Jump to content

తెలుగు-తెలుగు నిఘంటువు/ఇ-ఈ

Wikibooks నుండి
ఇంగలం వైవి నిప్పు; సంఅంగారం; అగ్గి, అనలం
ఇంగితం n హృద్ధతాభిప్రాయం; వివక్ష, లోకజ్ఞానం, వ్యవహారజ్ఞానం
ఇంగువ వైవి అంబల్పెరేసి కుటుంబ మొక్కల వేళ్ళనుండి తీసిన ద్రవ్యం; సం హింగుః; జామకం, బిల్లం
ఇంచుక అవ్యకొంచెం; ఆవంత, ఇసుమంత
ఇంచుమించు అవ్య సుమారు, దాదాపు; అంచనా, అందాజ, రమారమి
ఇంటిపట్టు వి ఇంటిదగ్గర
ఇంటిల్లిపాది అవ్య ఇంటి లోని వారందరు; కుటుంబ సభ్యులందరు
ఇంత సర్వ ఈకొలది, ఈ సమయం
ఇంతి వైవి స్త్రీ, భార్య, అంగన,కాంత
ఇంద అవ్య ఇదిగో
ఇందిర n లక్ష్మి; అమల, దాక్షాయణి
ఇందీవరం n నల్లకలువ; నీలాబ్బం, నీలోత్పలం
ఇందు అవ్య ఇచ్చట, ఈ లోకంలో
ఇందుడు n చంద్రుడు; కలువజేడు, కువలయేశుడు, కౌముదీపతి, జాబిల్లి, రేరాజు
ఇందువారము n సోమవారం
ఇంద్రజాలం n కనుకట్టు విద్య, మాయ
ఇంద్రజిత్తు n మేఘనాథుడు, రావణుని కొడుకు, ఇంద్రుని జయించినవాడు; ఇంద్రజి, రావణి
ఇంద్రధనుస్సు n సూర్యకిరణాలు నీటి బిందువులపై పడినప్పుడు ఏర్పడే వర్ణమాల, హరివిల్లు; ఇంద్రచాపం, సింగిడి
ఇంద్రనీలం n నీలమణి
ఇంద్రాణి n ఇంద్రుని భార్య, శచీదేవి; సురవాణి, హిమజ
ఇంద్రియ జ్ఞానం n ఇంద్రియాల ద్వారా విషయం తెలిసికొనడం
ఇంద్రియం n జ్ఞానేంద్రియం, కర్మేంద్రియాలలో ఒకటి
ఇంద్రుడు n దేవతల రాజు
ఇంధనం నం,వి మండటానికి ఉపయోగించే పదార్థం (కర్ర, పెట్రోలు, హైడ్రోజన్)
ఇంపు వి ఆనందం; అనుగు, అనురక్తి
ఇక అవ్య ఈ మీద, ఇటు పైన, ఇగ, ఇంక,
ఇక్కట్టు వి ఆపద, సంకటం; ఇబ్బంది, చిక్కు, కష్టం
ఇక్కడ వి ఈ చోటు
ఇక్కు వి ఇరుకు, సంకటం
ఇక్షురసం n చెరకు రసం; అపి పత్రం, తియ్యమ్రాను
ఇక్షువనం n చెరకు తోట
ఇక్షువు n చెరకు; తియ్యమ్రాను, రసాలం
ఇగం వైవి మంచు, శైత్యం, చల్లదనం, ఇవం, ఈము; సం హిమమ్; చలువ, సీతి
ఇగిలించు క్రి పండ్లు చూపు, పళ్ళు కనబడేట్టుగా నోరు తెరిచి నవ్వు, వెకిలిగా నవ్వు ఉపహసించు, హసించు
ఇగురబెట్టుట వి ద్రవ్యాన్ని ఆవిరి రూపంలో తీసివేయడం
ఇగురు వి చిగురు; కిసలయం, చివురు
ఇగురు బోడి వి చిగురు వంటి మేనుగల స్త్రీ, చక్కని స్త్రీ; అంగన, అంతయాన, ఇందుముఖి, ఇందువదన
ఇగురుట వి నెమ్మదిగా బాష్పం కావడం
ఇగో అవ్య ఇదిగో, ఇలాగే
ఇగు క్రి లాగు, గుంజు, తన్ను
