Jump to content

తెలుగు-తెలుగు నిఘంటువు/

Wikibooks నుండి
మంకుతనం n మొండితనం, మూర్ఖత్వం, మకురుతనం
మంకుపట్టు n మొండిపట్టు; తను అనుకున్నది జరగాలని మొండికేయు;
మంకెన n బంధూకం; ఒక జాతివడ్లు;
మంగలి n క్షౌరికుడు; అంతావసాయి, క్షురి, గ్రామణి, దివాకీర్తి, నాపితుడు, ముండి, మంగి
మంగళం n శుభం, మంగలం,
మంగళ ప్రదం n 1 శుభాన్నిచ్చేది, 2 పసుపు;
మంగళవారం n జయవారం, అంగారకవారం, వ్యతిరేక లక్షణంచే అమంగళం అయ్యేవారం
మంగళసూత్రం n తాళిబొట్టు, పుస్తే;
మంగళస్నానం n పెళ్ళికి ముందు చేయించేసానం, శుభస్నానం
మంగళాకృతి n శుభకరమైన ఆకారం;
మంచం n పర్యంకం, ఖట్వం, మంచకం కంకటి, ఖట్విక, పర్యంకం
మంచం పట్టు v వ్యాధిగ్రస్తుడవు; జబ్బుపడు, పడక పెట్టు
మంచి n మేలు, శుభం, కలుపుగోలుతనం, సామం, సజ్జనుడు, యోగ్యం , ఇంపైనది, ఫలకారి, ఇష్టం, శ్రేష్టమైనది ఉదా
మంచినీళ్ళు n పాన (తాగడానికి) యోగ్యమైన జలం తాగేనీళ్ళు
మంచిపని n ఉత్తమమైన కార్యం
మంచిమాట n 1 ప్రియభాషణం, సుభాషితం, 2 స్నేహం, పొత్తు; సంధి,
మంచిమాట చేసికొను v భోజనం చేయు;
మంచివాడు n సజ్జనుడు;
మంచు n తుహినం, హిమం; అవశ్యామం, నీహారం, తుహినం, ప్రాలేయం, మహిక, మిహిక, హేమ, ఇవం, ఇగం, వలి, తుహినం, ఊష్మం, ఆవిరి, శీతకాలం, పోషించు, కాపాడు, పెంచు, మన్నించు
మంచుకొండ n హిమాలయ పర్వతం;
మంజరి n లేతచిగురు, పూలగుత్తి, చిగిరించిన లేత కొమ్మ, బొట్టుగుచెట్టు, పూచిన లేతకొమ్మ, పూగుత్తి, పెద్దముత్తెం
మంజీరం n నూపురం, అందె, పాదాన మనోహరంగా మోగేది
మంజుల n మనోజ్ఞం, అందమైనది,
మంజుల వాణీ n మృదువుగా మాట్లాడే స్త్రీ,
మంజూరు n అంగీకారం; అధికారికంగా నిధులు వంటి ఇవ్వడం
మంజూష n పెట్టె, మందసం, మంజిష్ఠ శిల, పురం
మంట n జ్వాల, వహ్నిశిఖ, ద్వేషం, కోపం, కాలడంవల్ల కలిగే బాధ
మంటగలుపు v నశింపచేయు పూర్తిగా నాశనం చేయు;
మంటపం దేవి 1 దేవతా విగ్రహాలను ఉంచడంకోసం చుట్టూ తెరపిగ ఉండేటట్లు స్తంభాల మీద కట్టిన కట్టడం, చవికె, మండపం 2 చావడి, సభాభవనం
మంటిని n బతికాను, రక్షింపబడ్డాను; మను
మండ n చీలమండ, మణికట్టు, ముంజేయి, కుండ, వేపుడు కుచ్చు, భూమి, జెండా, జిగురు, కొమ్మ ఉసిరిచెట్టు, సుర, తప్తలోహం
మండలం n పాలన సౌలభ్యంకోసం కొన్ని ఊళ్ళు కలిసి ఏర్పరిచిన ప్రాంతం, దేశం, కుక్క, సమూహం, సూర్యచంద్రులబింబం, 12గురు రాజులు, 40 దినాల కాలం, వీలుకాని నిలకడ, ఒక వ్యూహం, ఇంద్రుని కత్తి, అలంకారం, సూర్యచంద్రులకు కట్టేగుడి;
మండిపడు v 1 ఎక్కువ కోపించు 2 కాలిపోవు;
మండు v ప్రజ్వలించు, ప్రకాశించు, వెలుగు, గాయం వంటివి చురు క్కుమని బాధ కలిగించు, తీక్షమగు, మిక్కిలి కోపించు, బాధ నొందు, చెలరేగు
మండువా v వి 1 మూడువైపుల గోడలుండి ఒకవైపుగోడ లేకుండా ఎత్తుగా కట్టిన కట్టడం; 2 పాక, 3 నాలుగిండ్ల భవంతి నడుమ ఖాళీగా ఉండే ప్రదేశం
మండూకం n కప్ప, మండుకం, తటాకాదులలో శోభిల్లేది, పికభేదం, రాజరక్షకుల చేత షర బహిర్భాగంలో ఉంచిన యంత్రభేదం
మండ్రగబ్బ n నల్లటి పెద్దతేలు; మంత్ర కవాటం
మండ్రగబ్బ n నల్లటి పెద్దవేలు, మంతనం
మంత్రం n వేదం, వేదభాగం, మంతరం,
మంత్రదండం n మంత్రాలు ప్రయోగించే కర్ర, (రహస్య దండం);
మంత్రసాని n సావిక, సుఖంగా వ్రసవించే ఉపాయంచేసే చికిత్సకురాలు;
మంత్రాంగం n మంత్రిత్వం, తంత్రం
మంత్రించు v మంత్రోచ్చారణం చేయు;
మంత్రి n సచివుడు, రహస్యమున కార్యాలోచనం (మంత్రం) కలవాడు అమాత్యుడు, ప్రెగడ, ప్రెగ్గడ, నియోగి, బుద్ధిమంతుడు, తెలివి గలవాడు, వేదాలు బాగా తెలిసినవాడు, మాంత్రికుడు, గారడివాడు
మంథరం n కవ్వం;,
మందం n 1 పరిపుష్టి బలుపు; 2 దళసరి అయినది;
మంద n ఆవులు వంటి పశువుల సమూహం, గుంపు, వశువుల సమూహం, ఆసమూహం ఉండే గోష్ఠం, గొల్లపల్లె (వ్రేపల్లె)
మందకొడితనం n చురుకుదనం / పోవడం, సోమరితనం; వ్యతి
మందగించు దే మందమతులు
మందరం n కవ్వపుకొండ, అలసం, మందారం అనే కల్పవృక్షం, బహుళం, స్వర్గం, అద్దం
మందలించు v చీవాట్లు పెట్టు, హెచ్చరించు, చెప్పు, ఆజ్ఞాపించు, విన్నవించు, అడుగు, తలచు
మందసం n పెట్టె, పెద్ద పెట్టె , మందస
మందహాసం n చిరునవ్వు, మెల్లనినవ్వు;
మందాకినీ n గంగ, ఆకాశగంగ, మందంగా వక్రగమనంతో ప్రవహించేది
మందారం n అమర తరువులలో ఒకటి; , ఇంద్రునితోటలోని ఐదు వృక్షాలలో ఒకటి, భూలోకంలోని ఒక వృక్షం, జిల్లేడు, ఉమ్మెత్త
మందిరం n ఇల్లు, గృహం, శరీరం, పట్టణం, సముద్రం, తొడ
మందు n ఔషధం, ప్రతిక్రియ, వశ్యౌషధం, ఉపాయం, తుపాకిమందు, దుర్లభం, విషయం
మందుడు n అసమర్థుడు, శని, యముడు, అల్పుడు, చొరవలేని వాడు, ఇష్టంవచ్చినట్లు తిరిగేవాడు, మూర్ఖుడు, నిర్భాగ్యుడు, వ్యాధిగ్రస్తుడు వ్యతి
మందోదరి n రావణాసురునిభార్య, మండోదరి, పలుచని ఉదరం కలది
మంద్రం n గంభీరమైనది, వాద్యభేదం, గజభేదం మకరం
మకరందం n తేనె, పూతేనె; (మరందం), దీనిచే పుష్పం అలంకరింపబడును
మకర కుండలాలు n చెవుల పోగులు, వెనలి ఆకారంగల కర్ణభూషా విశేషం
మకర ధ్వజుడు n మన్మథుడు, మొసలి జెండాగా గలవాడు
మకరతోరణం n మొసలి రూపంగా తయారుచేసిన తోరణం
మకరాంకుడు n మన్మథుడు, మొసలి ధ్వజం చిహ్నంగా గలవాడు, సముద్రుడు
మకరికా పత్రం n స్త్రీలకు చెక్కిళ్ళు వంటి తావులలో లతుకతో రాసే మకరరూపమయిన అలంకార రేఖ
మకాం n బస, ప్రయాణంలో ఉండేచోటు విడిది చేసేచోటు, బస;
మకిల n 1 మురికి, మాలిన్యం; 2 నలుపు
మకుటం n కిరీటం, వరసగా కొన్ని వద్యాల్లో అనువృత్తమయ్యే పదబంధంలేదా పద్యపాదం
మక్కా n మహమ్మదు ప్రవక్త జన్మస్థానం, అరేబియాదేశంలోని ఒక పెద్దపట్టణం;
మక్కి హీంవి ఈగ;
మక్కికిమక్కి దే ఉన్నదున్నట్లు; మక్కు
మక్కువ n ప్రేమ, కూరిమి, వాత్సల్యం, స్నేహం, వేడుక,
మక్కె n అస్థి, ఎముక, తొడఎముక;
మక్షిక n ఈగ; మఖం
మగ n పురుషజాతిది, శూరుడు, పురుషుడు, భర్త రాజు
మగడు n పెనిమిటి, శూరుడు,పురుషుడు, భర్త, రాజు
మగతనం n పరాక్రమం, మగటిమి, పురుషత్వం; మగతనిద్ర
మగవాడు n 1 పురుషుడు; 2 మగడు, భర్త;
మగిడిమగువ n 1 స్త్రీ, ఆడుది, 2 ప్రియురాలు, భార్య , ఒగం
మగుడు v మరలు, తిరుగు, పోవు, బాగుపడు;
మగ్గు v కమియపండు, ఉక్కచే చెమ్మగిల్లెడు , మాగు, ఆవిరిమీద చక్కగా ఉడుకు, చచ్చు
మఘ n అశ్విని వంటివాటిలో 10వ నక్షత్రం;
మఘవుడు n ఇంద్రుడు, మఖవుడు, యజ్ఞాలలో పూజింపబడేవాడు
మచ్చ n పుట్టుమచ్చ, గుర్తు, చిహ్నం, కళంకం, మాలిన్యం, మరక, కురుపుగాయం మానిన తరవాత ఏర్పడ్డ గుర్తు, జాడ, దృష్టాంతం
మచ్చరం n ఈర్ష్య, ఓర్వ / పోవడం, విరోధం, స్పర్ధ, ద్వేషం, పట్టుదల, పోటీ
మచ్చిక n చనువు, మోహం, మచ్చిగ, భ్రమ, ప్రేమ, ఆసక్తి
మచ్చు దే
మజా ,అవ్య ప్రశంసార్థకం, మజ, మజా, మజ్జ, మజ్జా
మజిలీ n నివాసం, ఉండటం, ప్రయాణంలో తాత్కాలికంగా ఒకచోట ఆగడం;
మజుందారు n ఆడిటర్, తాలూకు శిరస్తుదారు;
మజ్జనం n స్నానం, మునగడం అవగాహన;
మజ్జనకుడు n (మత్+జనకుడు), నాతండ్రి,
మజ్జిగ n చల్ల, దండాహతం; మార్జిక, మోరట, రసాయనం, మోరి, మోరు, చక్రం, అరిష్టం, కాలశ్యం , గోరసం, మనరసం, ఫలం, ఫళం, మధితం, కచ్చరం, కటురం, స్తన్యజంమటుకు
మటుమాయం n అదృశ్యం , కానరానిది, మటుమాయ, మాయావి, నికృష్టం, మోసం
మట్టం n సమానం, సమానం, పొట్టిది, అల్పం, కొలది
మట్ట n ఆకుతొడిమ, కొబ్బరి తాటి వంటి వాటికమ్మ, ఆవులు వంటివాటి తోక, కొబ్బరితాటి వంటివాటికమ్మ, చిన్న చెట్టు
మట్టికొట్టుకుపోవు v నశించు, పూర్తిగా చెడిపోవు, నిరాధారమవు నిర్లక్ష్యానికి గురవు
మట్టు v తొక్కు, పీడించు, అణగదొక్కు, అధఃకరించు, బాధించు, చుట్టుముట్టు, పడవేయు, ప్రవేశించు, ప్రదేశం, అందం, విధం, అమరిక, మూలం, మేర, పరిమాణం, మర్యాద, ఆధారం, పాతు
మట్టు పెట్టు v చంపు, వధించు, అణచు, చంపు, తెగగొట్టు, సమాధానపరచు, కుదురుపరచుమట్టి
మట్టుపడు v నశించు, అడగు, చచ్చు, స్థిరపడు
మట్టె n స్త్రీలుకాలి రెండవ వేలుకు ధరించే ఆభరణం, మన్ను, మట్టియ
మఠం n సన్యాసులు వంటివారు మటం, ఆశ్రయం, చైత్యం, నిలయం, ప్రవజ్య++
మఠాధిపతి n మఠం పాలకులు;
మడ ఏవి ప్రవాహమార్గం? , మడవ, ఒకజాతిచేప, ఒకజాతిచెట్టు
మడక n అరకదున్నడానికి ఎడ్లను కట్టిసిద్ధం చేసిననాగలి, మడుపు, పల్లం, స్థలం, ఊరు
మడగు v క్షీణించు, తగ్గు, మణగు,లొంగు, చెడు, వంగు
మడత n వస్త్రం వంటి మడుపు, కడుపు మీది మడుపు, ధౌతవస్త్రం, భక్ష్యవిశేషం
మడత పేచీ n చిక్కుముడి, చిక్కు సమస్య, (వెలికలు), అర్థంలేని అభ్యంతరం, కేవలం అడ్డంకులు పెట్టడానికి లేవనెత్తిన అభ్యంతరం
మడది స్త్రీ, భార్య , మడతి;
మడమ n చీలమండ కిందిభాగం; 2, వెదురుసోల వంటివాటి అడుగు భాగం
మడమ మడి n 1 వరి వంటి పంటలకు నీరు నిలవడానికి నలుదిక్కుల గట్లువేసి ఏర్పరచిన పొలం, కేదారం 2 మడుగు, పొలం, ధౌతవస్త్రం, రెట్టింపు (ముమ్మడి)
మడియు v నశించు, చచ్చు, తునుగు, ముక్కలవు, చెడు
మడివాలు n చాకలి;
మడివేలు, మడేలు మడుగు n కొలను, సరస్సు;
మడ్డి n నూనె వంటివాటిలో తేరగా అడుగున నిలిచే పదార్థం, ఏదైనా పదార్థాన్ని మరిగిస్తే నిలిచే చిక్కటిసారం, నూనెమడ్డి, మూఢుడు, మొద్దుమణి
మణికట్టు మివి ముంజేయి, మణిబంధం;
మణిప్రవాళం n రెండుభాషలు కలిసిన కవిత్వం , వేరువేరు భాషలలోని పదాల సాంకర్యంవల్ల ఏర్పడ్డభాష, భాషలు కలిసిన కవిత్వం
మణిరాజం n వజ్రం, మణులలో శ్రేష్టమైనది;
మణుగు n ఎనిమిది వీసెలకొలది, పరిశుద్ది, పరిశుద్దవస్త్రం
మతం n విశ్వసింపబడినది ఆస్తికులు ఏర్పరచుకొన్న ఒక వ్యవస్థ,
మతంగం n మబ్బు, మేఘం,విరహులకు ఉద్దీపన మయ్యేది
మతంగజం n 1 ఏనుగు, 2 మబ్బు , 1 మతంగుడనే ఋషివల్ల మట్టినది 2 మేను భ్రాంతిని కలిగించేది
మతంగుడు n 1 ఒకానొకముని, 2 ఒకానొక రాక్షసుడు
మతకం n కపటం, కుత్సితం, మాయ, గుట్టు
మతకరి n మాయకలవాడు, మాయలాడి;
మతప్రచారకులు n మతాన్ని ప్రచారం చేసేవారు;
మతల్లి n శ్రేష్ఠురాలు; మతల్లిక
మతి n బుద్ది, జ్ఞానం, మనస్సు, వాంఛ, వాక్కు, తలపువిధం, కోరిక, తెలివి, స్మృతి, రీతి
