ్వ, బోనం | |
| ఓపిక | విబలం, ఓర్పు, సహనం, శక్తి, బలం, సామర్థ్యం | |
| ఓమనగుంటలు | వి బాలికల క్రీడ; అచ్చనగండ్లు, అచ్చనగాయలు | |
| ఓయి | వై అవ్య పురుష సంబోధనంలో ఉపయోగించేది | |
| ఓరంతపొద్దు | వైవి రవంత, రాత్రి పగలు, అహోరాత్రం, నిత్వం | |
| ఓరగిల్లు | క్రి అవనతమగు, పక్కకు ఒరుగు, వాలు, ఓరగిలు | |
| ఓరి | అవ్య స్నేహ / నీచ సంబోధనార్థకం | |
| ఓరిమి | వి క్షమ, శాంతం, ఓరుపు; తాల్మి, సహనం | |
| ఓరుగాలి | వి శబ్దంతో వీచుగాలి, హోరుగాలి; ఝంఝామారుతం, ప్రకంపనం, ప్రచండ వాయువు | |
| ఓర్పు | వి క్షమ, శాంతం; ఓపిక, ఓరిమి | |
| ఓషధి | n మందు, తీగమొక్క వంటి మందాకు, మూలిక | |
| ఔగాక | అవ్య అట్లే కానిమ్ము | |
| ఔచిత్యం | n యోగ్యత, తగి ఉండటం; ఉచితం, యోగ్యం | |
| ఔజనం | n బంగారు; కాంచనం, పసిడి | |
| ఔత్తరాహులు | n ఉత్తరదేశంవారు | |
| ఔత్సుక్యం | n ఉత్సకత్వం, ఉత్కంఠ, తీవ్రమైన కోరిక | |
| ఔదాసీన్యం | n ఉదాసీనత, పట్టించుకోనితనం; పరాకు, ఉపేక్ష, విరాగం | |
| ఔన్నత్యం | n గొప్పతనం, ఉన్నతి, ఎత్తు; అతిశయం, ఉన్నతి | |
| ఔరా ! | అవ్య ఆశ్చర్యాన్ని తెలిపేది | |
| ఔషధం | n మందు; ఆయుర్ధ్రవ్యం |