Jump to content

అంతర్జాల స్వేచ్చా వనరులు/OER

Wikibooks నుండి

స్వేచ్ఛా విద్యావనరులు (OER)

[మార్చు]

జ్ఞానం పంచుకున్నంత మాత్రాన తగ్గదు, పెరుగుతుంది అనే సిద్ధాంతానిని అనుసరించి స్వేచ్ఛా విద్యావనరులు.

స్వేచ్ఛా విద్యావనరులు (Open Educational Resources - OER) , అంటే ఎవరైనా ఉచితంగా ఉపయోగించవచ్చునూ, పునఃవినియోగం చేసుకోవచ్చునూ, మార్చవచ్చునూ, పంచుకోవచ్చునూ అని అనుమతించే విద్యా సంబంధిత వస్తువులు. అంటే ఇవి ఉచితం (Free) గా లభ్యమవుతాయి, స్వేచ్ఛగా ఉపయోగించగలిగినవి (Reusable & Editable).చదవడం, డౌన్‌లోడ్ చేసుకోవడం, మార్చడం (edit/translate), పంచుకోవడం (share with others) వంటి అనుమతులు, లైసెన్స్ పరిమితులను అనుసరించి ఉంటాయి. ముఖ్యంగా Creative Commons లైసెన్స్ ఉంటే, వనరుల్ని స్వేచ్ఛగా వాడవచ్చు. వాటిల్లో

  • పాఠ్యపుస్తకాలు (Textbooks)
  • లెక్చర్లు (Lectures)
  • స్లయిడ్లు (Slides)
  • వీడియోలు (Videos)
  • టెస్ట్‌లు, ప్రశ్నాపత్రాలు
  • వర్క్‌షీట్లు, అభ్యాసపత్రాలు
  • కోర్సులు (Courses)

ఉపయోగాలు

[మార్చు]

విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు ఖర్చు లేకుండా నాణ్యమైన విద్యా వనరులు లభిస్తాయి. ఉపాధ్యాయులు తాము బోధన చేస్తున్న విషయాన్ని అనుసరించి కంటెంట్‌ని మార్చుకుని వినియోగించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వనరులు అనేక భాషలలో ఉండటంతో భిన్న దేశాల్లో వినియోగం  జరగడంతో  అన్ని ప్రాంతాల వారికి సమాన విద్య, అధ్యయన అవకాశాలు కల్పించడంలో సహాయం                  |

  1. కాపీ చేసుకొని ఉంచుకోవడం (Retain)
  2. యథాతథంగా వాడుకోవడం (Reuse)
  3. మార్చుకోవడం, ఉదా: తెలుగు అనువాదం చేయడం (Revise)
  4. ఇతర వనరులతో కలిపి కొత్తది సృష్టించడం (Remix or Recreate)
  5. మరొకరికి పంచడం (Redistribute)

OER వేదికలు

[మార్చు]
  • OER Commons (https://www.oercommons.org)    ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయులకు ఉచిత వనరులు               
  • National Repository of Open Educational Resources – NROER (https://nroer.gov.in/) NCERT ఆధ్వర్యంలో  భారత ప్రభుత్వ వేదిక
  • SWAYAM (https://swayam.gov.in/)   ఉచిత ఆన్‌లైన్ కోర్సులు (UGC, AICTE, NPTEL, NCERT)       
  • TESS India (https://www.tessindia.edu.in/)  ఉపాధ్యాయులకు తెలుగు సహా అనేక భారతీయ భాషల్లో వనరులు     
  • Khan Academy (https://www.khanacademy.org)  వివిధ విషయాలలో ఉచితంగా వీడియోలు, అభ్యాసాలు (తెలుగు సహా)

స్వేచ్ఛా విద్యావనరులు రూపొందిస్తున్న సంస్థలు

[మార్చు]

స్వేచ్ఛా విద్యావనరులు విద్యను అందరికీ చేరవేయాలనే లక్ష్యంతో రూపొందించినవి. ఇవి జ్ఞానాన్ని ప్రజలందరికి అందించేందుకు; నాణ్యమైన విద్యను అందించేందుకు; ఖర్చును తగ్గించేందుకు ముఖ్యమైన సాధనాలు రూపొందించడం వంటివి. ఉదాహరణకి - NCERT, CIET, UGC, MOOCs (Massive Open Online Courses)

వనరులు

[మార్చు]

సార్వత్రిక విద్యావనరులు