మతోనోదం n మతపిచ్చి;
మత్కుణం n నల్లి, కొబ్బరికాయ, దున్నపోతు, కొబ్బరిచెట్టు, దంతాలులేని ఏనుగు
మత్తు n 1 మదం, మత్తా, 2 మైకం (నిద్దుర మత్తు) కొవ్వు
మత్తుడు n మదించినవాడు; ఉత్కటుడు, క్షీబుడు, శాండుడు
మత్తుపానీయాలు n మత్తును కలిగించే ద్రావకాలు;
మత్సరం n అసూయ, ఓర్వ / పోవడం, క్రోధం, ఆత్మధిక్కారం, ద్వేషం, గర్వం, లోభం;
మత్స్యం n చేప, మీనరాశి, ఒక పురాణం, మాంసం హరించే ఇచ్చతో హర్షించేది
మత్స్యావతారం n శ్రీవిష్ణుని దశావతారాలలో మొదటి అవతారం;
మథనం n చిలకడం, చిలికేది, నశింపజేసేది, ధ్వంసంచేయడం
మథనపడు మిక్రి మానసిక సంఘర్షణ చెందు, బాధపడు;
మథుర n యమునానదీ తీరంలోని శ్రీకృష్ణుని జన్మస్థానమైన పట్టణం
మదజలం n మదపుటేనుగు గండస్థలాల నుంచి స్రవించే కొవ్వు, మదింపజేసేవాడు
మదమడగు మిక్రి బలహీనుడగు గర్వాన్ని అణచు;
మదర్ n తల్లి, అమ్మ, మాత మూలం, (ఇక్కడ మదర్ థెరిసా);
మదింపు n అంచనా, ఇంత అని వెల వంటి వాటిని ఊహించడం
మది n మనస్సు, బుద్దీ, ఇచ్చ, చషకం (పానపాత్రం), కృషిసాధనం;
మదిర n మద్యం, కల్లు, తాగితే మదింప చేసేది
మదిరాక్షి n స్త్రీ, మదం కప్పిన కళ్ళు గలది; మోహింపచేసే
మదీయం n నాది, నా సంబంధమైనది;
మద్దతు దే తోడ్పాటు, సాహాయ్యం, మద్దత్తు
మద్ది n సాలం, అర్జునం, ఒకజాతిచెట్టు;
మద్దెల n మృదంగం; మద్యం
మద్యపానం n కల్లుతాగడం;
మద్యపానుడు n కల్లుతాగిన వాడు;
మధుకం n తుమ్మెద, పూదేనెను చేసేది, భిక్షాన్నం, జీవన వృక్షం
మధుకోశం n తేనెపట్టు;
మధుపం n తుమ్మెద, తేనెటీగ, మధువు (తేనె)ను పానం చేసేది
మధుపర్కం n పెరుగు, నేయి, నీరు, తేనె, పంచదార అనే అయిదువస్తువుల సముదాయం, 1 పెరుగుతో కలసిన తేనె, 2 పెళ్ళిలో వధూవరులకిచ్చే వస్త్రాలు
మధుమాసం n వసంతం;
మధురం n తియ్యనిది, మనోహరమైనది, శోభనం, వరి, జీలకర్ర, విషం, తగరం, శర్కరలో ఒక విధం
మధుర n పూలతేనె, మకరందం, మాధుర్యం, తేనె, తియ్యనిది, ద్రాక్షలత, చెరకు
మధుర స్మృతులు n తీయని తలపులు;
మధురిమ n మాధుర్యం తియ్యదనం, కమ్మదనం, చక్కదనం;
మధువు n తేనె, పాలు, నీరు, కల్లు, మకరందం, చైత్రం, వసంతరువు, ఇప్పచెట్టు, నెయ్యి, ఒక రక్కసుడు, పాలకూర
మధువ్రతం n తుమ్మెద, పాలచెట్టు, పూదేనెను మాత్రం తాగే వ్రతం కలది
మధుసూదనుడు n విష్ణువు, మధువు అనే రాక్షసుని చంపినవాడు
మధ్యం n నడిమిది, నడుము, అవకాశం, న్యాయం, నడితరముది, పక్షపాతంలేనిది
మధ్యందినం n మధ్యాహ్నం, పట్టపగలు
మధ్య n నడుమ, నడి, నడిమివేలు, లజ్జామన్మథ మధ్యస్థయు ఉదిత యౌవనా అయిన స్వీయనాయిక, ఒకానొక ఛందస్సు
మధ్యమం n నడుమనున్నది; నడుము, నడిమిది, ఒక స్వరం
మధ్యమ n నడిమివేలు, దుద్దు, వాగ్బేదం, చెరసాల, పౌర్ణమి, కొత్తగా సమర్తాడిన పడుచు, మధ్యమ నాయిక
మధ్యమ పురుష n నీవు, మీరు కర్తలుగా కలది, ప్రథమ మధ్యమ ఉత్తమ పురుషములలో నడిమిది; ఎదుటి వారి గురించి చెప్పేది
మధ్యరాత్రం n అర్థరాత్రం, నిశీథం, నడిరేయి;
మధ్యవర్తి n రెండు పక్షాల వాదం విని తీర్పు చెప్పువాడు;
మధ్యాహ్నం n మధ్యందినం, పట్టపగలు, దివాభాగం మధ్యకాలం;
మనం n మనసు, బుద్ధి, నీవు నేను
మననం n ధ్యానం, ఆలోచన, జ్ఞానం, యుక్తులచే పొందబడిన సిద్దాంతం
మననీడు v ఉండనీయడు;
మనవడు n పౌత్రుడు, కొడుకు, లేదా కూతురు కొడుకు, మనుమడు
మనవి n విన్నపం, విజ్ఞప్తి, ప్రార్థన
మనవు దే కాపురం, జీవనం, పెండ్లి, వృత్తి, ప్రవర్తన, కాపురం
మనసారా ,అవ్య మనసుపూర్తిగా;
మనసిచ్చు v గుట్టుచెప్పు, రహస్యం తెలుపు;
మనసిజుడు n మన్మథుడు, మనస్సులో ఉదయించేవాడు
మనసు n చిత్తం, ఉల్లం, మనస్సు, హృదయం, లింగశరీరా వయవం, తలపు, కోరిక, మణిసిల, అభిప్రాయం, వలపు, అనురాగం జీవాత్మకంటే భిన్నమైన జ్ఞానజనక ద్రవ్యం
మనసులో ముల్లు మివి ఎక్కువ బాధ;
మనస్కరించు v ఇష్టపడు, ఇష్టమగు;
మనస్తత్వాలు నంవి మనస్సు (స్థితులు) స్వభావాలు;
మనస్తాపం n మానసికబాధ, అనుతాపం, పశ్చాత్తాపం;
మనస్వి n 1 ప్రశస్తమైన మనస్సు గలవాడు 2 విద్వాంసుడు
మనికి దేవి బతుకు, జీవనం, ఉనికి, నెలవు, స్థానం
మనియార్డరు n సొమ్ము చెల్లింపుకు వంపే ఆజ్ఞాపత్రం నిర్దిష్టమైన, (సాధారణంగా పోస్టాఫీసులో లేదా బ్యాంకులో కానీ జారీ చేస్తారు)
మనీష n బుద్ధి, తెలివి, అన్నింటిని తెలిసికొనేది
మనీషి n వండితుడు, తెలివిగలవాడు, బుద్ధికలవాడు
మను v బ్రతుకు, జీవించు దేవి మట్టి, భూమి; మనుబోతు; ఒకజాతి జింక, వృద్ధినొందు, వర్తిల్లు, ఉండు, పుట్టు, శోభిల్లు, ధన్యుడగు;
మనుగడ n జీవనం, సుఖజీవనం, జీవిక
మనుచు v బ్రతికించు, మంచు, మన్చు, పెంచు, నిలుపు, పోషించు, రక్షించు
మనుజుడు n మనుష్యుడు, మానిసి, మనువువల్ల పుట్టినవాడు (నరుడు), మానుషుడు, మర్త్యుడు, మానవుడు, నరుడు, పంచజనుడు, మానిసి, మనిషి మనిసి, పురుషుడు, పూరుషుడు, జనుడు
మనుమరాలు n దౌహిత్రి, కూతురుపుత్రి, కొడుకు కూతురు;
మనువు n జీవనం; సం వి మంత్రం, విష్ణువు, కాలాగ్రజుడు స్వాయంభువాది పధ్నాలుగురిలో ఒకడు పెళ్ళి తరవాత తొలిసారి అల్లుడికి అత్తగారింట చేసేవిందు, అల్లెం, మగడు, వర్తనం, పోషించు,
మనోజ్ఞం n మనోహరమైనది; అందమైనది;
మనోనిగ్రహం n స్టైర్యం, మనస్సును నిలకడగా ఉంచడం;
మనోరంజనం n మనస్సుకు ఉల్లాసం కలిగించడం;
మనోరథం n కోరిక, ఇచ్చ;
మనోవరి మివి భరణం, విడాకులిచ్చిన స్త్రీ జీవనానికి భర్త ఇచ్చే భృతి;
మనోవికాసం n మనస్సు వికసించడం;
మనోవ్యథ n మనసులోని బాధ;
మనోహరం n ఆకర్షణీయం, అందమైనది;
మనోహరి n మనస్సును ఆకట్టుకొనేది, చక్కనిది;
మన్నన n గౌరవం, సమ్మానం, ఆదరం, అనుగ్రహం
మన్ననివారు n గౌరవింపదగినవారు;
మన్నించు v క్షమించు, సన్మానించు, గౌరవించు, ఆదరించు,
మన్నూమశానం n మట్టిదుమ్ము;
మన్నె n పర్వతప్రాంతప్రదేశం, మన్నెం, సన్మానించి ఇచ్చిన భూభాగం, పన్నులేనిభూమి, కొండభూమి
మన్మధుడు n మారుడు, కామదేవుడు, మనస్సును కలత పెట్టేవాడు మదనుడు, ప్రద్యుమ్నుడు, మీనకేత నుడు, కందర్పుడు, దర్శకుడు, అనంగుడు, కాముడు, పంచశరుడు, స్మరుడు, శంబరారి, మనసి జుడు, కుసుమేషువు, అనన్యజుడు, పుష్పధన్వుడు, రతిపతి, మకరధ్వజుడు, ఆత్మభువు, శ్రీపుత్రుడు, శూర్పకారాతి, బ్రహ్మసువు, ఋష్యకేతువు, విశ్వకేతువు, అలరువిల్లుడు, చక్కెర విలుకాడు, చిలుకరవుతు, చెరకువిలుడు, పూవిలుడు, మరుడు, లచ్చికొడుకు, వలరాజు, కంతుడు
మప్పు v అలవాటుచేయు, నేర్పు, అభ్యసింపజేయు , మరపు
మబ్ళు n మొయిలు, మేఘం, అజ్ఞానం, చీకటి, మత్తు
మభ్యపెట్టు వైక్రి మోసంచేయు, ఉపాయంగాదాటవేయు
మమకారం నంవి నాది అనే అభిమానం;
మమత n అభిమానం, ప్రేమ,, తనది అనుకోవడం, గర్వం, అహంకారం
మయి n 1 శరీరం, మెయి, మై 2 మార్గం
మయిమరచు v పారవశ్యం పొందు, ఒడలెరుగకుండు , మైమరచు
మయుడు n అసురుల శిల్చి; మయూఖం
మయూరం n నెమలి, పాములను హింసించేది, నెమిలి, నెమిలిజట్టు;
మయూరి n ఆడు నెమలి; మర
మరందం n లే పూదేనె;
మరకతం n పచ్చ, నవరత్నాలలో ఒకటి;
మరగు v మచ్చికపడు, పరిచితమగు, ఆసక్తమగు, అలవాటుపడు, స్వాధీనమగు, వలచు, అభ్యసించు, గ్రహించు, ఆశించు, ఆశ్రయించు
మరచెంబు n తిరుగుడు చెంబు, మరమూతి గల చెంబు;
మరణం n చావు; పంచత్వం, కాలధర్మం, ప్రళయం, త్యజం, అంతం, నాశం, మృత్యువు, నిధనం, దీర్ఘనిద్ర, హింస, ప్రమాలనం, కాలం;
మరదలు n 1 తమ్ముని భార్య, 2 భార్య చెల్లెలు 3 మగని చెల్లెలు 4 తనకంటే చిన్నదైన మేనమామ, మేనత్తల కూతురు
మరల ,అవ్య పునరర్థకం, మళ్ళీ;
మరలబడు v తిరగబడు, వెనుకకుదిరుగు, ప్రతిఘటించు, మారుపడు
మరలు v వెనుకకుపోవు, పోవు, తిరుగు, శాంతించు, విముఖమగు, సుడివడు;
మరామత్తు n బాగుచేయడం, మరమ్మతు
మరాళం n హంస; వికఅంచ;
మరింత n ఇంకా కాస్త (మరి+ఇంత),అవ్య పిమ్మట, అనంతరం, ఇంకా, ఇంకా, నిశ్చయంగా, ఇదిగాక, తడవ, పక్షాంతరాన, పలుమారు, అన్యం, అట్లు మరీచినివ్వరు జగన్ని మిమ్మిపు
మరి n తడవ, పర్యాయం;
మరిది దైవి 1 భర్త తమ్ముడు; 2 చెల్లెలి భర్త 3 తనకంటే చిన్నవాడైన మేనత్త /మేనమామ కొడుకు
మరీచిక n మృగతృష్ణ ఎండమావులు;
మరుక్షణం విణ వెంటనే
మరుగు జొచ్చు v భరణం పొందు;
మరుగుపడు v చాటవు, దాగు, కనిపించకపోవు, పాతబడు; అంతరం, అంతర్థ, అంతర్థి, అపవారణం, అపిధానం, ఆచ్చాదనం తిరోధానం
మరుత్తు n గాలి, మరువకం, వేల్పు, పిక్క, పర్వతశిఖరం,
మరునాడు n తెల్లవారి, పరదినం, మరుసటిదినం, తరవాతరోజు, రేపటిరోజు , మర్నాడు
మరున్నగం n దేవతావృక్షం;
మరుపు n విస్మృతి, అజ్ఞానం, పారవశ్యం, మూర్చ, పొరపాటు
మరులు దే మోహం, వలపు;,
మరులు దీగ n తొక్కగానే అజ్ఞానం కలిగే ఒకానొక ఓషధి
మరులుగొను v మోహంపొందు, ఉన్మత్తుడగు , మరుల్కొను
మరువం n సువాసనగల ఒకానొక చిన్నచెట్టు కులసౌరభం, కులకం, ఖరపుష్పం, జంబీరం, అల్లం, పాల్వం, దలామలం, ప్రస్తపుష్పం, మరువు, మరువకం, శీతలం
మరుసటిరోజు n తర్వాతిరోజు
మరోదిక్కు n వేరొకదిశ
మరోలా n వేరొకవిధంగా;
మర్కటం n కోతి, వానరం, దాటేటప్పుడు కొమ్మల సందునబడి చచ్చేది,
మర్త్యలోకం n భూలోకం, మనుష్యలోకం
మర్త్యుడు n మానవుడు, మనుష్యుడు, నరుడు, మృతినొందేవాడు, భూలోకంలో పుట్టినవాడు చూ మనుజుడు
మర్మం n రహస్యం, ఆయువుపట్టు, అవయవాల సంధి; గూఢార్థం, ఆలోచన, సలహా, తుమ్ములు కలిగించేమందు
మర్మజ్ఞుడు n రహస్యం తెలిసినవాడు
మర్యాద v వి క్రమం, మేర, కట్టుబాటు , మరియాద,
మర్రి n వటవృక్షం, మజ్జి కర్మజం, కాంచనం, క్షీరద్రుమం, క్షీరం, క్షీరి, జటి, ధ్రువం, నంది, న్యగ్రోధం, పాదరోహం, బహుపాత్తు, బహుపాదం, యక్షావాసం, రక్తపలం, రోహి, వటం, వనస్పతి, విటపి, క్షీరకాష్ఠ గుటిక
మల n పర్వతం, కొండ;
మలక n వంకర అయినది, చుట్టు, మెలిక, చిక్కు, మలపు, కుటిల ప్రవర్తనం, పరిమాణ విశేషం
మలగు v వెనకకు మరలు, పక్కకు తిరుగు, వంకరగు, తొలగు, చుట్టుకొని ఉండు, తిరుగు, వర్తిల, క్షీణించు, ప్రజ్వలించు, వెనుదీయు
