తెలుగు-తెలుగు నిఘంటువు/అ-ఆ
స్వరూపం
| అంకురం | n మొలక, బీజం, ఈరిక, మొక్క, మోసు; మొగ్గ | నీళ్ళు, నెత్తురు, వాపు, కణితి | |
| అంకురించు | v మొలకెత్తు, పుట్టు,కలుగు, వెనలిడు, మోసులెత్తు, మోసెత్తు | ||
| అంకుశం | నంవి ఏనుగును నడపడానికి కుంభస్థలాన్ని పొడిచే ఆయుధం, ఆరెగోల | ||
| అంకె | వైవి సంఖ్య, అంశం అంకం, ఒంట్లు, సంఖ్య | ||
| అంగజుడు | n మన్మథుడు, కొడుకు అంగభవుడు, అబ్బాయి, పుత్రుడు, సుతుడు | ||
| అంగడి | n సంత, మార్కెట్, రచ్చచావడి, కొలువుకూటం, కమ్మరి, కంసాలి, వంటి వారు పనిచేసే స్థలం | ||
| అంగణం | n ఇంటి ముందు చోటు, ముంగిలి, ప్రాంగణం, మొగవాళం, చత్వరం | ||
| అంగన | n స్త్రీ, అతివ, ఇంతి,ఉవిద | ||
| అంగం | n అవయవం, ఉపజనం, శరీరం, భాగం | ||
| అంగారకుడు | n నవగ్రహాలలో ఒకటి, కుజుడు, ప్రవాళం, లతామణి, విద్రుమం, ఏకాదశరుద్రులలో ఒకడు | ||
| అంగారం | n నిప్పు ఉష్ణం, కాక వేడి, మండే బొగ్గు, బొగ్గు, ఎరుపు | ||
| అంగి | వైవిపొడవైన చొక్కా, అంగీ;సం అంగికా | ||
| అంగీకరించు | v సమ్మతించు, ఒప్పుకొను ఆమోదించు, ఇచ్చగించు, స్వీకరించు | ||
| అంగీకృతం | n సమ్మతింప బడినది అనుజ్ఞ, అనుమతి, అభిమతం, ఒప్పుకొన్న | ||
| అంగుటం | వైవి బొటన వేలు, | ||
| అంగుష్టం, అంగుళి, కరశాఖ, వేలు | |||
| అంగుళి | n వేలు; అంగుటం, అంగుళం, అంగుష్ఠం | ||
| అంగుళీయకం | n ఉంగరం; ఉండ్రం, ఊర్మిళ, బటువు | ||
| అంచనా | n లెక్కకట్టడం; అందాజ, ఇంచుమించు, దాదాపు | ||
| అంచిత | n పూజింపబడిన, ఒప్పిదమైన, వంగిపోయిన | ||
| అంజన | n హనుమంతుని తల్లి, పడమటి దిక్కులోని ఏనుగు | ||
| అంజనం | n కాటుక, ఒక పర్వతం; అక్షి భేషజం, కజ్జలం, కాలాంజనం, దీపధ్వజం, రసాంజనం, సౌవీరం | ||
| అంజలి | n చేమోడ్పు, నమస్కారం; అంజలిపుటం, దోయిలి, పుటితం, దోసిలి, కుంచంలో నాలుగో వంతు | ||
| అంటువ్యాధి | విఒకరినుంచి మరొకరికి వ్యాపించే వ్యాధి, సంక్రమణ వ్యాధి | ||
| అండ | వి సమీపం, ఆశ్రయం, ప్రాపు, పక్క, వెనక, గోడ పెల్ల | ||
| అంతం | n తుద, చావు; క్షయం, పతనం, వినాశం, శిధిలం | ||
| అంతరంగం | n హృదయం, మనస్సు; | ||
| అంతఃకరణం, అంతరింద్రియం, మానసం | |||
| అంతరంగుడు | n స్నేహితుడు | ||
| అంతరం | n ఎడం, భేదం, సమయం, సందు, ఎడబాటు | చాటు, మాటు | |
| అంతరాయం | n అడ్డు, ఆటంకం; అడ్డగాలు, అడ్డగింత, అడ్డం, అడ్డుపాటు | ||
| అంతరించు | v చనిపోవు, చెడు; పాడుపడు, మంటగలియు, మాయు, రూపు చెడు, తగ్గి పోవు, మాయమవు | ||
| అంతరిక్షం | n ఆకాశం;అంబరం, అనంతం, ఉడువీధి | ||
| అంతర్ధానం | n మరుగు పడటం, మాయం కావడం, మునగడం; | ||
| అంతర్భావం, అగోచరం, మరుగు, మాయం | |||
| అంతర్యామి | n లోపల నుండు వాడు, జీవాత్మ; | ||
| అంతరాత్మ, అధిదేవత, అధిదేవుడు, జగదీశ్వరుడు | |||
| అంతస్సంఘర్షణ | n మనసులో అలజడి | ||
| అంతిపురం | n రాణులుండే చోటు; | ||
| అంతిపురి, రాణివాసం, హవేలి | |||
| అంతిమం | n చివరి; | ||
| అంత్యం, కడ, చివర, తుద | |||
| అందం | విసౌందర్యం; చక్కన, చెన్ను, శోభ, సొగసు | ||
| అంధకారం | n చీకటి; తమస్సు, తిమిరం | ||
| అంధుడు | n గుడ్డివాడు; | ||
| అంధకుడు, అంధీభూతుడు చీకు | |||
| అంబ | n అమ్మ, తల్లి, పార్వతి; జనని, జనయిత్రి, ధాత్రి, మాత | ||
| అంబకం | n బాణం, కన్ను; అక్షి, చక్షువు, దృష్టి, నేత్రం | ||
| అంబరం | n ఆకాశం, శూన్యం; అంతరిక్షం, అనంతం, అభ్రం, ఉడువీధి | ||
| అంబలి | వి జావ; అన్నరసం, గంజి | ||
| అంబారీ | వి ఏనుగు మీద ఏర్పరిచే పీఠం; చౌడోలు, పల్లనం | ||
| అంబు | n బాణం; అంబకం, అమ్ము, కంటకం | ||
| అంబుజగర్భుడు | n బ్రహ్మ; అంబుజాసనుడు, అగ్రజన్ముడు, కమలాసనుడు | ||
| అంబుధి | n సముద్రం; కడలి, జలనిధి, జలధరం, జలధి | ||
