గోండి తెగ-జీవన విధానం
గోండి తెగ:జీవన విధాన అధ్యయనం
[మార్చు]తెగ పరిచయం
[మార్చు]గోండి భాష అనేది ద్రవిడియన్ కుటుంబానికి చెందిన పురాతన భాషల్లో ఒకటి దీనిని మాట్లాడేవారిని కోయ్తూర్ లేదా గోండ్ ప్రజలు అంటారు. ఇది ఒక షెడ్యూల్ తెగ.
చరిత్ర మరియు మూలాలు
[మార్చు]గోండులు చారిత్రక ప్రాముఖ్యత కలిగిన అనేక రాజ్యాలను ఏర్పాటు చేశారు. వీరు భారతదేశంలోని గోండ్వాన ప్రాంతాన్ని పరిపాలించేవారు. గోండ్వాన భూభాగంలో, మహారాష్ట్రలోని విదర్భ తూర్పు భాగం,మధ్యప్రదేశ్ కు ఉత్తరాన కొన్ని ప్రాంతాలు, పశ్చిమ ఛత్తీస్ ఘడ్ లో కొన్ని భాగాలు,ఆంద్రప్రదేశ్,తెలంగాణ లోని ప్రాంత విస్తరించి ఉండేవారు. గోండుల మూలాలు అస్పష్టంగా ఉన్నప్పటికీ కొంతమంది పరిశోధకులు వీరు భిన్నమైన తెగల సముదాయం అని తెలిపారు.
విస్తరించి ఉన్న ప్రాంతాలు
[మార్చు]గోండి తెగకు చెందిన వారు ప్రస్తుతం మధ్యప్రదేశ్,మహారాష్ట్ర,ఛత్తీస్ ఘడ్ ఉత్తరప్రదేశ్,తెలంగాణ, ఆంద్రప్రదేశ్ మరియు ఒడిషా రాష్ట్రాలలో విస్తరించి ఉన్నారు.
గ్రామీణ జీవనం
[మార్చు]గ్రామ నిర్మాణం: ఒక గ్రామాన్ని "గూడ" అని అంటారు. ఒక్క గ్రామంలో 20 నుండి 30 కుటుంబాలు ఉంటాయి. గ్రామ పెద్దగా పటేల్ ఉంటారు. ఊరిలో ఏ సమస్య వచ్చినా ముందుగా పటేల్ ను సంప్రదిస్తారు.ప్రతీ ఊరిలో ఒక గుడి ఉంటుంది. సంప్రదాయ పూజలు అన్నీ "దేవరి" చూసుకుంటాడు. ఊరిలో ఇళ్లు ఎర్ర మట్టితో కానీ తడకలతో కానీ నిర్మిస్తారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో సిమెంట్ కూడ ఉపయోగిస్తున్నారు.
ఆహారం: ప్రజలు ఆహారం కోసం వ్యవసాయం మరియు అడవి ఉత్పత్తుల పై ఆధారపడతారు.జొన్న, గోధుమ,మొక్కజొన్న రొట్టెలు; జొన్నగట్క, అంబలి, కూరగాయలు మరియు అడవిలో లభించే వివిధ రకాల పండ్లు వీరి ఆహారంలో ముఖ్యమైనవి.
వేషభూషణాలు: మగవారు దోత్రె లేదా ప్యాంట్ ,షర్ట్ ; ఆడవారు చీరలు(సాడి) లేదా గోచి (సోగ) కట్టుకుంటారు.
పేర్లు: ఆడవారి పేర్లు ఎక్కువగా "బాయి" తో ముగుస్తాయి(జంగుబాయి,విమలబాయి,రాంబాయి.....) ; మగవారి పేర్లు (గంగారాం,సోనెరావ్ మానిక్ రావ్.....).
పర్యావరణంతో సంబంధం:ఎక్కువ గోండ్ గ్రామాలు అడవులతో మమేకం అయ్యే ఉంటాయి. ప్రతి పండుగకి మొదటి పూజ ప్రకృతికే చేస్తారు.ప్రకృతిని తల్లిలా భావిస్తారు.
విద్య మరియు అక్షరాస్యత: వేరే ప్రజలతో పోలిస్తే అక్షరాస్యత చాలా తక్కువ. బడుల నిర్మాణం కూడా చాలా తక్కువ.
రవాణా మరియు కమ్యూనికేషన్: కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం ఉంది. కొన్ని ప్రాంతాల్లో రోడ్డు ఉన్నా ప్రైవేట్ వాహనాల పై ఆధారపడాలి.మరికొన్ని ప్రాంతాల్లో సరిగా రోడ్డు కూడా ఉండదు
సామాజిక జీవనం
[మార్చు]- కుటుంబ నిర్మాణం: ఎక్కువ ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి
- జీవిత చక్ర సంబరాలు: "పాచ్వి"(పుట్టిన 5 రోజులకి చేస్తారు)తో మొదలై "తుం"(మరణం తరువాత చేసే కార్యక్రమం)తో ముగుస్తుంది
- ప్రజల మధ్య సయోధ్య: అందరితో కలిసిమెలిసి ఉంటారు.
- లింగ సంబంధాలు: చాలా సందర్భాల్లో లింగ సమానత్వం కనిపిస్తుంది.