మలచు v చెక్కు, వెనకకు తిప్పు, వంచు, కదల్చు, అడచు, పరివేష్టించు, పక్కకుతిప్పు
మలమల n మరగడం, మాడటం, వేగడం వంటి వాటి ధ్వనికి అనుకరణం;
మలమూత్రాలు n పేడ, ఉచ్చలు;
మలయానిలుడు n దక్షిణవాయువు, మలయ పర్వతం నుంచి వీచేగాలి
మలయు v పోటీపడు, సంచరించు, వ్యాపించు, వీచు, వర్తించు, ఒప్పు, ఉత్సహించు, చెలరేగు, పోరాడు, ప్రతిఘటించు, చలించు, ఆలసించు, తపించు
మలాం n బంగారం వంటివాటి పూత, పుండుకు పూ సేపూత, ఒక ధాతువు పై ఇంకొక ధాతువును పొరగా పరచడం, గాయాలకు పెట్టేపూత మందు , మొలాం
మలిగంతు n రెండోగంతు (దూకు)
మలిగ n అంగడి, దుకాణం, మాళిగ
మలినం n మురికి అయినది, పాపం, చక్రం, వెలిగారం, దోషం, నీరు
మలిభాగం n రెండో భాగం;
మలుపు v మార్పు, ఆర్పివేయు, నశింపజేయు, చేక్కడం;
మలేరియా n విషవాయువు, జ్వరాదులను పుట్టించే వాయువు;
మల్ల యుద్ధం n మల్లులు చేసే యుద్ధం, ద్వంద్వ యుద్ధం, బాహుయుద్ధం;
మల్లడి n మిక్కుటం, అతిశయం, పెనకువ, పరితాపం
మల్లాడు v పెనగులాడు, అతిశయించు క్రీడించు, విహరించు, కష్టపడి పనిచేయు;
మల్లి n కుందం, వెల్లజాతిలో ఒకటి, మత్స్యభేదం, కపాలం, కొబ్బరికాయ మొదలగు వాటి చిప్ప
మల్లుపంచే దే మిల్లులో నేసిన సన్నని ధోవతి;
మల్లె దే మల్లెతీగ, మల్లెపూవు, మల్లియ అష్టాపది, ఆస్పోట, కుటజ, గంధవతి, గిరజ, త్రిపుర, నారీష్ట, ప్రమోదని, భద్రవల్లి, ముక్తబంధన,, మల్లిక, రాజపత్రి, వనచంద్రిక, వల్లిక, వార్షికి, విప్రియ, శీత, శ్రీపది, షట్పద ప్రియ, సురూప, సులభ, సువర, సౌమ్య, హసంతి, మహామేద జీవని, దేవమణి, సుచ్ఛిద్ర, సస్యరోగం, రెమ్మ, మంటి కంచం
మల్లేనే ,అవ్య లాగానే, వలెనే;
మళిగలు n అంగళ్ళు
మవ్వం n కోమలం, మనోజ్ఞం, శోభాకారం, సూక్ష్మం, విధం, ఉత్సాహం
మసక n కొంచెం నలుపు, మునిచీకటి;
మసగిన v విణ విజృంభించిన
మసలు v ఆలస్యంచేయు, జాగుచేయు, తడయు, విహరించు, నీళ్ళు మలమలకాగు, వెనుకకు తిరుగు
మసలుకొను v మెలగు, విహరించు;
మసి n నల్లటిచూర్ణం, బూడిద, మాలిన్యం, సిరా, కాటుక
మసీదు n మహ్మదీయుల మందిరం
మస్తకం n తల, శిరస్సు
మస్తు n 1 సమృద్ధి, చాల; 2 మదం, మత్తు
మహజరు n బహుజనుల రాత పూర్వకమైన విన్నపం, సామూహికంగా చేసుకొనే రాత పూర్వకమైన విన్నపం, దరఖాస్తు, అర్జీ;
మహతి n నారదుని వీణ (నూరు తంత్రులు గల నారదునివీణ), వంగచెట్టు, ఒకరకంవీణ, బృహతి మహత్కార్యం
మహత్తర నిర్మాణం n గొప్పకట్టడం;
మహత్తు n గొప్పది, సమృద్ధమైనది, పొడవైనది, పవిత్రమైనది, ఒంటె, మహర్లోకం, బుద్ధి
మహదవకాశం n గొప్ప అవకాశం;
మహనీయత n గొప్పదనం, ఘనత;
మహనీయుడు n ఘనుడు, గొప్పవాడు;
మహలు n మేడ, హర్మ్యం, భవంతి, మహల్
మహాంగం n ఒంటే, గొప్ప అవయవాలు గలది
మహా ప్రసాదం n గొప్పదయ, మహాప్రసన్నత;
మహా భాగవతం n ఒకానొక పురాణ గ్రంథం; వ్యాసుడు రచించిన పద్దెనిమిది మహాపురాణాల్లో ఒకటి
మహాకావ్యం n గొప్పకావ్యం, ఉత్తమకావ్యం; , అష్టాదశ వర్ణనాదులు కలిగినది;
మహాత్ముడు n ఘనత చెందినవాడు, ఉదారస్వభావం గలవాడు, ఘనత చెందినవాడు, సుకృతి
మహాదేవుడు n శివుడు, దేవులలో శ్రేష్ఠుడు మహేశ్వరుడు, మృడుడు, మృత్యుంజయుడు, మహానటుడు, మహాకాలుడు, ముక్కంటివేల్పు
మహానసం సం వంటిల్లు, అధికమైన భోజనోపకరణాలు కలది
మహానుభావుడు n గొప్పబుద్ది గలవాడు, ఔదార్యం కలవాడు, గొప్ప సామర్థ్యం కలవాడు
మహాపండితుడు n గొప్ప విద్వాంసుడు;
మహాపతి n రాజు; మహ్రుహం
మహాపాతకం n గొప్పపాపం, పెద్దతప్పు, బ్రహ్మహత్య, స్వర్ణస్తేయం, సురాపానం, గురుపత్నీ గమనం, ఇవి చేసే వారితో స్నేహం అనేవి పంచమహాపాతకాలు
మహాపురుషుడు n గొప్ప పురుషుడు, 2 విష్ణువు
మహాప్రధానులు n గొప్ప ప్రధానులు;
మహాప్రళయం n బ్రహ్మ ప్రళయం, కల్పాంతం;
మహాప్రస్థానం n మరణం, చావు, లోకాంతర యాత్ర
మహాబలుడు n చాలా బలం కలవాడు, బుద్దుడు, వాయువు, చాలా బలం కలవాడు
మహాభాగ్యం n గొప్ప అదృష్టం; 2 మిక్కిలి ప్రాశస్త్యం;
మహాభారతం n ప్రసిద్ధమైన ఒకానొక ఇతిహాసం, కౌరవపాండవుల చరిత్రను తెలిపే ఒక మహాకావ్యం
మహాభాష్యం n పాణిని రాసిన అష్టాధ్యాయి అనే వ్యాకరణ సూత్ర గ్రంథానికి పతంజలి మహర్షి రచించిన వ్యాకరణ భాష్యం;
మహాభోగి n గొప్పభోగి;
మహామతి n 1 ఉదార మనస్సు కలవాడు, 2 బుద్ధి మంతుడు, 3 బృహస్పతి
మహామతి మహా మనీషి
మహామహుడు n చాలా గొప్పవాడు;
మహామూర్తులు n గొప్ప ఆకృతులు గలవారు
మహాయుధం సం
మహాయోగి n గొప్పయోగి; కోడిపుంజు
మహాయోధుడు మహి n భూమి, శక్తి, జ్ఞానం, మహిమ, ఉత్సవం, నాసికాగ్రం, ఒకనది,
మహారథుడు n పదివేల మంది విలుకాండ్రతో అసహాయుడై పోరే
మహిత n ఉత్తమమైన, పూజింపదగినది;
మహితాత్ముడు n పూజింపదగిన వాడు, గౌరవింప దగినవాడు;
మహిమ నంవి గొప్పదనం; అష్టసిద్దులలో ఒకటి, విధం
మహిళ n స్త్రీ,
మహిళా సదస్సు n స్త్రీలసభ;
మహిషం n ఎనుబోతు, దున్న, బలం కలదగుటవల్ల ఆదరింప బడేది లులాయం, వాహద్విషం, కాసరం, సైరిభం, దుంత, జమునెక్కిరింత, దున్న
మహేశుడు n శివుడు; మహోదయుడు
మహోద్యమం n గొప్ప ఉద్యమం;
మహోన్నతం n మిక్కిలి ఉన్నతమైనది;
మహోన్నతవ్యక్తి n గొప్ప ఉన్నతమైన వ్యక్తి;
మహోపకారం n గొప్ప ఉపకారం;
మహౌషధం n గొప్పమందు, అల్లం, వెల్లుల్లి, వత్సనాభమనే విషం, సొంటి మా
మాంగల్యం n శుభప్రదం, శుభసూచకం, శుభం, అభివృద్ధి, తాయెత్తు, తాళిబొట్టు
మాంద్యం n మందగించడం, సోమరితనం, తెలివితక్కువ, దౌర్బల్యం, ఔదాసీన్యం, అనారోగ్యం, జడత్వం
మాంసం n నంజుడు, పలలం, శరీరచర్మానికీ ఎముకలకూ మధ్య ఉండే కండ; పిశితం, తరసం, పలలం, క్రవ్యం, ఆమిషం, కుల్యం, ఎరచి, పొల, పొలసు, ఈరువు, నంజుడు, క్రిమి, మాంసం అమ్మేజాతి, కాలం
మాంసాంతరం n వేరొక మాంసం;
మాకందం n మామిడి చెట్టు మాకు
మాగన్ను n నిద్రవచ్చే ముందు వాలిన రెప్పలతో ఉన్న కన్ను, తూగు వల్ల ఏర్పడిన అరమోడ్పుకన్ను;
మాగాణం n క్షేత్రం, వరిపండేభూమి తరిభూమి;
మాగాయ n 1 మామిడి కాయలతో ఒక విధంగా తయారు చేసిన ఊరగాయ, 2 మామిడికాయ
మాగు v మిగులపండు, కమయు
మాఘం n 1 తెలుగు నెలలో 11వది 2 శిశుపాలవధ, (మాఘుడు రాసిన కావ్యం)
మాచిపత్రి n ఒకానొక చెట్టు, దాని ఆకు
మాట n వచనం, పదం, పలుకు, వాక్యం; ఉక్తి, గోవు, పలుకు, భారతి, భాషితం, లసనం, లసితం, వక్తవ్యం, వచనం, వ్యాహారం, ఇడ, ఇర, ఇల, వాక్యం, వార్త, విషయం, హితోక్తి, చరిత్ర, కథ, నింద, తిట్టు, వివాదం, లోకోక్తి, సూక్తి, శాస్త్రయుక్తి, ఆజ్ఞ, ప్రతిజ్ఞ, ప్రార్థన
మాట ఇచ్చు v వాగ్దానం చేయు మాటకారి
మాటకారితనం n వాగ్మిత్వం, చక్కగా మాటలాడటం;
మాటపడు v నిందపొందు;
మాటాడు v పలుకు, ప్రసంగించు, వచించు, నిషురాలాడు, ఆలోచనం చేయు, వ్యతిరేకంగా చెప్పు
మాటామంతీ n పలుకూ ప్రసంగం, సంభాషణ, మాట్లాడటం, ముచ్చట
మాటిమాటికి ,అవ్య అడుగడుగునకు, వెంట వెంట, పదేపదే
మాటు n తడవ, తూరి; చాటు, తెర, ఛత్రం, అతుకు, రక్షణస్థానం,
మాటు పరచు v మరుగుపరచు మాడ
మాడవు n హర్మ్యం , డాబా, మేడ, మాడుగు;
మాడ్కి n రీతి, విధం, ఉపమావాచకం రూ మాడికి;
మాణిక్యం n కెంపు అరుణోపలం, కురువిందం, కూవ్యం, తరుణం, పద్మరాగం, రంగమణి, రత్నరాట్టు, రవి, రత్నం, లోహితం, లక్ష్మీపుష్పం, శృంగారి, శోణం, శౌగంధికం, విక
మాతంగం సంవి, ఏనుగు, మతంగుడు అనే ఋషివల్ల పుట్టినది
మాత n తల్లి, జనని, జనని, గోవు, భూమి, లక్ష్మి, పార్వతి బ్రాహ్మి, అపరాలు కొలిచేవాడు
మాతలి n ఇంద్రసారథి, మతలుడు అనే వాని కుమారుడు, సారథికర్మలలోగల సమస్త మతాలను ఎరిగినవాడు
మాతహీనులు n తల్లిలేనివారు
మాతాపితలు n తలిదండ్రులు;
మాతామహి n అమ్మమ్మ , మాతామహుడి భార్య, తల్లితల్లి
మాతామహుడు n తాతయ్య, తల్లితండ్రి
మాతాశిశుసంక్షేమం n తల్లిపిల్లల క్షేమం;
మాతులుడు n మేనమామ, తల్లి తోడబుట్టినవాడు
మాతృదేశం n జన్మభూమి, పుట్టినదేశం;
మాతృద్రోహి n తల్లికి ద్రోహంచేసినవాడు
మాతృభాష n తల్లితండ్రుల నుంచి సంక్రమించిన భాష
మాతృభూమి n జన్మభూమి పుట్టినగడ్డ,
మాతృమూర్తి n తల్లి;
మాత్ర n ఔషధపుగుళిక, అక్షరావయవం, వర్ణం, అలంకారం, సందేహం, నిశ్చయం, కొలది, సర్వం, ధనం, పరివారం, తృటికాలం
మాత్రాచ్చందస్సు n మాత్రల సంఖ్యచేత ఏర్పరుపబడిన వృత్తం, ఆర్యాది వృత్తం
మాత్సక n మూలం, జనని;
మాత్సర్యం n అసూయ, ఓర్వలేనితనం, అనిష్టం, కోపం
మాదకం n మత్తు కలిగించేది పిచ్చెత్తించేది
మాదశులు n మాబోటివారు, నాలాంటివారు
మాదిగ n షెడ్యూల్డ్ కులాల్లో ఒకటి, షెడ్యూల్డ్ కులానికి చెందినవాడు చండాలుడు అంత్యజుడు, హరిజనుడు
మాదిరి n సదృశం, సాటి, పోలిక, మాద్రి, సాదృశ్యం, పద్దతి, ఔపమ్యం
మాద్రి n పాండురాజు రెండో భార్య;
మాధవసఖుడు n శివుడు;
మాధవీలత n గురివెంద తీగ;
మాధవుడు n (కృష్ణుడు), విష్ణువు, లక్ష్మీదేవికి భర్త, యదుపుత్రుడు మధువు వంశంలో పుట్టినవాడు, శత్రువులను భయపెట్టేవాడు
మాధుకరం n మధుకర వృత్తిచే తెచ్చిన భిక్షం, పూలలోని తేనెను తుమ్మెదలు గ్రహించే విధంగా గృహస్థుల ఇళ్ళకెళ్ళి వారిని బాధించక భిక్షకులు భిక్షాన్నిగొని జీవించడం
మాధురి n తీపి, తియ్యదనం, మద్యం
మాధుర్యం n తియ్యదనం, తీపి, ఆకర్షకమైన అందం, కావ్యగుణాలలో ఒకటి, దయ, సుశీలం
మాధ్యమిక n పాఠశాల విద్యలో నడిమినుండేది, ప్రాథమికం పైది, నడుమ ఉన్నది, మధ్యస్థం
మానం n ఆత్మాభిమానం, పౌరుషం, కొంచెం, ఆ గ్రహం, స్త్రీలకోపం, మానిక, గర్వం, అభిమానం, మరియాద, తులామానం, మనోగౌరవం
మాననీయుడు n గౌరవానికి అరుడు, మన్నింపదగినవాడు;
మానరేఖ నంవి ఆత్మాభిమాన చిహ్నం
మానవంతుడు n అభిమానం కలవాడు;
మానవ కల్యాణం n మానవుల క్షేమం;
మానవతా మూర్తి n మానవత్వం ఆకారం దాల్చినవాడు;
మానవతావాది n మానవత గురించి వాదించేవాడు; ప్రతివిషయాన్ని మానవతాదృష్టితో విచారించే పద్ధతి;
మానవతి n మానిని, అసూయచే కలిగిన కోపంగలస్తీ;
మానవత్వం n మనిషి లక్షణం, మానవతాదృష్టి
మానవాళి n మానవుల సమూహం
మానసం n మనస్సు, హంస, మానసికం , గూఢంగా ఉన్నది;
మానసికం n మనస్సంబంధమైనది