| అంభోజం | n తామర, సారస పక్షి, చెగురు పక్షి | ||
| అంబోరుహం, ఉయ్యల, పులుగు, రాజీవం | |||
| అంశం | n భాగం, విషయం; తరగతి, శాఖ | ||
| అకట | అవ్యఅయ్యో, అకటా, కటకటా (సంతాప సూచకం) | ||
| అక్క | వి తనకంటే పెద్దదైన తోడబుట్టువు, అప్ప, పూజ్యశ్రీ; సోదరి, ఆడకూతురు, వంటలక్క | ||
| అక్కజం | వైవిణ ఆశ్చర్యకరం, శక్తికి మించినది; అచ్చెరువు, అచ్చెరు, అపూర్వం, అబ్బురం | ||
| అక్కర | వి ప్రయోజనం, శ్రద్ధ, అవసరం | ||
| అక్షతలు | n పసుపు/కుంకుమ కలిపిన బియ్యం గింజలు; అచ్చతలు, సేసలు | ||
| అక్షయ | n అరవై సంవత్సరాలలో చివరిది | ||
| అక్షరం | n క్షరం కానిది, నాశనం లేనిది; | ||
| అచ్చరం, వర్ణం, ఆకాశం, ఓంకారం, నీరు, పరబ్రహ్మం; వికృ అక్కర; X క్షరం | |||
| అఖిలం | n సమస్తం, అశేషం; విశ్వం, సకలం, సమస్తం | ||
| అగసాలి | వి కంసాలి, స్వర్ణకారుడు | ||
| అగాధం | n చాల లోతైనది, తెలియరానిది | ||
| అగ్రగణ్యుడు | n శ్రేష్ఠుడు; అగ్రణి, ప్రధానుడు, ప్రముఖుడు | ||
| అగ్రగామి | n ముందు నడిచేవాడు; | ||
| అగ్రయాయి, పురోగముడు, పురోగామి | |||
| అగ్రం | n ఎదురు, సమీపం, కొన; పరమం, ప్రథమం, ప్రధానం, ప్రముఖం, ప్రాధాన్యం | ||
| అగ్రశ్రేణి | n మొట్ట మొదటిస్థాయి | ||
| అగ్రహారం | n పన్ను లేకుండ బ్రాహ్మణులకిచ్చే ఈనాం భూమి | ||
| అఘోరించు | v దుః ఖించు, ఏడ్చు; అభీలం, ఉగ్రం, భీకరం, భీమం, భీషణం, భైరవం, రౌద్రం, విభీషణం | ||
| అజరామరం | n శాశ్వతం | ||
| అజాతశత్రువు | n ధర్మరాజు; విణ శత్రువులు లేనివాడు | ||
| అజీర్ణం | n అన్నం మొదలైనవి అరుగక పోవడం; విణ జీర్ణం కానిది | ||
| అజ్ఞాని | n తెలివిలేనివాడు | ||
| అటమటించు | క్రి చలించు, వంచించు, అపహరించు | ||
| అటవి | n అరణ్యం | ||
| అటక | వి ఇంటిలో దూలాల మీద ఏర్పాటు చేసిన మంచె, అట్టుక; | ||
| అట్టడి, అట్టుగ, గడిసె | |||
| అట్టహాసం | n పెద్దనవ్వు; ప్రహసనం, వికటాట్టహాసం | ||
| అడపాదడపా | అవ్య అప్పుడప్పుడు; అడపదడప, ఎడపదడప | ||
| అడిదము | వి కత్తి; అడ్డాయుధం, అలుగు, అసి, కటారం, కటారు | ||
| అడియాస | వి ప్రత్యాశ, వ్యర్థాశ, నిస్పృహ, నైరాశ్యం | ||
| అడుసు | వి బురద; అసలు, దుమ్ము, ద్రావం, పంకం, రొంపి | ||
| అడ్డంకి | వి అడ్డు, నిరోధం | ||
| అలకరించు | క్రికిందుపరచు, మించు, | ||
| అతిక్రమించు; అతివర్తించు, ఉల్లంఘించు, మితిమీరు | |||
| అతలాకుతలం | వి నలగడం, చెదరిపోవడం | ||
| అతి | సంఅవ్య అమితం, ఎక్కువ | ||
| అతిధి | n విలువ కుండానేవచ్చినవాడు, భోజన సమయానికి వచ్చే పరదేశి; ఆగంతుకుడు, ఆగంతువు, ఆతిథ్యుడు, గృహాగతుడు | ||
| అతివృష్టి | n మితిమీరిన వాన, పంటలను పాడుచేసే పెద్ద వాన; X అనావృష్టి | ||
| అతిశయం | n ఆధిక్యం, ఎక్కువ అతిరిక్తం, అతివేలం, టెక్కు, గర్వం | ||
| అతిసారం | n నీళ్ళవిరేచనం; విరేచనం, బేది, భేధం | ||
| అతీతం | n మీరినవి, కడచినవి, మించినది, కాలాతీతమైనది | ||
| అతుల | n సరిలేనిది, సాటిలేనిది, అసమానమైనది | ||
| అత్యంతం | n మిక్కిలి; ఇనుమిక్కిలి, మీదు మిక్కిలి | ||
| అత్యాశ | n అధిక ఆశ; ఆబ, కక్కుర్తి, దురాశ, పేరాశ, మితిమీరిన ఆశ | ||
| అదనం | విణ అధికం, కావలసిన దానికంటే ఎక్కువ; అపరిమితం, అపారం, అబ్బరం, అమితం | ||
| అదరకు | క్రి కదలకు, చలించకు; అదటు, అదరు, కంపం, చలనం, భయం, దడ, ప్రకంపం | ||
| అదుపు | వి కట్టుబాటు, నియమం, హద్దు, స్వాధీనం | ||
| అదురు | క్రి వి చలించు, భయంవల్ల | త్రుళ్ళు; అల్లాడు, కదలాడు, బిత్తర పోవు | |
| అదృశ్యం | n చూడ డానికి సాధ్యం కానిది, మాయమైనది, కనిపించనిది; అంతర్థానం, అగోచరం | ||
| అదృష్టం | సం భాగ్యం, నిప్పు, నీరువల్ల కలిగే కీడు; దిష్టం, భవితవ్యత, భవితవ్యం | ||