ఇచట వి ఈ స్థలం, ఇచ్చట
ఇచ్చ n కోరిక
ఇచ్చకం వి ముఖస్తుతి, ప్రియవచనం, నచ్చిన మాట
ఇచ్చు క్రి ఒసగు
ఇటిక వైవి బంక మట్టి అచ్చు కాల్చి చేసిన రాయి; సం ఇష్టికా; ఇట్టిక, ఇష్టిక
ఇటీవల n ఈ మధ్య
ఇటు అవ్య ఈ వైపు
ఇట్టలం విణ అధికం, విస్తారం
ఇట్టి విణ ఇటువంటి
ఇడుపు వి గోడ, చీలిక, చిల్లి, పాయ, బద్ద
ఇడుమ వి ఆపద; కష్టం, కీడు, క్లేశం
ఇతడు సర్వ ఈతడు, ఇతను, ఈ వ్యక్తి
ఇతం వైవి కోరిక, ఇంగితం, మంచి; సం హితమ్
ఇతరం n అన్యం
ఇరవరి వైవిణ హితం చెప్పేవాడు, మేలుకోరేవాడు; హితవరి, హితుడు
ఇతిహాసం n పూర్వ చరిత్ర ప్రతిపాదక కావ్యం
ఇతోధికం n మరింత ఎక్కువ, ఇంతకన్నా ఎక్కువ
ఇత్తడి వైవి రాగి, యశదముల కలయికతో ఏర్పడిన ధాతు మిశ్రమం
ఇది సర్వ ఈ వస్తువు, ఈ కాలం, ఈమె
ఇనుమడి వి రెట్టింపు; ఇబ్బడి, ఇమ్మడి, ద్విగుణం
ఇనమనుమడు వి మునిమనుమడు; ఇనుమారు వి రెండుసార్లు, మిక్కిలి
ఇనుము వి లోహం
ఇపుడు వి ఈ సమయం , ఇప్పుడు
ఇప్ప వి మధూక వృక్షం
ఇబ్బంది వి కష్టం; ఇక్కట్టు, చిక్కు
ఇభం n ఏనుగు; కుంజరం, కుంభి, హస్తి
ఇభి n ఆడ ఏనుగు; కచ, కణీర, కరిణి, కుంజరి, కుంభిని
ఇభ్యుడు n మావటివాడు; అంకుశగ్రహుడు, అంకుశి, మావటీడు, హస్తీవాహుడు
ఇమిడిపోవు n కలిసిపోవు, లీనమవు
ఇరవు వి చోటు, స్థానం; సీమ, స్థలం
ఇరుకు క్రి కొంచెం తావులో అడుగు, సన్నదారి, సరిపోని స్థలం, చాలని స్థలం
ఇరుగు వి పక్క ఇల్లు; పొరుగు, సరస
ఇరుమారు వి రెండుసార్లు;
ఇరులు వి చీకట్లు;
ఇరుసు వి బండి చక్రాలకు అడ్డంగా వేసే ఇనుపకడ్డి, అక్షం
ఇల n నేల, ఇళ; అగ్నిగర్భ, అచల, ఉర్వి
ఇలవేలుపు వి కులదేవత; ఇష్టదేవత, గృహదేవత
ఇలు వి గృహం, ఇల్లు; గీము, గృహం, గేహం, నికేతనం, నిలయం
ఇలుదొర వి గృహస్థు, యజమాని
ఇలువరుస వి వంశానుక్రమం, గృహశ్రేణి
ఇల్లంట్రం వి అల్లుడు మామగారి ఇంట్లో నివసించడం, ఇల్లటం; ఇలడం, ఇల్లటం
ఇల్లరికం వి (ఇల్లు + అరికము), ఇల్లంట్రం
ఇల్లాలు వి భార్య, ఇంటి యజమానురాలు; అర్థాంగి, ఆలు, ఉద, గృహణి
ఇవతల వి ఈవల ప్రదేశం, ఇటువైపు, ఈ పక్క
ఇవల వి ఇవతల, ఇవ్వల, ఈవల
ఇవాళ n ఈ రోజు
ఇవురు వి చిగురు, పల్లవం
ఇవ్వల వి ఇవతల
ఇష్టదేవత n ప్రియదేవత
ఇష్టం n కోరిక, ప్రేత, ప్రేమ
ఇష్టుడు n ప్రియుడు, ఆప్తుడు, నచ్చినవాడు