మానసికాఘాతం n మానసికమైన దెబ్బ;
మానాభిమానాలు n గౌరవాభిమానాలు;
మానికి n నాలుగు సోలలకొలది రూ మానిక, మాన రెండువ్వల పరిమాణం
మానిత n గౌరవింపదగిన;
మానిని n ఆత్మాభిమానం ఉన్న స్త్రీ; పట్టువీడని స్త్రీ, భర్తమీద కోపం ప్రదర్శించిన స్త్రీ
మానిసి దే మనిషి, స్త్రీ, సేవకుడు, యోధుడు
మాను v వదలు, విడుచు, చెట్టు, మనోజ్ఞత, ఒప్పు
మానుకొను v వదులుకొను, విడుచు;
మానుషం n మనుష్య సంబంధమైనది, మిధునరాశి, తులారాశి, కన్యారాశి, అభిమానం, గౌరవం,
మానేయు v వదలి పెట్టు, విడిచి పెట్టు
మాన్చు దే పోగొట్టు, నశింపజేయు, నివారించు
మాన్యాలు n గౌరవ పూర్వకంగా దానమీయబడే భూములు;
మాన్యుడు n గౌరవార్థుడు;
మాన్యువల్ n చిన్న పుస్తకం (Manual)కరదీపిక
మాపటివేళ n రాత్రివేళ;
మాపనం n కొలవడం, త్రాసు, తక్కెడ;
మాపు n సాయంకాలం, రాత్రి, మురికి, నశింపచేయు
మాపుడు n మాసినది, మలినమైనది;
మామ n మేనమామ, తల్లికి తోడబుట్టినవాడు, భర్తతండ్రి, భార్యతండ్రి, మాతులుడు, శ్వశురుడు, మామవరుసవాడు
మామిడి n చూతం, మావిరూపం, మావిడి; ఆత్రం, అంబరీషం, అమ్రాతకం, కామవల్లభం, కామశరం, కామాంగం, కీరేష్టం, కోకిలానందం, కోకిలావాసం, గంధబంధువు, చామర పుష్పం, మాకందం; రసాలం, అంబాళం, అంబష్ఠ, ఆమ్లపాటలం, అత్తతకం, కపిచూడ, కపిచూతం, కపీతనం, టంకం, పీతనం, బృహద్బీజం, రక్తపుష్పం
మామూలు v,n 1 సాధారణం, సామాన్యం , 2 వాడుక మామూలుగానే ఉండి 'ఓహో, కొంచెం నిలు' అన్నది
మాయం n అదృశ్యం, కానరానిది, మాయోపాయం;,
మాయ n అవిద్య, ఇంద్రజాలాది విద్య, దంభం, వంచన, మోసం, గారడీవిద్య, మంత్రవిద్య, బుద్ధుని తల్లియగు మాయాదేవి, ప్రధానం, ప్రకృతి, ఒకానొక పట్టణం, గయ, లక్ష్మి, కృప, ఒకానొక విష్ణుశక్తి, తెగడ బుద్ధి, విష్ణువు, అసురుడు, అజ్ఞానం, రతీదేవి, పార్వతి, దయ, భ్రమ
మాయదారి మివిణ మాయావి, మోసగాడు;
మాయావి n మోసగాడు, ఇంద్రజాలికుడు, మాయలమారి, మోసపుచ్చేవాడు, యుక్తిపన్నేవాడు;
మాయు v కాంతి హీనమగు, మలినమగు;,
మారటనోరిది n ఆడిన మాటలనే ఆడేది, చెప్పిన దానినే మరలచెప్పేది
మారణాయుధాలు సంవి చంపడానికి ఉపయోగించే ఆయుధాలు
మారాం n పెంకేపట్టు, మంకు, గారాబంతోకూడిన పట్టుదల;
మారాకు n రెండవ ఆకు, (చిగురోత్తు);
మారాడు v బదులు చెప్పు, ఎదురుచెప్పు;
మారు v రూపాంతరం పొందు, వికృతి పొందు, మార్పుచెందు, ఎదుర్కొను, ప్రతిఘటించు;
మారు మనువు n స్త్రీ రెండోసారి చేసుకొనే పెళ్ళి;
మారు మాట్లాడకుండా v విణ ప్రతివచనమివ్వకుండా,
మారుజవాబు n తిరుగు సమాధానం;
మారుడు n కామదేవుడు, మన్మథుడు
మారుతం n వాయువు, గాలి, మరుతుల (గాలి) సంబంధమైనది, వాత(రసం, స్వాతి నక్షత్రం
మారుతాత్మజుడు n భీముడు, ఆంజనేయుడు, వాయువు, కుమారుడు
మారుతి n హనుమంతుడు, వాయుదేవుని కుమారుడు, భీముడు, స్వాతి నక్షత్రం
మారుపల్కు v ఎదురు మాట్లాడు, ప్రతివచనమిచ్చు
మారుమాట n ప్రతివచనం, మరుమాట
మారుమూల n చాలాలోపల, ఎక్కువవాడుకలేనిచోటు
మారుమొగం n పెడమొగం;
మారొడ్డు v ప్రతిఘటించు, ఎదురుచెప్పు
మార్కులు n గుణములు, గుర్తులు (మార్క్)
మార్కెట్ n అంగడి వీధి, బజారు గంజ్, టోకువర్తకం కోసం ఏర్పరచిన విఫణివీధి, క్రయ విక్రయాలు జరిగే ప్రదేశం **** ఉత్పత్తి అయిన సరుకు మార్కెట్ అవడానికి అవకాశం ఉండాలి
మార్కొను v ఎదుర్కొను, ఎదిరించు
మార్క్ n గుర్తు
మార్గం n త్రోవ, దారి; అయనం, రుతి, స్మృతి, పంథ, వర్మం, అధ్వం, పదవి, తెన్ను, తెరువు, తెర్వు, వీధి, జాడ, తెరగు, తెరవు, తెరుకువ, రస్తా, నడవ, సరవి, కంత, క్రంత, పరిశోధన, పరిశీలన, సాధనం, కార్యం నడి పేరీతి, పద్దతి, శైలి, వెదకడం, సూచించడం, కస్తూరి, మృగశీర్షనక్షత్రం, మార్గశీర్షమాసం, సంగీతంలో ఒక భేదం, ముగసంబంధ మైనది
మార్గణం n బాణం, ప్రార్థించడం, యాచించడం, వెదకడం, అయిదుసంఖ్యకు సంకేతం, ఒక విధమైన ధనుస్సు
మార్గదర్శకం n దారి చూపేది
మార్గదర్శకులు n దారి చూపేవారు
మార్గస్తుడు n బాటసారి అధ్వరుడు, అధ్వనీనుడు, అధ్వనుడు, ఇత్వరుడు, తెరువరి, దారినడుచువాడు, పాంథుడు, బాటసారి
మార్గాలు n దారులు;
మార్చు v వినిమయం చేయు, ఒక వస్తువుఇచ్చి మరో వస్తువు పుచ్చుకోవడం, నశింపజేయు, పరివర్తనం నొందించు, మారుపరచు, వడ్డించు
మార్జాలం n పిల్లి, , మార్తారం, మూషికాలను తినడంవల్ల గృహాన్ని శుద్దిచే సేది
మార్జిన్ n అంచు (మార్జిన్)
మార్తాండ మండలం n సూర్యమండలం;
మార్తాండుడు n సూర్యుడు, మార్తాండుడు, మృకండుడనే వాని కొడుకు బ్రహ్మాండం మృతి (రెండు శకలాలుకావడం) నొందినపుడు పుట్టినవాడు
మార్థవం n 1 మృదుత్వం, నెమ్మది 2 సాధుత్వం
మార్పు n రూపాంతరం పొందు, వికృతి
మార్బలం మివి శత్రుబలం మార్మోగు
మాల n 1 దండ 2 దేవి షెడ్యూల్డ్ కులాల్లో ఒకటి, షెడ్యూల్డ్ కులాల్లో ఒకదానికి చెందినవాడు; ప్లవుడు, మాతంగుడు, దివాకీర్తి, జంగముడు, నిషాదుడు, శ్వపచుడు, అంతేవాసి, పుల్కసుడు, అంత్యజుడు, హరిజనుడు,
మాలకాకి n బొంతకాకి మాలకారుడు
మాలిక n పూలదండ, విరజాజిచెట్టు, కూతురు, ఒకనది, ఒకపక్షి, రాజగృహం, సమూహం, పంక్తి రూపమైనది మధ్యం
మాలిన్యం n మురికి, మైల, పాపం, నలుపు, బాధ, నొప్పి
మాలిమి n చనువు, వాత్సల్యం, ప్రేమ;
మాల్యం n దండ, మాలా సంబంధమైనది, పూలదండ, పువ్వు, శిరసుపై ధరించిన మాల
మాల్యవంతం n ఒకానొక పర్వతం, సప్తగిరులలో అయిదోది (హిమ వంతం, గంధమాదనం నిషధంవింధ్యం,మాల్యవంతం, పారియాత్రం, హేమకూటం అనేవి కులగిరులు)
మావటివాడు n ఆధోరణుడు, మావుతుడు
మావి n 1 మామిడి, చూతవృక్షం, 2 గర్భస్థ పిండాన్ని ఆవరించి ఉండే మాయ, మాంసం పొర, జరాయువు, ఉల్బం మాషం
మాష్టరు n ఉపాధ్యాయుడు, గురువు పండితుడు (మాష్టరు)
మాసం n నెల, త్రోవ, మార్గశిర మాసం, వెదకడం, బౌద్ధజ్ఞాన భేదం, మూడి, కస్తూరి, మృగశిర, చంద్రగ్రహం, పన్నెండు సంఖ్యకు సంకేత పదం, రెండున్నర చిన్న మెత్తు
మాసికం n మాససంబంధమైనది, ఆబ్దికం దాకా ప్రతినెలకూ చేసే శ్రాద్ధ కర్మం
మాసిక n అతుకు;
మాస్టరు డిగ్రీ n ఏంఏ లేదా దానితో సమానమైన పట్టం
మాహాత్మ్యం n గొప్పతనం, మహాత్మత్వం;
మింగు v నోటిలో వేసుకొని గుటుక్కుమనిపించు;
మించు v అధికమవు, హెచ్చవు, అతిశయించు, అతిక్రమించు, కాలిచుట్టు ఆధిక్యం, ప్రకాశం, మెరపు
మింట n ఆకాశంలో మిన్నుకు ఔప విభక్తిక రూపం
మిండడు n విటుడు; పురుషుడు, లేతది;
మిక్కిలి n 1 అధికం, ఎక్కువ, 2 శ్రేష్టం
మిక్కుటం n అధికం
మిగత v విణ 1 మిగిలినది, శేషించినది 2 అధికం;
మిగుల పరిశుభ్రం మివి ఎక్కువ పరిశుభ్రం;
మిగులు v మీరు, అతిక్రమించు, ఎక్కుడగు, అతిశయించు, దాటు, చెలరేగు, శేషించు, శేషం, లాభం
మిటకరించు v మిటమిటచూచు, చూడడానికనుకరణం, భయంతో కళ్ళుమూసుకొని తెరచు, సందేహించు
మిట్ట n ఎత్తైనది, ఉన్నతభూమి,
మిఠాయి n తీపి పిండివంట , మిటాయి, ఒక స్వరస్థాయి;
మిడసరిలగ్నం మివి మిట్టమధ్యాహ్నం పెట్టిన లగ్నం పట్టపగలు;
మిడి మిడి n చాలా అల్పం
మిడిల నంవి విదేహదేశము రాజధానియైన మిథిలానగరం
మిడిసిపాటు దే మిట్టిపాటు, గర్వాదులవల్ల కలిగే తుళ్ళు, పొగరు, ఎగిరిపడటం, ఎగిసిపడటం;
మిడుకు v పరితపించు, జీవం, బ్రతుకు, త్రుళ్ళు, సంచరించు, ఆరు
మిడుకు మిడుకుమను v తేజోహీనమగు, కొంచెం కొంచెంగా కనపడు, మిణుకు మిణుకుమను, అతితక్కువ కాంతితో ఆగి ఆగి ప్రకాశించు
మిడుత n శలభం, మిడత పొడవైనమడతకాళ్ళుండి ఎగిరే పురుగు; ఆకు పురుగు, దివ్వెయార్పు, చీరకం, పతంగం
మిడ్వైఫ్ n మంత్రసాని
మితం n పరిమితిగలది తోసివేయబడినది
మితభాషి n పరిమితంగా మాట్లాడేవాడు
మితవాది n మితంగా అంటే తక్కువగా వాదించేవాడు
మితి n హద్దు, మేర, గడువు, కాలపరిమితి, కొలత, తత్వజ్ఞానం, నిశ్చయం
మితిమీరు మి క్రి మేర మీరు, హద్దుదాటు, ఎక్కువగా
మిత్తి దేవి మృత్యుదేవత, మరణం, ఒకజాతితీగ, వడ్డి
మిత్రత్వం n స్నేహం, మైత్రి మిత్రలాభం
మిత్రుడు n స్నేహితుడు; వ్య
మిథునం n ఆలుమగలజత, దాంపత్యం; జమలి, జోడు, దోయి, దొందం, ద్వయం, ద్వయి, యమళం, యుగళం, యుగ్మం, యురకం, కవలలు, మిధునరాశి
మిథ్య సంఅవ్య అసత్యమైనది, మోసమైనది, అశాశ్వతం
మిద్దె n సౌధం, మేడ, మిద్దియ, డాబా, తామరపువ్వు వంటి వాటిలోని దుద్దు, ఉంగరం
మినుకు v తళతళ ప్రకాశించు రూ మిన్కు, కిరణం, మంగళసూత్రం, సూత్రం, వేదం, ఒక భూషణం, బంగారు నాణెం, కాంతి
మినుములు n మాఘసస్యం, ఒకవిధమైన పైరు; ధాన్యమాషం, మాషకం, మినుములు, ఉద్దులు
మిన్న ,అవ్య ఎక్కువ, అధికం, శ్రేష్ఠం, మణి, కాంతి, ధనం, బొమ్మ, నగ
మిన్నక ,అవ్య మాటాడక, అప్రయత్నంగా, నిష్కారణంగా, వ్యర్థంగా, ప్రతిక్రియ / , సులభంగా
మిన్ను n ఆకాశం,, భూషణం, మణి, శ్రేష్టమైనది, పదోత్తర ఘటితశ్రేష్ఠవాచకం
మిన్నుముట్టు v సంతోషంతో ఉప్పొంగు, ఆకాశాన్నంటు,
మిన్నేరు ఆకాశగంగ వ్య
మిరప n మిరపకాయలకు సంబంధించిన
మిరాశీలు n వంశపారంపర్యంగా వచ్చిన హక్కు లేదా ఆస్తి పరంపరగా అనుభవం ఉండేసొత్తు, వారసత్వపు ఆస్తిహక్కులో వంశపారంపర్యంగా వచ్చే గ్రామ ఉద్యోగం వంశపారం పర్యంగా అనుభవించే భాగస్వామ్యం
మిరాసి n వంశ పారంపర్యంగా వచ్చే గ్రామోద్యోగం గలవాడు
మిరియం n ఒక విధమైన సంబారు వస్తువు, మరీచం కారంగా ఉండే ఒకరకం నల్లనిగింజ;
మిరుమిట్లు గొల్పు v కళ్ళు ఎక్కువగా చలింపజేయు దృష్టిని చెదరచచేయు, మిరుమిట్లు
మిలమిలలాడు v తళతళ ప్రకాశించు, మెరియు;
మిలిటరీ హెడ్ క్వార్టర్స్ n సైన్యపు బసలు, సేనానివాసాలు
మిలియను n పదిలక్షలు;
మిల్లి n చిన్న గరిటె; మిళిందం
మిళితం n కలిసినది, కూడినది, మిలితం
మిశ్రం n కలిసినది
మిశ్రణం n కలపడం, కూడిక;
మిశ్రితం n కలపబడినది;
మిష n నెపం, సాకు;
మిషనరీ n మత ప్రచారకుడు, ఫాదర్
మిషను n కుట్టేయంత్రం, యంత్రం;
మిసిమి n నూతన కాంతి, నవనీతం, పండ్లకప్పు, స్నిగ్ధం
మిస్సు n తప్పడం, పోగొట్టుకోవడం
మిహిక n మంచు, హిమం;
మిహిరుడు n సూర్యుడు, వేవు రూపాన్ని దాల్చి ప్రపంచాన్ని తడి పేవాడు
