Jump to content

తెలుగు-తెలుగు నిఘంటువు/ఋ-ఎ-ఏ-ఐ

Wikibooks నుండి
ఋక్కు n చందోబద్ధమైన వేదమంత్రం, స్తుతి
ఋగ్వేదం n నాలుగు వేదాలలో మొదటిది
ఋజువు n సరళం, వంకరలేనిది, నిరూపణ, నిరూపించడం; దాఖలా, నిదర్శనం
ఋణదాత n అప్పిచ్చువాడు ఋణదాయి, వృద్యాజీవుడు
ఋణం n అప్పు, నీరు; అరువు, ఎరువు, రుణం
ఋణాత్మకం n శూన్యం కన్న తక్కువైనది
ఋతంబరుడు n పరమేశ్వరుడు; ఈశుడు, ఉమావతి, కాశీనాథుడు, కేదారుడు
ఋతం n సత్యం; తథ్యం, నిక్కం, నిజం
ఋతుడు n సూర్యుడు; అంబరమణి, అంశుమాలి
ఋతుకాలం నంవివసంతాది ఋతుకాలం, గర్భధారణకు యోగ్యమైన కాలం
ఋతుపతి n వసంతర్తువు; ఆమని, పుష్పమాసం, పూలకారు
ఋతుపవనాలు n ఒక ఋతువులో వీచు పవనాలు
ఋతుపవనారణ్యాలు n వర్షం అధికం ఉండే ప్రదేశాలలోని అడవులు
ఋతుమతి n పుష్పవతి, ముట్టుత; ఏకవస్త్ర, త్రిరాత్ర, స్త్రీ ధర్మిణి
ఋతువు n రెండు మాసాల కాలం, (వసంత, గ్రీష్మ వర్ష, శరత్, హేమంత, శిశిరాలు) గర్భధారణ యోగ్యకాలం
ఋతు వృత్తి n సంవత్సరం
ఋత్విక్కు n యజ్ఞం చేయించేవాడు ఋత్విజుడు, యాజకుడు, యాజయిత
బుత్విజుడు నంవి యజ్ఞము చేయించేవాడు; ఋత్విక్కు, యాజకుడు, యాజయిత
ఋద్ధం n సమృద్ధం, పెరిగినది; పుష్కలం, పుష్టి పెంపు, వృద్ధి
ఋద్ధి n వృద్ధి; పుష్కలం, పుష్టి పెంపు
ఋషభధ్వజుడు n శివుడు; అస్థిమాలి, ఉగ్రుడు, చంద్రశేఖరుడు
బుషభం నంవిఎదు, ఆనడ్వాహం, ధుర్యం, వరీవర్దం
ఋషి n జ్ఞానంవల్ల సంసారసారం పొందినవాడు, మంత్రద్రష్ట, జడధారి, తపసి, యతి
ఋషి పంచమి n భాద్రపద శుద్ధ పంచమి
ఋష్య మూకం n పంపా సరోవర తీరంలోని పర్వతం
ఎంగిలి వి లాలాజలం, మిగిలిన పదార్థం, అపవిత్రం
ఎండ్రకాయ వి కర్కటకం, పీత, ఎండ్రి, ఎండ్రిక; కుళీరం, కర్కం
ఎకరం 4840 చదరపు గజాల నేల, 100 సెంట్లు, ఎకరా
ఎకసెక్కెం వి వికటపు మాట, అప హాస్యం; పరిహాసం, పర్యాచకం
ఎకాయకి హిం విణ ఎక్కడ నిలవకుండా, అతివేగంగా, అకస్మాత్తుగా,
ఎకాయెకి; తటాలున, హఠాత్తు
ఎకిమీడు వి రాజు, ప్రభువు; భూపతి, భూపాలుడు
ఎక్కాలు వైవి గుణకార పట్టిక; సం ఏకః, ఎక్కములు
ఎక్కువ వి ఆధిక్యం; విణ అధికం; మిక్కిలి, మిక్కుటం, మెండు, హెచ్చు
ఎగగొట్టు క్రి ఎగవేయు (పని) మాను, అప్పు తీర్చకుండు
ఎగతాళి విగేలి, పరిహాసం; అపహాస్యం, పరిహాసం
ఎగాదిగ క్రి విణ పైకి కిందికి, వెనుకకు, ముందుకు
ఎగిసి పాటు వి గర్వం, మిడిసిపాటు ఎగిరిపడు, త్రుళ్ళు
ఎగ్గాడు క్రి దూషించు, తిట్టు, నిందించు
ఎగ్గు వి కీడు, అపకారం, దోషం; సేగి, హాని
ఎచ్చు వి ఆధిక్యం, విణ అధికం, గొప్ప
ఎజెండా/అజెండా n సభలో చర్చించే విషయానుక్రమణిక, చర్చనీయాంశాల పట్టిక
ఎటు అవ్య ఏవైపు, ఏ ప్రకారం
ఎడ వి స్థానం, అవకాశం, గడువు, సందు, ఎడం, దూరం
ఎడద వైవి ఎద, హృదయం ; డెందం, హృది
ఎడబాటు వి వియోగం, క్రమంతప్పు; వర్తించడం; విప్రలంభం, వియోగం
