Jump to content

తెలుగు-తెలుగు నిఘంటువు/ఉ-ఊ

Wikibooks నుండి
ఉంగ వి శిశువులకు ఉగ్గు పెట్టేప్పుడు వారి ఏడ్పుకు ధ్వన్యనుకరణ
ఉంగరం విచేతి వేలినగ,ఉంగ్రం; అంగుళి, అంగుళీయకం, ఉగ్రం, ఊర్మిక
ఉంగుటం వైవిబొటన వేలు; సం అంగుష్ఠః; అంగుటం, అంగుష్ఠం
ఉంచు క్రి పెట్టు, నిలవచేయు; నిక్షేపించు
ఉంఛం n కిందపడిన గింజలను ఏరుకొని బతకడం
ఉంఛవృత్తి n రాలిన గింజలను ఏరికొని జీవించుట, ఉంచమనే జీవనోపాయం
ఉంట వి ఉండ, గుండ్రనిది; గుటిక, గుళిక
ఉండ వి గుళిక, గుండ్రం; ఉంట, గుటిక, మాత్ర
ఉండ్రం విణ గుండ్రనిది, వర్తులం
ఉండ్రాలు విఉడికించిన తీపి పిండి ఉండలు, మోదకాలు; ఉండ్రకాలు, ఉబ్బు కుడుములు
ఉంబ వైవిగోవుల అంబారవం; సం అంభా
ఉక్క వి ఉమ్మ, తాపం, వేడి
ఉక్కడం వైవి శ్రేష్ఠం, గొప్పది; సం ఉత్కటమ్
ఉక్కిరిబిక్కిరి విణ ఊపిరాడక పోవడం
ఉక్కు వి కాచి శుభ్రం చేసిన ఇనుము, పరాక్రమం, శౌర్యం, సాహసం; అయస్పార, ఆయసం, చీనజం
ఉక్కు కునుక విణ శూరుడు
ఉక్తి n మాట, వచనం, వాక్యం, చెప్పడం, కథనం; భాషిక, భాషణం
ఉక్రోషం n దుఃఖంతో కూడిన కోపం, అసమర్థతవల్ల వచ్చిన కోపం
ఉగాది వి సంవత్సరాది, చాంద్రమాన సంవత్సరంలో మొదటి రోజు సంవత్సరముఖ
ఉగ్గ అవ్యబిగువుగా, గట్టిగా, బిగ్గరగా
ఉగ్గబట్టి క్రి బిగబట్టి, నిరోధించి; ఇల్కరచు, ఈలకరచు
ఉగ్గడించు వైక్రి ప్రకటించు, చెప్పు, వర్ణించు; ఉల్లేఖించు, పరిభాషించు, వక్కాణించు, వివరించు
ఉగ్గం వైవి పట్టుకొని పోవడానికి వీలుగా పాత్రలకు కట్టేవాడు పశువుల కాళ్ళకు కట్టేబంధం; ఉదాహం, మోకు, పరాటకం, శణసూత్రం
ఉగ్గు విచనుబాలతో రంగరించి పసిబిడ్డలకు పోసే ఆముదం
ఉగ్గు గిన్నె వి పిల్లలకు ఉగ్గుపోసేందుకు ఉపయోగించే చిన్న గిన్నె; గుడక, పారడ, ప్రాడ
ఉగ్రం n క్రూరమైనది, భయంకరమైనది, మిక్కుటమైనది; దారుణం, భీకరం
ఉగ్రుడు n శివుడు, భయంకరుడు; త్రినేత్రుడు, విశ్వనాథుడు
ఉచితం n తగినది, ఉంచబడినది, తెలియబడినది, మితం; వ్యావ వెలలేనది; ఉరవు, సుహితం
ఉచ్ఛం n ఉన్నతం, ఉత్కృష్టం ఉఠాణి, ఊర్ద్వం, ప్రాంశువు, మిడి
ఉచ్చరణం n నోట పలకడం, ఉచ్ఛారణం; ఉదీరణం, ఉల్లేఖం
ఉచ్చారణ n పలకడం, ఉచ్చరించడం; ఉదీరణం, ఉల్లేఖం
ఉచ్చు క్రి వల, చీలు, చీల్చు
