వంటపుస్తకం:టమాట సూపు
స్వరూపం
వర్గం : శాకాహారం
కావలసిన పదార్దాలు :
- టమాటాలు : 4
- కొత్తిమీర తరుగు : 1 టీ స్పూను
- నీళ్ళు : 3 కప్పులు
- పంచదార : 1/2 టీ స్పూను
- క్యారెట్ : 1
- ఉల్లిగడ్డ : 1
- వెల్లుల్లి : 2 పాయలు (రెకలు)
- బిర్యానీ ఆకులు : 2
- మిర్యాలు : 3
- వెన్న/నెయ్యి : 1/2 టీ స్పూను
- ఉప్పు : తగినంత
- నల్ల ఏలకులు : 2
తయారీ విధానం:
టొమాటో, క్యారెట్, నీళ్ళు, నల్ల ఏలకులు, మిరియాలు, బిరియానీ ఆకులు, వెల్లుల్లి, ఉల్లిపాయ, పంచదార, ఉప్పు లను కుక్కర్ లో ఉడికించాలి. (కుక్కర్ 3 విజిల్స్ వస్తే సరిపోతుంది). మెత్తగా అయిన టొమాటో మిశ్రమాన్ని వడ పోయాలి. మెత్తగా చేత్తో మెదిపి, ఆ గుజ్జును కూడా వడ పోయాలి. ఫ్రయింగ్ పాన్ లో వెన్న/నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలను వేయించాలి. వడ్డించే ముందు ఈ బ్రెడ్ ముక్కలను సూప్ లో వేసుకోవాలి.