మీగడ n కాగినపాల మీది తెట్టె, పెరుగుమీద తెట్టే, మీవడ
మీట n బొత్తాం, యంత్రంకీలు
మీటరు n ఒక కొలత, 3937 అంగుళాలు
మీటించు v తీగపై వేళ్ళు కదలించి పలికించు
మీటు v వీణ వంటి వాయించు, మోగించు, ఎగజిమ్ము, వేలితోకొట్టు, పోగొట్టు, ఏయు, ఊడదీయు, కుట్టు, మిడుచు, సొగసు, శ్రేష్ఠం, పెద్దది, ఉద్రేకం, పొడుచు
మీడియం n మాధ్యమం;
మీదు n ఉపరిభాగం, పై, పరం, పైభాగం, ముడుపు, రాబోవుకాలం
మీనం n చేప, మినరాశి
మీన మేష వివాదం(బులు) n సోమరితనంతో వృథాగా కాలంగడపే తగవులు; మంచి చెడ్డలు;
మీమాంస n లోతుగా తెలిసికోవడం , పరిశీలన, పరిశోధన, షడ్దర్శనాలలో ఒక దర్శనం
మీరిన v దేవిణ మించిన
మీరు v ఉల్లంఘించు, దాటు, నిరసించు, అతిక్రమించు, ఒప్పు, అతిశయించు, కలుగు, గతించు, సఫలమగు
మీలితం n మూయబడినది; మీసం
ముంగల n ముందు, ముందుచోటు పురోభాగం , ముంగడ, ముందర
ముంగాలు n పాదాగ్రం; (ముందు +కాలు)
ముంగి దే ముంగిస, నకులం, ముంగిస, కోటీరం, కౌశికం, పింగళం, బభ్రువు, వంచకం, సర్పారి, బలి, శుచివక్రం, ఎక్కువగా మాట్లాడని వ్యక్తి ముంగిలి
ముంగురులు n అలకలు, నొసలి పై ఆడే ఉంగరపు వెంట్రుకలు
ముంగొంగు n చెంగుకొన, మునికొంగు
ముంచు v మునగజేయు, ఆచ్చాదించు, నశింపజేయు, అతిశయించు, కలుగు, విజృంభించు
ముంచెత్తు 'దేక్రి మునగజేయు;
ముంజె v దేవి లేత తాటికాయలోని గిజురు (మెత్తటి పదార్థం)
ముండ n విధవ, విశ్వస్త, దాసి, ఉంపుడుకత్తె, దూర్తురాలు, కొన్ని నియమాలున్న భిక్షుకులు
ముండమోపి n విధవ, ముండమోసినది; వితంతువు, భర్తపోయిన స్త్రీ
ముండమోయు v వైధవ్యం పొందు;
ముండ్లపంది n ఏదుపంది, శల్యం;
ముంత దే దార్వాది కలశం, మానిక, చెంబు, కుండ, మానిక,మూడున్నర సేరు
ముందంజ n ముందడుగు;
ముందటేడు n కడచిన సంవత్సరానికి పూర్వ సంవత్సరం (ముందు + ఏడు);
ముందడుగు n అభివృద్ధి, మొదటి పాదం;
ముందర దే ముందుభాగం, పురోభాగం, వెనుక, మొదటికాలం, భవిష్యత్కాలం, పూర్వకాలం;
ముందస్తు n మొదట;
ముందు n పూర్వకాలం; తొలి, తొల్లి, తొలుత, పూర్వం, ముందర, మునుపు, భవిష్యత్కాలం, ఉత్తరకాల ఫలం, పురోభాగం, సమ్ముఖం;
ముందెన్నడు అవ్య పూర్వం ఎప్పుడు;
ముంపు దేవి ముంచడం, వద్ది, వెల్లువ, గుంపు, అతిశయం, లక్ష్యం
ముకుందుడు n విష్ణువు, మోక్షం ఇచ్చేవాడు
ముకుటం n కిరీటం, తురాయి, పర్వతశిఖరం
ముకుదాడు n నాథం, ఎడ్లకు ముక్కున గుచ్చేదారం;
ముకుదూలం n ముక్కునడిమి ఎముక;
ముకుబంటి n ముక్కులోతు;
ముకురం n అద్దం, దీనిచే అలంకరింపబడతారు, మల్లె చెట్టు, రేగుచేటు, పొగడచెట్టు
ముకుళించు v మోడ్చు, ముడుచుకొను;
ముక్కంటి దేవి శివుడు, త్రిలోచనుడు, మూడు కన్నులు ఉన్నవాడు
ముక్క n 1 చిన్నమాట; 2 ఖండం, తనక
ముక్కన్ను n మూడోకన్ను, మూడుకన్నులు;
ముక్కర దే ముక్కుకు అలంకరించుకొనే వలయాకార ఆభరణం, నత్తు , ముంగర
ముక్కారు n మూడు కాలాలు; మూడు పంటలు; (మూడు + కారులు)
ముక్కాలిపీట n మూడుకాళ్ళు అమర్చిన ఎత్తుబల్ల , ముక్కలిపీట(మూడు+కాళులు+పీట)
ముక్కాలు n ముప్పాతిక; ముప్పావు, నాలుగువంతుల్లో మూడువంతులు(మూడు+కాళులు)
ముక్కిడి n ముక్కులేనివాడు, ముక్కులేనిది;
ముక్కు n నాసిక, నోటికి పై భాగంలో ఉండే అవయవం, మూర్కొను (వాసనచూసే) సాధనం ఘాణం, గన్జవహ, ఫణ, నాస, నశ్య, ముక్కు, శ్వాసం స్తంభించు, స్తనాగ్రం, తుద, చెడిపోవు;
ముక్కు కరచి v ముక్కుతో పట్టుకొని;
ముక్కు విరుచు v నిరసించు, ఆక్షేపించు, ఇష్టపడకపోవు, అసంతృప్తి పొందు;
ముక్కుపుటాలు n ముక్కు రంధ్రాలు;
ముక్కోటి n వైకుంఠ ఏకాదశి ధనుర్మాసంలో వచ్చే శుక్లఏకాదశి(మూడు + కోటులు)
ముక్కోపి మివిణ శీఘ్రంగా కోపం వచ్చేవాడు;ఎక్కువకోపం ఉండే వ్యక్తి
ముక్తకం n ఏకశ్లోక రూపమైన ఖండకావ్యం, అస్త్రం, గద్యం,
ముక్తకంఠం n పైకి గట్టిగా అనడం, ఐక్యకంఠం, ఏకకంఠం
ముక్తకంఠం n పైకిగట్టిగా అనడం ఐక్యకంఠం, ఏకకంఠం;
ముక్తాయింపు n ముగింపు, ముగించడం;
ముక్తాహారం n ముత్యాలదండ;
ముక్తి n 1 మోక్షం, శరీర ఇంద్రియాలవల్ల ఆత్మ విడువ బడడం, ఆత్మను సంసార బంధాలవల్ల విడిపించేది; 2 విడుపు, విడుదల విక
ముఖం n నోరు, మోము; వక్రం, ఆస్యం, వదనం, తుణం, ఆననం, ఆపనం, ప్రతీకం, మొగం, మోర, వాయి, మూతి, మొగం, మాట, నోరుతల, చనుమొన, ద్వారంవైపు, పీఠిక, పైభాగం, ప్రభావం, ఉపాయం, మొదలు, ఆధారం, ఊరిముందరి భూమి, రాగి, ఆరంభం, నాటకంలో ఒక సంధి
ముఖద్వారం n నది సముద్రంలో కలిసే చోటు, నది సముద్రంలో కలిసే చోటు
ముఖమార్జనం n మొహం కడుక్కోవడం;
ముఖవర్చస్సు n ముఖంలోని తేజస్సు; ముఖకాంతి;
ముఖస్థం n సమక్షంలో
ముఖాముఖి సంఅవ్య సమ్ముఖంలో, సమక్షంలో,
ముఖ్యం n ప్రధానమైనది;
ముఖ్య అతిధి n ప్రధానమైన అతిథి సమావేశాల్లో ప్రాతినిధ్యం వహించేవ్యక్తి;
ముఖ్యాశయం n ప్రధానమైన ఆశయం, ప్రధానోద్దేశం;
ముగింపు n సమాప్తి; ముగియు
ముగ్గ n ఒకానొక శృంగార నాయిక, ఉదయిస్తున్న యవ్వనం గలది, 16 సంకు మించని వయసుగల బాలిక, యౌవనం ఉదయిస్తున్న స్త్రీ, తెలివిలేనిది, కొత్తది, చక్కనిది
ముగ్గు n రంగవల్లి; సున్నంపొడి, సుద్ద;
ముగ్గుడు n తన్మయుడు;
ముగ్ధభావం n మనోహరమైన భావం;
ముచ్చట n వేడుక, సల్లాపం, కోరిక, ప్రేమ, వృత్తాంతం, రమ్యం,
ముచ్చటపడు v ఎక్కువకోరు తహతహపడు;
ముచ్చటించు v మాట్లాడు;
ముచ్చిలి n ముచ్చిలి గుంట, పెడతలలోని గుంత;
ముచ్చు n దొంగ, అరటిపువ్వులలోని వస్తు విశేషం, వంచకుడు
ముచ్చు n దొంగ, మోసగాడు, మనసులోని మాటదాచి మాట్లాడకుండా ఉండేవాడు, ముచ్చు
ముజ్జగాలు మివి మూడులోకాలు; (మూడు+జగాలు)
ముట్టడించు v కోటవంటి !వాటిని చుట్టుకొని నిర్బంధించు, దాడిచేయు;
ముట్టించు v అంటించు, వెలిగించు; 2 నిప్పు తగిల్చి మండించు,
ముట్టు v చెందు, ప్రాప్తమగు; వి
ముట్టె n 1 పశువు వంటివాటి మూతి; 2 పందిముక్కు;
ముఠా n గుంపు;
ముడి n మూట, గ్రంథి, ఎద్దు మూపురం, సంధి, కలహం, వికసింపనిది, పొట్టుతో ఉండేది, దారపుముడి;
ముడివజ్రం n సానబట్టని వజ్రం;
ముడుచు v తురుము, తలలో బెట్టుకొను, ముడుగజేయు, మూటకట్టు, నిలువచేయు, అపహరించు, ముడివేయు, తురుము, పెట్టు, కట్టు;
ముడుత n వస్రపునెరి, కడుపుమీదివళి;
ముడుపు n ధనం కట్టిన మూట, ధనం, దేవుడికి సమర్పించడానికి మూటకట్టి పెట్టిన ధనం
ముత్తవ n అమ్మమ్మ అత్త, అమ్మమ్మ తల్లి లేదా నాయనమ్మ తల్లి లేదా నాయనమ్మ అత్త, అవ్వ;
ముత్తాత దే తాతతండ్రి లేదా తండ్రితాత, తల్లితాత, మూడో తాత
ముత్తైదువ దేవి వృద్ధసువాసిని, ముదుసలి సుమంగళి అయిన వివ
ముత్యం దేవి మౌక్తికం; ఆణే, కువలం, చినుకు, పాణి, ముక్త హిమం, ముక్తాఫలం, బూస, సారంగం; వికృ
ముత్యాలసరం దే ముత్యాలహారం;
ముదం n సంతోషం, హర్షం;
ముదనష్టం n చెడు, ఎక్కువనష్టం, పిల్లలులేని వాడు చనిపోగా కలిసివచ్చిన ఆస్తి వంటి
ముదల n ఆజ్ఞ, ఉత్తరువు, లక్ష్యం, గురి;
ముది n ముదుసలివాడు, వృద్దుడు, ముదుసలిది వృద్ధురాలు
ముదిత n 1 స్త్రీ, వనిత, 2 ఆనందం;
ముదిమి n ముసలితనం, వార్ధక్యం;
ముదు n చుంబనం, కోరిక, ముద్ర, మనోజ్ఞత, ఆదరం
ముదుక n ముసలివాడు, వృద్దుడు, దళసరి అయింది, సాంద్రమైంది, స్థూలం
ముదురు v లేతదనం వీడి పరిణతి నొందు;,
ముదుసలి n వృద్దుడు, వృద్దురాలు, వృద్దం;
ముద్ద n 1 కడి, కబళం, ఉండ, కబళం, పిండం, ముగ్గ (అమాయకురాలు)
ముద్దరాలు n ముగ్గ, గోల, పదహారేండ్ల ప్రాయం మించనిది, సంపూర్ణ యౌవనావిర్భావంకానిది
ముద్దాడు v ముద్దు పెట్టుకొను పిల్లలను బుజ్జగించు;
ముద్దాయి n కక్షిదారుడు, వకీలును కోరుకున్నా వ్యాజ్యెడు ప్రతివాది;
ముద్దుగా అవ్య అందంగా, మనోజ్ఞంగా;
ముద్దుగుమ్మ n మనోజ్ఞురాలు; స్త్రీ, మనోజ్ఞురాలయిన స్త్రీ,
ముద్దుటుంగరం దే ముద్రగల ఉంగరం, అక్షరాలు చెక్కిన ఉంగరం
ముద్ర n సీలు, ముద్దర, న్యత్యముద్ర, నాణెం, ఒకఅలంకారం, సంజ్ఞాక్షరాలున్న ఉంగరం
ముద్రణం n అచ్చుపని, ముద్రిత ప్రతి ముద్రించడం
ముద్రవేయు మిక్రి ముద్రించు, సీలువేయు
మునగ n సన్నటిపొడుగైన కాయలు కాసే చెట్టు, శిగ్రువు; కాక్షీదం, కృష్ణశాలి, ప్రభాంజనం, బహుపల్లవం, శోభాంజనం, శిగువు, తీక్షగంధకం, అక్ష్మీబలం, ములగచెట్టు, మోచక, బిందుఫలం, ముఖగంధం, సుమూలం, శోభనకం, స్వాదుగంధి
మునగచెట్టు ఎక్కించు జా పొగడు, గొప్పవానిగా చేయు;
మునరికొను v వ్యాపించు, చుట్టుకొను;
ముని n రుషి, మౌనందాల్చి ఉండేవాడు, బుద్దుడు, దమనకం మొక్క, మామిడి చెట్టు, ప్రియాలువుచెట్టు, ఆరంభం, కొన
మునిమనుమడు n పౌత్రుని పుత్రుడు, ప్రపౌత్రుడుదౌహిత్రుని పుత్రుడు
మునిమాపు n ప్రదోషకాలం, సంజ;
మునిసిపాలిటీ n నగరపాలక సంస్థ, స్థానిక పరిపాలన సంస్థ
మునీంద్రుడు n మునిశ్రేష్ఠుడు, శాక్యముని, భరతుడు, ఒకానొకరాక్షసుడు
మునుగు v మునకవేయు, తలమునిగేవరకు నీళ్ళలోకి పోవడం తలను ముంచడం, మగ్నమగు, కుంగు, అస్తమించు, కప్పబడు, లగ్నమగు, నశించు, తీరు, నాటు, పూర్ణము మునుపు
మునుము n వరస, పంక్తి, ఎదుటిచోటు, సేనా ముఖం, తరచుదనం
మునుముట్టు v సాంతం అగు, మొదలంటు;
మునుమును n మొట్టమొదలు, తొలిసారి;
మున్నీరు n సముద్రం, మొదటినీరు, సృష్ట్యాది నుంచీ ఉన్న నీరు
మున్ను n పూర్వం, ముందు
మున్నుడి దే ముందుమాట, తొలిపలుకు;
మున్నూరు n మూడువందలు; మున్ముందు
ముప్పతిప్పలు n శ్రమలూచిక్కులూ;
ముప్పాతిక n ఒక వస్తువులోని నాలు భాగాలలో మూడు భాగాలు, మూడు పాతికలు (3/4);
ముప్పావలా n ఒక రూపాయలో నాలువంతులలో మూడువంతులు, (మూడు+పావులాలు), ముప్పావులా
ముప్పు n విపత్తు, చేటు;
ముప్పుటలా n మూడు పూటలు;
ముప్పేట n సంతోషం, మూడు పేటలుగలది;
ముప్పొద్దు n మూడు పూటలు; (మూడు+ప్రొద్దులు)
ముబ్బడి n మూడురెట్లుగలది, త్రిగుణితం;
ముముక్షుత్వం n మోక్షం పై ఇచ్చ;
ముముక్షువు n ముక్తిపై కోరిక ఉన్నవాడు , మోక్షేచ్చ ఉన్నవాడు
ముమ్మరం n ఉగ్రం, అతిశయం, చాలా ఎక్కువ;
ముమ్మారు n మూడు పర్యాయాలు, మూడు తడవలు;