ఉచ్చ్వాసం n ఊపిరి బయటికి రావడం; ఊష్మం, దమ్ము, నిశ్వసం, నిశ్వాసం, పూరకం, శ్వాసం
ఉజ్జీవనం n బతకడం; జీవం, బతుకు, మనుగడ
ఉజ్జ్వలం n ప్రకాశించేది; అగ్ని, అభ్రం
ఉట్టంకించు క్రి ఉదాహరించు,ఉటంకించు, పలుకు, పేర్కొను
ఉట్టి వి పాత్రలుంచడానికి వేలాడదీసిన చిక్కం; ఉగ్గం, శిక్యం
ఉట్టిపడు క్రి స్రవించు, ఉన్నట్టుండి ఏర్పడు /వచ్చు; అగపడు, అగు, అలరు
ఉడిగం వి సేవ, ఊడిగం; ఉపచారం, చాకిరి, నౌకరి
ఉడుకుబోతు విణ అసూయాపరుడు; అంకకాడు, బలిమిడి , మచ్చరీడు, మాత్సర్యశీలుడు
ఉడుత వి చెట్టు మీద నివసించే జంతువు, చమర పుచ్చం, వృక్షమర్కటిక, వృక్షశాయిక
ఉడుపథం n నక్షత్రమార్గం, ఆకాశం; అంబరం, అంతరిక్షం
ఉడుపులు వి దుస్తులు; అంబరం, ఆచ్చాదనం
ఉడుము వి బల్లివంటి పెద్ద జంతువు;రూ ఉజుము; గోధ, గోధి, గోధిక, నిహాక, పంచనఖం
ఉడువీధి n ఆకాశమార్గం
ఉతకడం క్రి మురికి పోవడానికి వస్త్రాలను రాతి మీద కొట్టడం
ఉత్కంఠ n కోరిన వస్తువును పొందటానికి తొందర, తహతహ ఉత్సుకం, తమకం
ఉత్కరం n మేలు, అతిశయం, అభివృద్ధి; అభినందనం, కొనియాడు
ఉత్కృష్టం n మేలైనది, అధికం; ఉదాత్తం, మిక్కిలి, మిన్న
ఉత్త వైవిణ వట్టి, కేవలం, అసత్యం; సం వ్యర్థమ్, రిక్తమ్
ఉత్తమం n శ్రేష్ఠం, ముఖ్యం, ఉత్తాలం, ఉత్కృష్టం, ఉదాత్తం, నాణ్యం
ఉత్తర n ఉత్తరదిక్కు, ఇరవై ఏడు నక్షత్రాలలో పన్నెండోది; ఉత్తర ఫాల్గుణి, పొద్దురొక్క
ఉత్తరం n లేఖ, జాబు, బదులు, ఒక దిక్కు; ఉదీచి, కాబేరి
ఉత్తరాయణం n సూర్యుడు డిసెంబరు 22వ తేదీన మకర రేఖను చేరి అచ్చటి నుండి ఉత్తర దిక్కుకు మరలునప్పటి నుండి ఆరునెలల కాలం, సంవత్సరంలో వచ్చే రెండు ఆయనాలలో ఒకటి
ఉత్తరువు వైవి ఆజ్ఞ, అనుజ్ఞ, ఆదేశం, సెలవు; సం ఉత్తరమ్; అనుశాసనం, ఆన, ఆనతి, పరమానా, హుకుం
ఉత్తరేను వి శైఖరిక, అపామార్గం, ఉత్తరేణి; అపామార్గం, మయూరకం
ఉత్తీర్ణుడు n దాటబడినవాడు; పరీక్షలలో కృతార్థుడైనవాడు
ఉత్తేజం n ఉద్రేకాన్ని కలిగించేది, పేరణ, ఉద్దీపనం, ఉత్సాహాన్ని పుట్టించేది
ఉత్పత్తి n పుట్టుక, పుట్టేచోటు, తయారీ; ఆవిర్భావం, ఆవిర్భూతం, ప్రాదుర్భావం
ఉత్పలం n కలువ, నల్లకలువ; కల్వ, కల్హారం, కువలయం
ఉత్పాదకులు n ఉత్పత్తి చేసేవారు
ఉత్పాదన శక్తి n నియతకాలంలో చేయగలిగిన కార్యం