| అద్రి | n కొండ, చెట్టు, సూర్యుడు; అగం, అచలం, గిరి, శిఖరి | ||
| అద్వితీయం | సంవిణ సాటిలేనిది | ||
| అధమం | n తక్కువ, నీచం; అల్పం, ఖిలం, హీనం | ||
| అధీనం | n ఆయత్తం, స్వాధీనం; వశం, కైవశం | ||
| అధీశుడు | n సామంతులు సేవించే రాజు, ప్రభువు; అధిరాజు, అధీశ్వరుడు, పాలకుడు, భూపతి | ||
| అధునాతనం | n ఇప్పటి కాలానికి చెందినవి, ఆధునికం; నవీనం, ఆధునిక కాలం | ||
| అధ్యక్షుడు | n ప్రధానాధికారి; అధినాథుడు, అధినేత, అధిపతి, అధిపుడు | ||
| అధ్యాయం | n గ్రంథ భాగం, ప్రకరణం, వేద పఠ నారకాలం; వ్యతి | అనధ్యాయం | |
| అధ్యాపకులు | n వేదాలను చదివే వారు, చదువు చెప్పేవారు, గురువులు, ఆచార్యులు, శిక్షకులు, శిక్షాకరులు | ||
| అధ్వానం | n అమార్గం, అధ్వాన్నం | ||
| అనంతం | n నేర లేనిది, నాశరహితమైనది; అంతరిక్షం, అంబరం | ||
| అనంతరం | n తరవాత హ్యా అవ్వల, ఆదట, ఆ పైన, ఆ మీద తరువాయి, పిమ్మట | ||
| అనంతుడు | n శ్రేష్ఠుడు, విష్ణువు, వాసుకి, అచ్యుతుడు, అజుగుడు, అజయుడు | ||
| అనద | వైవిణ దిక్కులేనిది, అశక్తుడు, అల్పుడు; అనాథ, అనాథుడు | ||
| అనర్గళం | n అడ్డులేనిది | ||
| అనలుడు | n అగ్ని దేవుడు; అంభోజుడు, అగ్గి, అగ్నిహోత్రం | ||
| అనవరతం | n ఎడతెగనిది, నిరంతరం; ప్యూ | అనిశం, అవిరామం, అహర్నిశం | |
| అనాచారం | n ఆచారం లేనిది; కృష్ణాచారం, దురాచారం | ||
| అనాథ | n నాథుడు లేనిది; అనద అనాద, అనపాశ్రయుడు | ||
| అనావృష్టి | n వాన లేకపోవడం; కరవు, కాటకం, క్షామం, దుర్భిక్షం; X అతివృష్టి | ||
| అనిత్యం | n నిత్యం కానిది; శాశ్వతం కానిది; తాత్కాలికమైనది | ||
| అనుగు | విప్రేమ, చెలికాడు, ముఖ్యుడు; ప్రీతి, ప్రేముడి, వాత్సల్యం | ||
| అనుగ్రహం | n దయ, కరుణ; అనుషంగం, ఆదరణ, కార్పణ్యం, కృప | ||
| అనుబంధం | n అనువర్తనం, చుట్టరికం, గ్రంథానికి చివర చేర్చిన భాగం; పొత్తు, బంధం, సమాయోగం | ||
| అనుభూతి | n అనుభుక్తి, (మానసిక) అనుభవం; అనుభోగం, ఉపలంభం, సంవేదన | ||
| అనుమతి | n సమ్మతి, ఆజ్ఞ, అంగీకారం, అంగీకృతి, అనుజ్ఞ; X అసమ్మతి | ||
| అనుయాయులు | n వెంబడించే వారు, ఆశ్రితులు | ||
| అనువు | వి అను కూల్యం, విధం, ఉపాయం; అధీనం, ఆయత్తం, స్వాధీనం | ||
| అనుష్టానం | n ఆచారం, నడవడి, వాడుక; సంప్రదాయం, సంవిత్తు, సమామ్నాయం | ||
| అనూడ | n పెండ్లికాని పడుచు; కన్య, అనన్య, అవివాహిత | ||
| అనూరుడు | n తొడలు లేనివాడు; పిచ్చుకుంటు, సూర్య సూతుడు | ||
| అన్నతం | n అబద్దం, అసత్యమైనది | ||
| అనేకం | n ఒకటి కానిది, పెక్కు | ||
| అన్యోన్యం | n పరస్పరం; ఒండొండు, ఒండొకరుండు | ||
| అపకారం | n కీడు, ద్రోహం, చెడ్డపని; అపక్రియ, అపచారం, హాని | ||
| అపయశం | n అపకీర్తి; అపఖ్యాతి, అపప్రథ, అపవాదం, అప్రతిష్ఠ | ||
| అపర్ణ | n పార్వతి; అంబ, అంబిక, గిరిజ, చండి, దుర్గ | ||
| అపరాహ్లావేళ | n పగటిని మూడు భాగాలుగా విభజిస్తే, అందులో చివరి భాగం | ||
| అపహరణం | n దొంగిలించుకొని పోవడం; మోసగించికొని పోవడం; అపహరింత, అభిగ్రహం; చౌర్యం, దొంగపని | ||
| అపహసించు | v గేలిసేయు, నవ్వు; ఉల్లసమాడు, గేలి పెట్టు, ఎగతాళి చేయు, పరియాచకం | ||
| అపాయం | n హాని, ప్రమాదం, ఇక్కట్టు, కష్టం, ఇడుం, కీడు | ||
| అపారం | n ఇవతలి ఒడ్డు, ఈవలి దరి, భూరి, మిక్కిలి, మెండు | ||
| అపార్థం | n తప్పు అర్థం; వ్యర్థం, నిరసించు | ||
| అపురూపం | వైవిణ అపూర్వం, పూర్వం లేనిది, ఎంతో ప్రియమైనది అసామాన్యం, అసాధారణం | ||
| అపూర్వం | వై విణ పూర్వం లేనిది; అరుదు | ||
| అపేక్ష | n కోరిక, కాంక్ష; అభికాంక్ష, అభిలాష అభీష్టం, ఆకాంక్ష | ||
| అపోహ | n లేనిది ఊహించడం అనుమానం | ||