ఇసుమంత అవ్య కొంచెం; రవంత, లేశం
ఇసుళ్ళు వి రెక్క, చెదలు; ఈసుళ్ళు, ఉసుళ్ళు
ఇహిహి అవ్య నవ్వుటలో, అనుకరణ ధ్వని, నిందను సూచించేది
ఈక వి పక్షిరెక్క, పక్షి రెక్కలో భాగం
ఈగపులి వి సాలెపురుగు
ఈటియ ,ఈటె
ఈటె వి పొడిచే సాధనం; కుంతం; బల్లెం, శూలం
ఈడ వి ఈచోట, ఇక్కడ
ఈడిగ వి కల్లుగీసి జీవించే జాతి
ఈడి గిలబడు క్రి చతికిలబడు, భయంవల్ల ముందుకురానని కూలిపోవు
ఈడు వి వయస్సు; విణ సామ్యం
ఈడేరు క్రి వృద్ధి చెందు, నేరవేరు; పూర్తవు, సఫలమవు
ఈత వి ఈతచెట్టు, ఈదడం, ఈనడం
ఈతకాడు విణ ఈదేవాడు
ఈతడు సర్వ ఇతడు, ఈవ్యక్తి
ఈతల వి ఈవలి ప్రదేశం, పిమ్మట, ఇవతల
ఈతి n ఉపద్రవం, ఆపద, కష్టం; గత్తర, ప్రళయం
ఈదర వి చలిగాలి; తుఫానుగాలి
ఈదు క్రి ఈతకొట్టు, ఈదులాడు
ఈదుగాయ వి ఈదుటకు ఉపయోగపడేది, సొరకాయ
ఈన వి ఆకులలోని నరం, చీపురుపుల్ల; ఈనియ, పత్రసిర
ఈనాం n మాన్యపు భూమి, మాన్యం బహుమతిగా ఇచ్చిన భూమి, ఇనాము
ఈని క్రి ఇయ్యని
ఈపి వి తలలో ఉండే అంటు పేను, పేను గుడ్డు
ఈప్పితం n కోరబడినది; వి కోరిక, వాంఛ
ఈమె సర్వ ఈక్రి
ఈయన సర్వ ఇతడు, ఈ వ్యక్తి
ఈరం వి నికుంజం, పొదరిల్లు; గుబురు, గుల్మం
ఈరస వైవి అసూయ, పగ, కోపం, ఈరసం; సం ఈర్ష్యా
ఈరిక వి మొలక, చీలిక, గుడ్డముక్క
ఈరికలేతు క్రి అంకురించు, మొలకెత్తు; అంకురిల్లు, మొనలెత్తు
ఈరుపెన వి పేను గుడ్లను ఈర్చెడు పొడవైన దువ్వెన, ఈర్పెన
ఈరేడు సర్వ (ఈరు + ఏడు) పదునాలుగు
ఈర్ష్య n ఓర్వలేనితనం, అసూయ; అసహనం, మత్సరం
ఈర్ష్యాళువు n అసహనుడు, అసూయాగ్రస్తుడు, ఓర్వలేనితనం గలవాడు; అసహిష్ణువు, ఉడుకుబోతు అసహిష్ణువు
ఈల వి సంకేతంగా నోటితో చేసే ధ్వని, తస్కరాదుల సంకేతధ్వని, చిమ్మట కూత
ఈళి n కత్తిపీట, ఈళిక
ఈలు క్రి చనిపోవు, చచ్చు; గతించు, గిటు, మరణించు, మృతినొందు
ఈవల వి ఈ పక్క, ఇవతలి ఒడ్డు
ఈవి వి దానం, వరం; అర్పణం, దత్తం
ఈవు సర్వ నీవు
ఈశాన్యం n తూర్పుకు, ఉత్తరానికి మధ్య ఉన్న దిక్కు; ఉత్తర పూర్వ ప్రాగు దీచి
ఈశుడు n శివుడు, ప్రభువు; పశుపతి, శశాంకమౌళి, శశిభూషణుడు
ఇసుమంత అవ్య కొంచెం; రవంత, లేశం
ఇసుళ్ళు వి రెక్క, చెదలు; ఈసుళ్ళు, ఉసుళ్ళు
ఇహిహి అవ్య నవ్వుటలో, అనుకరణ ధ్వని, నిందను సూచించేది
ఈక వి పక్షిరెక్క, పక్షి రెక్కలో భాగం