ఉత్ర్పేక్ష n ఊహ, ఒక అర్థాలంకారం; అనుమ, అనుమితి, హృల్లేఖం, భావం
ఉత్సంగం n ఒడి, తొడ, ఆలింగనం
ఉత్సవం n ఊరేగింపు, పండుగ; క్షణం, వేడుక, సంబరం
ఉత్సహించు v యత్నించు, ఉత్సాహపడు, సంతోషపడు, ఉత్సాహించు, మాను, పూనుకొను, సమకట్టు
ఉత్సాహం n ప్రయత్నం, సంతోషం, కోరిక; అంగద, అగ్గలిక
ఉత్సేకం n అతిశయం, గర్వం, పొంగు; అవలేపం, ఉద్దతి
ఉదకం n నీరు, తడి పేది, ఉదము; అంబువు, ఘృతం, జలం
ఉదజం n నీటిలో పుట్టేది, పద్మం; అంబుజం, అంభోరుహం, కమలం, కుముదం
ఉదధి n సముద్రం; అంబుధి, అబ్ది, కడలి, జలధి
ఉదయం n పుట్టుక, సృష్టి, ప్రాతఃకాలం; ఉదిత, పొడుపు, ప్రొద్దు పొడుపు
ఉదయించు vపుట్టు; పొడతెంచు, పొడుచు
ఉదరం n కడుపు; కంజరం, పొట్ట, బొజ్జ, బొజ్జ
ఉదాత్తం n గౌరవమైనది, ధారాళం, మనోహరమైనది; ఉత్తమం, ఉత్కృష్టం
ఉదారం n గొప్పది; ఔదార్యం, దయాదాక్షిణ్యం
ఉదారుడు n గొప్పవాడు, దాత; దానశీలుడు, దానశూరుడు, వదాన్యుడు
ఉదాసీనం n తటస్థంగా ఉండేది, ఏదీ పట్టించుకోకపోవడం; అనాస్థ, పరాకు
ఉదాహరణం n దృష్టాంతం, తార్కాణ; ఉదాహారం, ఉదాహృతి, తార్కాణం
ఉదాహరించు v ఉదాహరణంగా చెప్పు, ఉదాహరణంగా చూపు; తార్కాణించు, దృష్టాంతీకరించు
ఉద్ఘాటన n ఉగ్గడించడం, ప్రకటన, పైకిలాగడం, వెలికి చెప్పడం, అడ్డం లేకుండ చేయడం; అంకుటం, కుంచిక
ఉద్దర వి తాకట్టు, ఉద్దరువు, గిరవు, తాకట్టు
ఉద్ది వి జత, జట్టు; ఈడు జోడు, జట్టి, దీటు, సరి, సాటి
ఉద్దీడు వి జతకాడు, మిత్రుడు, ఉద్దికాడు; చెలికాడు, నెచ్చెలి, స్నేహితుడు
ఉద్దేశం n గురి, తలంపు, నిశ్చయం, అవధానం, ఉపధారణం
ఉద్దతుడు n గర్వి; బహు ఉద్ధతులు; గర్విష్ఠి పొగరుబోతు
ఉద్దరించు v పెల్లగించు, మీదికెత్తు, రక్షించు; ఉత్సాదించు, ఉప్పరమెత్తు, ఉప్పరించు
ఉద్యమం n యత్నం, సిద్ధం కావడం; ఉద్యతి, కదలిక
ఉద్యమించు v ప్రారంభించు, యత్నించు, మొదలు పెట్టు; ఉత్సహించు, సమకట్టు
ఉద్యానం n విహారార్థం ఏర్పాటు చేసిన తోట; ఆరామం, ఉపవనం, ప్రమదావనం, వాటిక
ఉద్యానవనం n తోట, రమణీయమైన చెట్లు, లతలు, గుల్మాల తోట; ఉపవనం, నందనం
ఉద్యుక్తుడు n యత్నించువాడు, సంసిద్ధుడు
ఉద్యోగం n యత్నం, పని, కొలువు, పాటుపడటం
ఉద్బోధ n వికాసం, ఉపదేశం, మేల్కొనడం
ఉద్రిక్తము n ఉద్రేకించినది