| అప్పగించు | వైక్రి ఒప్పగించు, అర్పించు; ఒప్పచెప్పు, ఒప్పనం, దత్తం చేయు, దారవోయు | ||
| అప్రతిష్ట | n అపకీర్తి, అగౌరవం; అప ఖ్యాతి, ఆపయశం; వ్యతి | ప్రతిష్ఠ | |
| అబద్దం | n నిజంకానిది, అసంగతం, ప్రయోజనం లేనిది; అనృతం, కల్ల, బూటకం | ||
| అబల | n స్త్రీ; అంగన అతివ, ఇంతి, మగువ | ||
| అభిజ్ఞానం | n గురు, గుర్తుపట్టడం, జ్ఞానం, తెలివి; హ్యా ఎరుక చేతన, మతి | ||
| అభినందన | n సంతోషం, పొగడటం, ప్రోత్సాహపరచడం | ||
| అభినయం | n నటన | ||
| అభినివేశం | n అభిరుచి, ప్రవేశం, చొరవ, పట్టుదల, అభిలాష; అచలం, పూనిక | ||
| అభిభాషణ | సం వి ఉపన్యాసం | ||
| అభిమతం | n సమ్మతి, కోరిక; అంగీకారం, అంగీకృతి, ఇష్టం | ||
| అభిమానం | n ప్రేమ, ఆత్మగౌరవం; అనుగు, అనురక్తి, అనురాగం, అభిమతి | ||
| అభిముఖం | n ఎదురెదురుగా; ఎదురు, ప్రతిముఖం, ముఖా ముఖి | ||
| అభియోగం | n నింద, ఆసక్తి, వ్యాజ్యం; ఆరోపణం, ఆరోపం | ||
| అభిరామం | n మనోహరం; మంజులం, మనోజ్ఞం, మనోరంజనం, రమ్యం | ||
| అభిరుచి | n అత్యాసక్తి, రుచి, ఆసత్తి, శ్రద్ధ, సంసక్తి | ||
| అభిషేకం | n తడపడం, స్నానం, చేయించడం; అవభృంధం, జలకం, తానం | ||
| అభేదం | n భేదంలేని, ఏకీభావం; అభిన్నం, సమరసం | ||
| అభ్యర్థన | n కోరిక, మనవి, విన్నపం | ||
| అభ్యర్థి | n దరఖాస్తుదారుడు, ఎన్నికలలో పోటీ చేయు వ్యక్తి | ||
| అభ్యాగతులు | n వచ్చినవారు, భోజన సమయానికి వచ్చిన అతిథులు | ||
| అభ్యాసం | n అలవాటు, సాధన | ||
| అభ్యుదయం | n శుభోదయం, వృద్ధి; శుభం, కల్యాణం | ||
| అభ్రమణి | n సూర్యుడు; అంశుడు, అంశుమాలి, అరుణ కిరణుడు, ఆదిత్యుడు | ||
| అమడలు | వైవి జంట; సం యమళః; జంట, జత, జోడు, ద్వయం | ||
| అమర | n మరణంలేని | ||
| అమరావతి | n ఇంద్రుని పట్టణం, స్వర్గం, గుంటూరు జిల్లాలోని ప్రాచీన పట్టణం; దేవపురి, వేల్పుటూరు, వేల్పుల ప్రోలు | ||
| అమరిక | వి పొందిక; ఒప్పు, కొమరు, చందం | ||
| అమర్త్యుడు | n దేవత, వేలు; అగ్నిముఖుడు, అదితిజుడు, అమరుడు | ||
| అమలం | n నిర్మలం, దోషంలేనిది, తెల్లనిది; అంబరం, అభ్రం | ||
| అమవస | వైవి చంద్రుడు ప్రకాశించని దినం, అమాస; సం | అమావాస్య | అమావసి, ఆగరం, సోమక్షయం |
| అమాయకుడు | n మాయ తెలియనివాడు; అంబేద, నిష్క పటి; బేల బోళా, వెట్టిబాగుల వాడు | ||
| అమావాస్య | n చంద్రుడు తన మార్గంలో సూర్యునికీ భూమికీ మధ్య వచ్చినపుడు చంద్రుని పై సూర్యుని వెలుగుపడిన భాగం కనిపించని దినం కృష్ణపక్షంలో వచ్చే చివరి తిథి | ||
| అమితం | n మితిలేని, హద్దులేని; అధికం, అనల్పం, అపరిమితం, అపారం, మిక్కిలి, మిక్కుటం, విస్తారం X మితం | ||
| అమూల్యం | n వెలలేనిది, మిక్కిలి విలువగలది | ||
| అమృతం | n నీరు, సుధ, విషానికి విరుగుడు మందు; బ్రహ్మరసం, మృత్యు నాశనం, సుధ | ||
| అమేయం | n అపరిమితం, మితిలేనిది; అక్కజం, కడు, జాస్తి | ||
| అమోఘం | n వ్యర్థం కానిది, సఫలమైనది, తప్పనిది | ||
| అయ్య | వైవి తండ్రి; సం ఆర్య | ||
| అయోమయం | n తోచని స్థితి, గందరగోళం | ||
| అరక | n నాగలి; కుంతలం, నాణేలు, మడక | ||
| అరమరిక | వి, సందేహం, జంకు, భేదం ఎడ, తేడా, పొరపొచ్చం | ||
| అరిష్టం | n అశుభం | ||
| అరుణ | n ఇంచుక ఎరుపు, కపిల వర్ణం, సంధ్యారాగం; చందురం, లోహితం | ||
| అరుదు | విఆశ్చర్యం, వింత | ||
| అరువు | విఅప్పు, అప్పుగా వస్తువును కొనటం, ఋణం, ఎరవు, బాకీ | ||
| అర్కుడు | n సూర్యుడు, ఇంద్రుడు; అంశుమంతుడు, అంశుమాలి, అరుణకిరణుడు | ||
| అర్తం | n తగినది; ఉచితం, వీలు, యోగ్యత | ||
| అలవడు | క్రి పరిచితమగు, కలుగు, శక్యమగు, సిద్దించు, తగు, కలియు, ఒప్పు, ఉండు | ||
| అలవికాదు | విణ, వీలుకాదు, సాధ్యం కాదు; ఆవశ్యం, దుర్లభం; X అలవి | ||
