వాడుకరి:Bhaskaranaidu

Wikibooks నుండి

చారిత్రాకాంశాలపై మక్కువ ఎక్కువగా నున్న నాకు... ఒకనాటి మన తెలుగు సాంస్కృతిక రాజధాని అయిన హంపి చూడాలని వుండేది. అది 2006 లోతీరింది. మొదటిసారి చూసి ఆశ్చ్యర్య చికితుడనై వెంటవెంటనే మరో రెండు పర్యాలు పర్యటించాను. మూడు రోజులు అక్కడే వుండి ప్రతి విషయాన్ని విపులంగా వ్రాసుకున్నాను. దానికి సంబందించిన చత్రిత పుస్తకాన్ని ఒకదాన్ని కొని దాన్ని విపులంగా చదివి మూడోసారి పరిశీలనాత్మకంగా ఆయా ప్రదేశాలను పర్యటించాను. ఆవిషయాలన్నింటిని వ్రాసుకొన్నాను.ఇలా రెండు పుస్తకాలు తయారైనాయి. ఒకటి ప్రస్తుతమున్న హంపి శిధిలాలు గురించిన వివరాలు. దానిపేరు మాహమైన మహానగరం. రెండోది విజయనగరం అత్యున్నత దశలొ వున్నపుడు విదేశీ యాత్రికులు వచ్చి చూసి ఉన్నదున్నట్టుగా వ్రాసుకొన్నారు. దాన్ని తెలుగులో తర్జుమా చేశాను. ఇలా ఈ రెండు పుస్తకాలను ఇంట్లోనే కంపూటర్లో ఎక్కించి సుమారు 15 పుస్తకాలుగా చేసుకొని తెలిసిన మిత్రులకిచ్చాను. ఆ తర్వాత వికిపీడియాలో చేరాను. ఆ రెండు పుస్తకాలను కొంత మార్పులతో వికీపీడియాలోనూ, వికి బుక్సు లోను ఎక్కించాను. నాప్రస్తుత నివాసం. హైదరాబాదు.