ఉద్రేకం n అతిశయం, విజృంభణం, అదటు, క్రోధం, రోషం, శఠం
ఉద్విగ్నం n కలతబారింది, భయం కలిగినది, మనసు కుదురు లేనిది, వ్యాకులమైనది
ఉద్వేగం n భయం, విరహం వల్ల కలిగే దుః ఖం, కలత; ఉద్వేజనం, వ్యాకులచిత్తత
ఉనికి వి ఉండటం, స్థితి, స్థానం, నివాసం
ఉన్నతం n గొప్పది; ఉచ్చం, ఊర్థ్యం
ఉన్నతి n ఎత్తు, ఉచ్చస్థితి, ఔన్నత్యం; పెంపు, సమున్నతి
ఉన్ని వి గొర్రె బొచ్చు
ఉన్మాదం n వెర్రి, పిచ్చి, తిక్క, మతిభ్రంశం, రిమ్మ
ఉపకథ n ఒక కథలో వచ్చే అప్రధానమైన చిన్నకథ
ఉవకరణం నంవిపనిముట్లు, ఉపయుక్తమైన సాధనం, పరికరం, సాధనం
ఉపకారం n మేలు, ఉపకృతి; ఉపక్రియ, హితం
ఉపకారి n ఉపకారం చేసే వాడు; ఉపకర్త, హితుడు
ఉపక్రమించడం v ప్రారంభించడం; ఆరంభించు, ఉపక్రమించు తలపెట్టు, మొదలు పెట్టు
ఉపదేశం నంవిహితవచనం, మంత్రోపదేశం, విధివాక్యం; ప్రవచనం, సూక్తి, హితోక్తి
ఉపద్రవం n ఆపద, బాధ; విపత్తు, సంకటం
ఉపనయనం n వడుగు, దగ్గరకు తేవడం, అర్పించడం, ఉపనాయం, ఉపనయం; ఆనయనం, ఆనయం
ఉపయుక్తం n ఉపయోగం, ప్రయుక్తి, ఫలం
ఉపరితలం n పైభాగం ఉపలాలనం n బుజ్జగించడం
ఉపవాసం n పస్తు, భోజనము చేయకుండా ఉండటం; అభోజనం, ఉపోషితం
ఉపశమనం n రోగంవల్ల కలిగే బాధ తగ్గడం, ఇంద్రియ నిగ్రహం, ఓర్పు, ఉపశాంతి; ఊరట, సాంత్వనం
ఉపసంహరించు v మరలించు, సమాప్తి చేయు, వెనక్కు తీయు; మరల్చు, మలపు, మళ్ళించు
ఉపాధి n ఆధారం
ఉపాధ్యాయుడు n చదువు చెప్పేవాడు; అధ్యాపకుడు, ఆచార్యుడు, ఒజ్జ, గురువు, చదువులయ్య, బోధకుడు
ఉపాయం n సాధనం; ఎత్తు, ఎత్తుగడ
ఉపేక్ష n అశ్రద్ధ, నిర్లక్ష్యం; అలక్ష్యం, అవగ్రహణం
ఉపేక్షించి క్రి అశ్రద్ధచేసి, నిర్లక్ష్యంచేసి, ఉదాసించు, తోసిపుచ్చు, పరాకు చేయు
ఉపోషణం n పస్తు, ఉపవాసం
ఉప్పరం n ఆకాశం
ఉప్పెన వైవిసముద్రపు పొంగు, సం ఉల్బణమ్
ఉబలాటం విఉత్కంఠ, తహతహ; కుతూహలం, మక్కువ
ఉభయులు n ఇద్దరు
ఉమ n పార్వతి, కాంతి; వెలుగు, శోభ
ఉమాపతి n శివుడు; త్రినేత్రుడు, నాగభూషణుడు, పశుపతి, రాజశేఖరుడు, శంకరుడు
ఉరవడి వి అతివేగం, శౌర్యం, విజృంభణం; ఉపక్రమం, విక్రమం
ఉరుము క్రి గర్జించు, మేఘధ్వని
ఉర్వి భూమి; క్షితి, ధరణి, పుడమి
ఉర్వీపతి n రాజు, భూమీశుడు; అధిపతి, ధరణీపతి, పరిపాలకుడు