| అలవోక | వి తేలిక, అప్రయత్నం, విలాసం; వ ర్యా స్వతంత్రత, స్వాతంత్ర్యం | ||
| అలికిడి | వి ధ్వని, చప్పుడు, సవ్వడి; రవళి, రావం; X నిశ్శబ్దం | ||
| అలివేణి | n తుమ్మెదల బారువంటి జడగల స్త్రీ; అంగన, కాంత, కోమలాంగి | ||
| అలుక | వి కోపం, ద్వేషం; అలుగు, ఉడుకు | ||
| అలుకు | క్రి భయం, జంకు; అడలిపోవు, అడలు, బెదరు, భీతిల్లు | ||
| అల్పం | n చిన్నది; నిమ్నం,న్యూనం | ||
| అల్పుడు | n నీచుడు | ||
| అల్లకల్లోలం | విణగందరగోళం, తారుమారైనది; కలత నొందినది; అలజడి కలవరం, గందరగోళం | ||
| అల్లన | విమెల్లన, మాంద్యం; అల్ల, మాంద్యం | ||
| అల్లం | వైవి పచ్చిసొంటి; ఆర్ధకం, ఖలం, మూలజం | ||
| అల్లాడు | క్రి చలించు, వణకు; ఆసియాడు, కదలాడు, కదలు, బెడకు | ||
| అల్లారు ముద్దు | విణ గారాబం, ఎక్కువ ప్రియం | ||
| అవకతవక | వి తారుమారు | ||
| అవకాశం | n వీలు, సమయం; వ్యవధి, సుళువు | ||
| అవగాహన | n గ్రహించడం, తెలుసుకోవడం; అవభృధం, గాహనం, ప్రక్షాళనం | ||
| అవగుణం | n దుర్గుణం, తప్పు | ||
| అవతరణ | n జన్మం, దిగడం, దేవతలు భూమి మీద పుట్టడం | ||
| అవతల | వి తరవాత, ఆవలి ప్రదేశం; అటు, అవతల, ఆవైపు | ||
| అవతారిక | n పీఠిక, గ్రంథాలకు ముందు రాసే పరిచయం; అవతరణి, అవతరణిక, రాసే పరిచయం, ఉపక్రమణిక, భూమిక | ||
| అవధి | n హద్దు, మేర; సరిహద్దు, సరుదు, సాదు, సీమ | ||
| అవభృథం | n యజ్ఞం చివర చేసే స్నానకర్మ | ||
| అవమానం | n తలవంపు; అవజ్ఞ, అవమతి, భంగపాటు | ||
| అవయవం | n అంగం, జీవకణ జాలంతో ఏర్పడిన ఒక ప్రత్యేక భాగం; అంగం, ప్రతీకం, వ్యంజనం | ||
| అవల | అవ్య తరవాత, పిమ్మట, అనంతరం | ||
| అవలీల | n సులభం, చులకన, అనాయాసం | ||
| అవలేపం | n పూత, గర్వం, సంబంధం; అహంకారం, అహంభావం, అహం | ||
| అవసానం | n చివర, ముగింపు, మేర, చావు | ||
| అవిరళం | సం,విణ విరామం లేకుండా, దట్టమైనది | ||
| అవివేకం | n అజ్ఞానం, తెలివి / పోవడం; బొడ్డిగం, వెడగుద | ||
| అశేషం | n అంత, సర్వం | ||
| అశ్రద్ద | n ఆసక్తి / పోవడం, నిర్లక్ష్యం | ||
| అశ్రువు | n కన్నీరు, బాష్పం | నయనజలం, నేత్రజలం | |
| అశ్లీలం | n అసభ్య వచనం, ఏవగింపు పుట్టించే మాట, బూతు; అసభ్యం, ఎబ్బెట్టు | ||
| అశ్వం | n గుర్రం; ఘోటకం తురంగం, తురగం, పటాణి | ||
| అష్టాదశ | n పద్దెనిమిది | ||
| అష్టావధానం | నంవి ఎనిమిది అంశాలను ఒకే సమయంలో గమనించి చేసే అవధానం/ ఒకేసారి ఏకాగ్రత చూపే నైపుణ్యం; చదరంగం, కావ్యపాఠం, శాస్త్రార్థం, ఆకాశపురాణం, లోకాభి రామాయణం, చదరంగం, వ్యస్తాక్షరి, పుష్పగణనం అనేవి ఎనిమిది అంశాలు | ||
| అసందర్బం | n సందర్భం కానిది, పొసగకపోవడం | ||
| అసమానత | n సనూనత లేనిది; ఎగుడు దిగుడు, హెచ్చుతగ్గులు; X సమానత | ||
| అసహ్యం | n సహింపరానిది, భరింపరానిది, రోత, ఏవగింపు, చీదర; విసుగు, ఐక్యసపాటు, వెక్కసం | ||
| అసాధారణం | n సాధారణం కానిది, విశేషమయింది, సాటిలేనిది; అపురూపం, అసాధారణం | ||
| అసాధ్యం | n సాధ్యం కానిది, నెరవేర్పరానిది; అశక్యం, దుర్లభం; X సాధ్యం | ||
| అసిధారావ్రతం | n కత్తి అంచుమీద నడిచే కఠినమైన నియమం | ||
| అసుర సంజ | వైవి సాయంకాలం; గోధూళి, నిశాది, సందెవేళ, సాయం సంధ్య, మరుసంజ | ||
| అసువులు | n ప్రాణాలు | ||
| అసూయ | n ఓర్వలేనితనం; అక్కసు, అలుక, ఈరస | ||
| అస్తమానం | n ఎల్లప్పుడు | ||
| అస్వస్థత | n అనారోగ్యం | ||
| అస్థిపంజరం | n కంకాళం, ఎముకల గూడు; పంజరం | ||
| అస్పృశ్యత | n అంటరానితనం | ||
| అహం | n దినం, పగలు; దివం, దివసం, పవలు, గర్వం | ||
| అహంకారం | సవి గర్వం; అహంశృతి, అహంభావం, అహమిక | ||
| అహంభావం | n గర్వ, నేననడం; అహం, బీరం | ||
| అహర్నిశం | n పగలూ రాత్రీ, ఎప్పుడూ; అనవరతం, అనిశం | ||
