అంతర్జాల స్వేచ్చా వనరులు/OAM
స్వేచ్చా ప్రాప్త్యత - ఉద్యమం
[మార్చు]ఓపెన్ యాక్సెస్ (Open Access) అంటే శాస్త్రీయ పరిశోధనల గురించి రాసిన వ్యాసాలు, గ్రంథాలు, అధ్యయన ఫలితాలు, విద్యా వనరులు ఎవరికైనా అంతర్జాలం ద్వారా ఉచితంగా చదివే వీలుగా ఉండే విధానం.
ఓపెన్ యాక్సెస్ అనేది శాస్త్రీయ సమాచారాన్ని, ముఖ్యంగా పరిశోధనా వ్యాసాలు, వ్యాస సమీక్షలు (journals) ఎవరికైనా ఉచితంగా, అంతర్జాలం ద్వారా అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో రూపుదిద్దుకున్న ఉద్యమం. ఇది ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు, పరిశోధన కేంద్రాలు, శాస్త్రజ్ఞులు, పరిశోధకులు కలిసి వైజ్ఞానిక పత్రిక ప్రచురణకు అందిస్తున్న పరిశోధనా ఫలితాలు, వైజ్ఞానిక సమాచారం అందరికీ అంటే విశ్వవిద్యాలయాలు, పరిశోధన కేంద్రాలు, గ్రంథాలయాలు, పరిశోధకులకు అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో నడిచిన ఉద్యమం. ఎందుకంటే ఈ వైజ్ఞానిక ప్రచురణలు చాలా వెలకలిగినవి, ఎక్కువ మొత్తం చందా రూపంలో వెచ్చిస్తే కానీ లభ్యం కావు.
ఓపెన్ యాక్సెస్ లక్ష్యం
[మార్చు]- విద్య, సమాచారం పరిశోధనా ఫలితాలు అందరికీ ఉచితంగా అందించడం
- పరిశోధనలు వేగంగా పంచుకోవడం.
- పెద్ద సంస్థలలో నుంచి సమాచారం విడుదల చేయడం.
- ప్రజల ధనంతో జరిగిన పరిశోధన ఫలితాలు ప్రజలకే అందించటం.
సమస్య
[మార్చు]20వ శతాబ్దం చివరకి, విశ్వవిద్యాలయాలు చాలా శాస్త్రీయ పత్రికలకు చందాలు (subscriptions) చెల్లించలేక పోతున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న, చెందని దేశాలలోని విద్యార్థులు, అధ్యాపకులు అధ్యయనం చేయడానికి కావలసిన సమాచారం చదవలేక పోతున్నారు. అనేక విశ్వవిద్యాలయాలు, పరిశోధకులు శ్రమించి చేసిన పరిశోధనలు ఎన్నో ప్రచురణ సంస్థల జర్నల్స్‌లో ప్రచురితమవుతున్నాయి. వాటిని చదవాలంటే డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ఇది పేద దేశాలలోని విద్యార్థులు, పరిశోధకులకు పెద్ద అడ్డంకిగా మారింది.
ఉద్యమ కార్యక్రమాలు
[మార్చు]బుడాపెస్ట్ ఒప్పందం (2002)
[మార్చు]2002లో జరిగిన Budapest Open Access Initiative (BOAI) సమావేశం ద్వారా ఈ ఉద్యమానికి బలమైన స్ఫూర్తి వచ్చింది. దీనిలో ఇలా పేర్కొన్నారు: “ప్రపంచంలోని అనేక మంది పరిశోధకులు ఉచితంగా తమ శాస్త్రీయ రచనలు అందుబాటులోకి తెచ్చేలా ప్రోత్సహించాలి.” ఇది ఓపెన్ యాక్సెస్ ఉద్యమానికి బలమైన పునాది వేసింది.
బెర్లిన్ డిక్లరేషన్ (2003)
[మార్చు]జర్మనీలో జరిగిన ఈ సమావేశంలో బెర్లిన్ డిక్లరేషన్ ఆన్ ఓపెన్ యాక్సెస్ టు నోలెడ్జ్ పేరుతో మరో ముఖ్యమైన ఒప్పందం జరిగింది. ఇందులో ప్రముఖ విశ్వవిద్యాలయాలు పాల్గొన్నాయి. ఇది విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు ఓపెన్ యాక్సెస్‌ను స్వీకరించేందుకు ప్రోత్సహించింది.
ఓపెన్ యాక్సెస్ ద్వారా శాస్త్రీయ వ్యాసాలు (scientific articles), పరిశోధనా పత్రాలు (research papers), సిద్ధాంత గ్రంథాలు (థీసిస్‌లు, డిజర్టేషన్లు), డేటాసెట్‌లు, గ్రంథాలు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. అనేక ఓపెన్ యాక్సిస్ పత్రికలూ ఆవిర్భవించాయి, అయితే కొంతమంది ప్రచురణకర్తలు తమ ఆదాయం తగ్గుతుందని భావించి వ్యతిరేకత చూపారు. కానీ బహుళ సంస్థలు ఇప్పటికి దీన్ని అనుసరిస్తున్నాయి.
ముఖ్యమైన ఓపెన్ యాక్సెస్ వేదికలు
[మార్చు]| వేదిక పేరు | వివరాలు |
|---|---|
| PLOS (Public Library of Science) | జీవ శాస్త్రంపై ప్రముఖ OA జర్నల్ |
| arXiv.org | భౌతికశాస్త్రం, గణితం, కంప్యూటర్ సైన్స్‌కు ప్రీ-ప్రింట్లు |
| DOAJ (Directory of Open Access Journals) | లక్షల ఓపెన్ యాక్సెస్ జర్నల్స్ జాబితా |
| PubMed Central (PMC) | వైద్య మరియు జీవశాస్త్ర పరిశోధనలు |
| Shodhganga (భారత ప్రభుత్వం) | భారత పరిశోధన విద్యార్థుల థీసిస్‌లు |