ఉర్వీశుడు n రాజు, భూపతి; అధిపతి, ధరణీపతి, పరిపాలకుడు
ఉలి వి వడ్రంగి సాధనం; విణఅల్పం, నులి
ఉల్లం వి హృదయం, కోరిక; అంతఃకరణం, అంతరంగం, ఆత్మ, ఎడద, హృది
ఉల్లి వినీరుల్లి, ఎర్రగడ్డ, వెల్లుల్లి, తెల్లగడ్డ, పలాండుపు, మఖగంధకం, విశ్వగంధం
ఉవ్విళ్ళూరు క్రి త్వరపడు, తహతహపడు, ఎక్కువ ఆశించు, తత్తరపడు, తమకించు, వేగిరపడు
ఉవ్వెత్తు క్రివిణ పూర్తిగా, నిశ్శేషంగా,సునాయాసంగా, ఎక్కువగా, ఒక్కుమ్మడిగా
ఉష n రేయి, రాత్రిశేషం, బాణా సురుని కూతురు పేరు అసుర, జ్యోతిష్మతి, తమస్విని, యామిని
ఉష్ణ మండలం n కర్కాటక మకర రేఖల మధ్య ఉన్న అత్యుష్ణ ప్రదేశం
ఉష్ణం n వేడి; ఊష్మం, జ్వలం, వేడిమి, జ్వరం
ఉష్ణీషం n తలపాగ, కిరీటం, వేడిని తగలకుండ చేసేది
ఉష్ణోగ్రత n ఉష్ణ పరిమితి; వేడి, సెగ
ఉసి వి కుక్కవంటి జంతువులకు చేసే ప్రేరణ; అధిక్షేపం, క్షేపం, ప్రయుక్తి, ప్రేరేపణ
ఉసిరిక వి ఆమలక వృక్షం, నెల్లచెట్టు, నేల ఉసిరిక; ఆమలకం, కర్ణఫల, తిష్యఫల
ఊక విపొట్టు, తవుడు
ఊట విభూమి నుంచి పీడనం వల్ల పైకి ఉబికి వచ్చే జలం, ఊరిగ ద్రవం, రసం, సారం
ఊడ వి మర్రి మొదలగువాని కొమ్మల నుంచి కిందికి దిగెడి వేరు; అవరోహం , జట
ఊడిగం విపరిచర్య, సేవ; నౌకరి, పరిచారం
ఊత వి ఆధారం; అండ, ఆదరువు, ఊనిక
ఊదా n ఎరుపు నలుపు కలిసిన రంగు
ఊనిక విదిటవు; ఊత, పట్టుగొమ్మ
ఊపిరి విశ్వాసం, ఊర్పు; ఉచ్చ్వాసం, ఊష్మం, శ్వాసం
ఊబి వి బురద, అడుసు
ఊయల వి చంటిబిడ్డలను పరుండబెట్టు తొట్టె; తొట్టె, హిందోలం
ఊరక అవ్య అప్రయత్నంగా, వ్యర్థంగా
ఊరట వివిశ్రాంతి, విరామం; ఉపశమనం, సాంత్వనం
ఊరు వి గ్రామం, దేశం; జనపదం, పల్లె
ఊరేగింపు వి గ్రామంలో తిరిగి చేసే ఉత్సవం, మెరవడి
ఊరేగు క్రి ఊరిలో పల్లకి మొదలగు వాని పై తిరిగివచ్చు
ఊర్మిక n ఉంగరం; అంగుళి, బటువు, అల
ఊర్మిళ n లక్ష్మణుని భార్య, జనక మహారాజు కూతురు, పెనిమిటి నెడబాసిన స్త్రీ
ఊర్వశి n అప్పరస
ఊల విఆర్తధ్వని, మొజ్జ; ఆర్భటం, ఈల
ఊళ వి నక్క కూత, ఈల; అరపు, రుతం
ఊషరం n చవుటినేల; ఉప్పునేల, చవుడు
ఊసరవెల్లి వి మూడువన్నెల తొండ, బింబకం (రంగులు మార్చుతొండ)
ఊసు వి వృత్తాంతం, కాలక్షేపం,ఉబుసు; జనవాణి, లోకవాదం, జోలి
ఊసుపోక వి ఉబుసు పోక, కాలక్షేపం