| అహింస | n హింవ లేనిది, బాధించకపోవడం; X హింస | ||
| ఆంగికం | n అవయవాలతో చేసే అభినయం, స్త్రీల హావభావాలు | ||
| ఆంగీరస | n ప్రభవ మొదలైన సంవత్సరాలలో ఆరోది; గురువు, పుష్యం | ||
| ఆంజనేయుడు | n అంజనాదేవి పుత్రుడు, హనుమంతుడు; అనిలాత్మజుడు, మారుతి, హనుమ | ||
| ఆంతర్యం | n అభిప్రాయం, ఎక్కువ సన్నిహిత సంబంధం, మనసులో ఉన్నది | ||
| ఆంతరంగికం | n లోపలిది, గూఢమైనది | ||
| ఆంధ్రం | n తెలుగుదేశం, తెలుగు బాస | ||
| ఆకతాయి | వైవిణ అల్లరి, గడుగ్గాయి, తుంటరి; దుశ్శీలుడు, దోషకారి | ||
| ఆకరణ | n ఆకర్షించడం, ఒకదానికొకటి దగ్గరగా రావడం, గుంజడం, లాగడం | ||
| ఆకర్షణ పత్రాలు | n పుష్పాలలో రకరకాల రంగుల రేకులు | ||
| ఆకర్షించు | v తనవైపు లాక్కొను, వశం చేసుకొను, దగ్గరగా లాక్కొను | ||
| ఆకసం | వైవి మిన్ను; సం ఆకాశం, అంతరిక్షం, అంబరం, అనంతం | ||
| ఆకస్మికం | n అనుకోకుండా సంభవించింది అకస్మాత్తు, అమాంతం, ఎకాయకి, తటాలున, హఠాత్తు | ||
| ఆకళింపు | వైవి పూర్తిగా అర్థం చేసుకోవడం, అవగాహన | ||
| ఆకాంక్ష | n కోరిక; అభిలాష అసత్తి, కాంక్ష | ||
| ఆకారం | n రూపం, పోలిక; ఆకృతి, చందం, నిర్మాణం | ||
| ఆకాశం | n మిన్ను, పంచభూతాలలో ఒకటి, శూన్యం; అంతరిక్షం, అంబరం, గగనం | ||
| ఆకాశ రామన్న | వి ఊరు పేరు లేని మనిషి | ||
| ఆకాశవాణి | n ఆకాశం నుంచి వినిపించే మాట, అశరీర వాక్కు, భారతీయ రేడియో సంస్థ పేరు అంబరవాణి, అశరీరవాణి, గగన వాణి, దైవవాణి | ||
| ఆకురాయి | వి లోహాలను అరగదీసే పనిముట్టు | ||
| ఆకృతి | n రూపం, దేహం, హృద్గత భావాన్ని తెలిపే చేష్ట, అనుభావం, పోలిక | ||
| ఆక్రందనం | n దుఃఖం; ఏడ్పు, గోడు, రోదనం | ||
| ఆక్రోశం | n తట్టు, శాపం, నింద, అపవాదం | ||
| ఆక్షేపణ | n త్రోసివేయటం; తిరస్కృతి, ధిక్కారం, ప్రతిరోధం | ||
| ఆఖరు | విణ చివర; అంతం, అంత్యం, ఉపసంహృతి, పరిసమాప్తి, సమాప్తి | ||
| ఆఖ్యాయిక | n వాస్తవంగా జరిగిన కథను చెప్పే గద్యగ్రంథం | ||
| ఆగంతుకుడు | n అతిథి; ఆగంతువు, ఆతిథ్యుడు, ఆవేశికుడు | ||
| ఆగడం | వైవి చెడ్డపని, దౌష్ట్యం, వంచన, అన్యాయం, దౌర్జన్యంతో కూడిన చర్య, అల్లరి, గోల; కపటం, కల్కం, కల్లతనం | ||
| ఆగమనం | n రాక, రావడం, ప్రాప్తి ఆగతి, ఆగమం, రాకడ | ||
| ఆగ్రహం | n కోపం, రోషం; ఆవేశం, ఉద్రేకం, క్రోధం | ||
| ఆచంద్రతారార్కము | సం అవ్య చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు ఉండే వరకు, శాశ్వతం, ఎల్లప్పుడు | ||
| ఆచరణీయం | n ఆచరింపదగినది, నడవదగినది | ||
| ఆచార్యుడు | n గురువు, వేద వ్యాఖ్యానం చేసేవాడు, వేదాధ్యయనం చేయించేవాడు, ఉపాధ్యాయుడు, పండితుడు, | ||
| విశ్వవిద్యాలయ బోధకుడు, ఉన్నత స్థాయి అధ్యాపకుడు | |||
| ఆచూకి | వి జాడ పోబడి; ఆనవాలు, పొడ | ||
| ఆజానుబాహువు | n మోకాళ్ళవరకు వేలాడే పొడుగు చేతులు ఉన్నవాడు | ||
| ఆజ్ఞ | n ఉత్తరువు, ఆదేశం; అనుమతి, ఆదేశం, ఆనతి | ||
| ఆజ్యం | n నెయ్యి, దేవదారుబంక, కర్పూర తైలం | ||
| ఆటంకం | వి అడ్డంకి, నిరోధం; అడ్డగింత, అభ్యంతరం, ప్రతి బంధం | ||
| ఆటవిడుపు | వి ఆడుకోవడానికి విద్యార్థులను విడవడం, విద్యార్థులకు సెలవుల్వివడం, బడి సెలవు | ||
| ఆటవెలది | వి నర్తకి, వేశ్య, పద్యభేదం; భోగిని, వారకాంత, వారాంగన | ||
| ఆటుపోటు | వి 1 సముద్ర తరంగాలు ముందుకు రావడాన్ని పోటని వెనక్కు పోవటాన్ని ఆటని అంటారు 2 బాధ 3 దుఃఖం | ||
| ఆడంబరం | n డాబు | ||
| ఆడితప్పు | క్రి ముందుగా చెప్పినదాన్ని మార్చి చెప్పడం, మాట నిలుపు కో / పోవటం, మాట తప్పడం | ||
| ఆతిథ్యం | n ఆతిథ్యం; విణ అతిధి కొరకైనది | ||
| ఆత్మ | n మనస్సు, హృదయం, జీవుడు, తాను; చిత్తు బుద్ధి హత్తు | ||