మురళి n పిల్లనగ్రోవి, మురలి,
మురళీధరుడు n శ్రీకృష్ణుడు, పిల్లనగ్రోవి తాల్చినవాడు
మురారి n శ్రీకృష్ణుడు, మురాసురునకు శత్రువు
మురికి n మలినం, మాలిన్యం కసటు, కల్మషం, చిలుము, పులు, మలం, మయిల(ల)
మురిపెం n విలాసం, అందం, నడకలోని కులు కు, సౌందర్యం, శృంగారగర్వం, సంతోషం
మురియు v సంతోషించు, కులుకు, గర్వించు, తిరుగు, ప్రకాశించు, తెగు, ఊడు, విరుగు
మురిసిపోవు v సంతోషించు, గర్వపడు, కులుకు, ముక్కలవు, ముచ్చటపడు, వక్కలగు
మురుగు v కుళ్ళు, మలినమవు, నలు, ఆభరణ విశేషం,
మురుగుకాలువ n మురికినీరు ప్రవహించే కాలువ;
మురువు n సౌందర్యం, చక్కదనం, గర్వం, విలాసం, శోభ, బంగారుకడియం
ములికి n బాణం; బొంగరపుముల్లు, (మేకు) , ముల్కి,
ములుకు n తీర్ఘమైనది, వాడియైనది;
ములుకోల n ములుగర్ర, గుర్రాలనుతోలే సాధనం, మునికోల
ముల్లంగి n ఒకజాతి దుంప; కటిమూలం, కురకందకం, గజకంద, గృంజనం, క్షారకం, బాలేయం, పిండమూలం, మూలకం, హస్తికందం, హస్తిదంతకం, హరపర్ణం, హిలమోచిక ముల్లు
ముల్లె n మూట, ముల్లియ, ముళ్ళే
మువ్వ n 1 కింకిణి, మొనను మూడు సందులుగల పెద్దగజై 2 ఒకానొక పట్టణం
మువ్వన్నె n మూడు రంగులు కలది; (మూడు+వన్నెలు)
మువ్వీసం n రూకలో పదహారింట మూడు భాగాలు; (మూడు+వీసాలు)
మువ్వురు దేస ముగ్గురు; ముష్కరం
ముష్కరుడు n కుటిలుడు, దుష్టుడు, దీనుడు, మూర్ఖుడు
ముష్టింపచుడు n దరిద్రుడు, పిడికెడు బియ్యం వండుకొనేవాడు
ముష్టి n పిడికిలి, పిడికెడి బియ్యం , కత్తిపీడి, సమృద్ధి, ముసిడిచెట్టు, సోలెడు, నాలుగు తులాలయేత్తు, బిచ్చం, వేడికోలు
ముష్టివాడు మివి బిచ్చగాడు;
ముసరు v వ్యాపించు, పైబడు;
ముసలం n రోకలి, దుడ్డుకర్ర, శస్త్రచికిత్సలోని సాధనవిశేషం
ముసలి n ముదుసలి, వృద్ధ, (సం) ముసలం (రోకలి) ఆయుధంగా కలవాడు బలరాముడు దే, ముదుసలి, ప్రవయుడు, స్థవీరుడు, వృద్ధుడు, జీనుడు, జీర్ణుడు, జరుడు, దశమినుడు, ముది, ముదురుడు,, వృద్ధుడు, ఉడుము, బల్లి, బలరాముడు, నేలతాడి
ముసలితనం n వృద్దాప్యం, ముదిమి పెద్దవయస్సు
ముసాఫిర్లు v,n ప్రయాణికులు, బాటసారులు;
ముసిముసి n మందం, అలతి, మెల్లగా;
ముసుగు n కప్పుడు, అవగుంఠనం, ఒకవ్యక్తి తలనుగానీ, వస్తువునుగానీ మూసిఉంచే వస్త్రం , ముసుకు
ముసుగుదన్ను v కప్పుకొను;
ముసురు n ఎడతెగనివాన, వరం;
ముసురుకొను v కమ్ముకొను, వ్యాపించు;
ముస్తాబు n అలంకరణ
ముహుర్ముహుః n మాటి మాటికీ;
ముహూర్తం n నిమేషకాలం, శుభకార్యం, శుభకాలం, వివాహాదులకు నిర్ణయించిన కాలం,, 12 క్షణాల (2గడియల) కాలం, రెండు గడియలకాలం, అల్పకాలం, శుభకార్యం
ముహూర్తకాలం n క్షణకాలం, కొంచెం సేపు రెండు ఘడియలకాలం
మూక n 1 గుంపు, 2 దండు;
మూకుడు n మూత, కుండమీద వూయడానికువయెగించే మృణ్మయపాత్రం, శరావం ఉదంచనం, కూర్మ పృష్టం, బ జీవం, బుచీషం, ఖల్లిక వర్ధమానం, దబ్బడం, దబ్బు, బూరెల మూకుడు, శరావం,
మూకుమ్మడి n అంతాకలసి గుంపుగా ఏకమొత్తంగా
మూగ n మూగది, మూగవాడు, దోమ, ఒకపక్షి, మువ్వ, ఒకానొకచెట్టు,
మూగభాష మివి మాటలులేకుండా (అభిప్రాయూలు) భావాలు వ్యక్తపరచడం;
మూగు v చుట్టుకొను, ముసరు, గుంపుగూడు, అతిశయించు, వ్యాపించు,
మూట v వి బట్టలు మొ!!వాటి ముడి, గ్రంథి, ముల్లె;
మూడు v 1 దేక్రి ముగియు, కలుగు, 2 దేస త్రయం, రెండుతరవాతవచ్చే అంకె,, వహ్ని, రాముడు, శిబి, అగ్ని, పావకుడు, దహనుడు, అనలం, శంకరాక్షి, పురి, లోకం, త్రీణి, కాలం, త్రయం, గుణం
మూడుకాళ్ళముసలి జా నడవడానికి ఓపిక లేనంతటి ముదుసలి, వయస్సుదాటిన తరవాత కర్రసాయంతో నడిచేవ్యక్తి
మూడుపూవులారుకాయలు జా మిక్కిలి ఉన్నతస్థితి కలిగి ఉండడం సమృద్ది, సుఖసంతోషాలతో; చేసిన పనికన్నా ఫలిత మెక్కువ రావడం అనిదీనిభావం
మూడుమూర్తులు మివి త్రిమూర్తులు, బ్రహ్మవిష్ణు మహేశ్వరులు;
మూడువంట్లు n మూడుభాగాలు (వంతులు)
మూఢనమ్మకాలు మివి గుడ్డినమ్మకాలు; అంధ విశ్వాసాలు;
మూఢాచారం n గుడ్డిగా ఆచరించడం;
మూఢాత్ముడు n మూర్ఖుడు;
మూఢుడు n మూర్ఖుడు, అవివేకి; అజుడు, యథాజాతుడు, వైధేయుడు, బాలిశుడు, మందుడు, భేలుడు, అర్చకుడు, పృథర్జనుడు
మూణ్ణాళ్ళు n మూడురోజులు, మూడుదినాలు, మూన్నాళ్ళు (మూడు + నాళ్ళు)
మూత దే మూకుడు, పాత్రలను మూయడానికి పెట్టేది
మూతి n నోటిచుట్టూ ఉండే పైభాగం, గొట్టం, సీసా వంటివి తెరుచుకొని ఉండే భాగం;
మూతి ముడుచు v బుంగ మూతి పెట్టు; అసంతృప్తిని తెలుపు;
మూత్రం n ఉచ్చ; కాల్మడి, ఉత్మం, కల్కం, కాయజలం, నీరుముట్టు, ప్రస్రావం, మేహం
మూదల n ప్రమాణం, సంబంధించినది;
మూయు v కప్పు, ఆచ్చాదించు, మూత పెట్టు, ముకుళించు
మూర n హస్తప్రమాణం, రెండు జేనల వేళ్ళకొనల నుంచి మోచేతిదాకా ఉన్న పొడవు పరిమాణం;
మూరెడు n హస్తప్రమాణంకలది, రెండుజేనల కొలది గలది;
మూర్కొను v వాసన చూచు, ఆఘ్రాణించు, మూరుకొను
మూర్ఖత్వం n అవివేకం;
మూర్ఖుడు n అవివేకి?
మూర్చ n సొమ్మసిల్లడం,, ఆత్మనెరుగమి, సంగీతంలో సప్తస్వరాల క్రమమైన ఆరోహణావరోహణాలు, అభివృద్ధి
మూర్త మాంగల్యాలు n ఆకారాన్ని తీసుకొన్న శుభాలు;
మూర్తి n విగ్రహం, శరీరం, యమదండం, కాఠిన్యం, ప్రతిమ, గొప్పదనం, స్వరూపం,
మూర్తిమంతుడు n మహనీయుడు, గొప్పవాడు;
మూర్తీభవించు v ఆకృతిదాల్చు రూపుదాల్చు;
మూర్ధన్యం n శ్రేష్టమైనది, తలనున్నది, మూర్ఖస్థానంలో పుట్టినది, ట,ఠ,డ,ఢ,ణ,ర,షఋ)
మూలం n మొదలు, అడుగు, వేరు పునాది, వ్యాఖ్యానంలేని గ్రంథం, సమీపం, కారణం, ప్రధానం, ఆధారం, ఒక నక్షత్రం, ముఖ్యపట్టణం, పొడ, క్రింది భాగం
మూల n దిజ్మధ్యం, విదిక్కు, చాటైన ప్రదేశం, ఒక నక్షత్రం, కోణం, వైపు, కొప్పు, చోటు, ఓషధివిశేషం
మూలకందం n మొదటిగడ్డ;
మూలధనం n పెట్టుబడి;
మూలపురుషుడు n వంశకారకుడు, ప్రధానమైనవాడు, ప్రధానవ్యక్తి;
మూలభూతం n ఆధారభూతం, ఆధారం;
మూలవిరాట్టు n ప్రధాన దేవుడే, ప్రధానవ్యక్తి;
మూలవ్యాధి, చిన్నమొలక బేడలు n నీటిలో నానబెట్టి పొట్టుతీసిన కాయధాన్యాల దళాలు
మూలాన్ని n కారణం చేత;
మూలిక నంవి వేరు, దుంవ మందువేరు;
మూలుగు v బాధతో ఒక విధమైన రోదన ధ్వనిచేయడం; 2 ధనదేవత వ్యర్థంగా ఉన్న నన్ను తీసుకోండని సూచిస్తూ కూయడం
మూల్యం n విలువ, వెల, లాభం, మూలధనం
మూషికం n ఎలుక, మూషకం, అన్నాదులను దొంగిలించేది, ఒకానొకదేశం, ఎలుకచెవిచెట్టు,
మూస దేఏ బంగారం వంటివాటిని కరగేపాత్ర;
మూసీనది మివి హైదరాబాదులోని గండి పేట చెరువు నుంచి మొదలై వజీరాబాదు (వాడవల్లి) వద్ద కృష్ణానదిలో కలిసే నది పేరు, దీనికి ముచుకుందానది అనే నామాంతరం కూడా ఉంది
మృగం n జంతువు, పశువు, జింక, (అడవిలో తిరిగే) ఏనుగు, మృగశీర్షం, అన్వేషణం, వేట, వేడటం, లేడి, వేటాడదగినది, పురుషులలో ఒకజాతి, శాకద్వీపంలో దేశభాగం
మృగతృష్ణ నంవి మరీచిక, ఎండమావులు, మృగాలకు నీళ్ళని ఆశగొల్పి దప్పి పుట్టించేది
మృగనేత్ర n లేడి కన్నుల వంటి కన్నులు కలది స్త్రీ, లేడి కన్నులలాగా చంచలాలైన నేత్రాలున్న
మృగమదం n కస్తూరి,, ఒకజాతి మృగం మదం
మృగయుడు n వేటగాడు, మయువు, మృగాలను వేద కుతూ పోయేవాడు, నక్క, బ్రహ్మ
మృగరాజు n జంతువులరాజు, సింహం, జంతుకోటికి ప్రభువైనది, సింహరాశి, పెద్దపులి
మృగశిర n మృగశీర్ష నక్షత్రం అశ్విని వంటి నక్షత్రాల్లో అయిదోది; ఐందవం, చాంద్రం, జాబిలిరిక్క, జింకతలచుక్క, మృగం, సౌమ్యం , హిమదీధితి,
మృగాక్షి n లేడికన్నుల వంటి కన్నులు ఉన్న స్త్రీ,, లేడి కళ్ళలాగా చంచలాలైన నేత్రాలు గలస్తీ, చేదుపుచ్చతీగ, దోస, ద్రాక్ష, కిడికంటి
మృగ్యం n వేదకదగినది, సులభంగా దొరకని, పరిశీలింపదగినది, విమర్శింపదగినది
మృడాని n పార్వతి, ముడుని భార్య
మృడుడు n శివుడు, భక్తులను మోదింపజేసేవాడు
మృణాళం n తామరతూడు, బిసం;
మృణాళిని n తామరతీగ, పద్మసమూహం, పద్మాలతో నిండిన చోటు
మృత సంజీవని n చచ్చినవారిని బతికించే విద్య, చచ్చినవానిని బతికించడం, చచ్చినవాడిని బతికించే అమృతం మృతి
మృతజీవి n చనిపోయినా జీవించి ఉండేవాడు;
మృతదేహం n శవం, కళేబరం;
మృతప్రాయుడు n చచ్చిన వారితో సమానుడు;
మృత్తిక n మట్టి, మన్ను;
మృత్పిండము n మట్టి ముద్ద;
మృత్యుంజయుడు n మృత్యువును జయించినవాడు; శివుడు;
మృత్యువాతపడు v మరణించు, మృత్యువు (యముడు) నోటిలో పడడం
మృత్యువు n మరణం, చావు, యముడు, బ్రహ్మ, విష్ణువు, మాయ, మన్మథుడు;
మృదంగం n మద్దెల, మృతు అంగంగా కలది, కొట్టబడేది, ధ్వని, వెదురు
మృదంగనాదం n మద్దెలధ్వని;
మృదుభాషి n నెమ్మదిగా మాట్లాడేవాడు, తియ్యటి మాటలు చెప్పేవాడు
మృదులం n మృదువైనది, సుకుమారమైనది, లేతది;
మృదువు n మెత్తనిది, సౌమ్యమైనది, మంచిది, శనిగ్రహం
మృద్వీకం n ద్రాక్ష, మృదువైన పండ్లు కలది
మృష సంఅవ్య అసత్యం
మృష్టాన్నం n పవిత్రమైన భోజనం, శుభ్రమైన అన్నం రుచికరమైన పదార్థాలతో కూడిన భోజనం
మెండు దేవి ఆధిక్యం, అధికం, ఎక్కువ, అతిశయం, ఉద్దతి, విధం, మిర్రు
మెంతి n ఒకరకం మందు మొక్క, ఒకజాతి పైరు; కుంచిక, మేంథి, మేధిక, వస్తిక
మెంబరు n సంఘంలో ఒకడు, సభ్యుడు;
మెకానిక్ n వాహనాలను మరమ్మత్తు చేయువాడు, పనివాడు, శిల్పి
మెక్కు v ఆబగా తిను, భక్షించు, ఎక్కువగా తిను;
మెచ్చు v శ్లాఘించు, పొగడు, ప్రశంసించు, గారవించు, లక్ష్య పెట్టు, గణించు, సంతోషం, అనురాగం, అద్భుతం
మెజార్టీ n చాలమంది, ఆధిక్యం;
మెటిక n వేలిగణుపు, అంగుళి పర్వం
మెటికవిరచు v ఏవగించు; మెట్ట నీరులేనిభూమి, పాదం, దిబ్బ, మెరకనేల
మెట్టవేయు v దిబ్బగామారు;
మెట్టినయిల్లు n అత్తవారిల్లు;
మెట్టె n స్త్రీలు కాలిరెండోవేలుకు ధరించే భూషణవిశేషం , మెట్టియ, మట్టియ,
మెట్టె ఎటు n సోపానం, పైకి ఎక్కడంకోసం దాదాపు ప్రతి ఆరంగుళాల ఎత్తులో ఏర్పాటుచేసిన నిర్మాణం, కొండ, తిప్ప, మొత్తం, మజ్జిగ, తొక్కు, ప్రాపు, తల, కాలు, పాదరక్ష;
మెట్రిక్ n కాలేజీలో చేరడానికి ప్రవేశపరీక్ష, 11వ తరగతి;
