ఉబుంటు/ఆర్థిక మరియు ఇతర లెక్కలు

Wikibooks నుండి
లిబ్రెఆఫీస్ కేల్క్ ఉదాహరణ తెరపట్టు

ఆర్థిక మరియు ఇతర లెక్కలు చూసుకొనటానికి మరియ మన దత్తాంశాన్ని చిత్రాల రూపంలో మార్చుటకు సరియైన అనువర్తనం లిబ్రెఆఫీస్ కేల్క్. ఈ విభాగంలో దీనిని ఎలా వాడుకోవచ్చో పరిశీలిద్దాం.

ఉదాహరణ[మార్చు]

తెలుగు కళాజ్యోతి, చిక్కడపల్లి సంస్థ 2010-11 వార్షిక ఆదాయ వ్యయాల చిట్టా వివరాలు ఇలా వున్నాయి.

ఆదాయం
వివరణ మొత్తం
సభ్యత్వ రుసుం 30000
ఆంతర్జాల తెలుగు సంస్థ విరాళం 70000
బ్యాంకు వడ్డీ 5053
వ్యయం
వివరణ మొత్తం
ప్రకటన ఖర్చులు 10000
కళాకారుల ఫీజు 75000
వేదిక ఫీజు 20000

ఈ వివరాన్ని కేల్క్ లో ప్రక్కన బొమ్మలో చూపినట్లుగా ప్రవేశపెట్టండి. మొత్తం కనుక్కోటానికి B9 లో =SUM(B5:B7) అనే సూత్రాన్ని ప్రవేశ పెట్టండి. మిగులు కనుక్కోటానికి D8 లో సూత్రం =D9-SUM(D5:D7) వాడండి. ఆ తరువాత అదాయం పట్టిక లో ని దత్తాంశాన్ని ఎంచుకొని చిత్రం తయారు చేయండి.