| ఆత్మగతం | n మనస్సులో ఉండేది వి నాటకంలోని పాత్ర తనలో తను అనుకొనే మాట మనసులో ఉన్నది; X ప్రకాశం | ||
| ఆత్మజుడు | n కొడుకు, మన్మథుడు; అంగభవుడు, ఔరసుడు, దేహజుడు, నందనుడు | ||
| ఆత్మనిగ్రహం | n ఆత్మ స్వాధీనత, మనస్సును వశంలో ఉంచుకోవటం | ||
| ఆత్మ విశ్వాసం | n తన శక్తి సామర్థ్యాలలో గట్టి నమ్మకం, తనపై తనకు ఉండే నమ్మకం | ||
| ఆత్మహత్య | n బలవంతంగా తన్ను తాను చంపుకోవటం | ||
| ఆత్మాహుతి | n అన్యాయానికి నిరసనగా శరీరాన్ని కాల్చుకోవటం | ||
| ఆత్మీయం | n తనది, స్వకీయం, తనకు సంబంధించినది | ||
| ఆత్రగాడు | విణ త్వరపడే వాడు, తొందరపడేవాడు | ||
| ఆత్రం | వైవి తొందర, విపత్తు, అత్తరం; సం ఆతురమ్; తొందర, తొందరపాటు, వేగిరపాటు | ||
| ఆదరణ | n సన్మానించడం, ఆదరికం, ఆధృతి, మన్నన | ||
| ఆదరబాదర | విణ ఎక్కువ తొందరగా, అతివేగంగా; తొందర, తొందరపాటు, త్వర, త్వరితం, శీఘ్రం, హుటాహుటి | ||
| ఆదర్శం | n పరమోత్కృష్ట స్థితి, మేలుబంతి, అబ్దం, ఆత్మదర్శం | ||
| ఆదాయం | n లాభం, లబ్ద ద్రవ్యం రాబడి; ఆగమం, ఆయం, రాబడి; | ||
| ఆదిత్యుడు | n సూర్యుడు, వేలుపు; అంబరమణి, అంశుమంతుడు, అంశుమాలి, కిరణమాలి | ||
| ఆదిమవాసులు | n కొండలలో, అడవులలో ఉండే అనాగరకులు | ||
| ఆదిశక్తి | n పరమేశ్వరుని మాయాశక్తి, దుర్గ; ఎల్లమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ | ||
| ఆదిశేషుడు | n సర్పరాజు; అనంతుడు, ఉరగరాజు, శేషాహి | ||
| ఆదుకొను | క్రి ఆధారమవు, ప్రాపవు, రక్షించు, ఆదరించు, పోషించు, సహాయపడు; కాపాడు, కాయు, సంరక్షించు | ||
| ఆదేశం | n ఆజ్ఞ, ఉపదేశం; అనుజ్ఞ, అనుమతి | ||
| ఆద్యంతం | n మొదటి నుంచి చివరి దాకా | ||
| ఆధ్యాత్మికం | n మనశ్శరీరాల వల్ల కలిగింది, ఆత్మకు సంబంధించింది | ||
| ఆనంద | n ప్రభవతో మొదలయ్యే సంవత్సరాలలో నలబయ్యోది | ||
| ఆనందం | n సంతోషం, సుఖం; సౌఖ్యం, హాయి | ||
| ఆనకట్ట | వి (అను+కట్ట) ఏటి అడ్డుకట్ట సహజ ప్రవాహాన్ని ఆపుటకు నిర్మించిన అడ్డంకి నీటికట్ట, బంధకం | ||
| ఆనవాలు | వి గుర్తు; చిహ్నం, సంకేతం | ||
| ఆపద | n విపత్తు, ఇడుము; ఆపత్తు, ఇక్కట్టు | ||
| ఆపన్నుడు | n ఆపదలో ఉన్నవాడు; పదాణకుడు, విపన్నుడు | ||
| ఆపాదించు | v కలిగించు, ఒనరించు కల్పించు, పరికల్పించు, సంపాదించు, సమకూర్చు | ||
| ఆపోవు | క్రి తృప్తి పొందు; ఆదటపోవు, చక్కబడు, తనియు | ||
| ఆప్తుడు | n బంధువు, స్నేహితుడు, నమ్మదగిన వ్యక్తి, ఇష్టుడు, నేస్తకాడు | ||
| ఆప్యాయత | n ప్రేమ, సంతోషం, అభిమానం, వాత్సల్యం, ఆదరణం | ||
| ఆబ | వి ఆత్రం, తిండి పై ఎక్కువ ఆశ; కక్కుర్తి, దురాశ, పేరాశ | ||
| ఆబ్దికం | n తద్దినం, మరణించిన వారికి ప్రతి సంవత్సరం చేసే కర్మ ఆపరకర్మ, మాసికం | ||
| ఆబోతు | వి (ఆవు + బోతు) ఎద్దు, ఆలపోతు, గోవృషభం, షండం | ||
| ఆభరణం | n నగ; భూషణం, సొమ్ము | ||
| ఆమడ | వి నాలుగు కోసుల దూరం, యోజనం | ||
| ఆమని | వి వసంత రుతువు; సమూహం, సొంపు | ||
| ఆమిషార్థ | n మాంసాన్ని కోరి వచ్చింది | ||
| ఆమూలాగ్రం | n అడుగు మొదలు తుది వరకు, మొదటి నుండి తుదివరకు, అంతా; అఖండం, పరిపూర్ణం, సమగ్రం, సమాప్తి | ||
| ఆమోదం | n అంగీకారం, సంతోషం, | ||
| ఆయకట్టు | వి (ఆయము + కట్టు) చెరువు కింద సాగుచేసే భూమి పరిమితి, రాబడి నిర్ణయం **** అవి ఆయకట్టు భూములు ఆయవారం | వైవిఇంటింటికి తిరిగి ధాన్యం/బియ్యం బిచ్చమెత్తుట అర్థన, తీరపం, యాచన | |
| ఆయాసం | n శ్రమం, పరితాపం, ఎగశ్వాస, రొప్పు, ఉబ్బసం, బడలిక; ప్రయాసం, బేజారు, శ్రమ, కష్టం, ఇబ్బంది | ||
| ఆయుర్దాయం | n ఆయుషు, జీవిత కాలం; ఆయుష్యం, ఆయుస్సు | ||
| ఆయుర్వేదం | n భారతీయ/హిందు వైద్యశాస్త్రం | ||
| ఆయువు | n జీవితకాలం, ఆయుస్సు; ఆయుర్దాయం, ఆయుష్యం | ||