ఈగపులి వి సాలెపురుగు
ఈటియ ,ఈటె
ఈటె వి పొడిచే సాధనం; కుంతం; బల్లెం, శూలం
ఈడ వి ఈచోట, ఇక్కడ
ఈడిగ వి కల్లుగీసి జీవించే జాతి
ఈడి గిలబడు క్రి చతికిలబడు, భయంవల్ల ముందుకు రానని కూలిపోవు
ఈడు వి వయస్సు; విణ సామ్యం
ఈడేరు క్రి వృద్ధిచెందు, నెరవేరు; పూర్తవు, సఫలమవు
ఈత వి ఈత చెట్టు, ఈదడం, ఈనడం
ఈతకాడు విణ ఈదేవాడు
ఈతడు సర్వ ఇతడు, ఈవ్యక్తి
ఈతల వి ఈవలి ప్రదేశం, పిమ్మట, ఇవతల
ఈతి n ఉపద్రవం, ఆపద, కష్టం; గత్తర, ప్రళయం
ఈదర వి చలిగాలి; తుఫానుగాలి
ఈదు క్రి ఈతకొట్టు, ఈదులాడు
ఈదుగాయ వి ఈదుటకు ఉపయోగపడేది, సొరకాయ
ఈన వి ఆకులలోని నరం, చీపురుపుల్ల; ఈనియ, పత్రసీర
ఈనాం n మాన్యపు భూమి, మాన్యం బహుమతిగా ఇచ్చిన భూమి, ఇనాము
ఈని క్రి ఇయ్యని
ఈపి వి తలలో ఉండేటి అంటు పేను, పేను గుడ్డు
ఈప్పితం n కోరబడినది; వి కోరిక, వాంఛ
ఈమె సర్వ ఈక్రి
ఈయన సర్వ ఇతడు, ఈ వ్యక్తి
ఈరం వి నికుంజం, పొదరిల్లు; గుబురు, గుల్మం
ఈరస వైవి అసూయ, పగ, కోపం, ఈరసం; సం ఈరా
ఈరిక వి మొలక, చీలిక, గుడ్డముక్క
ఈరికలెత్తు క్రి అంకురించు, మొలకెత్తు, అంకురిల్లు, మొనలెత్తు
ఈరుపెన వి పేను గుడ్లను ఈర్చెడు పొడవైన దువ్వెన, ఈర్పెన
ఈరేడు సర్వ (ఈరు + ఏడు) పదునాలుగు
ఈర్ష్య n ఓర్వలేనితనం, అసూయ అసహనం, మత్సరం
ఈర్ష్యాళువు n అసహనుడు, అసూయాగ్రస్తుడు, ఓర్వలేనితనం గలవాడు; అసహిష్ణువు, ఉడుకుబోతు
ఈల వి సంకేతంగా నోటితో చేసే ధ్వని, తస్కరాదుల సంకేతధ్వని, చిమ్మట కూత
ఈళి n కత్తిపీట, ఈళిక
ఈలు క్రి చనిపోవు, చచ్చు; గతించు, గిటు, మరణించు, మృతినొందు
ఈవల వి ఈ పక్క, ఇవతలి ఒడ్డు
ఈవి వి దానం, వరం; అర్పణం, దత్తం
ఈవు సర్వ నీవు
ఈశాన్యం n తూర్పుకు, ఉత్తరానికి మధ్య ఉన్న దిక్కు; ఉత్తర పూర్వ ప్రాగు దీచి
ఈశుడు n శివుడు, ప్రభువు; పశుపతి, శశాంకమౌళి, శశిభూషణుడు
ఈశ్వర n ప్రభవతో మొదలయ్యే అరవై సంవత్సరాలలో పదకొండోది
ఈశ్వరి n పార్వతి
ఈశ్వరుడు n శివుడు, పరమాత్మ; విణ శ్రేష్ఠుడు; అనిరుద్దుడు, ఈశుడు, చంద్రశేఖరుడు, త్రినేత్రుడు
ఈసడము వి దూరు, నింద, అపవాదు
ఈసరుడు వైవి ఈశ్వరుడు
ఈసు వైవి ఓర్వలేనితనం, ద్వేషం, పగ, వైరం; సం, ఈర్ష్యా,
ఈహ n కోరిక, వాంఛ
ఈహామృగం n తోడేలు, దశ రూపములలో ఒకటి
ఈహీ అవ్య ఎగతాళి చేయటం, ఈహిహీ