మెడ దే తలకూ, మొండేనికి మధ్య ఉండే శరీరభాగం, అర్రు, గ్రీవం; కుత్తిక, కుత్తుక, గొంతు గొంతుక, పీక, పేక, కంఠం, కంధరం, కంధి కుహరం, కంబువు, గళం, గాత్రం, నిగర్ణం, ప్రగ్రీవం,
మెడపట్టీలు దే టైలు, మెడకు అలంకరణ కోసం కట్టుకునేరంగు గుడ్డలు;
మెడల్స్ n బహుమానపు పతకాలు;
మెడికల్ కాలేజి n వైద్యకళాశాల;
మెడిసిన్ n 1 ఔషధం, మందు, 2 వైద్యశాస్త్రం;
మెతుకు n అన్నకణం, ఉడికిన బియ్యంగింజ, మెదుకు,
మెత్త n దిండు, తలగడ, మృదువైనది, చిన్నదిబ్బ, మట్టిగోడ అండ, గుర్రపు పల్లం
మెత్తబడు v బింకం విడుచు, మృదువు అగు, లొంగు, తగు, రసార్ధమగు
మెత్తు v దట్టంగా పూయు;
మెత్తుకొను v దట్టంగా పూసికొను, బాగా అతుకు, మూయు;
మెదడు n మస్తిష్కం, తలలోపలి కొవ్వు
మెదలు v కొంచెంకదలు, తిరుగు, వీచు, వర్తించు
మెదుచు మెత్తగచేయు, కలియగలపు;
మెప్పు n పొగడ్త, శ్లాఘ, సంతోషం, వరం, ఎగురు, దూకు
మెయిలు n తపాలు జాబులు తీసికొని పోయేబండి, రైలుబండి!
మెరక n మెట్ట, దిబ్బ, వర్షాధారంతో పండేనేల;
మెరమెర n వ్యథ, దుః ఖం, సంశయం, భేదం, మాలిన్యం, క్రౌర్యం
మెరయు v తళుక్కున ప్రకాశించు, ప్రకాశించు, ఒప్ప, వెల్లడియగు, చెలరేగు, ఉద్యమించు, అతిశయించు, ప్రసరించు
మెరికలు n కొంచెం పొట్టువీడిన బియ్యం, బియ్యంలోనే వడ్ల గింజలు, మెరిగలు పబం
మెరిసిపోతు v ప్రకాశిస్తూ;
మెరుగుపరుచు v బాగుచేయు, ప్రకాశింపజేయు;
మెరుపు n విద్యుత్తు, ప్రకాశం, మెరపు శంప, శతహ్రద, సౌదామిని, చపల, చంచల, తటిత్తు, హోదీని, ఐరావతి, క్షణప్రభ
మెలగు v ప్రవర్తించు, నడచుకొను, మెలవు,
మెలత n స్త్రీ, ఆడుది, మెలతుక
మెలి దే మెలిక, పెన;
మెలిపెట్టు v పెనవేయు, మెలివేయు;
మెల్ల n కొంచెం వంకరైనది, కేకరం, ఊరిబయలు, ఎత్తైనచోటు;
మెల్లన n అల్లన, మాంద్యం, శైథిల్యం, సడలు, మందస్వరం
మెల్లమెల్లగా n మందం మందంగా నెమ్మది నెమ్మదిగా;
మెళకువ n నేర్పు, తెలివి, లాఘవం, జాగ్రత్త, నైపుణ్యం, మెలకువ, వర్తనం, జీవనం, సంచారం, దిట్టతనం, స్థలం, నాట్యగతిభేదం
మెసవజనెన్ మేకప్ ఇంక్రి అలంకరణం, సరిచేయు, పూర్తిచేయు
మెసవు v తిను, భుజించు, మీంగు, కబళించు, అనుభవించు, మెసగు
మేక n అజం, మేషం, ఆడమేక; ఆద్య, క్రియ, ఛాగ, బస్త, ఛాగి, తూబర, రయం, విశ్వభేషజి
మేకపోతు గాంభీర్యం మివి లోపల పిరికి తనం ఉన్నా పైకి మాత్రం గాంభీర్యాన్ని చూపడం
మేకలకాపరి n మేకలను కాసేవాడు;
మేకవన్నె పులి జా పైకి మేకలా సాధువుగా కనిపిస్తూ లోపల పులిలా క్రూర స్వభావం ఉండే వ్యక్తి
మేకు n ఇనుము వంటి వాటితో చేసిన చీల; కొర్రు, గసిక, గూటం, ముల్లు, మొల, సీల, శంకువు, శూలం వేసవించు,
మేఖల n మొలనూలు, నడికట్టు ముంజగడ్డితో పేని ఉవ నయన సమయంలో వటువునడుముకు కట్టేతాడు, కత్తిపిడి, కొండనడుము, చిలుకడ త్రాడు, నర్మదానది, ఉమ్మెత్త,
మేఘం n మబ్బు; వెగులు, అంబుదం, అంభోదం, అభ్రం, అంబుభృత్తు, కంధరం, కజ్జలం, కమలాసనం, క్షరం, ఖచరం, ఖద్యుతం, ఖద్యోతం, ఖతమాలం, గగనధ్వజం, మనం, జలదం, జలధరం, జలమని, జలముచం, జీమూతం, తటిత్వతి, తటిత్వంతం, తోయదం, దర్గరం, ధారాధరం, ధూమయోని, నభం, నగజం, నీరదం, పయోధరం, పారణహరణం, బలాహకం, ముదిరం, వనదం, వలాహకం, వాతరథం, వారివాహం, వ్యోమ ధూమం, సనత్నువు, గాలినూడు, జాలుదొడు కు, నీటి తాలు కు, నీటి పరి, నీరు తాలువు, జేజేటేనియరదం, పయిరులుసులు, మబ్బు, ముంచుదారి, మొగిలు, మొయిలు
మేఘపటలి n మబ్బులగుంపు;
మేఘావరణం మంది n జనం, జన సమూహం, బలగం, కాలు బలం(సేన),
మేచకం n నల్లనిది, నలుపురంగు గలది, నెమలికన్ను, మేఘం, పొగ, చీకటి, నీలాంజనం
మేజరు n 1 యుక్త వయస్సుకు వచ్చినవాడు 2 దండులోని ఒక ఉద్యోగస్తుడు;
మేజా n బల్ల;
మేజిస్ట్రేట్ n న్యాయాధిపతి;
మేజువాని n విందు, భోగం మేళం, భోగంవాళ్ళ ఆటస్థలం
మేజోళ్ళు 'దేవి పాదరక్షల (బూట్ల) లోపల కాళ్ళకు వేసే జోళ్ళు;
మేట n ప్రవాహంలో కొట్టుకొని వచ్చి కమ్ముకొన్న ఇసక;
మేటి n గొప్పవాడు, ప్రభువు, శ్రేష్టుడు
మేడ n సౌధం, అంతస్తులున్న ఇల్లు; ఉపకారిక, ఉపకార్య, ఉప్పరిగపురం, నగరు, రాజసదనం, సజ
మేడి దేవి ఉదుంబరం, అత్తి; అంజూరు, అషష, ఔదుంబరం, జంతుఫలం, సదాఫలం, సుప్రతిష్ఠం, నాగలి వెనక రైతుచేత్తో పట్టుకునే భాగం?
మేత n పశుపక్ష్యాదుల ఆహారం;
మేదకుడు n వెర్రిబాగులవాడు;
మేదర n వెదురు తడకలు, చాపలు వంటి అల్లుకొని జీవించే ఒకజాతివాడు మేదరి;
మేదిని n భూమి, మధుకైటభుల మేధస్సుచే (మెదడు) తడుపబడినది, ఒకానొక సంస్కృతి నిఘంటువు, మేద
మేధ n బుద్ది, తెలివి;
మేధావి n చాలాబుద్ధి మంతుడు, ధారణశక్తి సూక్ష్మబుద్ధిగల వ్యక్తి, తెలివిగలవాడు, చిలుక, మధ్యం
మేధాశక్తి n బుద్ధిబలం;
మేధాసంపత్తి n బుద్దిసంపద;
మేనక n ఒకానొక అప్పరస్త్రీ, హిమవంతుని భార్య;
మేనకోడలు n పురుషునికి తోడబుట్టిన దాని కూతురు, స్త్రీకి తోడబుట్టిన వానికూతురు
మేనత్త n తండ్రి తోడబుట్టింది
మేనబావ n తనకంటే పెద్దవాడైన మేనమామకొడుకు, తనకంటే పెద్దవాడైన మేనత్తకొడుకు;
మేనమరదలు n తనకంటే చిన్నదైన మేనమామ/ మేనత్త కూతురు;
మేనమరది n తనకంటే చిన్నవాడైన మేనమామ/ మేనత్తకొడుకు
మేనమామ n తల్లితోడ బుట్టినవాడు, మాతులుడు;
మేనరికం దేవి 1 మేనత్తకొడుకును లేదా మేనమామ కూతురిని పెళ్ళిచేసుకొనే సంప్రదాయం, తోబుట్టువు , తల్లి తోడ బుట్టిన వాని దేహ సంబంధ భావం 2 పరిహాసం
మేనల్లుడు n పురుషునికి తోబుట్టువు కొడుకు, స్త్రీకి తోడబుట్టిన వాని కొడుకు;
మేనిపసల్ n శరీరంలోని సమ్పదులు;
మేను n శరీరం, మే, జన్మం, పార్శ్వం
మేను v ఒప్పుకొను, అంగీకరించు, మైకోను, పొందు, చేయు, పూను,సహించు, కలుగు, తహతహపడు
మేపు v అ పశుపక్ష్యాదుల్ని ఆహారం తినేటట్లుగా చేయు; 2 ఆహారం, తిండి, మేత
మేయి n శరీరం, మయి, మై ఒళ్ళు, దేహం, ఒడలు, పెయి, పెయ్యి, తృతీయా విభక్తిలో వచ్చే ప్రత్యయం, విధం, పార్శ్వం అగు, వెంబడి భూమి
మేయు v తిను, భక్షించు, పబం లంచం తీసుకొను, అనుభవించు, నోటనుంచు మేర దేవి హద్దు; అవధి, ఎల్ల, కర, క్రమం, గడి, కాష్ఠ ధారణ, నియమం, ప్రమాణం, మరియాద, సంధ్య, సంస్థ, స్థితి, సీమ
మేరమీరు v అధికమగు, హద్దుదాటు; మేరు (వు)
మేలం n హాస్యం, పరిహాసం, పరిహాసోక్తి, జాగరూకత (సం) కలయిక, నివాసం
మేల n సంగమం, సభ;,
మేలి n శ్రేష్టమైన; మేలిమి
మేలు n శ్రేష్ఠత, గొప్పదనం, వరం, క్షేమం, (ప్రేమం, స్నేహం, లాభం, సౌందర్యం, సుకృతం, అధికం, ఉపకారం, సుఖం, శుభం, హితవచనం, న్యాయం
మేలుకొను v నిద్రనుంచిలేచు, మెలకువనొందు , మేలుకను, జాగ్రదావస్థనొందు, జాగ్రత్తపడు
మేలుకొలుపు v మేలుకొనజేయు, వ్యక్తీకరించు
మేలుబంతి n ఒజ్ఞబంతి, ఒరవడి, ఒకవని ఇతరులు నేర్చుకోడానికి మొదట చూపే మాదిరి, శ్రేష్ఠుడు, శ్రేష్ఠురాలు
మేలుముసుగు n సువాసినులు వేసుకొనే ముసుగు, అవకుంఠం;
మేల్తరం n శ్రేష్ఠం మేళం
మేళవించు v కలుపు, జతపరచు, కలియు, మిశ్రమవు, మేళగించు
మేషం n పొట్టేలు, గొర్రె; అజం, అతిరోమశం, అయోధురం, అల్పాయువు, ఉరణం, ఉరభ్రం, ఊర్ణం, ఊర్ణాయువు, ఏడకం, చగలం, చాగం, తగరం, దేవానాండ్రియం, వర్ణభోజనం, జాలవాహ్యం, లంబకర్ణం, శివాప్రియం, అగ్గితత్తడి, ఇరుదలతేజి, ఏడిక, చింబోతు, తగరు, మేకపోతు, అమిడ, ఒకరాశి, మందుదినుసు, మేక
మేస్టారు n ఉపాధ్యాయుడు, గురువు;
మైకం n మత్తు, మయికం
మైకు n చిన్నధ్వనిని పెద్దదిగా వినబడేటట్లు చేసే సాధనం;
మైత్రి n స్నేహం, చెలిమి, దయ, అనురాధానక్షత్రం
మైథిలి n సీత, మిథిలాపతి జనకుని కూతురు
మైదానం n బయలుభూమి;
మైదు v వి మాయ, మైకం, చొక్కుపొడి;
మైనం n తేనెపట్టులో తేనెతీసేయగా మిగిలిన మెత్తని పదార్థం, మధూచ్చిష్టం, సిక్తకం, మయినం వికసం, మదనం, మక్షికామలం
మైనాకుడు n హిమవంతుని పుత్రుడు, మేనకా హిమవంతుల పుత్రుడు
మైపూత n అంగరాగం, కలపం; రూ
మైమరచు v 1 ఒడలెరుగక ఉండు, పారవశ్యం పొందు; 2 మూర్చిల్లు
మైమరువు n కవచం, మైమజుగు, శరీరాన్ని కప్పేది
మైల n మలినం, మురికియైనది, మయిల, అశుచి, మాలిన్యం, చీకటి, ఎరుపుతెలుపు పసుపునలుపు కలిసిన రంగు
మైలపడు v మాలిన్యం పొందు;,
మైలసంత n చేపలసంత, మాంసం అమ్మేస్థలం;
మైలు n దూరంకొలవడానికి ఒక ప్రమాణం 1760 గజాలదూరం
మైలుతుత్తం n ఒకానొక మందువస్తువు, మయిలుతుత్తం మందుల్లో వాడే రసాయనం కర్పరి, తుతాంజనం, మయూరకం, మయూరతుతళీం, వితున్నకం, శిథిగ్రీవం
మొంటే n చిన్నచేట, మొంటి వెండి
మొండి కెత్తు v బండతనం కలవాడవు
మొండి కెత్తు v బండతనం కలవాడవు,
మొండిచెయ్యిచూపు v లేదను, ఎగొట్టు, కాదను;
మొండివాడు n మూర్ఖుడు, చేతులు లేని వాడు, మొండితనం కలవాడు
మొండెం n తలలేని శరీరం, మొండియం
మొండెం n తలలేని శరీరం, మొండియం మొకం
మొకం n ముఖం, వదనం, మొగం
మొకమాటం n సంకోచం, మొగమాట, మొహమాటం, దాక్షిణ్యం, వరచితాను కూలవర్తనం
మొకమాలు n ఒకవిధమైనమేలు జాతిపట్టు, ముకమాలు
మొకరం n స్తంభం, కొయ్యతోచేసిన లావుపాటిస్తంభం, మొక్కరం
మొక్క n మొలక, అంకురం , మోక, చిగురుమొలక, ఒకజాతి జొన్నలు, మొనచెడినది, లేత
మొక్కజొన్న n ఒకజాతి జొన్న
మొక్కపోవు v వాడిచెడినదగు, కుంఠితమగు, భంగపడు, నశించు, హానిచేందు ఎక్కు
మొగం n వదనం, ముఖం;,
మొగంవాచు v మిక్కిలి అపేక్షచేతబాధపడు;
మొగడు v ముకుళించు, మొగుడు; వి భర్త, మగడు
మొగమింత చేసికొను v సంతోషంతో ముఖం వికసింపజేసుకోవడం;
మొగమిచ్చమాట n మొహం ముందర సంతోషం కలిగేటట్లు పలికే పలుకు, ముఖప్రీతి సంభాషణ;
మొగలి n కేతకి, గేదంగి; అమరపుష్పం, ఇందుకలిక, కుంకుకచ్చద, కంటదళ, కాప్టపుష్పం, క్రకచచ్చదం, జంబాలం, జంబూలం, దీనం, దీర్ఘపత్రం, ద్రోణీదళ్ళ ద్రోణీలు, కృష్ణసర్పప్రియ, ధారాకదంబం, ధూళ్నీషిక, నృవ ప్రియ, పాండురచ్చదం, సూచీపత్రం, శివదిష్ట హానీలం, గొజ్జగి, గేదగి
మొగసాల n 1 తలవాకిటి చావడి, మోసల ఇంటిలోని ముందుభాగం 2 తలవాకిటిపంచ;
మొగసిర n లోకమోహనమైన ముఖశోభ; వశీకరణాషధం;
మొగి n పూనిక, పర్యాయం, మొత్తం, విధం, మొవ్వు, ఎదుట, ఉత్సాహం, మొగులు?