| ఆయుష్మంతుడు | n దీర్ఘకాలం జీవించేవాడు; చిరంజీవి | ||
| ఆయుస్సు | n జీవిత కాలం; ఆయుర్దాయం, ఆయుష్యం | ||
| ఆరంభం | వైవి మొదలు పెట్టడం, ఉపక్రమం, ప్రయత్నం | ||
| ఆరంభించు | vయత్నించు, మొదలు పెట్టు; తలపెట్టు, నాందిపలుకు, శ్రీకారం చుట్టు | ||
| ఆరగించు | క్రి భుజించు, తిను, తాగు; కుడుచు, నోరబట్టు | ||
| ఆరడి | వి కష్టం, హాని, నింద; విణ వ్యర్థం, దుష్టం; అధిక్షేపం, అభిశంసనం | ||
| ఆరతి | వైవి దేవుని సమక్షంలో దీప ధూపాలు తిప్పటం; నివాళి, నీరాజనం, మంగళారతి, హారతి | ||
| ఆరాటం | వి దుఃఖం, బాధ, తహతహ, తాపత్రయం | ||
| ఆరాధన | n పూజించటం కొలవటం; అర్చన, ఉపాసన, సంసేవన, సపర్య | ||
| ఆరామం | n ఉపవనం, తోట; ప్యు విహరించే స్థలం; ఉద్యానం, నందనం | ||
| ఆరోహణ | n క్రమంగా, వృద్ది చెందటం; అధిరోహిణి, నిశే | ||
| ఆర్జనం | n సంపాదన; గడన, సంప్రాప్తి | ||
| ఆర్తి | n దుః ఖం, ఆపద, మనోవ్యథ | భేదం, సంతాపం | |
| ఆలకించు | క్రి విను; ఆదరించు | ||
| ఆలన | వి మొర వినటం; రక్షణ | ||
| ఆలం | వి ఉపేక్ష; అలక్ష్యం, అవహేల | ||
| ఆలయం | n గుడి, స్థానం; మందిరం, నిశాంతం | ||
| ఆలవాలం | n పాదు, నిలయం, స్థానం; ఆవాపం, ఆలవాలం | ||
| ఆలాపం | n రాగాన్ని గొంతెత్తి పాడడం; ఆలతి, ఆలపి | ||
| ఆల్చిప్ప | వి ముత్తెపు చిప్పవంటి గుల్ల, నత్తగుల్ల | ||
| ఆలు | వి స్త్రీ, భార్య | ||
| ఆలోకనం | n చూడటం, చూపు; అభివీక్షణం, దృష్టి | ||
| ఆళి | n పంక్తి, సమూహం ఆవరణ | n చుట్టూ ఉన్న ప్రదేశం ప్రాకారం, ప్రాంగణం | |
| ఆవల | వి ఆ ప్రక్క, అనంతరం; అటు, అవతల, ఆవైపు | ||
| ఆవశ్యకం | n అక్కర; విణ అక్కరైనది, అగత్యమైనది, ముఖ్యమైనది | ||
| ఆవాసం | n ఇల్లు, గృహం; గీము, గేహం, నిలయం, వాసం, సదనం | ||
| ఆవిరి | వి బాగా కాచిన నీటి నుండి లేచే ఊష్మం; ఆవి, ఉబ్బ, ఊష్మం, బాష్పం | ||
| ఆవృతం | n ఆవరింపబడింది; కప్పబడింది | ||
| ఆవేదన | n దుఃఖం, బాధ, వ్యథ, పాతాళం | ||
| ఆవేశం | n కోపం, వేగిరపాటు; క్రోథనం, క్రోధం | ||
| ఆశయం | n తలపు, మనస్సు, లక్ష్యం | ||
| ఆశీర్వాదం | n దీవెన, హితం, కోరడం, కోరిక | ||
| ఆశీస్సు | n హితం కోరటం | ||
| ఆశువు | n వేగం; తొందర, తొందరపాటు, త్వరితం | ||
| ఆశ్చర్యం | సంవి అచ్చెరువు, వింత, విస్మయం; అద్బుతం, అపూర్వం | ||
| ఆశ్రమం | n మునుల ఇల్లు, ఆకుటిల్లు | ||
| ఆశ్రయం | n ఇల్లు, ఆధారం, ఊత, శరణాలయం | ||
| ఆశ్వయుజం | n అశ్వనీ నక్షత్రంతో కూడిన మాసం, శరదృతువులోని మొదటి నెల; ఆశ్వినం, ఇందాసనెల, తొలురిక్కనెల | ||
| ఆషాఢం | n ఆషాఢ నక్షత్రంతో కూడిన పున్నమి ఉన్న మాసం; చైత్రం మొదలు నాలుగో నెల | ||
| ఆసనం | n పీఠం, కూర్చోడానికి ఆధారమైంది; గద్దియ, పీట; X యానం | ||
| ఆస్తి | వి సంపాదించిన, భూమి, ధనం, సొత్తు; సంపత్తి, సంపత్తు, సిరి | ||
| ఆస్తికుడు | n దేవుడున్నాడని నమ్మేవాడు; X నాస్తికుడు | ||
| ఆస్థానం | n సభ, రాజసభ, సభా మండపం; కొలువు, కొలువు కూటం; దర్భారు | ||
| ఆహరించు | v అపహరించు, ఆకర్షించు, భుజించు; ఆరగించు, నమలు | ||
| ఆహర్త | n దొంగ | ||
| ఆహవనం | n యజ్ఞం | ||
| ఆహవనీయం | n హోమం చేయదగింది | ||
| ఆహవం | n యుద్ధం | ||
| ఆహవరంగం | n యుద్ధం, యజ్ఞం | ||
| ఆహా | వై అవ్య ఆశ్చర్యార్థకం | ||
| ఆహారనాళిక | n ఆహారపు గొట్టం | ||
| ఆహారం | n భోజనం, పదార్థం; ఎర, గ్రాసం, భుక్తి | ||
| ఆహార్యకం | నంవి పాత్రోచిత వస్త్రాభరణాలు ధరించటం | ||
| ఆహార్యం | n తెచ్చుకోదగింది, అపహరించదగింది, ఆకర్షింపదగింది, కృత్రిమం | ||
| ఆహికం | n ధూమకేతువు; తోకచుక్క | ||
| ఆహ్నికం | n పగలు చేయతగింది | ||
| ఆహ్లాదం | n సంతోషం; ప్రమోదం, ప్రీతి, సంతనం | ||
| ఆహ్వానం | n పిలుపు; అభిమంత్రణం, అభిహూతి |