ఎడారి వి నిర్జనమైన ఇసుక బయలు; ఎడవు, మరువు
ఎత్తుగడ వి ఉపాయం, యత్నం, వ్యూహం, కుట్ర; ఎత్తు, పన్నుగడ
ఎదురుకోలు వి వివాహానికి ముందు వధువు వైపువారు వరునికెదురుగా పోవడం, ఎదుర్కోలు, ఆహ్వానం
ఎద్దు ,వృషం (బహు ఎడ్లు); బలీవర్థం, భద్రం
ఎనుము వి మహిషి, బర్రె, గేదె; ఎను పెంటి, సిప్ర
ఎబ్బెట్టు విణ వికటం, జుగుప్స, రోత; అశ్లీలం, అసభ్యం
ఎర వి బలి, తిండి; గ్రాసం, మేత
ఎరువు వి బదులు తెచ్చుకొనే సొమ్ము; అన్యం, పరాయి
ఎరుకి వి తెలియడం, ఎరగడం, పరిచయం, గుర్తు; పరిచితి, మాలిమి
ఏకకణజీవి n ఒక జీవకణమే శరీరంగా కలిగిన ప్రాణి (ఉదా అమీబా)
ఏకగ్రీవం n ఏకవాక్కు, అభిప్రాయభేదంలేని, పోటీలేని
ఏకఠాకీని క్రి ఒకేసారి
ఏకపత్నీ వ్రతుడు n త్రికరణ శుద్దిగా ఒకే భార్య అనే వ్రతం కలవాడు
ఏక వార్షికం n ఒక రుతువులో పెరిగి చనిపోయే మొక్క; ఒక సంవత్సరం
ఏకశిల n ఒకే ఒక రాయి
ఏకాంకిక n ఒకే అంకం ఉన్న నాటక ప్రక్రియ
ఏకాకి n ఒంటరి, ఒంటరివాడు, అసహాయుడు; ఒంటి, ఒకరుడు
ఏకాక్షం n కాకి, ఒక కన్ను ఉన్నది; కాకం, వాయసం
ఏకాగ్రత క్రి ఏకైక ధ్యానం; అవధానం, నిబ్బరం
ఏకాదశి n పదకొండో తిథి; ఏకాసి, హరివాసరం
ఏకార్ణవాకారం n ఒకే సముద్ర రూపం (ఏకార్ణవ + ఆకారం)
ఏకీభవించు క్రి కలిసిపోవు, ఒప్పుకొను, ఆమోదించు
ఏకైక n ఒకేఒక్క, అద్వితీయమైనది
ఏడాది వి సంవత్సరం; అబ్దం, సాలు
ఏతం వైవి నీటిని తోడు సాధనం; ఘటీ యంత్రం, సిడి; ఇర్రి, యాతం
ఏతమెత్తటం క్రి నీళ్ళు పైకి తోడటం, పైకి తేవడం
ఏతెంచు క్రి వచ్చు, సమీపించు, జరుగు; అరుదెంచు, ఏతెంచు
ఏను సర్వ నేను; వి అయిదు
ఏపు వి ఆధిక్యం, గొప్పతనం
ఏసలారు క్రి విజృంభించు
ఏమరుపాటు వి పరాకు, ప్రమాదం
ఏమి సర్వ ఏ, ఏది; అవ్య ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం, ఏమీ
ఏరచి క్రి వెతికి
ఏర్పరించు క్రి తెలుసుకొను
ఏర్పు క్రి కాల్చు, ఎన్ను, ఎంపిక చేయు, వేరు చేయు
ఏల అవ్య ఎందు కూ, ఎందులకు, ఏలా
ఏలిక వి రాజు, యజమానుడు
ఏలికపాము వి మనుష్యుల పేగులలోని పరాన్నజీవి
ఏహ్యం వైవి ఏవం; విణ రోత పుట్టించేది; సం హేయమ్; ఏవ, ఏవగింపు
ఐంద్రజాలికుడు n ఇంద్రజాలం, చేసే వాడు, వెనగాడు; గారడీవాడు, చక్రవరుడు, మాయావి, మాయి
ఐకమత్యం n కలిసిమెలిసి ఉండటం, కలిసికట్టుతనం, ఒద్దిక; పొందిక, పొత్తు, ఒద్దిక
ఐక్యం n ఏకీభావం, మైత్రి, లీనం,
ఏకత్వం; పొత్తు, నంది, సాంగత్యం
ఐతిహాసికుడు n ఇతిహాసం తెలిసినవాడు
ఐతిహ్యం n పారంపర్యంగా వచ్చిన ఉపదేశం, కథ
ఐరావణం n ఇంద్రుని ఏనుగు; అభ్రం, వల్లభం
ఐరావతం n ఏనుగు; కిమ్మీరం, నాగరం
ఐరేని / అయిరేని వి పంచవర్ణాల గీతలు గీసిన పెండ్లికుండ, అలంకరించిన పెళ్లికుండ,; పూజకుండలు, పెండ్లి కుండలు
ఐశ్వర్యం n సంపద; ఆస్తి, సిరి
ఐహికం n ఇహలోక సంబంధమైనది; వ్యతి ఆముష్మికం