మొగ్గ దే ముకుళం, కోరకం, విచ్చని పువ్వు, మొగడ, మొగడ, కుట్మలం, జాలం
మొగ్గు v 1 ఒరగు, వాలు, 2 నేలగూలు, కిందబడు , మొగ్గు
మొటిమ n యౌవనంలో మొగం మీద లేచే, పొక్కు, అవగండం;
మొట్టమొదలు n ముందు, ఆరంభం, అన్నింటికీ ముందు;
మొట్టికాయ n తలమీద పిడికిలితో పొడిచేపోటు , మొదటికాయ
మొట్టు v తలమీద పిడికిటితో కొట్టు మోదు, పొడుచు;
మొత్తం దేవి సమూహం, వెరసి అంతా, సేన, బాహుళ్యం, సాంద్రం అన్నీ కలపగా వచ్చిన విలువ
మొత్తం మీద n అన్ని విషయాలు ఆలోచించి చూడగా;
మొత్త n వాకిటిలోపలి పక్కగోడ, నీళ్ళు పారేకాలువ మొదట ఏర్పరచబడిన ఎతు ప్రదేశం, అధ
మొత్తానికి? n చివరికి ఎంత శ్రమపడినా;
మొత్తు v కొట్టు, తాడించు, కుంగ జేయు, నరకు, పగులగొట్టు, వాయించు
మొత్తుకొను v అరచు చాలాసార్లు హితంచెప్పు, గట్టిగా అరచు, కొట్టుకొను
మొదటి పల్కులు దే వేదాలు, శివుడు
మొదటివేల్పు n బ్రహ్మ, శివుడు, దేవతలలో పెద్దవాడు
మొదలారు v సమూలంగా నశించు;
మొదలు n ఆది, ప్రారంభం, ద్వారం, మొగ్గ, అప్రాణివస్తు ముఖం, తొలి, వెన, నదీ, సముద్రాదుల ముఖం, పూర్వం, ప్రకాండం, మూలకారణం, మూలధనం
మొదవు n పాడిఆవు, ఆవు,
మొద్దు n మూడుడు, మూఢురాలు తెలివిలేని వ్యక్తి, చురుకులేనివ్యక్తి; ధ్రువం, మొరడు, మోటు, మోడు, హైడు, శంకువు, స్థాణువు++
మొన n అగ్రం, కొన, ముందు, సేన, వ్యూహం, పోరు, ఖాఢాదులధార, బాణాగ్రం,
మొనగాడవోయిమొనదేరు v వాడి కలది అగు నిశితమవు;
మొనగాడు n శూరుడు, ముఖ్యడు, సేనాధిపతి
మొనయనునిచి మొనసి v పూని, పుట్టి, కలిగి, సంభవించి;
మొనయు v శోభిల్లు, ఒప్పు, యత్నించు, కలుగు, తటస్థించు, అవతరించు, ప్రత్యక్షమగు, రూపొందు, నశించు, సిద్ద మగు, వ్యాపించు, జరుగు
మొన్న n నిన్నటికి వెనకరోజు, రెండురోజుల ముందు, ఇటీవల
మొప్పె n మూర్ఖుడు మొర
మొరం n గులకరాయి, శర్కర; మొరసు, శర్కర, గరుకైన చూర్ణం
మొరగు v మోసగించు, వంచించు, కప్పిపుచ్చు మొర పెట్టు; అరచు, కూయు, ప్రలాపించు, ప్రలాపం కుక్క అరుపు, పేలడం, పెద్ద గా మాట్లాడు;
మొరటు n మోటు, మొద్దు;
మొరడు దే మోడు, స్థాణువు మొద్దు;
మొరయు v మ్రోయు, ధ్వనించు, కూయు, ప్రవర్తిల్లు
మొర్రి n అంగన్యూనత, కొరత వెలితి, అవయవలోపం;
మొల n నడుము, కటిప్రదేశం; కటి, కటీరం, జమునం, నితంబం, శ్రోణి, కట్టుబట్ట, చీల, మేకు, త్రాసుముల్లు
మొలక అంకురం, నిసువు, మొక్క, మొటిక, మొట్టిక, మోకు, మోటిక, మోసు, అం కురిత బీజం, లేత,
మొలకలెత్తు దేక్రి అంకురించు, కలుగు, మొలకెత్తు;
మొలచు v పుట్టు, జనించు, మొల్చు, ప్రత్యక్షమగు, ప్రాప్తించు
మొలతాడు n కటిసూత్రం, మొలకు కట్టుకొనే తాడు
మొలతామర n మొలగజ్జి;
మొలనూలు n స్త్రీలు అలంకారార్థం ధరించే కటిసూత్రం, రశన కలాపం, కాంచి, మేఖల, రశన, రసన, సప్తకి, సారసం
మొలాం దేవి బంగారు వంటి వాని పూత, మలాము, మొల్లాము, మోలం, మోళం, బంగారు వంటివాటి పూత, పుండ్లకు పూసే మందు
మొల్లం (బు) మివి అధికం, హెచ్చు, గుంపు, సాంద్రత, పెంపు, ధనం
మొల్ల దే మల్లెపూవు, బొడ్డుమల్లె;
మొవ్వు n అరటిచెట్టు వంటి వాటిలో పుట్టెముడుత వీడని లేత ఆకుమొలక , మొవు, మోవు
మొసలి దే జలజంతు విశేషం, మకరం; ! అంబుగజం, అంబుమర్కటం, అసి దంష్ట్రం, కుంభ, క్షీరశుక్లం, కుంభీరం, జలగ్రాహం, గ్రాహం, జలకంటకం, జలకపి, జిలజిహ్వం , జలసూకరం, జలసూచి, రుషం, రషాశనం, నక్రం, హోదగ్రహం, కడలిరాతత్తడి, మరునిడాలు, కంటకం
మొహమాటం n సంకోచం, జంకు; చూ మొకమాటం
మొహరు n ముద్ర;
మొహర్రం n ముస్లిముల పీర్లపండుగ;
మోకరిల్లు v మోకాళ్ళు నేలమీద ఆనేటట్టు ముందు కొరుగు, నమస్కరించు;
మోకాలు n జానువు, తొడపిక్కల సంధిభాగం, కీలుభాగం ముడుకు, ముడుము, కుర్బరం, జానువు; మోకాలొడ్డు
మోకు n లావుతాడు;
మోక్షం n ముక్తి, చావు, విడుదల, జీవుని కష్టాల నుంచి విడిపించేది, దుఃఖాది దురవస్థల వినాశనం కైవల్యం, నిర్వాణం, శ్రేయం, అమృతం, అపవర్గం, మృత్యువు, మొక్కపుచెట్టు, విడుపు, గ్రహణం తుద
మోక్షపదం n మోక్షస్థానం, మోక్షపదవి;
మోచు v మోయు, వహించు, వహించు, ఎత్తికొను, స్పృశించు, ఆక్రమించు, అంటుకొనిపోవు, పొందు, పోషించు, గుణి సేయు, నిండు
మోచేయి n కూర్పరం, భుజానికీ ముంజేయికీ మధ్య ఉండే కీలుభాగం, మోచెయ్యి, మోచేయి కపణి, కపోణి, కూర్పరం, కీలం, కూబరం,
మోజు n అభిలాష, ఆశ;
మోటబావి n పెద్దబావి, (పొలంకోసం మోటకొట్టేబావి);
మోటరు ఇవి యంత్రం, చలింపజేసేది, చలన హేతువు;
మోటించు v ఆధారంగా నిలుపు, పోటీగా నిలుపు;
మోటు దేని మోడు, పరుషం, మొద్దు, స్థూలం, మొద్దు
మోడుమాకు v దేవి ఎండిన చెట్టు, మోడు మ్రాకు
మోడ్చు v జోడించు, మోడుచు, మూడు, ముడుచు, కన్నులుమూయు, చేతులు జోడించు
మోత n 1 మోయడం, వహించడం, మోత 2 భారం, బరువు, ధ్వని
మోతాదు n ఒకసారి ఇచ్చేమందు, హెచ్చు తగ్గుకాని పదార్థం ఎక్కువ తక్కువ కానిది
మోతుబరి v,n ఘనతగల, గొప్ప, నమ్మదగిన;
మోదం n సంతోషం;
మోదకం n ఆనందించేది; n కుడుము, లడ్లు, ఉండం, గుండ్రం,
మోదడం v కొట్టడం, ప్రహరించడం;
మోదుగు 'దేక్రి నలుగు, బాగానోటికి వచ్చు, విషయం బాగా పరిశీలనలో పడు,, ధాన్యం పొట్టు పోయేటట్లు సలగు, బాగావచ్చు, బలహీనుడగు
మోనపోవు v భంగవడు; వంచితుడగు;
మోపు v ఆనించు, వహింప జేయు, చేర్చు, ఆరోపించు, గుచ్చు, గడ్డి, కట్ట, గుంపు, మూట, భారం, బాధ్యత, నారి, ఆధిక్యం
మోపెడు n గుంపు, చాలమంది;
మోము n ముఖం, మొగము చూ మొకము
మోయు దేక్ర' వహించు, తాకు
మోర దేవి, ముట్టె, వశ్వాదుల దీర్ఘముఖం !
మోరగించు v మొగం మీదికెత్తు;
మోరుండ దే మోవి
మోసం n వంచన, పొరపాటు, తప్పు, బొంకు, అపాయం, అజ్ఞానం, అవమానం
మోసపుచ్చు v వంచించు, మోసంచేయు;
మోసులు n మొలకలు, అంకురాలు, మొలక, మొవ్వు, అందం
మోసులు వారు v మొలకలెత్తు;
మోస్తరు n మాదిరి;
మోహం n అజ్ఞానం, దుః ఖం, వలపు, పొరపాటు, బాధ, ఆశ్చర్యం, మూర్చ, చిత్తవికలత్వం, నివ్వెరపాటు
మోహనాక్షరాలు n మోహాన్ని కలిగించే అక్షరాలు;
మోహరం n మొగ్గరం, వ్యూహం,, సేన, సమూహం
మోహరించు v ఎదుర్కొను, ప్రతిఘటించు, మోహించు;
మోహిని n ఒకానొక అప్సర, అచ్చర, అమృతం పంచి పెట్టేటప్పుడు రాక్షసులను మోసపుచ్చడం కోసం విష్ణువు తాల్చిన ఒక సుందర స్త్రీ రూపం, ఒక జాతి మల్లెపూవు
మౌంజి n ముంజి, ముంజదర్భ మొలతాడు
మౌక్తికం n ముత్తెం, ముత్యం, ముత్యపు చిప్ప నుంచి విడువబడినది
మౌఖిక సంప్రదాయం n ముఖతఃనేర్చుకొనే పద్దతి;
మౌఢ్యం n మూఢత్వం, తెలివి / పోవడం, అజ్ఞానం, అవిద్య, గ్రహాలకు సూర్యసంబంధం
మౌనం n మాట్లాడకుండటం, అన్యులకు తావం కలిగింపనిది, నిశ్శబ్దం పాటించడం
మౌని n మునీ, రుషి, మౌనం దాల్చేవాడు
మౌనీంద్రులు n మునులలో శ్రేష్ఠమైనవారు
మౌర్వి n వింటినారి, అల్లెత్రాడు;
మౌలికం n మొదటిది, శ్రేష్ఠమైనది;
మౌల్వీ n ఇస్లాం పండితుడు;
మౌళి n తల, శిరస్సు, నేల, అశోకం, కొప్పు, కిరీటం, జటాజూటం, చెట్లు, శిరం
మ్యారేజీ n వివాహం, పెళ్ళి;
మ్యూజియం n వస్తు ప్రదర్శనశాల;
మ్రానువడు v స్తంభించు, కొయ్యవారు
మ్రోగు v శబ్దించు, మొరయు, మోగు, బుసకొట్టు, గాండ్రు పెట్టు, పక్షులు వంటికూయు, మొరుగు, కేకలువేయు, పలుకు
మ్రోల n ముందర, ముందు; రూ